
మైదుకూరు: వైఎస్సార్ జిల్లాలోని మైదుకూరు మున్సిపల్ ఛైర్మన్ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. మైదుకూరు మున్సిపాలిటీలో 24 వార్డులుండగా, టీడీపీ 12 వార్డుల్లో, వైసీపీ 11 వార్డుల్లో , జనసేన ఒక చోట గెలుపొందాయి. దీంతో ఏ పార్టీకి కూడా మెజార్టీ దక్కని పరిస్థితి ఏర్పడింది. ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలుపుకుంటే వైసీపీ బలం 13కి పెరిగింది.
టీడీపీ, జనసేన కలిస్తే సంఖ్యా బలం 13గా ఉంది. కాగా, టీడీపీ ఆరో వార్డు సభ్యురాలు మహబూబ్‌బీతో పాటు జనసేన సభ్యుడు బాబు గైర్హాజరు కావడంతో టీడీపీ బలం 11కి పడిపోయింది. మరోవైపు అధికార పార్టీ వైఎస్సార్‌సీపీ తమకున్న రెండు ఎక్స్ అఫీషియా ఓట్లతో బలాన్ని 13కి పెంచుకుని చైర్మన్ పీఠాన్ని చేజిక్కించుకుంది. మైదుకూరు మున్సిపల్ ఛైర్మన్‌గా మాచనూరి చంద్ర, వైస్ ఛైర్మన్‌గా మహబూబ్ షరీఫ్ ఎన్నికయ్యారు.
చదవండి:
దేశ చరిత్రలోనే ఇది ఓ అరుదైన ఘట్టం: సజ్జల
అక్రమాల పుట్ట ‘అమరావతి’
Comments
Please login to add a commentAdd a comment