Municipal Corporations
-
2019–24 ఐదేళ్ల సమర్థపాలనలోమున్సిపాలిటీల సర్వతోముఖాభివృద్ధి
సాక్షి, అమరావతి: సమర్థమైన పాలన వ్యవస్థల ద్వారా గడచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపాలిటీలు సర్వతోముఖాభివృద్ధి దిశగా దూసుకెళ్లిందని ఆర్బీఐ అధ్యయన నివేదిక వెల్లడించింది. ఆర్థిక స్వయం ప్రతిపత్తి, పౌరసేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెరిగిందని, కార్పొరేషన్ల బడ్జెట్లో రెవెన్యూ మిగులు సాధించాయని నివేదిక స్పష్టం చేసింది. 2019–2024 వరకు దేశంలోని రాష్ట్రాల్లో 232 మున్సిపల్ కార్పొరేషన్ల ఆరి్థక స్థితిగతులపై ఆర్బీఐ అధ్యయనం చేసి నివేదిక రూపంలో విడుదల చేసింది. 2023–24 ఆర్థిక ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ల బడ్జెట్ మొత్తం వ్యయంలో 50 శాతానికిపైగా ఆస్తుల కల్పన (మూలధన)కు వ్యయం చేసినట్లు నివేదిక పేర్కొంది. అలాగే జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, బీహార్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా మున్సిపల్ కార్పొరేషన్ల బడ్జెట్ల మొత్తం వ్యయంలో ఆస్తుల కల్పన వ్యయం 50 శాతం కన్నా ఎక్కువగానే ఉందని నివేదిక వివరించింది. కేపిటల్ వాల్యూ విధానంలో పన్ను మార్కెట్ శాతం అంచనాతో ఆస్తి విలువను ప్రాథమికంగా నిర్ధారించడంతో పాటు ఏటా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేస్తోందని, ఈ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణల్లో అమలు చేస్తున్నారని తెలిపింది. అలాగే ఐదేళ్లు రాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ల మూలధన రాబడులు, వ్యయం కూడా పెరిగిందని నివేదిక స్పష్టం చేసింది. రాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్లు ఆర్థికంగా స్వయంప్రతిపత్తి సాధించడంతో పట్టణ మౌలిక సదుపాయాలు బాగా పెరిగాయని తెలిపింది. ఆస్తి పన్నుల వసూళ్లలో గణనీయమైన పురోగతి సాధించిన రాష్ట్రాల మున్సిపల్ కార్పొరేషన్లలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. 2019–20 నుంచి 2023–24 మధ్య రెవెన్యూ వసూళ్లలో ఆస్తి పన్నుల వసూళ్లు పెరిగాయని నివేదిక పేర్కొంది. రాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ల్లో మూల ఆదాయాలను, పన్నేతర ఆదాయాలను గణనీయంగా పెంచుకున్నాయని, దీంతో నీటి సరఫరా సేవలు, పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణ అధిక నాణ్యతతో నిర్వహిస్తున్నాయని నివేదిక స్పష్టం చేసింది. -
చెరువుల పరిరక్షణ... దీర్ఘకాలం కొనసాగాలి!
మునిసిపల్ కార్పొరేషన్ల వంటి వ్యవస్థలు తప్పులు జరిగాయని నిర్ధారణ జరిగినా అనేక రకాల కారణాలు చెబుతూ చర్యలు తీసుకోవడా నికి సాహసించడం లేదు. అదే కొత్తగా వచ్చిన ‘హైడ్రా’ చాలా వేగంగా పని పూర్తి చేస్తోంది. విచారణ, కోర్టుల పేరుతో కాలయాపన చేయకుండా చెరువులు, కుంటల పరి రక్షణకు; సామాన్యులకు న్యాయం చేసేందుకు ముందుకు సాగుతోంది. అందుకే ఇప్పుడు హైడ్రాలాంటి వ్యవస్థలు కావాలని ప్రతి జిల్లా, ప్రతి మునిసిపాలిటీ నుంచి డిమాండ్లు వస్తున్నాయి.రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రం, ప్రతినగరం, ప్రతి పట్టణంలో చెరువులు కబ్జా చేసి, బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపట్టిన ఘటనలు కోకొల్లలు. నీటిని మోసుకెళ్లే నాలాలను సైతం వదిలిపెట్టలేదు. చెరు వులు, నాలాలను పూడ్చివేసి బిల్డింగులు కట్టుకు న్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వందలాది చెరువులు నామరూపాల్లేకుండా మాయమయ్యాయి. వేలాది చెరువులు సగానికి పైగా కుంచించుకుపోయాయి. నాలాలు నీటిని తీసుకెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో చిన్నపాటి వర్షాలు వచ్చినా కాలనీలకు కాల నీలే నీట మునుగుతున్నాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.తెలంగాణ మునిసిపాలిటీల చట్టం –2019ను రూపొందించిన అప్పటి ప్రభుత్వం... అందుకు అను గుణంగా ‘టీఎస్ బీపాస్’ అనే ప్రత్యేక వ్యవస్థను రూపొందించింది. భవన నిర్మాణ అనుమతుల కోసం ఆన్లైన్ అప్లికేషన్ వ్యవస్థను తీసుకువచ్చి ఈజీ చేసింది. అక్రమ నిర్మాణాలపై కూడా ఇందులో ఫిర్యాదు చేసే అవకాశమిచ్చింది. అయితే టీఎస్ నుంచి టీజీ బీపాస్గా మారిన ఈ వ్యవస్థ ప్రస్తుతం అనుమ తులు ఇవ్వడానికి మాత్రమే పరిమితమైంది. అక్రమ, నిబంధనలకు విరుద్ధమైన నిర్మాణాలపై ఎవరైనా టీజీ బీపాస్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదు.టీజీ బీపాస్ ద్వారా ఆన్లైన్లో అనుమతులు పొందుతున్న చాలా మంది వాటికి భిన్నంగా నిర్మా ణాలు చేపడుతున్నారు. ఎలాంటి సెట్ బ్యాక్స్ వదల కుండా, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలోనూ నిర్మాణాలు చేస్తు న్నారు. గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే పర్మిషన్ తీసుకొని రెండు, మూడు అంతస్తులు నిర్మిస్తున్న వారు సైతం ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణా ల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. టీజీ బీపాస్ అమలులో భాగంగా జిల్లా స్థాయిలో టాస్క్‌ఫోర్స్ బృందాలు, ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. ఇందులో రెవెన్యూ, పొలీస్, ఫైర్, ఆర్ అండ్ బీ అధికారులను భాగస్వాములను చేశారు. నేరుగా, పోర్టల్, కాల్‌సెంటర్లు, మొబైల్ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులపై వీరు మూడు రోజుల్లో పరిశీలన జరపాలి. అక్రమమని తేలితే ఎలాంటి నోటీసు లేకుండా కూల్చివేయాలి. కూల్చివేతకు అయ్యే ఖర్చును కూడా వారి నుంచే వసూలు చేయాలి.అంతేకాకుండా స్థలం విలువలో 25 శాతం జరిమానా విధించవచ్చు. మూడేళ్ల జైలు శిక్షకు సైతం చర్యలు తీసుకునే నిబంధనలున్నాయి. నిర్మాణం/లే అవుట్ రిజిస్ట్రేషన్ కాకుండా డీటీఎఫ్సీలు, సబ్ రిజిస్ట్రార్లకు తెలియజేసి... అలాంటి స్థలాలను బ్లాక్ లిస్టులో పెట్టేలా ఫిర్యాదు చేయాలి. ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఇది స్పష్టంగా ఉన్నా అమలుకు నోచుకోవడం లేదు.గత ప్రభుత్వం తీసుకువచ్చిన మునిసిపల్ యాక్ట్ –2019ను సక్రమంగా, కఠినంగా అమలు చేస్తే రాష్ట్రవ్యాప్తంగా సమస్యలు పరిష్కారమవుతాయి. అయితే కమిషనర్లు అందుకు సాహసించడం లేదు. ‘గట్స్’ ఉన్న ఒకరిద్దరు అధికారులు ఉన్న చోట అంతో ఇంతో చర్యలు కొనసాగుతున్నాయి. అందుకే రంగ నాథ్ లాంటి అధికారులతో కూడిన హైడ్రా లాంటి వ్యవస్థ ఉంటేనే చెరువులు పరిరక్షించొచ్చనీ, అక్రమ నిర్మాణాలను ఆపవచ్చనీ ప్రజల్లో అభిప్రాయం ఏర్ప డింది. ప్రభుత్వం ఆ డిమాండ్‌కు అనుగుణంగా హైడ్రా లాంటి వ్యవస్థలు ఏర్పాటు చేయడం మంచిదే. అయితే తాత్కాలిక ఉపశమన చర్యలకు బదులు పట్ట ణాలు, నగరాల్లో కీలకంగా వ్యవహరించే కమిషనర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి... ఇలాంటి చర్యలు ఎల్లప్పుడూ కొనసాగేలా చూడాలి. తప్పులను నిర్ధారించిన తర్వాత చర్యలు తీసుకోలేకపోతున్న కమిషనర్లపై ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి.– ఫిరోజ్ ఖాన్, వ్యాసకర్త, సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, మొబైల్: 96404 66464 -
దేశంలో మున్సిపల్ కార్పొరేషన్ల రాబడి స్వల్పమే
సాక్షి, అమరావతి : దేశంలో ఢిల్లీ, మహారాష్ట్రల్లోని మున్సిపల్ కార్పొరేషన్ల మినహా మిగతా రాష్ట్రాల్లోని కార్పొరేషన్ల రెవెన్యూ రాబడి చాలా తక్కువగా ఉందని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నివేదిక వెల్లడించింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఒక శాతం కూడా మిగతా రాష్ట్రాల కార్పొరేషన్ల రెవెన్యూ రాబడిలేదని పేర్కొంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ల రెవెన్యూ రాబడి ఆ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 2.75 శాతం ఉండగా మహారాష్ట్రలోని మున్సిపల్ కార్పొరేషన్ల రెవెన్యూ రాబడి ఆ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 2.12 శాతం ఉందని తెలిపింది. దేశంలోని వివిధ రాష్ట్రాల మున్సిపల్ కార్పొరేషన్ల మొత్తం రెవెన్యూ రాబడులు, అందులో కార్పొరేషన్ల సొంత రాబడులు, వ్యయాలకు సంబంధించి ఆర్బీఐ అధ్యయనం చేసి నివేదిక విడుదల చేసింది. ఇందులో పేర్కొన్న ముఖ్యాంశాలు ఏమిటంటే.. పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా పట్టణ ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడానికి కార్పొరేషన్లు సొంత రాబడులను పెంచుకోవడంతో పాటు వివిధ మార్గాల్లో నిధులను సమీకరించుకోవాలి. దేశంలోని మున్సిపల్ కార్పొరేషన్ల సగటు ఆదాయాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో చాలా తక్కువ రాబడి ఉంది. దేశ జీడీపీలో కార్పొరేషన్ల సగటు రాబడి 0.72 శాతం ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో అది రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 0.38 శాతమే ఉంది. మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లో మున్సిపల్ కార్పొరేషన్ల మొత్తం రెవెన్యూ రాబడులు, సొంత రెవెన్యూ రాబడులు అత్యధికంగా ఉండగా మిగతా రాష్ట్రాల్లోని మున్సిపల్ కార్పొరేషన్ల మొత్తం రెవెన్యూ రాబడులు, సొంత రెవెన్యూ రాబడులు అత్యంత తక్కువగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2018–19 ఆర్థిక ఏడాదిలో మున్సిపల్‌కార్పొరేషన్ల రెవెన్యూ రాబడులు ఎంత ఉన్నాయో 2019–20 ఆర్దిక ఏడాదిలో కూడా అంతే ఉన్నాయి. ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల సొంత రెవెన్యూ రాబడులు 2018–19 ఆర్థిక ఏడాదిలో రూ.2,906.83 కోట్లు ఉండగా.. రెవెన్యూ వ్యయం రూ.2,692.52 కోట్లు ఉంది. అదే 2019–20లో ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల సొంత రెవెన్యూ రాబడులు రూ.2,906.83 కోట్లు ఉండగా రెవెన్యూ వ్యయం రూ.2,954.08 కోట్లు ఉంది. అలాగే, ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల ఉద్యోగుల వేతనాలు, భత్యాలు, పెన్షన్ల వ్యయం 2018–19లో రూ.822.49 కోట్లు కాగా.. 2019–20లో రూ.878.83 కోట్లకు పెరిగింది. ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల ఆపరేషన్, నిర్వహణ వ్యయం 2018–19లో రూ.1,143.86 కోట్లు వ్యయం కాగా.. 2019–20లో రూ.1,254.16 కోట్లు. ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్లలో అడ్మినిస్ట్రేటివ్ వ్యయం 2018–19లో రూ.238.59 కోట్లు కాగా.. 2019–20లో రూ.247.75 కోట్లకు పెరిగింది. ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్లలో మూలధన వ్యయం 2018–19లో రూ.4,419.12 కోట్లు ఉండగా ఇది జీఎస్డీపీలో 0.51 శాతంగా ఉంది. 2019–20లో మూలధన వ్యయం రూ.5,788.75 కోట్లు ఉండగా ఇది జీఎస్డీపీలో 0.60 శాతంగా ఉంది. -
క్షీణిస్తున్న మునిసిపల్ కార్పొరేషన్ల ఆదాయం
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా మునిసిపల్ కార్పొరేషన్ల సొంత ఆదాయం, సామర్థ్యం క్షీణిస్తోందని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. మునిసిపల్ కార్పొరేషన్ల ఆదాయ, వ్యయాలు దశాబ్ద కాలంలో దేశ జీడీపీలో ఒక్క శాతం వద్ద స్తబ్దుగా ఉన్నట్లు తెలిపింది. మెజారిటీ మునిసిపల్ కార్పొరేషన్ల బడ్జెట్ కాగితాలకే పరిమితమని, వాస్తవికతను ప్రతిబింబించడం లేదని పేర్కొంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే గ్రాంట్లపైనే మునిసిపల్ కార్పొరేషన్లు ఆధారపడుతున్నాయని, సొంత ఆదాయ మార్గాలు పెంచుకోవడంపై దృష్టి సారించాలని సూచించింది. దేశవ్యాప్తంగా మునిసిపల్ కార్పొరేషన్ల ఆర్థిక స్థితిగతులపై ఆర్బీఐ తొలిసారిగా అధ్యయన నివేదికను విడుదల చేసింది. దక్షిణాఫ్రికా తరహాలో.. పెరుగుతున్న పట్టణ జనాభాకు తగినట్లుగా సేవల్లో నాణ్యత పెరిగేందుకు తక్షణం సొంత ఆదాయం పెంచుకోవాల్సిన అవసరం ఉందని నివేదిక స్పష్టం చేసింది. ఇందుకోసం దక్షిణాఫ్రికా తరహాలో సంస్కరణలు తేవాలని సూచించింది. బ్రెజిల్, రష్యన్ ఫెడరేషన్, చైనా, దక్షిణాఫ్రికాతో పోల్చి చూస్తే దేశంలో పట్టణ ప్రజలకు కనీస నీటి సరఫరా, పారిశుద్ధ్య సేవలు అందించడం చాలా తక్కువ శాతం ఉందని తెలిపింది. పెరుగుతున్న పట్టణ జనాభాకు మెరుగైన మౌలిక సదుపాయాలు, కనీస ప్రాథమిక సేవలందించేందుకు ఆస్తి పన్ను సంస్కరణలతో పాటు పాలనా సంస్కరణలు తేవాలని సూచించింది. ఆస్తి పన్ను మరింత సమర్థంగా వసూలు చేసే చర్యలు చేపట్టడంతోపాటు యూజర్ చార్జీలు, ప్రకటన పన్ను, పార్కింగ్ ఫీజు, ట్రేడ్ లైసెన్సుల జారీలో పటిష్ట విధానాలను అమలు చేయాలని పేర్కొంది. రహదారులు, సీవరేజ్, మంచినీటి సరఫరా తదితర మౌలిక సదుపాయాల కల్పనకు మునిసిపల్ బాండ్లను జారీ చేయాలని సూచించింది. సీఆర్డీఏ బాండ్లతో అత్యధిక రుణం దేశంలో తొలిసారిగా 1997లో బెంగళూరు మునిసిల్ కార్పొరేషన్, 1998లో అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్లు మున్సిపల్ బాండ్ల జారీ ద్వారా రుణాలను సేరించాయని, 2000 సంవత్సరం వరకు తొమ్మిది మునిసిపల్ కార్పొరేషన్లు బాండ్ల జారీ ద్వారా రూ.1200 కోట్ల వరకు సమీకరించినట్లు నివేదికలో ప్రస్తావించింది. జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్ ప్రారంభమయ్యాక 2005 నుంచి మున్సిపల్ బాండ్ల జారీ ఆకస్మాత్తుగా నిలిచిపోయిందని పేర్కొంది. తిరిగి 2017–2021 మధ్యలో తొమ్మిది మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపల్ బాండ్ల జారీ ద్వారా రూ.3840 కోట్లను సమీకరించినట్లు పేర్కొంది. ఇందులో అత్యధికంగా ఏపీ సీఆర్డీఏ బాండ్ల ద్వారా రూ.2000 కోట్లు రుణం తీసుకున్నాయి. సొంత వనరులు పెంచుకునేలా.. ప్రైవేట్ భూ యజమానులపై భూమి విలువ పన్నులు, బెటర్మెంట్ లెవీ, డెవలప్మెంట్ చార్జీలు, ఖాళీ భూమి పన్ను మొదలైన మార్గాల ద్వారా సొంత ఆదాయ వనరులను పెంచుకోవాలని నివేదిక సూచించింది. మునిసిపల్ బాండ్ల జారీ ద్వారా సమీకరించిన నిధులను మూలధన వ్యయం కోసం ప్రత్యేకంగా వినియోగించాలని పేర్కొంది. బ్యాంకులు, ప్రైవేట్ సంస్థల ద్వారా మున్సిపాలిటీలకు రుణాల సేకరణకు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపింది. తలసరి అప్పుల్లో తెలంగాణ టాప్ దేశంలో మునిసిపల్ కార్పొరేషన్ల తలసరి రుణాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. తలసరి అప్పు రూ.1750 ఉండగా బిహార్, మహారాష్ట్రలో రూ.600 ఉన్నట్లు నివేదిక తెలిపింది. ఆంధ్రప్రదేశ్, కేరళ, గుజరాత్ రాష్ట్రాల్లో మునిసిపల్ కార్పొరేషన్లలో తలసరి అప్పు రూ.400 చొప్పున ఉంది. షరతుల బాండ్లతో అవరోధాలు దేశంలో మునిసిపల్ బాండ్లకు అనేక షరతులతో అనుమతించడం అవరోధంగా ఉందని నివేదిక తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో బాండ్ల జారీకి అనుమతించినా ద్వితీయ మార్కెట్ లేకపోవడంతో కీలకమైన అడ్డంకిగా ఉందని పేర్కొంది. ఈ సెక్యూరిటీల కోసం మరింత విస్తృతమైన పెట్టుబడిదారుల వ్యవస్థ అవసరమని సూచించింది. పట్టణాలు, నగరాల్లో మౌలిక సదుపాయాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో మునిసిపల్ బాండ్ల ద్వారా స్థిరమైన వనరుల సమీకరణకు ప్రోత్సహించాలని తెలిపింది. ఆర్థిక పెట్టుబడికి అవసరమైన వాతావరణం, సమర్థ నియంత్రణ, పారదర్శకత, మెరుగైన పాలనకు చర్యలు తీసుకోవాలని, స్టాక్ ఎక్సే్చంజీలలో మునిసిపల్ బాండ్లు నమోదయ్యేలా ద్వితీయ మార్కెట్‌ను అభివృద్ధి చేయాలని పేర్కొంది. బాండ్ల జారీతో రూ.37,600 కోట్లు మునిసిపల్ పాలన మెరుగుపరచేందుకు దక్షిణాఫ్రికా రెండు దశాబ్దాలుగా పలు చర్యలు తీసుకుంది. మూడంచెల విధానంలో జనాభా ఆధారంగా షరతులు లేకుండా సమానంగా వనరుల పంపిణీ చేపడుతోంది. అక్కడ 97 మునిసిపాలిటీలు 4.7 బిలియన్ డాలర్లు (రూ.37,600 కోట్లు) బాండ్ల జారీ ద్వారా నిధులను సమీకరించాయి. -
పటిష్ట ఆర్థిక వనరులపై దృష్టి
ముంబై: మునిసిపల్ కార్పొరేషన్లు (ఎంసీ) తమ ఆర్థిక వనరులను పెంచుకోవడానికి వినూత్న రీతిలో వివిధ బాండ్, ల్యాండ్ ఆధారిత ఫైనాన్సింగ్ యంత్రాంగాలను అన్వేషించాల్సిన అవసరం ఉంద ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నివేదిక పేర్కొంది. ఆస్తిపన్ను వసూళ్లు, ప్రభుత్వ ఉన్నత శ్రేణుల నుండి పన్నులు, గ్రాంట్ల పంపిణీ మునిసిపల్ కార్పొరేషన్ల ఆదాయాలకు ప్రస్తుతం ప్రధా న వనరులు. ఈ నేపథ్యంలో ఫైనాన్షియల్ అంశాల కు సంబంధించి ఎంసీలకు ఆర్థిక స్వయంప్రతిపత్తి కొరవడిందని ఈ అంశంపై విడుదల చేసిన నివేదిక పేర్కొంది. భారతదేశంలోని మునిసిపల్ బడ్జెట్ల పరిమాణం ఇతర దేశాల్లోని కార్పొరేషన్లతో పోల్చి తే చాలా తక్కువగా ఉందని కూడా సూచించింది. అన్ని రాష్ట్రాల్లోని 201 ఎంసీల బడ్జెట్ డేటా సంకలనం, విశ్లేషణ ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. ‘మునిసిపల్ కార్పొరేషన్ల కోసం ప్రత్యామ్నాయ వనరుల’ థీమ్‌గా ఈ నివేదిక రూపొందింది. నివేదికలో మరికొన్ని అంశాలు పరిశీలిస్తే.. ► వివిధ ఆదాయాలు, వ్యయ అంశాలపై ఎంసీలు సరైన పర్యవేక్షణ, డాక్యుమెంటేషన్‌తో మంచి, పారదర్శకమైన అకౌంటింగ్ పద్ధతులను అవలంబించాలి. తమ వనరులను పెంచుకోవడానికి విభిన్న వినూత్న బాండ్, భూమి ఆధారిత ఫైనాన్సింగ్ విధానాలను అన్వేషించాలి. ► తమ వనరుల లోటును పూడ్చుకోడానికి పలు ఎంసీలు బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రుణాలపై ఆధారపడుతున్నాయి. మునిసిపల్ బాండ్ల వంటి పటిష్ట మార్కెట్ నుంచి నిధుల సమీకరణ పరిస్థితులు లేని లోటు ఇక్కడ కనిపిస్తోంది. ► వ్యవస్థీకృత, పాలనా వ్యయాలు, వడ్డీ, ఫైనాన్స్ చార్టీల రూపంలో వ్యయాలు పెరుగుతున్నాయి. మూలధన వ్యయం తక్కువగా ఉంటోంది. ► 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఎంసీల రెవెన్యూ వ్యయాలు–మూలధన వ్యయాల నిష్పత్తి 2.4 శాతం. కేంద్రం విషయంలో 7.1 శాతం, రాష్ట్రాల విషయంలో 5.9 శాతంగా ఈ నిష్పత్తులు ఉన్నాయి. ► మునిసిపల్ కార్పొరేషన్ల పరిమాణం, జనాభా సాంద్రత, సొంత రాష్ట్ర ప్రభుత్వ వ్యయ స్వభావం వంటి వివిధ అంశాలు దేశంలోని మునిసిపల్ కార్పొరేషన్ల వ్యయాలను ప్రభావితం చేస్తున్నాయి. ► 2017–18లో ఎంసీల రాబడి (స్వంత పన్ను రాబడి, స్వంత పన్నుయేతర ఆదాయం, ప్రభుత్వాల నుంచి బదిలీ అయిన మొత్తం) జీడీపీలో 0.61 శాతంగా అంచనా. అయితే ఇది 2019–20లో కేవలం 0.72 శాతానికి ఎగసింది. ► అధ్యయన కాలంలో ఎంసీల మొత్తం ఆదాయంలో ఆస్తిపన్ను, నీటి పన్ను, టోల్ పన్ను, ఇతర స్థానిక పన్నులు 31–34% శ్రేణిలో ఉన్నాయి. ► ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, చండీగఢ్, ఛత్తీస్‌గఢ్‌లలోని ఎంసీలు దేశంలోని ఇతర ఎంసీలతో పోలిస్తే అధిక పన్నులను వసూళ్లు జరుపుతున్నాయి. ఈ విషయంలో రాష్ట్రాల మధ్య అధిక వ్యత్యాసం కనిపిస్తోంది. -
మూడు మున్సిపల్ కార్పోరేషన్లు ఒక్కటిగా...ఆమోదం తెలిపిన కేంద్రం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని మున్సిపల్ కార్పొషన్ ఎన్నికలు ప్రకటించడానికి ఒక గంట ముందు ఎన్నికలను వాయిదా వేయాలంటూ బీజేపీ ఎన్నికల సంఘానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీంతో ఆప్ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇలా ఎప్పుడూ జరగలేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా ఆయన ఇది దేశ ప్రజాస్వామ్యానికి ముప్పు అని కూడా వ్యాఖ్యానించారు. అయినా గత ఏడేనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ అప్పడే ఎందుకు మూడు మున్సిపల్ కార్పొరేషన్లను విలీనం చేయలేదని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా కేంద్రం మంగళవారం మూడు మున్సిపల్ కార్పొరేషన్ల విలీన ప్రతిపాదన బిల్లును ఆమోదించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతేగాదు వచ్చేవారం ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ఇప్పటి వరకు ఉన్న తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అనే మూడు పౌర సంస్థలకు బదులుగా ఒకటి మాత్రమే ఉంటుంది. అయితే ఆప్ మాత్రం బీజేపీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే ఈ ఎత్తుగడ వేస్తోందంటూ ఆరోపణలు చేస్తోంది. కానీ ప్రభుత్వ వర్గాలు ప్రతి కార్పొరేషన్‌కి సంబంధించి ప్రాదేశిక విభజనలు, ఆదాయాన్ని ఇచ్చే సంభావ్యత పరంగా కార్పొరేషన్ త్రివిభజన అసమానంగా ఉన్నందున ఈ విలీన బిల్లు చాలా అవసరం అని నొక్కి చెప్పింది. అంతేగాక మున్సిపల్ కార్పొరేషన్లు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోందని, పైగా అవి ఉద్యోగులకు సకాలంలో జీతాలు, పదవీ విరమణ ప్రయోజనాలను చెల్లించలేని స్థితిలో ఉండటం వల్లే ఢిల్లీలోని పౌర సేవల నిర్వహణలో తీవ్రమైన ఆటంకాలు ఏర్పడుతున్నాయని వివరించింది. అయితే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సవరణ చట్టం, 1911 ప్రకారం 2011లో ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించారు. కానీ ప్రస్తుతం చట్టంలోని సవరణలతో మూడు కార్పొరేషన్లను ఉపసంహరించి ఏకీకృత మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీని ఏర్పాటు చేయనుందని అధికారిక వర్గాలు తెలిపాయి. (చదవండి: ట్విస్ట్ ఇచ్చిన అఖిలేష్.. ‘యోగితో ఇక తాడో పేడో తేల్చుకుంటా’) -
కుంటి సాకులు చెప్పొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: దేశరాజధానిలో వాయు కాలుష్య సంక్షోభాన్ని పరిష్కరించడంలో అత్యవసర చర్యలు తీసుకోనందుకు, మున్సిపల్ కార్పొరేషన్లపై నెపం వేసేందుకు యత్నించినందుకు ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కుంటి సాకులు చెబితే ఆదాయం, పాపులారిటీ స్లోగన్ల ఖర్చులపై ఆడిట్‌కు ఆదేశిస్తామని ఢిల్లీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఢిల్లీలో వాయు కాలుష్యానికి ప్రధాన కారణం రైతులు పంట వ్యర్థాలు దహనం చేయడం వల్ల కాదని నిర్ధారణకు వచ్చింది. ప్రతివాదుల అఫిడవిట్ల పరిశీలన తర్వాత వాయుకాలుష్యానికి నిర్మాణ కార్యకలాపాలు, పరిశ్రమలు, రవాణా, వాహనాల రాకపోకలతోపాటు అక్కడక్కడ పంట వ్యర్థాలు కాల్చడమనే నిర్ధారణకు వచ్చామని పేర్కొంది. ఎయిర్‌క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ నియంత్రణ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కారకాల నియంత్రణకు ఏయే చర్యలు తీసుకోబోతున్నారో కచ్చితంగా సూచించలేదని పేర్కొంది. రాజధాని ప్రాంతంలో కొంతకాలం వర్క్‌ఫ్రమ్ హోం అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. పంజాబ్, యూపీ, హరియాణా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు మంగళవారం సమావేశం కావాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఢిల్లీకి చెందిన విద్యార్థి ఆదిత్య దూబే దాఖలు చేసిన పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్ల ధర్మాసనం సోమవారం అత్యవసర విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వాదనలు వినిపిస్తూ.. పంట వ్యర్థాలు కాల్చడానికి సంబంధించి పంజాబ్‌లో ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎవరిపైనా కేసులు పెట్టడం లేదని పేర్కొన్నారు. భవన నిర్మాణాలను నిలుపుదల చేయలేదని తెలిపారు. సొలిసిటర్ జనరల్ అందజేసిన నివేదిక కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కొన్ని చర్యలు చేపడుతోందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. పార్కింగ్ రుసుము 4 రెట్లు పెంచాలని, బహిరంగంగా వ్యర్థాలు తగులబెట్టకుండా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ మేరకు ఓ ప్రణాళిక రూపొందించి కోర్టుకు అందజేశారు. పంట వ్యర్థాల వల్ల వచ్చే కాలుష్యం ప్రధాన సమస్య కాదని అంగీకరిస్తున్నారా... ఢిల్లీకి రాకపోకలు మొత్తంగా నిషేధిస్తారా అని జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. పరిశ్రమలు, రవాణా, దుమ్ము కారణంగానే 75 శాతం వాయు కాలుష్యం వస్తోందని అఫిడవిట్లో పేర్కొన్నారని ఆ దిశగా నియంత్రణ ఆలోచించాలని జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. బుధవారానికల్లా ఏయే చర్యలు తీసుకున్నారో తెలపాలని సూచించారు. -
నేడు రెండో డిప్యూటీ మేయర్/వైస్ చైర్పర్సన్ ఎన్నిక
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో మార్చిలో ఎన్నికలు నిర్వహించిన 12 మునిసిపల్ కార్పొరేషన్లు, 75 మునిసిపాలిటీల్లో నేడు (శుక్రవారం) రెండో డిప్యూటీ మేయర్/వైస్ చైర్పర్సన్ ఎన్నికను నిర్వహించనున్నారు. నగరపాలక సంస్థల్లో రెండో డిప్యూటీ మేయర్, పురపాలక సంఘాల్లో రెండో వైస్ చైర్పర్సన్ పదవులకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం కొన్ని నెలల కిందట నిర్ణయం తీసుకుంది. పట్టణ ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు ఈ పదవులను సృష్టిస్తూ మునిసిపల్ చట్టాన్ని సవరించింది. ఆ మేరకు రెండో డిప్యూటీ మేయర్/వైస్ చైర్పర్సన్ ఎన్నిక నిర్వహించేందుకు శుక్రవారం మునిసిపల్ పాలకమండళ్లను ప్రత్యేకంగా సమావేశపరుస్తున్నారు. -
టీఆర్ఎస్ పరిశీలకుల నియామకం..
సాక్షి, హైదరాబాద్: వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్ పదవులతో పాటు మరో 5 మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ఈ నెల 7న జరగనున్న విషయం తెలిసిందే. ఈ పదవులకు చాలా చోట్ల టీఆర్ఎస్లో అంతర్గతంగా బహుముఖ పోటీ ఉండటంతో ఏకాభిప్రాయ సాధనతో ఏకగ్రీవ ఎన్నిక జరగాలని పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే సంబంధిత జిల్లా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలు సేకరించి వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులను ఖరారు చేశారు. సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు. నకిరేకల్ మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల జాబితాను కూడా సిద్ధం చేశారు. అయితే ఎన్నిక ప్రక్రియ సజావుగా జరిగేందుకు సీల్డ్ కవర్ ద్వారా వారి వివరాలు వెల్లడిం చాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఈ పదవుల ఎన్నిక ప్రక్రియను పర్యవేక్షించేందుకు పార్టీ తరఫున పరిశీలకులను నియమించారు. వీరు పార్టీ అధినేత ఇచ్చే సీల్డ్ కవర్లను వెంట తీసుకుని గురువారం రాత్రికే తమకు కేటాయించిన కార్పొరేషన్ లేదా మున్సిపాలిటీకి చేరుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. చదవండి: (7న మేయర్, చైర్మన్ల ఎన్నికలు) -
స్మార్ట్టౌన్ల ప్రాజెక్టుకు అనూహ్య స్పందన
సాక్షి, అమరావతి: మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రభుత్వం చేపట్టనున్న స్మార్ట్టౌన్ల ప్రాజెక్టుకు పట్టణ ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తోంది. అన్ని వసతులతో లేఅవుట్లు వేసి లాభాపేక్ష లేకుండా ప్లాట్లు విక్రయించే ఈ ప్రాజెక్టు పట్ల మధ్యతరగతి ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు. స్మార్ట్టౌన్ల ప్రాజెక్టుపై ప్రజల స్పందన తెలుసుకునేందుకు నిర్వహిస్తున్న డిమాండ్ సర్వేనే అందుకు నిదర్శనం. ఈ నెల 1 నుంచి 10 వరకు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో నిర్వహించిన డిమాండ్ సర్వేలో ఏకంగా 2,32,369 ప్లాట్లకు ఆసక్తి కనబరచడం విశేషం. వార్డు సచివాలయాలు యూనిట్‌గా ఈ డిమాండ్ సర్వే నిర్వహించారు. ఒక కుటుంబం నుంచి ఒక దరఖాస్తు చొప్పున మాత్రమే సర్వేలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. ఊహించిన దానికంటే అధికంగా డిమాండ్ స్మార్ట్టౌన్ల పట్ల రాష్ట్రంలో పట్టణ ప్రాంత ప్రజల నుంచి ఊహించిన దానికంటే భారీ డిమాండ్ వ్యక్తమవుతోంది. డిమాండ్ సర్వేకు చివరి రోజు అని ముందుగా ప్రకటించిన ఒక్క ఆదివారమే ఏకంగా 74 వేల ప్లాట్లకు ప్రజల నుంచి సుముఖత వ్యక్తం కావడం విశేషం. ► ఒక్కోటి 150 చ.గజాల విస్తీర్ణం ఉండే 76,018 ప్లాట్ల కోసం ఆసక్తి వ్యక్తమైంది. ► ఒక్కోటి 200 చ.గజాల విస్తీర్ణం ఉండే 77,247 పాట్ల కోసం సానుకూలత చూపారు. ► 240 చ.గజాల విస్తీర్ణం ఉండే 79,104 ప్లాట్ల కోసం ఆసక్తి చూపారు. డిమాండ్ సర్వే పొడిగింపు వరుస సెలవులు రావడంతో డిమాండ్ సర్వేను పొడిగించాలని పలువురు పురపాలక శాఖను కోరారు. దీంతో సర్వేను ఈ నెల 20 వరకు పొడిగించినట్టు రాష్ట్ర పట్టణ ప్రణాళిక విభాగం డైరెక్టర్ వి.రాముడు తెలిపారు. డిమాండ్ సర్వే అనంతరం తదుపరి కార్యాచరణ డిమాండ్ సర్వే పూర్తి చేశాక స్మార్ట్టౌన్ల ప్రాజెక్టుపై పురపాలక శాఖ తుది అంచనాకు వస్తుంది. దాని ప్రకారం భూసేకరణ నిర్వహిస్తారు. అనంతరం నోటిఫికేషన్ జారీ చేసి ప్లాట్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు, నిబంధనలు, ప్లాట్ల కేటాయింపు విధివిధానాలను ఆ నోటిఫికేషన్లో ప్రకటిస్తారు. -
37 ‘మునిసిపల్’ ఎన్నికలకు సన్నాహాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వివిధ కారణాలతో ఎన్నికలు నిర్వహించని మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణ దిశగా పురపాలకశాఖ కార్యాచరణ చేపట్టింది. రాష్ట్రంలో మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు కలిపి మొత్తం 125 ఉండగా ఇటీవల 87 చోట్ల ఎన్నికలు జరిగాయి. కాకినాడ కార్పొరేషన్‌కు 2017లోనే ఎన్నికలు జరిగాయి. దీంతో శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, నెల్లూరు కార్పొరేషన్లతోసహా 37 కార్పొరేషన్లు, మునిసిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి పెండింగ్ పనుల్ని వచ్చేనెల 15 నాటికి పూర్తిచేయాలని మున్సిపల్ కమిషనర్లను పురపాలకశాఖ ఆదేశించింది. ఓటర్ల జాబితాలను రూపొందించాలని, అవసరమైనచోట వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తిచేయాలని సూచించింది. అవసరమైనచోట వార్డుల సంఖ్యను పెంచుతూ ప్రతిపాదనలను రూపొందించి, వాటిపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరించమని ఆదేశించింది. సమీప గ్రామాలను విలీనం చేయడంపై ఉన్న వ్యాజ్యాలను త్వరగా పరిష్కరించాలని పురపాలకశాఖ యోచిస్తోంది. ఆ 37 కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా.. అందుకు సన్నద్ధమై ఉండాలని భావిస్తోంది. -
మైదుకూరు ఛైర్మన్ పీఠం వైఎస్సార్సీపీదే
మైదుకూరు: వైఎస్సార్ జిల్లాలోని మైదుకూరు మున్సిపల్ ఛైర్మన్ స్థానాన్ని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. మైదుకూరు మున్సిపాలిటీలో 24 వార్డులుండగా, టీడీపీ 12 వార్డుల్లో, వైసీపీ 11 వార్డుల్లో , జనసేన ఒక చోట గెలుపొందాయి. దీంతో ఏ పార్టీకి కూడా మెజార్టీ దక్కని పరిస్థితి ఏర్పడింది. ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలుపుకుంటే వైసీపీ బలం 13కి పెరిగింది. టీడీపీ, జనసేన కలిస్తే సంఖ్యా బలం 13గా ఉంది. కాగా, టీడీపీ ఆరో వార్డు సభ్యురాలు మహబూబ్‌బీతో పాటు జనసేన సభ్యుడు బాబు గైర్హాజరు కావడంతో టీడీపీ బలం 11కి పడిపోయింది. మరోవైపు అధికార పార్టీ వైఎస్సార్సీపీ తమకున్న రెండు ఎక్స్ అఫీషియా ఓట్లతో బలాన్ని 13కి పెంచుకుని చైర్మన్ పీఠాన్ని చేజిక్కించుకుంది. మైదుకూరు మున్సిపల్ ఛైర్మన్‌గా మాచనూరి చంద్ర, వైస్ ఛైర్మన్‌గా మహబూబ్ షరీఫ్ ఎన్నికయ్యారు. చదవండి: దేశ చరిత్రలోనే ఇది ఓ అరుదైన ఘట్టం: సజ్జల అక్రమాల పుట్ట ‘అమరావతి’ -
ఆంధ్ర ప్రదేశ్ : కొనసాగుతున్న మేయర్, ఛైర్మన్ల ఎన్నిక
-
బడుగుబలహీన వర్గాలకే అగ్రాసనం..
సాక్షి, అమరావతి: సామాజిక న్యాయానికి, మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం సరికొత్త చరిత్రను లిఖించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, మహిళలకు అధికారాన్ని అప్పగించడం ద్వారా వారి అభ్యున్నతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన చిత్తశుద్ధిని మరోసారి నిరూపించుకున్నారు. ఈ సారి పురపాలక అధ్యక్ష పదవుల్లో 60.46 శాతం మహిళలకే దక్కటం ఒక రికార్డేనని చెప్పాలి. అంతేకాదు!! చరిత్రలో తొలిసారిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 78 శాతం పదవులు లభించాయి. దీంతోపాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ల మేయర్లుగా బీసీ వర్గానికి చెందిన ముగ్గురు మహిళలు ఎన్నిక కావడం ఊహలకు కూడా అందని పరిణామం. మహిళాభ్యున్నతిని చేతల్లో చూపించిన ముఖ్యమంత్రి జగన్... పార్టీ సాధించిన 11 కార్పొరేషన్లలో ఏకంగా ఏడింటి పగ్గాలు మహిళలకే అప్పగించారు. ఎలాంటి రాజకీయ నేపథ్యంలేని సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన గృహిణులను పలువురిని ఈ పదవులు వరించటం ఒక మంచి మార్పుకు నాందిగానే పేర్కొనాలి. ఆయా వర్గాల రాజకీయ సాధికారతను చేతల్లో చూపించటం ద్వారా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అసలైన ప్రజాస్వామ్యానికి నిర్వచనం చెప్పింది. తన మంత్రివర్గంలో 60 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కేటాయించి జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన ముఖ్యమంత్రి... నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 50 శాతం కేటాయించేలా... అందులోనూ సగం మహిళలకే ఇవ్వాలని చట్టం చేశారు. తద్వారా సామాజిక న్యాయ సాధన దిశగా కొత్త ఒరవడి సృష్టించారు. ఇప్పుడు మేయర్లు, మునిసిపల్ చైర్ పర్సన్ల ఎంపికలోనూ అదే విధానాన్ని అనుసరించి తన నిబద్ధతను రుజువు చేసుకున్నారు. చెప్పిన దానికి మించి... 11 మేయర్, 75 మునిసిపల్ చైర్పర్సన్ పదవులతో కలిపి మొత్తం 86కిగానూ చట్ట ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 45 కేటాయించాల్సి ఉంది. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏకంగా 67 పదవులను వారికి కేటాయించింది. బీసీ ‘ఇ’ కేటగిరీ కిందకు వచ్చే ముస్లిం మైనార్టీలతో సహా బీసీలకు కేటాయించాల్సిన వాటికంటే అత్యధికంగా ముఖ్యమంత్రి జగన్ పదవులు ఇవ్వటంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద 86 పదవుల్లో మైనార్టీలతో సహా బీసీలకు 30 పదవులు కేటాయించాల్సి ఉండగా 52 ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో బీసీలకు కేటాయించాల్సిన పదవులకన్నా ఏకంగా 70.3 శాతం పదవులను అదనంగా ఇచ్చినట్లయింది. మహిళలకే అగ్రస్థానం ఇక మహిళలకు సంబంధించి తమది మాటలు చెప్పే ప్రభుత్వం కాదని... చేతల్లోనే చూపిస్తామని ముఖ్యమంత్రి మరోసారి నిరూపించారు. పదవుల్లో మహిళలకు అగ్రాసనం వేశారు. మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు కలిపి మొత్తం మీద 86 పదవుల్లో మహిళలకు 50 శాతం కేటాయించాలి. ఆ ప్రకారం 44 పదవులు కేటాయించాల్సి ఉండగా ముఖ్యమంత్రి ఏకంగా 52 మంది మహిళలకు పదవులు ఇచ్చారు. మహిళలకు 60.46 శాతం పదవులు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. జనరల్, బీసీ జనరల్, ఎస్సీ జనరల్‌గా రిజర్వ్ అయిన స్థానాల్లో కూడా చాలా చోట్ల మహిళలకే అవకాశం కల్పించారు. 75 మున్సిపాలిటీల్లో 45 చోట్ల చైర్పర్సన్లుగా మహిళలకే పగ్గాలు అప్పగించారు. అధికార పార్టీకే అన్నీ.. రాష్ట్రంలో ఇటీవల 12 కార్పొరేషన్లు, 75 మునిసిపాలిటీల్లో ఎన్నికలు జరగ్గా వాటిలో తాడిపత్రి మినహా 74 మున్సిపాలిటీలను వైఎస్సార్సీపీ గెలుచుకుంది. కోర్టు ఉత్తర్వుల కారణంగా ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెల్లడించకపోగా... ఫలితాలు వెల్లడించిన 11 కార్పొరేషన్లలోనూ వైఎస్సార్ సీపీ జయకేతనం ఎగురవేసింది. వాటిలో పాలక వర్గాలు గురువారం కొలువుదీరాయి. కార్పొరేషన్లలో ఎన్నికైన కార్పొరేటర్లు, ముసిసిపాలిటీల్లో ఎన్నికైన కౌన్సిలర్లు తొలుత పదవీ స్వీకార ప్రమాణం చేశారు. అనంతరం కార్పొరేషన్లలో మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మునిసిపాలిటీల్లో చైర్ పర్సన్లు, వైస్ చైర్ పర్సన్ల పదవులకు ఎన్నికలు నిర్వహించి గెలిచిన వారిచేత ప్రమాణం చేయించారు. అన్ని చోట్లా స్పష్టమైన మెజార్టీ ఉండటంలో మొత్తం 11 కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను వైఎస్సార్సీపీ గెలుచుకుంది. మున్సిపాలిటీలలో చైర్పర్సన్లు, వైస్ చైర్ పర్సన్ పదవులు కూడా అధికార పార్టీకే దక్కాయి. వైఎస్సార్సీపీకి పూర్తి మెజార్టీ ఉండటంతో నల్లేరుపై నడకలా విజయం సాధించింది. కాస్త ఆసక్తి రేపిన మైదుకూరు మున్సిపాలిటీని కూడా వైఎస్సార్సీపీయే గెలుచుకుంది. మైదుకూరులో వైఎస్సార్సీపీ 11 వార్డుల్లో, టీడీపీ 12 వార్డుల్లో గెలవగా జనసేన ఒక వార్డు దక్కించుకుంది. కాగా జనసేన నుంచి గెలిచిన ఏకైక కౌన్సిలర్‌తోపాటు టీడీపీ కౌన్సిలర్ ఒకరు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలో పాల్గొనలేదు. ఎక్స్ అఫిషియో సభ్యులైన ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లు ఉండటంతో వైఎస్సార్సీపీ స్పష్టమైన మెజార్టీ సాధించి మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ పదవులను గెలుచుకుంది. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీని మాత్రం టీడీపీ దక్కించుకుంది. ఇక్కడ వైఎస్సార్సీపీ 16 వార్డులను గెలవగా టీడీపీ 18 వార్డుల్లో గెలిచింది. సీపీఐ ఒక వార్డులోనూ, స్వతంత్ర సభ్యుడు ఒక వార్డులోనూ విజయం సాధించారు. ఎక్స్ అఫిషియో సభ్యులైన ఎంపీ, ఎమ్మెల్యే ఓట్లతో వైఎస్సార్సీపీ బలం 18కి చేరింది. టీడీపీకి సీపీఐ కౌన్సిలర్‌తో పాటు ఇండిపెండెంట్ కౌన్సిలర్ కూడా మద్దతు ప్రకటించడంతో తాడిపత్రి మున్సిపాలిటీని ఆ పార్టీ గెలుచుకుంది. సూళ్లూరుపేట, బొబ్బిలి, ఉయ్యూరులో నేడు.. సూళ్లూరుపేట మునిసిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నికను గురువారం నిర్వహించలేదు. విజయనగరం జిల్లా బొబ్బిలి, కృష్ణా జిల్లా ఉయ్యూరు మునిసిపల్ వైస్ చైర్మన్ల ఎన్నికలు కోరం లేకపోవడంతో జరగలేదు. ఆ పదవులకు శుక్రవారం ఎన్నికలు నిర్వహిస్తారు. మేయర్లు, డిప్యూటీ మేయర్లు.. ►ఒంగోలు మేయర్‌గా గంగాడి సుజాత ►ఒంగోలు డిప్యూటీ మేయర్‌గా వేమూరి సూర్యనారాయణ ►కడప మేయర్‌గా సురేష్‌బాబు ►కడప డిప్యూటీ మేయర్‌గా షేక్ ముంతాజ్ బేగం ►అనంతపురం మేయర్‌గా వసీమ్ సలీమ్ ►అనంతపురం డిప్యూటీ మేయర్‌గా వాసంతి సాహిత్య ►విజయనగరం మేయర్‌గా విజయలక్ష్మి ►విజయనగరం డిప్యూటీ మేయర్‌గా ముచ్చు నాగలక్ష్మి ►మచిలీపట్నం మేయర్‌గా మోకా వెంకటేశ్వరమ్మ ►తిరుపతి మేయర్‌గా డా.శిరీషా ఏకగ్రీవ ఎన్నిక ►విశాఖ మేయర్‌గా గొలగాని హరి వెంకటకుమారి ►విశాఖ డిప్యూటీ మేయర్‌గా జియ్యాని శ్రీధర్ ►చిత్తూరు మేయర్‌గా అముద ►చిత్తూరు డిప్యూటీ మేయర్‌గా చంద్రశేఖర్ ►గుంటూరు మేయర్‌గా కావటి మనోహర్‌నాయుడు ►గుంటూరు డిప్యూటీ మేయర్‌గా వనమా బాలవజ్ర బాబు ►విజయవాడ మేయర్‌గా భాగ్యలక్ష్మీ ►విజయవాడ డిప్యూటీ మేయర్‌గా బెల్లం దుర్గ ►కర్నూలు మేయర్‌గా బీవై రామయ్య మున్సిపల్ ఛైర్పర్సన్లు... అనంతపురం: ధర్మవరం ఛైర్‌పర్సన్‌గా నిర్మల గుత్తి ఛైర్‌పర్సన్‌గా వన్నూరుబీ గుంతకల్లు ఛైర్‌పర్సన్‌గా ఎన్.భవానీ హిందూపురం ఛైర్‌పర్సన్‌గా ఇంద్రజ కదిరి ఛైర్‌పర్సన్‌గా నజి మున్నీసా కల్యాణదుర్గం ఛైర్మన్‌గా రాజకుమార్ మడకశిర ఛైర్‌పర్సన్‌గా లక్షీనరసమ్మ పుట్టపర్తి ఛైర్మన్‌గా ఓబులపతి రాయదుర్గం ఛైర్‌పర్సన్‌గా శిల్ప తాడిపత్రి ఛైర్మన్‌గా జేసీ ప్రభాకర్‌రెడ్డి కర్నూలు: ఆదోని ఛైర్‌పర్సన్‌గా శాంత ♦ఆళ్లగడ్డ ఛైర్మన్‌గా రామలింగారెడ్డి ♦ఆత్మకూరు ఛైర్మన్‌గా ఆసియా ♦డోన్ ఛైర్మన్‌గా గంటా రాజేష్ ♦గూడూరు ఛైర్మన్‌గా వెంకటేశ్వర్లు ♦నందికొట్కూరు ఛైర్మన్‌గా సుధాకర్‌రెడ్డి ♦నంద్యాల ఛైర్‌పర్సన్‌గా షేక్ మబున్ని ♦ఎమ్మిగనూరు ఛైర్మన్‌గా శివన్న రఘు వైఎస్సార్ జిల్లా: బద్వేల్ ఛైర్మన్‌గా రాజగోపాల్‌రెడ్డి ♦జమ్మలమడుగు ఛైర్‌పర్సన్‌గా శివమ్మ ♦మైదుకూరు ఛైర్మన్‌గా చంద్ర ♦ప్రొద్దుటూరు ఛైర్‌పర్సన్‌గా లక్ష్మీదేవి ♦పులివెందుల ఛైర్మన్‌గా వరప్రసాద్ ♦రాయచోటి ఛైర్మన్‌గా షేక్ బాషా ♦ఎర్రగుంట్లపాలెం ఛైర్మన్‌గా హర్షవర్ధన్‌రెడ్డి ప్రకాశం జిల్లా: ఒంగోలు డిప్యూటీ మేయర్‌గా వేమూరి సూర్యనారాయణ ♦అద్దంకి ఛైర్‌పర్సన్‌గా ఎస్తేరమ్మ ♦చీమకుర్తి ఛైర్‌పర్సన్‌గా చల్లా అంకులు ♦చీరాల ఛైర్మన్‌గా జి.శ్రీనివాసరావు ♦గిద్దలూరు ఛైర్మన్‌గా వెంకటసుబ్బయ్య ♦కనిగిరి ఛైర్మన్‌గా అబ్దుల్ గఫార్ ♦మార్కాపురం ఛైర్మన్‌గా మురళీకృష్ణారావు నెల్లూరు: ఆత్మకూరు ఛైర్‌పర్సన్‌గా వెంకట రమణమ్మ ♦నాయుడుపేట ఛైర్‌పర్సన్‌గా దీపిక ♦సూళ్లూరుపేట ఛైర్మన్‌గా శ్రీమంత్‌రెడ్డి ♦వెంకటగిరి ఛైర్‌పర్సన్‌గా నక్కా భానుప్రియ చిత్తూరు: మదనపల్లె ఛైర్‌పర్సన్‌గా మనుజ ♦నగరి ఛైర్‌పర్సన్‌గా నీలమంగళం ♦పలమనేరు ఛైర్‌పర్సన్‌గా పవిత్ర ♦పుంగనూరు ఛైర్మన్‌గా ఆలీమ్ బాషా ♦పుత్తూరు ఛైర్మన్‌గా హరి కృష్ణా జిల్లా: నూజివీడు ఛైర్‌పర్సన్‌గా త్రివేణి దుర్గా ♦పెడన ఛైర్‌పర్సన్‌గా బి.జ్ఞానలింగజ్యోతి ♦ఉయ్యూరు ఛైర్మన్‌గా వల్లభనేని సత్యనారాయణ ♦నందిగామ ఛైర్‌పర్సన్‌గా మండవ వరలక్ష్మి ♦తిరువూరు ఛైర్‌పర్సన్‌గా కస్తూరిభాయి గుంటూరు జిల్లా: తెనాలి ఛైర్‌పర్సన్‌గా ఖలీదా ♦చిలకలూరిపేట ఛైర్‌పర్సన్‌గా షేక్ రఫాని ♦రేపల్లె ఛైర్‌పర్సన్‌గా కట్టా మంగమ్మ ♦సత్తెనపల్లి ఛైర్‌పర్సన్‌గా లక్ష్మీతులసి ♦వినుకొండ ఛైర్మన్‌గా దస్తగిరి ♦మాచర్ల ఛైర్మన్‌గా తురక కిశోర్ ♦పిడుగురాళ్ల ఛైర్మన్‌గా చిన్న సుబ్బారావు తూర్పుగోదావరి: అమలాపురం మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా సత్యనాగేంద్రమణి ♦గొల్లప్రోలు నగర పంచాయతీ ఛైర్‌పర్సన్‌గా మంగతాయారు ♦మండపేట మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా దుర్గారాణి ♦ముమ్మిడివరం నగర పంచాయతీ ఛైర్మన్‌గా ప్రవీణ్‌కుమార్ ♦పెద్దాపురం మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా బొడ్డు తులసి ♦పిఠాపురం మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా గండేపల్లి సుర్యావతి ♦రామచంద్రపురం మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా శ్రీదేవి ♦సామర్లకోట మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా గంగిరెడ్డి దేవి ♦తుని మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా ఏలూరి సుధారాణి ♦ఏలేశ్వరం నగర పంచాయతీ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా అలమంద సత్యవతి పశ్చిమగోదావరి: కొవ్వూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా రత్నకుమారి ♦జంగారెడ్డిగూడెం మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా బత్తిన లక్ష్మీ ♦నరసాపురం మున్సిపల్ ఛైర్మన్‌గా బర్రె శ్రీవెంకటరమణ ♦నరసాపురం మున్సిపల్ వైస్‌ఛైర్మన్‌గా కొత్తపల్లి భుజంగరావు ♦నిడదవోలు మున్సిపల్ ఛైర్మన్‌గా ఆదినారాయణ ♦కొవ్వూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా రత్నకుమారి ♦కొవ్వూరు మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్‌గా మన్నె పద్మ ♦జంగారెడ్డిగూడెం మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా బత్తిన లక్ష్మీ ♦జంగారెడ్డిగూడెం మున్సిపల్ వైస్‌ఛైర్‌పర్సన్‌గా కంచర్ల వాసవీ ►విజయనగరం: బొబ్బిలి మున్సిపల్ ఛైర్మన్‌గా వెంకట మురళీకృష్ణారావు ►విజయనగరం: పార్వతీపురం మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా బోను గౌరీశ్వరి ►విజయనగరం: సాలూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా ఈశ్వరమ్మ ►విశాఖ: నర్సీపట్నం మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా ఆదిలక్ష్మి ►విశాఖ: యలమంచిలి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా పీలా రామాకుమారి ►శ్రీకాకుళం: ఇచ్ఛాపురం మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా పిలక రాజ్యలక్ష్మి ►శ్రీకాకుళం: పాలకొండ నగర పంచాయతీ ఛైర్‌పర్సన్‌గా రాధాకుమారి ►శ్రీకాకుళం: పలాస మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా గిరిబాబు ►పార్వతీపురం మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా బోను గౌరీశ్వరి ►పార్వతీపురం మున్సిపల్ వైస్‌చైర్‌పర్సన్‌గా కొండపల్లి రుక్మిణి ►సాలూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా ఈశ్వరమ్మ ►సాలూరు మున్సిపల్ వైస్‌ఛైర్మన్‌గా జరజాపు దీప్తి ►విజయనగరం: నెల్లిమర్ల నగర పంచాయతీ ఛైర్‌పర్సన్‌గా సరోజిని ►విజయనగరం: నెల్లిమర్ల నగర పంచాయతీ వైస్ ఛైర్మన్‌గా సముద్రపు రామారావు ►గుంటూరు: సత్తెనపల్లి మున్సిపల్ ఛైర్మన్‌గా లక్ష్మీతులసి ►సత్తెనపల్లి మున్సిపల్ వైస్‌ఛైర్‌పర్సన్‌గా షేక్ నాగుల్‌మీరాన్ ►విశాఖ: యలమంచిలి మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా పిల్లా రామకుమారి ►యలమంచిలి మున్సిపాలిటీ వైస్‌ఛైర్మన్‌గా వెంకట గోవిందరాజు ►అనంతపురం: హిందూపురం మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా ఇంద్రజ ►హిందూపురం మున్సిపాలిటీ వైస్‌ఛైర్మన్‌గా పీఎన్ జాబివుల్లా ►విజయనగరం: పార్వతీపురం మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా గోను గౌరీశ్వరి ►పార్వతీపురం మున్సిపాలిటీ వైస్ ఛైర్‌పర్సన్‌గా కొండపల్లి రుక్మిణి ►తూ.గో: ఏలేశ్వరం మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా అలమండ సత్యవతి ►ఏలేశ్వరం మున్సిపాలిటీ వైస్‌ఛైర్‌పర్సన్‌గా శిడగం త్రివేణి ►చిత్తూరు: పలమనేరు మున్సిపల్ ఛైర్మన్‌గా మురళీకృష్ణ ►పలమనేరు మున్సిపల్ వైస్‌ఛైర్మన్‌గా చన్మ ►వైఎస్ఆర్ జిల్లా: మైదుకూరు మున్సిపల్ ఛైర్మన్‌గా మచ్చునూరి చంద్ర ►మైదుకూరు మున్సిపల్ వైస్‌ఛైర్మన్‌గా షేక్ మహబూబ్ షరీఫ్ -
మేయర్, చైర్పర్సన్ల ఎన్నిక నేడే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 11 నగరపాలక సంస్థలు, 75 మునిసిపాలిటీల్లో కొత్త పాలక మండళ్లు గురువారం కొలువుదీరనున్నాయి. కార్పొరేషన్లకు మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మునిసిపాలిటీలకు చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 10న 12 మునిసిపల్ కార్పొరేషన్లు, 75 మునిసిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఏలూరు కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు చేపట్టలేదు. ఫలితాలు ప్రకటించిన 11 కార్పొరేషన్లలో ఎన్నికైన కార్పొరేటర్లు మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకుంటారు. అదేవిధంగా 75 మునిసిపాలిటీలకు ఎన్నికైన కౌన్సిలర్లు చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లను ఎన్నుకుంటారు. అందుకోసం పురపాలక శాఖ అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. ఎన్నిక ప్రక్రియ ఇలా.. ముందుగా నగరపాలక సంస్థల కార్పొరేటర్లు, మునిసిపల్ కౌన్సిలర్లతో ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఉదయం 11 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్, మునిసిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులకు ఎన్నిక నిర్వహిస్తారు. ఫలితాలను వెంటనే ప్రకటిస్తారు. మేయర్, చైర్పర్సన్ ఎన్నిక నిర్వహించేందుకు కనీసం 50 శాతం సభ్యుల హాజరును కోరంగా పరిగణిస్తారు. కోరం లేకపోతే ఎన్నికను వాయిదా వేస్తారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు కార్పొరేషన్లు, మునిసిపాలిటీలకు ప్రిసైడింగ్ అధికారులను ప్రభుత్వం నియమించింది. వారి ఆధ్వర్యంలో ఆయా సంస్థల సమావేశ మందిరాల్లో సమావేశాలు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పురపాలక శాఖ కమిషనర్ ఎంఎం నాయక్, జిల్లా కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏర్పాట్లను సమీక్షించారు. ఆయా కార్యాలయాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కొక్క పోస్టుకే నేడు ఎన్నికలు ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు వీలుగా నగరపాలక సంస్థల్లో ఇద్దరు డిప్యూటీ మేయర్లు, మునిసిపాలిటీల్లో ఇద్దరు వైస్ చైర్పర్సన్లను ఎన్నుకునే అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఆర్డినెన్స్ రూపొందించి గవర్నర్ ఆమోదానికి పంపించింది. ఈ లోగా ఒక్కొక్క మేయర్, ఒక్కొక్క వైస్ చైర్పర్సన్ నియామకానికి గురువారం ఎన్నిక నిర్వహిస్తారు. ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం లభించింన తరువాత మరో డిప్యూటీ మేయర్, మరో వైస్ చైర్పర్సన్ పదవులకు ఎన్నిక నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అనంతరమే ఆ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తారు. -
వీఆర్వోలకు కొత్త బాధ్యతలు..
సాక్షి, హైదరాబాద్ : గ్రామ రెవెన్యూ అధికారు (వీఆర్వో)లను రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లుగా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. కొత్త రెవెన్యూ చట్టం అమల్లో భాగంగా వీఆర్వోల వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 5,348 మంది వీఆర్వోలు గత కొన్ని నెలలుగా పనిలేకుండా ఖాళీగా ఉంటున్నారు. అవసరాన్ని బట్టి వీఆర్వోలను ఇతర శాఖల్లో విలీనం చేస్తామని, అప్పటివరకు వారికి యథావిధిగా జీతాలు చెల్లిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వీరిలో 40 శాతం మందిని పురపాలక శాఖలోకి తీసుకోనున్నారు.వార్డుకొకరు చొప్పున: జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని 141 పురపాలికల్లో దాదాపు 2,200 వార్డు ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తొలుత ప్రత్యక్ష నియామకాల ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు కొత్త పోస్టులు సృష్టించడానికి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి కోరుతూ పురపాలక శాఖ ఇటీవల ప్రతిపాదనలు సైతం పంపించింది. అయితే వీఆర్వోలను పురపాలక శాఖలో విలీనం చేసుకుని వార్డు ఆఫీసర్లుగా నియమించాలనే ఆలోచన రావడంతో ప్రత్యక్ష నియామకాల ప్రతిపాదనలను ప్రభుత్వం పక్కనబెట్టింది. వీఆర్వోలను ఇతర శాఖల్లో విలీనం చేసేందుకు అవసరమైన విధివిధానాలను ప్రభుత్వం రూపొందించాల్సి ఉంది. ప్రభుత్వ అవసరాలు, ఖాళీలను బట్టి వారికి నచ్చిన ప్రభుత్వ శాఖలో విలీనం కావడానికి వీఆర్వోల నుంచి ఆప్షన్లను స్వీకరిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇతర శాఖల్లో వీఆర్వోలను విలీనం చేస్తే 5,348 మందిలో 40 శాతం మంది ఒక్క పురపాలక శాఖకే వస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొత్త పుర చట్టం అమలుకే... పురపాలనలో సంస్కరణల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చింది. వార్డు/ డివిజన్ స్థాయిలో ఈ చట్టం అమలు బాధ్యతలను వార్డు ఆఫీసర్లకు అప్పగించబోతోంది. వార్డు కమిటీలతో సమావేశాలు నిర్వహించడం, వార్డు అభివృద్ధి పనుల్లో కౌన్సిలర్లు/ కార్పొరేటర్లతో సమన్వయం చేసుకోవడం, హరితహారం కింద మొక్కలు నాటడం, వాటిని పరిరక్షించడం, పారిశుద్ధ్య నిర్వహణను పర్యవేక్షించడం, అక్రమ నిర్మాణాలపై నిఘా వేయడం, ఆస్తి పన్ను వసూళ్లు తదితర బాధ్యతలను వార్డు ఆఫీసర్లకు ప్రభుత్వం అప్పగించనుంది. ఈ బాధ్యతల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, లేక కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం నాటిన వాటిలో 85 శాతం మొక్కలను పరిరక్షించడంలో విఫలమైనా వార్డు ఆఫీసర్లను బాధ్యులుగా చేయనున్నారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక: పకడ్బందీ చర్యలు
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రణాళిక ప్రకారం నిర్వహించాలని కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారులకు సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక ప్రిసైడింగ్ అధికారి, ఇద్దరు అసిస్టెంట్ పోలింగ్ అధికారులను నియమించామన్నారు. పోలింగ్‌కు 48 గంటల ముందు రాజకీయ పార్టీలు ప్రచారం చేయడానికి వీలు లేదన్నారు. లిక్కర్ దుకాణాలు మూసివేయాలని, సోషల్ మీడియాపై బాగా నిఘా పెట్టాలన్నారు. ఇందూరు(నిజామాబాద్ అర్బన్): ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను కార్యాచరణ ప్రణాళికతో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని ప్రగతిభవన్‌లో కామారెడ్డి కలెక్టర్ శరత్‌తో కలిసి ఉమ్మడి జిల్లా అధికారులతో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ ఈనెల 9న జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ సామగ్రిని రెండు జిల్లాలకు 8న నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల నుంచి పంపిణీ చేస్తామన్నారు. మొత్తం ఓటర్లు 824 మంది ఉన్నారని తెలిపారు. గతంలో రెవెన్యూ డివిజన్‌కు ఒక పోలింగ్ స్టేషన్ ఉండేదని, ప్రస్తుతం ప్రతి మండలానికి ఒక పోలింగ్ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. మొత్తం 50 పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ జరుగుతుందన్నారు. నిజామాబాద్‌లో 28, కామారెడ్డిలో 22 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓటరు జాబితాను పోలింగ్ స్టేషన్ల వారీగా డివైడ్ చేసి మండల అధికారులు, ఆర్డీవోలకు, రాజకీయ పార్టీలకు, పోటీలో ఉన్న అభ్యర్థులకు అందజేశామన్నారు. 50 పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణ కోసం 15 రూట్లు ఏర్పాటు చేశామన్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి సిరిసిల్ల జిల్లాలో రెండు ఎంపీటీసీ ఓట్లు, సంగారెడ్డిలో ఒక ఎంపీటీసీ ఓటు ఉన్నట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక ప్రిసైడింగ్ అధికారి, ఇద్దరు అసిస్టెంట్ పోలింగ్ అధికారులను నియమించామన్నారు. ఎన్నికల పరిశీలనకు 21 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించినట్లు వివరించారు. 48 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సిస్టం ఏర్పాటు చేస్తుండగా, మిగతా రెండు కేంద్రాల్లో వీడియో కెమెరా ద్వారా రికార్డు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో పోలింగ్ అధికారి, మైక్రో పరిశీలకులతో పాటు ఒక మెడికల్ అధికారి, ఏఎన్ఎం, ఆశా వర్కర్లను ఏర్పాటు చేస్తామన్నారు. పోలింగ్‌కు 48 గంటల ముందు రాజకీయ పార్టీలు ప్రచారం చేయడానికి వీలు లేదన్నారు. పోలింగ్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందన్నారు. పోలింగ్‌కు ముందు 48 గంటలను డ్రై డేగా పాటించాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 7న సాయంత్రం 5 గంటల నుంచి లిక్కర్ దుకాణాలు మూసివేయాలన్నారు. చివరి 48 గంటల ముందు సోషల్ మీడియాపై బాగా నిఘా పెట్టాలని అధికారులకు సూచించారు. 8వ తేదీన పోలింగ్ సామగ్రి పంపిణీ, 12న కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేయనున్నందున ఈ రోజుల్లో పాలిటెక్నిక్ కళాశాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ రోజు పోలింగ్ స్టేషన్ ఉన్న 100 మీటర్ల పరిధిలో కార్యాలయాలకు, దుకాణాలకు సెలవు ఉంటుందన్నారు. ఎన్నికల కోడ్, కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఓటు వినియోగించుకునే వారిలో 24 మందికి కోవిడ్ పాజిటివ్ ఉన్నట్లు తెలిపారు. వారికి రెండు విధాలుగా ఓటు వేయడానికి అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఒకటి పోస్టల్ బ్యాలెట్, రెండోది చివరి గంటలో నేరుగా కేంద్రానికి వచ్చి ఓటు వేయవచ్చని తెలిపారు. ఇందుకు కోసం ప్రతి పోలింగ్ కేంద్రానికి నాలుగు పీపీఈ కిట్లు ఇస్తున్నామని, హెల్ప్ డెస్క్ దగ్గర మెడికల్ అధికారి ఉంటారని తెలిపారు. అలాగే పోలింగ్ ఏజెంటు ఎప్పుడు వచ్చినా పోలింగ్ కేంద్రంలోని అనుమతించాలని, పోటీలో ఉన్న అభ్యర్థికి ఒక ఏజెంటు మాత్రమే ఉండాలన్నారు. ప్రభుత్వ అధికారులు, ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఏజెంట్‌గా ఉండరాదన్నారు. ఓటు వేసేవారందరూ తప్పకుండా మాస్కు, గ్లౌజులు ధరించాలని, సానిటైజర్ వినియోగించాలని సూచించారు. ఓటు ఓటువేసే వ్యక్తిని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు గుర్తిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ, కామారెడ్డి ఎస్పీ శ్వేత, నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్, ఉమ్మడి జిల్లా ఆర్డీవోలు, పోలీసు అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
ఇతర రాష్ట్రాల్లో ఆస్తి పన్ను విధానాలపై అధ్యయనం
సాక్షి, అమరావతి: మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో సంస్కరణలపై కేంద్ర మార్గదర్శకాల అమలు తీరు తెన్నులను ఇతర రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఈ అంశంపై సమీక్షించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ► కార్పొరేషన్లు, మున్సిపాల్టీలను స్వయం సమృద్ధి దిశగా నడిపించాలని కేంద్రం మార్గనిర్దేశం చేసింది. ఈ నేపథ్యంలో కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లో ఆస్తి పన్ను విధానాలు, రాష్ట్రంలో ఆస్తి పన్ను విధానాలను అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వివరించారు. ► ఆయా రాష్ట్రాల్లో నెలవారీ అద్దె ప్రాతిపదికన కాకుండా ఆస్తి విలువ ప్రాతిపదికన పన్నులు విధిస్తున్న అంశాన్ని అధికారులు వివరించారు. ఆయా రాష్ట్రాల్లో ఆస్తి విలువలు, దాన్ని నిర్ధారించే విధానాలు, ఆ మేరకు విధిస్తున్న పన్ను తదితర అంశాలపై చర్చించారు. వాటన్నింటిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ► ఈ సమీక్షలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్యామలరావు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ విజయకుమార్, ఆ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
రానున్నాయి 266 ‘చార్జింగ్ బంక్‌లు’
సాక్షి, అమరావతి: కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్యాచరణకు ఉపక్రమించాయి. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర భారీ పరిశ్రమలు, పట్టణాభివృద్ధి సంస్థలతో కలిసి పని చేసేందుకు రాష్ట్ర పురపాలక, విద్యుత్ శాఖలు సంసిద్ధమయ్యాయి. రాష్ట్రంలో స్మార్ట్ సిటీ, అమృత్ పథకం కింద ఎంపికైన నగరాల్లో మొదటి దశలో ఈవీల వినియోగాన్ని ప్రోత్సహిస్తారు. ఇందుకోసం 266 ఈవీ చార్జింగ్ స్టేషన్లు (చార్జింగ్ బంక్‌లు) నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక, ఇంధన శాఖలకు సమాచారం ఇచ్చింది. రాష్టంలో స్మార్ట్ సిటీల పథకం కింద ఎంపికైన విశాఖపట్నం, కాకినాడ, అమరావతి, తిరుపతి నగరాల్లో చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన సంస్థలు ఆ నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లు, వాటి పరిధిలోని విద్యుత్ పంపిణీ సంస్థలతో త్వరలోనే ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. ఇందుకు అవసరమైన స్థలాలను సేకరించి చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తారు. రాష్ట్రానికి కేటాయించిన 266 ఈవీ చార్జింగ్ స్టేషన్లలో 1,412 చార్జర్లు ఉంటాయని భావిస్తున్నారు. 266 స్టేషన్లలో 133 స్లో చార్జింగ్, మరో 133 స్పీడ్ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. స్లో చార్జింగ్ స్టేషన్లలో వాహనం మోడల్‌ను బట్టి చార్జింగ్ చేయడానికి 2 నుంచి 6 గంటల సమయం పడుతుంది. స్పీడ్ చార్జింగ్ స్టేషన్లలో అయితే వాహనం మోడల్‌ను బట్టి అరగంట నుంచి 2 గంటల సమయం పడుతుంది. ఒక్కొక్క చార్జింగ్ స్టేషన్లో ఒకేసారి సగటున 5 వాహనాలకు చార్జింగ్ చేసే సామర్థ్యం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కాలుష్య నియంత్రణకు ‘ఫేమ్’ డీజిల్, పెట్రోల్ వాహనాలతో కాలుష్యం పెరిగిపోతోందని పర్యావరణ నిపుణులు చెబుతున్న నేపథ్యంలో ఈవీల వాడకాన్ని పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. అందుకోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల సత్వర తయారీ, వాడకం (ఫేమ్) పథకాన్ని చేపట్టింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ చేయడమనేది ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ సమస్య పరిష్కారానికి దేశంలో ఈవీ చార్జింగ్ స్టేషన్లను పెద్ద సంఖ్యలో నెలకొల్పాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. స్మార్ట్ సిటీ, అమృత్ పథకం కింద 100 నగరాలు ఎంపిక కాగా.. మొదటి దశలో 62 నగరాల్లో 2,636 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని అధికారులు సంకల్పించారు. ఇందుకు ఆసక్తి గల సంస్థల నుంచి భారీ పరిశ్రమల శాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. మొత్తం 106 సంస్థలు ఈవీ చార్జింగ్ స్టేషన్లు నెలకొల్పేందుకు ఆసక్తి చూపించగా.. నిపుణుల కమిటీ వాటిలో 19 కంపెనీలను ఎంపిక చేసింది. మున్సిపాల్టీల్లోనూ ఏర్పాటు చేసే యోచన రాష్ట్రంలో 31 పట్టణాలు అమృత్ పథకం కింద ఎంపికయ్యాయి. స్మార్ట్ సిటీలకు మంజూరు చేసిన 266 ఈవీ చార్జింగ్ స్టేషన్లలో కొన్నిటిని అమృత్ పథకం కింద ఎంపికైన మున్సిపాల్టీల్లో కూడా నెలకొల్పితే ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని మరింతగా ప్రోత్సహించినట్టు అవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించాల్సి ఉంది. కేంద్రం ఆమోదిస్తే 31 మున్సిపాలిటీలలో రెండేసి చొప్పున, మిగిలిన 204 స్టేషన్లను స్మార్ట్ సిటీలైన విశాఖపట్నం, కాకినాడ, అమరావతి, తిరుపతిలలో నెలకొల్పాలని యోచిస్తున్నారు. అందుకు నిబంధనలను అనుమతించకపోతే మొత్తం స్టేషన్లను ఎంపికైన నాలుగు నగరాల్లోనే ఏర్పాటు చేస్తారు. కేంద్రం ఎంపిక చేసిన సంస్థలు ఈవీ చార్జింగ్ స్టేషన్లను త్వరితగతిన ఏర్పాటు చేసేందుకు మున్సిపాలిటీలు, డిస్కంలతో ఒప్పందం చేసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్దేశించింది. దీనిపై త్వరలోనే స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. -
33% బీసీ కోటా
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు వచ్చేశాయి. బీసీలకు 33 శాతం వరకు రిజర్వేషన్లు అమలు చేయవచ్చని రాష్ట్ర మున్సిపాలిటీల చట్టంలో విధించిన గరిష్ట పరిమితి మేరకు మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 32.5 నుంచి 33 శాతం వరకు రిజర్వేషన్లు దక్కనున్నాయి. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల చైర్పర్సన్, 13 మున్సి పల్ కార్పొరేషన్ల మేయర్ స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్లను రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్ డాక్టర్ టీకే శ్రీదేవి ఆదివారం హైదరాబాద్‌లో ప్రకటించారు. 123 మున్సిపాలిటీల చైర్పర్సన్ స్థానాల్లో బీసీలకు 40, ఎస్సీలకు 17, ఎస్టీలకు 4 రిజర్వ్‌కాగా ఓపెన్ కేటగిరీకి 62 స్థానాలు రిజర్వు అయ్యాయి. 13 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ స్థానాలకుగాను ఎస్సీ, ఎస్టీలకు చెరో స్థానం, బీసీలకు 4, ఓపెన్ కేటగిరీలో 7 స్థానాలు రిజర్వు అయ్యాయి. రాష్ట్రంలో కొత్త మున్సిపల్ చట్టం అమల్లోకి రావడంతో మళ్లీ కొత్తగా రిజర్వేషన్లను ప్రకటించాల్సిన అవసరం ఏర్పడింది. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలతోపాటు మరో రెండు పర్యాయాలు కలిపి మొత్తం మూడు వరుస సాధారణ ఎన్నికల్లో ఇవే రిజర్వేషన్లు అమలు కానున్నాయి. రాష్ట్రంలో 128 మున్సిపాలిటీలు, 13 మున్సిపల్ కార్పొరేషన్లు కలిపి మొత్తం 141 పురపాలికలు ఉన్నాయి. ఇందులో షెడ్యూల్డ్ ఏరియా పరిధిలో ఉన్న 3 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించడానికి రాజ్యాంగ సవరణ జరపాల్సి ఉంది. గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా ఏర్పడిన 2 కొత్త మున్సిపాలిటీల పరిధిలోని కొన్ని గ్రామ పంచాయతీల పదవీకాలం ఇంకా ముగియలేదు. దీంతో ఈ ఐదు మున్సిపాలిటీలను మినహాయించి రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లకు సంబంధించిన చైర్పర్సన్, మేయర్ స్థానాలకు రిజర్వేషన్లను ప్రకటించారు. మరోవైపు ఆదివారం జిల్లా కలెక్టర్లు స్థానికంగా ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలోని వార్డులు/డివిజన్లకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రకటించారు. దీంతో మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన ప్రధాన ఘట్టం ముగిసింది. ఈ నెల 7న రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికల నోటిఫికేషన్ రానుండగా, 22న పోలింగ్ నిర్వహించి 25న ఫలితాలు ప్రకటించనున్నారు. జనాభా దామాషా ప్రకారం.. మున్సిపల్ చైర్పర్సన్, మేయర్ స్థానాలకు రాష్ట్రం యూనిట్‌గా తీసుకొని రిజర్వేషన్లను ఖరారు చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా దామాషా ప్రకారం చైర్పర్సన్, మేయర్ స్థానాలను కేటాయించారు. మున్సిపాలిటీల్లో 3.3 శాతం ఎస్టీ జనాభా ఉండగా, 3.2 శాతం చైర్పర్సన్ స్థానాలు వారికి దక్కాయి. దీంతో మొత్తం 123 పురపాలికలకుగాను 4 చైర్పర్సన్ స్థానాలు ఎస్సీలకు రిజర్వు అయ్యాయి. ఇక మున్సిపాలిటీల్లో 13 శాతం ఎస్సీల జనాభా ఉండగా దాదాపు 14 శాతం (17 స్థానాలు) చైర్పర్సన్ సీట్లను వారికి కేటాయించారు. ఎస్సీ, ఎస్టీల కోటా కలుపుకొని మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా ఉండేలా బీసీలకు 32.5 నుంచి 33 శాతం (40 స్థానాలు) చైర్పర్సన్ సీట్లను కేటాయించినట్లు పురపాలక శాఖ డైరెక్టర్ టీకే శ్రీదేవి తెలిపారు. 13 మున్సిపల్ కార్పొరేషన్లలో ఎస్టీల జనాభా 1.9 శాతం మాత్రమే ఉన్నా నిబంధనల ప్రకారం వారికి ఒక మేయర్ పదవి (8 శాతం)ని కేటాయించారు. కార్పొరేషన్లలో ఎస్సీల జనాభా 3.6 శాతం ఉండగా వారికి కూడా నిబంధనల ప్రకారం ఒక మేయర్ సీటును కేటాయించడంతో 8 శాతం కోటా అమలు చేసినట్లు అయింది. బీసీలకు 4 మేయర్ స్థానాలు కేటాయించడంతో 33 శాతం రిజర్వేషన్లు వారికి కల్పించినట్లు అయిందని శ్రీదేవి వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీలకు చెరో మేయర్ పదవి రిజర్వు కావడంతో ఈ స్థానాలకు మహిళా రిజర్వేషన్లను అమలు చేయలేకపోయామన్నారు. అందుకు బదులుగా మహిళలకు ఓపెన్ కెటగిరీలో ఉన్న 7 మేయర్ స్థానాలకుగాను 4 స్థానాలను రిజర్వు చేశామన్నారు. మున్సిపాలిటీ చైర్మన్ రిజర్వేషన్లు... బీసీ (జనరల్): నారాయణ్‌ఖేడ్, ఆందోల్–జోగిపేట్, గద్వాల, నిర్మల్, రాయికల్, ఎల్లారెడ్డి, మహబూబ్‌నగర్, పరిగి, వనపర్తి, అమరచింత, రామాయంపేట, చౌటుప్పల్, కొడంగల్, ఖానాపూర్, తూప్రాన్, మంచిర్యాల, బాన్సువాడ, ఆలేరు, భువనగిరి, నర్సాపూర్ బీసీ (మహిళ): సిరిసిల్ల, నారాయణపేట, కోరుట్ల, సదాశివపేట, చండూరు, భీంగల్, ఆర్మూర్, కోస్గి, మెట్పల్లి, జగిత్యాల, సంగారెడ్డి, భైంసా, మక్తల్, పోచంపల్లి, సుల్తానాబాద్, ధర్మపురి, నర్సంపేట, కొల్లాపూర్, యాదగిరిగుట్ట, బోధన్ ఎస్సీ (జనరల్): క్యాతన్‌పల్లి, బెల్లంపల్లి, ఇబ్రహీంపట్నం, వైరా, ఐజా, నస్పూర్, నేరెడ్‌చర్ల, తొర్రూరు, నర్సింగి ఎస్సీ (మహిళ): మధిర, పరకాల, పెబ్బైర్, అలంపూర్, వర్ధన్నపల్లి, భూపాలపల్లి, పెద్ద అంబర్‌పేట, తిరుమలగిరి ఎస్టీ (జనరల్): ఆమనగల్, డోర్నకల్ ఎస్టీ (మహిళ): వర్ధన్నపేట, మరిపెడ ఓసీ (జనరల్): మెదక్, దేవరకొండ, గజ్వేల్, జహీరాబాద్, కొత్తపల్లి, ఎల్లందు, అచ్చంపేట, భూత్పూర్, లక్సెట్టిపేట, జమ్మికుంట, కాగజ్‌నగర్, కల్వకుర్తి, షాద్‌నగర్, తుక్కుగూడ, పోచారం, దమ్మాయిగూడ, ఆదిబట్ల, చిట్యాల, ఆదిలాబాద్, అమీన్పూర్, మహబూబాబాద్, మిర్యాలగూడ, సత్తుపల్లి, కొంపల్లి, నాగారం, తుంకుంట, బొల్లారం, మణికొండ, జల్పల్లి, హాలియా, నల్లగొండ. ఓసీ (మహిళ): చొప్పదండి, పెద్లపల్లి, వేములవాడ, కొత్తకోట, చేర్యాల, దుబ్బాక, మోత్కూరు, ఆత్మకూరు, కామారెడ్డి, తాండూరు, చెన్నూరు, దుండిగల్, జనగామ, నాగర్ కర్నూల్, శంషాబాద్, హుస్నాబాద్, మంథని, హుజూర్నగర్, హుజూరాబాద్, శంకర్పల్లి, వికారాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, కొత్తగూడెం, ఘట్కేసర్, మేడ్చల్, నందికొండ, తెల్లాపూర్, కోదాడ, తుర్కయాంజల్, గుండ్ల పోచంపల్లి మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ రిజర్వేషన్లు ఎస్సీ (జనరల్): రామగుండం ఎస్టీ (జనరల్): మీర్‌పేట బీసీ (జనరల్): బండ్లగూడ జాగీర్, వరంగల్ బీసీ (మహిళ): జవహర్‌నగర్, నిజామాబాద్ ఓసీ (జనరల్): కరీంనగర్, బోడుప్పల్, పీర్జాదిగూడ ఓసీ (మహిళ): ఖమ్మం, నిజాంపేట్, బడంగ్పేట్, జీహెచ్ఎంసీ మహిళలకు..50% 123 మున్సిపాలిటీల చైర్పర్సన్ స్థానాలకుగాను 61 స్థానాలు, 13 మున్సిపల్ కార్పొరేషన్ల చైర్మన్ స్థానాలకుగాను 6 స్థానాలు మహిళలకు లభించాయి. కొత్త మున్సిపల్ చట్ట నిబంధనల ప్రకారం మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను వర్తింపజేశారు. పురపాలక శాఖ డైరెక్టర్ టీకే శ్రీదేవి ఆదివారం తన కార్యాలయంలో రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ ద్వారా 50 శాతం స్థానాలను ఎంపిక చేసి మహిళలకు రిజర్వు చేశారు. రిజర్వేషన్ కేటగిరీలవారీగా మహిళా రిజర్వేషన్లను పరిశీలిస్తే 123 చైర్పర్సన్ స్థానాల్లో బీసీ (జనరల్)కు 20, బీసీ (మహిళ)కు 20, ఎస్టీ (జనరల్)కు 2, ఎస్టీ (మహిళ)కు 2, ఎస్సీ (జనరల్)కు 9, ఎస్సీ (మహిళ)కు 8, ఓపెన్ కేటగిరీ (జనరల్)కి 31, ఓపెన్ కేటగిరీ (మహిళ)కి 31 స్థానాలు రిజర్వు అయ్యాయి. 13 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ స్థానాలకుగాను మహిళలకు 6 స్థానాలు దక్కాయి. 13 మేయర్ స్థానాలకుగాను బీసీ (జనరల్)కు 2, బీసీ (మహిళ)కు 2, ఎస్సీ (జనరల్)కు 1, ఎస్టీ (జనరల్)కు 1, ఓపెన్ కేటగిరీ (జనరల్)కి 3, ఓపెన్ కేటగిరీ (మహిళ)కు 4 స్థానాలు రిజర్వు అయ్యాయి. కీలకమైన జీహెచ్ఎంసీ మేయర్ స్థానం ఓపెన్ కేటగిరీ(మహిళ)కి రిజర్వు కావడం గమనార్హం. -
ప్లాస్టిక్ తెచ్చి.. భోజనం చేసి వెళ్లండి
భువనేశ్వర్: ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణను ప్రోత్సహించడం, వాటి కాలుష్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా అర కిలో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి భోజన సదుపాయాన్ని కల్పిస్తోంది. ‘మీల్ ఫర్ ప్లాస్టిక్’ పేరిట చేస్తున్న ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆహార్ పథకంలో చేర్చారు. దీని ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణతోపాటు భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు బీఎంసీ కమిషనర్ ప్రేమ్ చంద్ర చౌదరి తెలిపారు. -
పేదల సొంతింటి కల సాకారానికి శ్రీకారం
సాక్షి, అమరావతి: పట్టణ పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ముందడుగు వేసింది. అందరికీ ఇళ్లు ఏర్పాటు చేయాలన్న సీఎం వైఎస్ జగన్ ఆలోచనలకు అనుగుణంగా రూపొందించిన ప్రతిపాదన లకు ఆమోదం లభించింది. నవరత్నాలు, పీఎం ఆవాస్ యోజన కింద తొలిదశలో రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో 1,24,624 ఇళ్ల నిర్మాణానికి పేదలకు ఆర్థిక సహాయం చేసే ప్రతిపాదనలను ఆమోదించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు/ మున్సిపాలిటీల పరిధిలో ఒక్కో లబ్ధిదారుడికి రూ.2.50 లక్షలు, మున్సిపల్ కార్పొరేషన్ వెలుపల పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ఒక్కో లబ్ధిదారుడికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తాయి. ఇదే రీతిలో తరువాతి దశల్లో కూడా పట్టణ ప్రాంతాల్లో పేదల ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలనేది ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళిక. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో... రాష్ట్రంలో ఇల్లు లేని పేదలు అన్నవారు లేకుండా అందరికీ సొంతిల్లు ఉండాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం. ఇప్పటికే రాష్ట్రంలో ఇళ్లులేని పేదలకు 25 లక్షల ఇళ్ల స్థలాలను ఉగాది పండుగ నాటికి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణ ప్రాంతాల్లో కూడా పేదలకు సొంత గూడు ఉండాలనే ఉద్దేశంతో నవరత్నాల పథకాల కింద ఆర్థిక సహాయం అందజేసేలా సమగ్ర ప్రాజెక్టు ప్రణాళిక(డీపీఆర్) రూపొందించాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ డీపీఆర్‌ను కేంద్ర ప్రభుత్వానికి నివేదించి, నిధులు సమీకరిద్దామని చెప్పారు. నవరత్నాల పథకాలు, పీఎం ఆవాస్ యోజన కింద పట్టణ ప్రాంతాల్లో గృహనిర్మాణ ప్రాజెక్టులు చేపడతామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన రాష్ట్రస్థాయి కమిటీ దీనిపై కసరత్తు చేసింది. మున్సిపాలిటీలు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో పేదలకు గృహ నిర్మాణం కోసం జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్ల నుంచి ప్రతిపాదనలు తెప్పించుకుంది. రాష్ట్రంలో మొదటి దశలో 85 ప్రాజెక్టుల కింద రూ.3 వేల కోట్లతో పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) రూపొందించింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదించిన తరువాత ఆ నివేదిను కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థకు సమర్పించారు. తొలిదశలో 1,24,624 ఇళ్లకు ఆమోదం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. పట్టణాల్లో గృహనిర్మాణ ప్రాజెక్టులపై ఢిల్లీలో గురువారం నిర్వహించిన సెంట్రల్ శాంక్షన్ మానిటరింగ్ కమిటీ(సీఎస్ఎంసీ) సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను ఆమోదించింది. కేంద్ర పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా నేతృత్వంలో నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున గృహనిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ పాల్గొన్నారు. పట్టణ గృహనిర్మాణ పథకం కింద రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో 1,24,624 ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం చేసేందుకు కేంద్రం అంగీకరించింది. ఆ ప్రకారం నవరత్నాల పథకాలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాల కింద సొంత స్థలాల్లో ఇళ్లు కట్టుకునే పేదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సహాయం చేస్తాయి. కేంద్ర ప్రభుత్వం తన వాటాగా రూ.1,870 కోట్ల గ్రాంటును రాష్ట్రానికి కేటాయిస్తూ ఆమోదం తెలిపింది. డిసెంబర్ నాటికి ఈ నిధులను రాష్ట్రానికి విడుదల చేయనుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు కూడా కలిపి లబ్ధిదారులకు అందజేస్తుంది. మున్సిపాలిటీలు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ఎంపికైన లబ్ధిదారులకు రాష్ట్ర పట్టణగృహ నిర్మాణ సంస్థ ఈ ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తుంది.గృహ నిర్మాణాలను పరిశీలించి దశల వారీగా లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందజేస్తారు. పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వం నుంచి ఇళ్ల స్థలాలు పొందినవారు ఇళ్లు కట్టుకోడానికి ఇదే రీతిలో ఆర్థిక సహాయం చేయాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. అందుకోసం ఎప్పటికప్పుడు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. -
పాలకవర్గాలకు గడువు నేటితో సమాప్తం
సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీల్లో ప్రత్యేక పాలనకు తెరలేచింది. ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం మంగళవారంతో ముగియనుంది. దీంతో బుధవారం నుంచి పురపాలన ప్రత్యేకాధికారుల చేతుల్లోకి వెళ్లనుంది. రాష్ట్రవ్యాప్తంగా పాలకమండళ్ల ఏలుబడిలో ఉన్న 61 నగర/పుర పాలక సంస్థల్లో ప్రస్తుతం 3 కార్పొరేషన్లు, 53 మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీకాలం సమాప్తం కానుంది. గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, అచ్చంపేట మున్సిపాలిటీల గడువు 2021 వరకు ఉండటంతో.. వీటికి మినహా మిగతా వాటికి ప్రత్యేకాధికారులను నియమిస్తోంది. మరోవైపు కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో ఇప్పటికే ప్రత్యేక పాలన సాగుతోంది. తాత్కాలికమే! నిర్ణీత వ్యవధిలోపు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం తొలుత భావించినా.. కొత్త పుర చట్టం రూపకల్పనలో జాప్యం జరగడంలో ఆలస్యం జరిగింది. అయితే ఎట్టిపరిస్థితుల్లోఈ నెలాఖరులోపు ఎన్నికలు జరపాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో.. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు, వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను పురపాలక శాఖ చకచకా చేస్తోంది. ఈ నెల 14వ తేదీలోపు ఈ క్రతువును పూర్తి చేయడం ద్వారా ఎన్నికలకు లైన్‌క్లియర్ చేయాలని నిర్ణయించింది. దీంతో బుధవారం నుంచి కొలువుదీరే ప్రత్యేకాధికారులు.. తాత్కాలికంగానే సేవలందించే అవకాశముంది. కాగా, మున్సిపాలిటీ స్థాయికి అనుగుణంగా కలెక్టర్/జాయింట్ కలెక్టర్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ హోదా కలిగిన అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమిస్తున్నట్లు పురపాలక శాఖ డైరెక్టర్ టీకే శ్రీదేవి ‘సాక్షి’కి తెలిపారు. -
ఆగుతూ.. సాగుతూ
వనపర్తి : జిల్లా కేంద్రంలో నిత్యంరద్దీగా ఉండే బ్యాంక్ స్ట్రీట్‌లో చేపట్టిన రోడ్డు సుందరీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో రెండునెలలుగా ఈ కాలనీవాసులు, ఇక్కడి వ్యాపారులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. రాకపోకలకూ తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. 2018 మార్చిలో ఈ పనులకు కేటీఆర్ రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి హోదాలో శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత అక్టోబర్, నవంబర్‌లో ఈ పనులకు అధికారులు టెండర్లు, అగ్రిమెంట్ ప్రక్రియను చేపట్టారు. 2019 ఏప్రిల్‌లో పనులను ప్రారంభించారు. రూ.1.31 కోట్ల నిధులతో చేపట్టిన ఈ పనులు గత రెండు నెలలుగా కేవలం 20శాతం పూర్తి చేసినట్లు అధికారులు రికార్డులు వెల్లడిస్తున్నాయి. సుమారు ఐదుబ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు, వందకుపైగా.. వ్యాపారదుకాణాలు, నివాస గృహాలు ఉన్న ఈ రోడ్డులో పనుల కారణంగా రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోడ్డుకు రెండు వైపులా ఒకేసారి డ్రెయినేజీ నిర్మాణాలు చేపట్టి గోతులు తవ్వటంతో ఈ రోడ్డు మార్గాన వెళ్లే వాహదారులకు, పాదచారులకు తీవ్ర అసౌకర్యం ఏర్పడింది. ప్రధానమైన బీటీ, ఫుట్‌పాత్ సీసీ నిర్మాణం చేయాల్సి ఉంది. కేవలం 560 మీటర్ల కాంక్రీట్ డ్రెయినేజీ నిర్మాణం చేపట్టేందుకే రెండు నెలల సమయం తీసుకుంటే.. మిగతా పనులు చేపట్టేందుకు ఎంతకాలం పడుతుందని ఈ రోడ్డు మార్గాన వెళ్లే ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చేయాల్సి పనులు ఇవే.. బ్యాంక్ స్ట్రీట్‌గా పిలువబడే.. ఈరోడ్డు ఆర్టీసీ డిపో నుంచి ఇందిగాంధీ చౌరస్తా వరకు సుందరీకరణ పనులు చేపట్టాల్సి ఉంది. ఇందుకు రూ.1.31 కోట్ల నిధులు కేటాయించారు. ఇరువైపులా 560 మీటర్ల కాంక్రీట్ రోడ్డు, 33 ఫీట్ల బీటీరోడ్డు, రోడ్డుకు ఇరువైపులా.. ఒక్కోవైపు ఆరు ఫీట్ల చొప్పున మొత్తం 12 ఫీట్ల సీసీ ఫుట్‌పాత్ నిర్మాణం చేయాల్సి ఉంది. ప్రస్తుతం రాజీవ్ చౌక్ నుంచి పూజా ఎలక్ట్రానిక్స్ వరకు మాత్రమే పనులు చేయనారంభించారు. అక్కడి నుంచి డిపో వరకు పనులు సంగంలోనే ఆగిపోయాయి. రాజీవ్‌చౌక్ నుంచి ఇందిగాంధీ చౌరస్తా వరకు ఒకవైపు డ్రెయినేజీ నిర్మాణం ఇదివరకే చేసిన కారణంగా.. పడమర వైపు మాత్రమే నిర్మాణం చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇంకా పనులు ప్రారంభంకాలేదు. ప్రధాన చౌరస్తాలో మురికి కూపం జిల్లా కేంద్రంలోని నడిబొడ్డున ప్రధాన రాజీవ్‌చౌక్‌లో డ్రెయినేజీ నీరు నిలుస్తుండటంతో దుర్గంధం వెదజల్లుతోంది. పుర పాలకులు, అధికారులు ఎన్నోసార్లు ఈ ప్రధాన కూడలి గుండా వెళ్తుంటారు. కానీ ఎవ్వరికీ ఈ సమస్య పట్టకపోవటం గమనార్హం. ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండే చిరువ్యాపారులు మురికి కూపం నుంచి వచ్చే దుర్గంధంను భరించకతప్పని పరిస్థితి ఏర్పడింది. దుకాణాల ఎదుట కర్ర నిచ్చెనలు డ్రెయినేజీ నిర్మాణం కోసం రెండు వైపులా గోతులు తవ్వటంతో బ్యాంకులకు, వ్యాపార దుకాణాలకు, నివాసగృహాలకు వెళ్లే వారు కర్రనిచ్చెనలు రూ.వేలు వెచ్చించి ఏర్పాటు చేసుకున్నారు. రోడ్డు పనులు ప్రారంభించిన కొద్ది రోజులకే.. ఓ ప్రధాన ఆస్పత్రి వైద్యురాలు కర్రనిచ్చెన దాటబోయి కిందపడి గాయాలపాలైంది. అయినా పనుల్లో వేగం పెరగలేదు. రోడ్డుపై పారుతున్న మురుగునీరు రెండు వైపులా ఒకేసారి డ్రైనేజీల నిర్మాణం చేపట్టడంతో ఇరువైపుల నుంచి వచ్చే మురుగునీరు రోడ్డుపై పారుతోంది. దీంతో ఈ దారిగుండా వెళ్లే పాదచారులు ముక్కుమూసుకుని వెళ్లాల్సి వస్తోంది. ఈ కాలనీలో నివాసం ఉంటున్నవారు దుర్గంధాన్ని భరించలేకపోతున్నామని వాపోతున్నారు. అనారోగ్యం పాలవుతున్నామని అంటున్నారు. పుర పాలకులకు పట్టదా..? నిత్యం జిల్లా కేంద్రంలో ఉండే.. పురపాలకులు ఈ పనుల జాప్యం విషయంలో ఎందుకు చొరవ చూపించటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంటికి మంచినీరు వచ్చే కుళాయి పైప్లైన్లు కట్ అయ్యాయి. దీంతో మున్సిపల్ సిబ్బంది రెండుమూడు రోజులకు ఒకసారి ట్యాంకర్లతో ఈ రోడ్డున ఉన్న నివాసగృహాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. రోడ్డు సుందరీకరణ పనులు నెమ్మదించడం, ఇక్కడి ప్రజల ఇబ్బందుల విషయమై ఇదే కాలనీకి చెందిన ఓ యువకుడు ట్విటర్లో కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు. అతని పేరు చెప్పడానికి ఇష్టపడలేదు. ఆక్రమణల విషయంలో ఆలస్యమైంది ఈ రోడ్డులో కొన్ని నిర్మాణాలు మున్సిపల్ రోడ్డును కొంతమేర ఆక్రమించుకుని చేశారు. వాటిని తొలగించి డ్రెయినేజీ నిర్మాణం చేయాల్సి ఉన్నందు వల్ల ఆలస్యమైంది. మరో రెండుమూడు రోజుల్లో డ్రెయినేజీల నిర్మాణం పూర్తిచేసి బీటీ రోడ్డు వేయిస్తాం. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. – భాస్కర్, మున్సిపల్ ఇంజనీర్ -
‘పుర’పోరుకు కసరత్తు
ఆదిలాబాద్‌రూరల్: మున్సిపాలిటీ పాలక వర్గాల గడువు త్వరలో ముగియనుండడంతో మరో మూడు నెలల్లోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు సమాయత్తమవుతున్నారు. మే 31లోగా మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ అడ్మిస్ట్రేషన్ డైరెక్టర్, కమిషనర్ నుంచి మున్సిపాలిటీ కమిషనర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటరు ముసాయిదా జాబితా తయారీకి ఆదేశించింది. మున్సిపాలిటీలో వార్డుల వారీగా ఓటరు జాబితాలను రూపొందించేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేశారు. వీటి బాధ్యతలను కమిషనర్లకు అప్పగించారు. ఈ నెల 16న ముసాయిదా జాబితాను విడుదల చేయనున్నారు. 21వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరిస్తారు. 27న తుది జాబితాను విడుదల చేస్తారు. 28న వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాను విడుదల చేస్తారు. ఇదిలా ఉండగా ఎన్నికల ముసాయిదా విడుదలైనా మున్సిపాలిటీలో వార్డుల పెంపుపై ఇంకా స్పష్టత రాలేదు. వార్డుల పెంపుపై స్పష్టత కరువు మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మే మొదటి వారంలోగా ఎన్నికల నోటిఫికేషన్‌ను జారీ చేసి మే 31లోగా పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఎన్నికల ముసాయిదా విడుదలైనా మున్సిపాలిటీలో వార్డులను పెంచడంపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. గతంలో మున్సిపాలిటీలో విలీనమైనా గ్రామ పంచాయతీలను అధి కారులు సమీప వార్డుల్లో సర్దుబాటు చేశారు. ఈ నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ప్రస్తుతం ఉన్న 36 వార్డులకు తోడు మరో ఐదు వార్డులు పెంచాలంటూ మున్సిపల్ కౌన్సిల్, ఎమ్మెల్యే జోగు రామన్న రాష్ట్ర మున్సిపల్ శాఖకు విన్నవించారు. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మున్సిపాలిటీలో కొత్తగా వార్డులు పెరుగుతాయా..లేక ప్రస్తుతం ఉన్న 36 వార్డుల్లోనే సర్దుబాటు చేసి ఎన్నికలు నిర్వహిస్తారా..? అన్న విషయంపై సందిగ్ధత కొనసాగుతోంది పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు విధివిధానాలు.. మున్సిపాలిటీ ఎన్నికల్లో 800 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్దేశించింది. కుటుంబంలోని ఓటర్లు అందరు ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు విని యోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని ఎన్నికల సంఘం అధికారులు ఓటరు జాబితాలను రూపొందించే అధికారులకు సూచించారు. ఇదిలా ఉండగా మున్సిపాలిటీ ఎన్నికల్లో మూడు వార్డులకు ఒక రిటర్నింగ్ అధికారితోపాటు సహాయ అధికారిని నియమించే అవకాశం ఉంది. విలీన గ్రామాలపై తేలని నిర్ణయం.. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 36 వార్డులు ఉన్నాయి. గతేడాది పట్టణానికి సమీపంలోని గ్రామాలను విలీనం చేశారు. మావల పంచాయతీ, బట్టిసావర్గాం, రాంపూర్, అనుకుంట, బెల్లూరి, నిషాన్‌ఘాట్‌లను మున్సిపాలిటీలో కలిపేశారు. సీడీఎంఏ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మున్సిపాలిటీ అధికారులు విలీన జీపీలు, కాలనీలను సమీప మున్సిపాలిటీ వార్డుల్లో విలీనం చేశారు. దీంతో 32వ వార్డులో రాంపూర్ గ్రామాన్ని కలిపారు. 13వ వార్డులో అనుకుంట, 27వ వార్డులో బట్టిసావర్గాం జీపీలోని టైలర్స్‌కాలనీ, వివేకానంద, ఎన్‌హెచ్‌బీ కాలనీ, అగ్రజా టౌన్షిప్, ఆదర్శకాలనీ, భగత్‌సింగ్ కాలనీలను విలీనం చేశారు. 3వ వార్డులో బేల్లూరి, నిషాన్ఘాట్, 19వ వార్డులో మావల మేజర్ గ్రామ పంచాయతీలోని దస్నాపూర్, దర్గానగర్, కేఆర్‌కేకాలనీ, పీహెచ్‌కాలనీ, ఇందిరమ్మ కాలనీ, కృష్ణానగర్, అటెండర్ కాలనీలను విలీనం చేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం 36 వార్డులు ఉండగా మరో ఐదు వార్డులను పెంచి మొత్తం 41 వార్డులు చేస్తారని మున్సిపల్ పాలకవర్గం భావిస్తూ వస్తోంది. తాజాగా ఎన్నికల సంఘం ఎన్నికల ముసాయిదా విడుదల చేసింది. కొత్తగా వార్డులు పెంచుతారా..లేక సర్దుబాటు చేసిన వార్డుల ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తారా? అన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతం మున్సిపల్ కౌన్సిలర్‌గా పోటీ చేసి అదృష్టం పరీక్షించుకుందామనుకునే వారి సంఖ్య అన్ని పార్టీలలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగా వార్డులు పెరిగితే కౌన్సిలర్‌గా పోటీ చేద్దామనుకునే అశావహుల్లో ఒకింత ఆందోళన కనిపిస్తోంది.