List of Mayors, Deputy Mayors, Chairpersons in Andhra Pradesh (AP)- Sakshi
Sakshi News home page

బడుగుబలహీన వర్గాలకే అగ్రాసనం..

Published Thu, Mar 18 2021 10:45 AM | Last Updated on Fri, Mar 19 2021 9:37 AM

Mayor And Chairpersons Elections For Municipalities And Corporations In AP - Sakshi

విశాఖ, విజయవాడ, తిరుపతి మేయర్లుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న గొలగాని వెంకట హరికుమారి, రాయన భాగ్యలక్ష్మి, డాక్టర్‌ బీఆర్‌ శిరీష

సాక్షి, అమరావతి: సామాజిక న్యాయానికి, మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సరికొత్త చరిత్రను లిఖించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, మహిళలకు అధికారాన్ని అప్పగించడం ద్వారా వారి అభ్యున్నతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన చిత్తశుద్ధిని మరోసారి నిరూపించుకున్నారు. ఈ సారి పురపాలక అధ్యక్ష పదవుల్లో 60.46 శాతం మహిళలకే దక్కటం ఒక రికార్డేనని చెప్పాలి.

అంతేకాదు!! చరిత్రలో తొలిసారిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 78 శాతం పదవులు లభించాయి. దీంతోపాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ, తిరుపతి మునిసిపల్‌ కార్పొరేషన్ల మేయర్లుగా బీసీ వర్గానికి చెందిన ముగ్గురు మహిళలు ఎన్నిక కావడం ఊహలకు కూడా అందని పరిణామం. మహిళాభ్యున్నతిని చేతల్లో చూపించిన ముఖ్యమంత్రి జగన్‌... పార్టీ సాధించిన 11 కార్పొరేషన్లలో ఏకంగా ఏడింటి పగ్గాలు మహిళలకే అప్పగించారు.

ఎలాంటి రాజకీయ నేపథ్యంలేని సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన గృహిణులను పలువురిని ఈ పదవులు వరించటం ఒక మంచి మార్పుకు నాందిగానే పేర్కొనాలి. ఆయా వర్గాల రాజకీయ సాధికారతను చేతల్లో చూపించటం ద్వారా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అసలైన ప్రజాస్వామ్యానికి నిర్వచనం చెప్పింది. తన మంత్రివర్గంలో  60 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కేటాయించి జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన ముఖ్యమంత్రి... నామినేటెడ్‌ పదవులు, నామినేటెడ్‌ పనుల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 50 శాతం కేటాయించేలా... అందులోనూ సగం మహిళలకే ఇవ్వాలని చట్టం చేశారు.

తద్వారా సామాజిక న్యాయ సాధన దిశగా కొత్త ఒరవడి సృష్టించారు. ఇప్పుడు మేయర్లు, మునిసిపల్‌ చైర్‌ పర్సన్ల ఎంపికలోనూ అదే విధానాన్ని అనుసరించి తన నిబద్ధతను రుజువు చేసుకున్నారు.   

చెప్పిన దానికి మించి... 
11 మేయర్, 75 మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పదవులతో కలిపి మొత్తం 86కిగానూ చట్ట ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 45 కేటాయించాల్సి ఉంది. కానీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏకంగా 67 పదవులను వారికి కేటాయించింది. బీసీ ‘ఇ’ కేటగిరీ కిందకు వచ్చే ముస్లిం మైనార్టీలతో సహా బీసీలకు కేటాయించాల్సిన వాటికంటే అత్యధికంగా ముఖ్యమంత్రి జగన్‌ పదవులు ఇవ్వటంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

మొత్తం మీద 86 పదవుల్లో మైనార్టీలతో సహా బీసీలకు 30 పదవులు కేటాయించాల్సి ఉండగా 52 ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో బీసీలకు కేటాయించాల్సిన పదవులకన్నా ఏకంగా 70.3 శాతం పదవులను అదనంగా ఇచ్చినట్లయింది.  

మహిళలకే అగ్రస్థానం  
ఇక మహిళలకు సంబంధించి తమది మాటలు చెప్పే ప్రభుత్వం కాదని... చేతల్లోనే చూపిస్తామని ముఖ్యమంత్రి మరోసారి నిరూపించారు. పదవుల్లో మహిళలకు అగ్రాసనం వేశారు. మేయర్లు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు కలిపి మొత్తం మీద 86 పదవుల్లో మహిళలకు 50 శాతం కేటాయించాలి. ఆ ప్రకారం 44 పదవులు కేటాయించాల్సి ఉండగా ముఖ్యమంత్రి ఏకంగా 52 మంది మహిళలకు పదవులు ఇచ్చారు. మహిళలకు 60.46 శాతం పదవులు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. జనరల్, బీసీ జనరల్, ఎస్సీ జనరల్‌గా రిజర్వ్‌ అయిన స్థానాల్లో కూడా చాలా చోట్ల మహిళలకే అవకాశం కల్పించారు. 75 మున్సిపాలిటీల్లో 45 చోట్ల చైర్‌పర్సన్లుగా మహిళలకే పగ్గాలు అప్పగించారు.  

అధికార పార్టీకే అన్నీ.. 
రాష్ట్రంలో ఇటీవల 12 కార్పొరేషన్లు, 75 మునిసిపాలిటీల్లో ఎన్నికలు జరగ్గా వాటిలో తాడిపత్రి మినహా 74 మున్సిపాలిటీలను వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది. కోర్టు ఉత్తర్వుల కారణంగా ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు వెల్లడించకపోగా... ఫలితాలు వెల్లడించిన 11 కార్పొరేషన్లలోనూ వైఎస్సార్‌ సీపీ జయకేతనం ఎగురవేసింది. వాటిలో పాలక వర్గాలు గురువారం కొలువుదీరాయి.

కార్పొరేషన్లలో ఎన్నికైన కార్పొరేటర్లు, ముసిసిపాలిటీల్లో ఎన్నికైన కౌన్సిలర్లు తొలుత పదవీ స్వీకార ప్రమాణం చేశారు. అనంతరం కార్పొరేషన్లలో మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మునిసిపాలిటీల్లో చైర్‌ పర్సన్లు, వైస్‌ చైర్‌ పర్సన్ల పదవులకు ఎన్నికలు నిర్వహించి గెలిచిన వారిచేత ప్రమాణం చేయించారు. అన్ని చోట్లా స్పష్టమైన మెజార్టీ ఉండటంలో మొత్తం 11 కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్‌ పదవులను వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది.

మున్సిపాలిటీలలో చైర్‌పర్సన్లు, వైస్‌ చైర్‌ పర్సన్‌ పదవులు కూడా అధికార పార్టీకే దక్కాయి. వైఎస్సార్‌సీపీకి పూర్తి మెజార్టీ ఉండటంతో నల్లేరుపై నడకలా విజయం సాధించింది. కాస్త ఆసక్తి రేపిన మైదుకూరు మున్సిపాలిటీని కూడా వైఎస్సార్‌సీపీయే గెలుచుకుంది. మైదుకూరులో వైఎస్సార్‌సీపీ 11 వార్డుల్లో, టీడీపీ 12 వార్డుల్లో గెలవగా జనసేన ఒక వార్డు దక్కించుకుంది.

కాగా జనసేన నుంచి గెలిచిన ఏకైక కౌన్సిలర్‌తోపాటు టీడీపీ కౌన్సిలర్‌ ఒకరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికలో పాల్గొనలేదు. ఎక్స్‌ అఫిషియో సభ్యులైన ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లు ఉండటంతో వైఎస్సార్‌సీపీ స్పష్టమైన మెజార్టీ సాధించి మున్సిపల్‌ చైర్‌పర్సన్, వైస్‌ చైర్మన్‌ పదవులను గెలుచుకుంది. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీని మాత్రం టీడీపీ దక్కించుకుంది.

ఇక్కడ వైఎస్సార్‌సీపీ 16 వార్డులను గెలవగా టీడీపీ 18 వార్డుల్లో గెలిచింది. సీపీఐ ఒక వార్డులోనూ, స్వతంత్ర సభ్యుడు ఒక వార్డులోనూ విజయం సాధించారు. ఎక్స్‌ అఫిషియో సభ్యులైన ఎంపీ, ఎమ్మెల్యే ఓట్లతో వైఎస్సార్‌సీపీ బలం 18కి  చేరింది. టీడీపీకి సీపీఐ కౌన్సిలర్‌తో పాటు ఇండిపెండెంట్‌ కౌన్సిలర్‌ కూడా మద్దతు ప్రకటించడంతో తాడిపత్రి మున్సిపాలిటీని ఆ పార్టీ గెలుచుకుంది.  

సూళ్లూరుపేట, బొబ్బిలి, ఉయ్యూరులో నేడు.. 
సూళ్లూరుపేట మునిసిపల్‌ చైర్‌ పర్సన్, వైస్‌ చైర్‌ పర్సన్‌ ఎన్నికను గురువారం నిర్వహించలేదు. విజయనగరం జిల్లా బొబ్బిలి, కృష్ణా జిల్లా ఉయ్యూరు మునిసిపల్‌ వైస్‌ చైర్మన్ల ఎన్నికలు కోరం లేకపోవడంతో జరగలేదు. ఆ పదవులకు శుక్రవారం ఎన్నికలు నిర్వహిస్తారు.  

మేయర్లు, డిప్యూటీ మేయర్లు..
ఒంగోలు మేయర్‌గా గంగాడి సుజాత
ఒంగోలు డిప్యూటీ మేయర్‌గా వేమూరి సూర్యనారాయణ

కడప మేయర్‌గా సురేష్‌బాబు
కడప డిప్యూటీ మేయర్‌గా షేక్‌ ముంతాజ్‌ బేగం

అనంతపురం మేయర్‌గా వసీమ్‌ సలీమ్‌
అనంతపురం డిప్యూటీ మేయర్‌గా వాసంతి సాహిత్య

విజయనగరం మేయర్‌గా విజయలక్ష్మి
విజయనగరం డిప్యూటీ మేయర్‌గా ముచ్చు నాగలక్ష్మి

మచిలీపట్నం మేయర్‌గా మోకా వెంకటేశ్వరమ్మ

తిరుపతి మేయర్‌గా డా.శిరీషా ఏకగ్రీవ ఎన్నిక

విశాఖ మేయర్‌గా గొలగాని హరి వెంకటకుమారి
విశాఖ డిప్యూటీ మేయర్‌గా జియ్యాని శ్రీధర్‌

చిత్తూరు మేయర్‌గా అముద
చిత్తూరు డిప్యూటీ మేయర్‌గా చంద్రశేఖర్‌

గుంటూరు మేయర్‌గా కావటి మనోహర్‌నాయుడు

గుంటూరు డిప్యూటీ మేయర్‌గా వనమా బాలవజ్ర బాబు
విజయవాడ మేయర్‌గా భాగ్యలక్ష్మీ
విజయవాడ డిప్యూటీ మేయర్‌గా బెల్లం దుర్గ

కర్నూలు మేయర్‌గా బీవై రామయ్య

మున్సిపల్‌ ఛైర్‌పర్సన్లు...
అనంతపురం: ధర్మవరం ఛైర్‌పర్సన్‌గా నిర్మల
గుత్తి ఛైర్‌పర్సన్‌గా వన్నూరుబీ
గుంతకల్లు ఛైర్‌పర్సన్‌గా ఎన్‌.భవానీ
హిందూపురం ఛైర్‌పర్సన్‌గా ఇంద్రజ
కదిరి ఛైర్‌పర్సన్‌గా నజి మున్నీసా
కల్యాణదుర్గం ఛైర్మన్‌గా రాజకుమార్‌
మడకశిర ఛైర్‌పర్సన్‌గా లక్షీనరసమ్మ
పుట్టపర్తి ఛైర్మన్‌గా ఓబులపతి
రాయదుర్గం ఛైర్‌పర్సన్‌గా శిల్ప
తాడిపత్రి ఛైర్మన్‌గా జేసీ ప్రభాకర్‌రెడ్డి

కర్నూలు: ఆదోని ఛైర్‌పర్సన్‌గా శాంత
ఆళ్లగడ్డ ఛైర్మన్‌గా రామలింగారెడ్డి
ఆత్మకూరు ఛైర్మన్‌గా ఆసియా
డోన్‌ ఛైర్మన్‌గా గంటా రాజేష్‌
గూడూరు ఛైర్మన్‌గా వెంకటేశ్వర్లు
నందికొట్కూరు ఛైర్మన్‌గా సుధాకర్‌రెడ్డి
నంద్యాల ఛైర్‌పర్సన్‌గా షేక్‌ మబున్ని
ఎమ్మిగనూరు ఛైర్మన్‌గా శివన్న రఘు

వైఎస్సార్‌ జిల్లా: బద్వేల్‌ ఛైర్మన్‌గా రాజగోపాల్‌రెడ్డి
జమ్మలమడుగు ఛైర్‌పర్సన్‌గా శివమ్మ
మైదుకూరు ఛైర్మన్‌గా చంద్ర
ప్రొద్దుటూరు ఛైర్‌పర్సన్‌గా లక్ష్మీదేవి
పులివెందుల ఛైర్మన్‌గా వరప్రసాద్‌
రాయచోటి ఛైర్మన్‌గా షేక్‌ బాషా
ఎర్రగుంట్లపాలెం ఛైర్మన్‌గా హర్షవర్ధన్‌రెడ్డి

ప్రకాశం జిల్లా: ఒంగోలు డిప్యూటీ మేయర్‌గా వేమూరి సూర్యనారాయణ
అద్దంకి ఛైర్‌పర్సన్‌గా ఎస్తేరమ్మ
చీమకుర్తి ఛైర్‌పర్సన్‌గా చల్లా అంకులు
చీరాల ఛైర్మన్‌గా జి.శ్రీనివాసరావు
గిద్దలూరు ఛైర్మన్‌గా వెంకటసుబ్బయ్య
కనిగిరి ఛైర్మన్‌గా అబ్దుల్‌ గఫార్‌ 
మార్కాపురం ఛైర్మన్‌గా మురళీకృష్ణారావు

నెల్లూరు: ఆత్మకూరు ఛైర్‌పర్సన్‌గా వెంకట రమణమ్మ
నాయుడుపేట ఛైర్‌పర్సన్‌గా దీపిక
సూళ్లూరుపేట ఛైర్మన్‌గా శ్రీమంత్‌రెడ్డి
వెంకటగిరి ఛైర్‌పర్సన్‌గా నక్కా భానుప్రియ

చిత్తూరు: మదనపల్లె ఛైర్‌పర్సన్‌గా మనుజ
నగరి ఛైర్‌పర్సన్‌గా నీలమంగళం
పలమనేరు ఛైర్‌పర్సన్‌గా పవిత్ర
పుంగనూరు ఛైర్మన్‌గా ఆలీమ్‌ బాషా
పుత్తూరు ఛైర్మన్‌గా హరి

కృష్ణా జిల్లా: నూజివీడు ఛైర్‌పర్సన్‌గా త్రివేణి దుర్గా
పెడన ఛైర్‌పర్సన్‌గా బి.జ్ఞానలింగజ్యోతి
ఉయ్యూరు ఛైర్మన్‌గా వల్లభనేని సత్యనారాయణ
నందిగామ ఛైర్‌పర్సన్‌గా మండవ వరలక్ష్మి
తిరువూరు ఛైర్‌పర్సన్‌గా కస్తూరిభాయి

గుంటూరు జిల్లా: తెనాలి ఛైర్‌పర్సన్‌గా ఖలీదా
చిలకలూరిపేట ఛైర్‌పర్సన్‌గా షేక్‌ రఫాని
రేపల్లె ఛైర్‌పర్సన్‌గా కట్టా మంగమ్మ
సత్తెనపల్లి ఛైర్‌పర్సన్‌గా లక్ష్మీతులసి
వినుకొండ ఛైర్మన్‌గా దస్తగిరి
మాచర్ల ఛైర్మన్‌గా తురక కిశోర్‌
పిడుగురాళ్ల ఛైర్మన్‌గా చిన్న సుబ్బారావు

తూర్పుగోదావరి: అమలాపురం మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌గా సత్యనాగేంద్రమణి
గొల్లప్రోలు నగర పంచాయతీ ఛైర్‌పర్సన్‌గా మంగతాయారు
మండపేట మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌గా దుర్గారాణి
ముమ్మిడివరం నగర పంచాయతీ ఛైర్మన్‌గా ప్రవీణ్‌కుమార్‌
పెద్దాపురం మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌గా బొడ్డు తులసి
పిఠాపురం మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌గా గండేపల్లి సుర్యావతి
రామచంద్రపురం మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌గా శ్రీదేవి
సామర్లకోట మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌గా గంగిరెడ్డి దేవి
తుని మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌గా ఏలూరి సుధారాణి
ఏలేశ్వరం నగర పంచాయతీ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌గా అలమంద సత్యవతి

పశ్చిమగోదావరి: కొవ్వూరు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌గా రత్నకుమారి
జంగారెడ్డిగూడెం మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌గా బత్తిన లక్ష్మీ
నరసాపురం మున్సిపల్‌ ఛైర్మన్‌గా బర్రె శ్రీవెంకటరమణ
నరసాపురం మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్‌గా కొత్తపల్లి భుజంగరావు
నిడదవోలు మున్సిపల్‌ ఛైర్మన్‌గా ఆదినారాయణ
కొవ్వూరు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌గా రత్నకుమారి
కొవ్వూరు మున్సిపల్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌గా మన్నె పద్మ
జంగారెడ్డిగూడెం మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌గా బత్తిన లక్ష్మీ
జంగారెడ్డిగూడెం మున్సిపల్‌ వైస్‌ఛైర్‌పర్సన్‌గా కంచర్ల వాసవీ

విజయనగరం: బొబ్బిలి మున్సిపల్‌ ఛైర్మన్‌గా వెంకట మురళీకృష్ణారావు
విజయనగరం: పార్వతీపురం మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌గా బోను గౌరీశ్వరి
విజయనగరం: సాలూరు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌గా ఈశ్వరమ్మ

విశాఖ: నర్సీపట్నం మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌గా ఆదిలక్ష్మి
విశాఖ: యలమంచిలి మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌గా పీలా రామాకుమారి

శ్రీకాకుళం: ఇచ్ఛాపురం మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌గా పిలక రాజ్యలక్ష్మి
శ్రీకాకుళం: పాలకొండ నగర పంచాయతీ ఛైర్‌పర్సన్‌గా రాధాకుమారి
శ్రీకాకుళం: పలాస మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌గా గిరిబాబు

పార్వతీపురం మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌గా బోను గౌరీశ్వరి
పార్వతీపురం మున్సిపల్‌ వైస్‌చైర్‌పర్సన్‌గా కొండపల్లి రుక్మిణి
సాలూరు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌గా ఈశ్వరమ్మ
సాలూరు మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్‌గా జరజాపు దీప్తి
విజయనగరం: నెల్లిమర్ల నగర పంచాయతీ ఛైర్‌పర్సన్‌గా సరోజిని
విజయనగరం: నెల్లిమర్ల నగర పంచాయతీ వైస్‌ ఛైర్మన్‌గా సముద్రపు రామారావు

గుంటూరు: సత్తెనపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌గా లక్ష్మీతులసి
సత్తెనపల్లి మున్సిపల్‌ వైస్‌ఛైర్‌పర్సన్‌గా షేక్‌ నాగుల్‌మీరాన్‌
విశాఖ: యలమంచిలి మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా పిల్లా రామకుమారి
యలమంచిలి మున్సిపాలిటీ వైస్‌ఛైర్మన్‌గా వెంకట గోవిందరాజు
అనంతపురం: హిందూపురం మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా ఇంద్రజ
హిందూపురం మున్సిపాలిటీ వైస్‌ఛైర్మన్‌గా పీఎన్‌ జాబివుల్లా
విజయనగరం: పార్వతీపురం మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా గోను గౌరీశ్వరి
పార్వతీపురం మున్సిపాలిటీ వైస్‌ ఛైర్‌పర్సన్‌గా కొండపల్లి రుక్మిణి
తూ.గో: ఏలేశ్వరం మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా అలమండ సత్యవతి
ఏలేశ్వరం మున్సిపాలిటీ వైస్‌ఛైర్‌పర్సన్‌గా శిడగం త్రివేణి
చిత్తూరు: పలమనేరు మున్సిపల్‌ ఛైర్మన్‌గా మురళీకృష్ణ
పలమనేరు మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్‌గా చన్మ
వైఎస్‌ఆర్‌ జిల్లా: మైదుకూరు మున్సిపల్‌ ఛైర్మన్‌గా మచ్చునూరి చంద్ర
మైదుకూరు మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్‌గా షేక్‌ మహబూబ్‌ షరీఫ్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement