సాక్షి, విజయవాడ: అంబేద్కర్ మహాశిల్పంపై దాడి ఘటనలో చంద్రబాబు సర్కార్ ఇప్పటికీ స్పందించలేదు. దాడిపై అంబేద్కర్ వాదులు మండిపడుతున్నారు. దాడి జరిగి రెండు రోజులవుతున్నా ఒక్కరినీ పోలీసులు అరెస్ట్ చేయలేదు. కనీసం కేసు నమోదు చేసి విచారిస్తామని కూడా ఏపీ ప్రభుత్వం ప్రకటించలేదు. అంబేద్కర్ మహాశిల్పంపై సుత్తెలు, ఇనుప వస్తువులతో దాడి చేయగా, ఇంకా విచారణ చేయకపోవడంపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంబేద్కర్ అవమానించడంపై వైఎస్సార్‌సీపీ ఆందోళన చేపట్టింది. నేడు ఏపీ వ్యాప్తంగా కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేయనుంది.
కాగా, ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరం నడిబొడ్డులో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సామాజిక న్యాయ మహా శిల్పంపై దాడి ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ పనేనని అంబేద్కరిస్టులు, ప్రజాస్వామిక వాదులు, వైఎస్సార్‌సీపీ నేతలు ఖండించారు. విగ్రహంపై దాడి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ శుక్రవారం అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్‌సీపీ నేతలు, దళిత సంఘం నేతలు, ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చేపట్టారు.
భావితరాలకు స్ఫూర్తిగా, దిక్సూచిగా గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ విజయవాడలో అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నగరం నడిబొడ్డులో అంబేడ్కర్ విగ్రహం ఉండకూడదన్నదే చంద్రబాబు ప్రభుత్వ ఉద్దేశమని, ఈ నేపథ్యంలో విగ్రహాన్ని కూల్చివేసే ప్రయత్నం చేసిందని పలువురు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment