
మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి వ్యాఖ్యలపై మైదుకూరు దళిత ప్రజాప్రతినిధులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
సాక్షి, వైఎస్సార్ జిల్లా: మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి వ్యాఖ్యలపై మైదుకూరు దళిత ప్రజాప్రతినిధులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, దళితులను కించపరచడం సరికాదన్నారు. స్వార్థ రాజకీయాల కోసం దళితులను వాడుకోవద్దని హితవు పలికారు. ఏపీలో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందిందన్నారు. పంటనష్టం జరిగితే కౌలు రైతులకు ఈ-క్రాప్ ద్వారా ఎకరాకు రూ.18 వేలు సాయం చేశారన్నారు.