అమలులోకి ఎన్నికల కోడ్
ఏలూరు, న్యూస్‌లైన్ :
నగర పాలక సంస్థలు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయటంతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. రాజకీయ నాయకులకు, ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల ప్రచారానికి సంబంధించి పలు నిబంధనలు వర్తించనున్నాయి. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే ఎన్నికల నియమావళిని అనుసరించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. దీంతో అధికారులు పట్టణాల్లోని రాజకీయ పార్టీలకు చెందిన బ్యానర్లు, కటౌట్లను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు.
నియమావళి ఇది..
కులం, మతం, భాష ప్రాతిపదికన ఓట్లు అభ్యర్థించకూడదు
{పభుత్వ సంస్థల భవనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల ప్రచారం కోసం ఉపయోగించరాదు {పైవేట్ స్థలాలు, భవనాలు వినియోగించాలంటే తప్పనిసరిగా సంబంధిత యజమాని రాతపూర్వక అనుమతి పొందాలి. అనుమతి పత్రాన్ని జిల్లా ఎన్నికల అధికారికి పంపాలి.
{పచారానికి వినియోగించే కరపత్రాలు, వాల్‌పోస్టర్లు, ఫ్లెక్సీల వంటి వాటిపై ముద్రణ సంస్థల పేరుతో పాటు వాటి మొత్తం సంఖ్య, ఎవరు ముద్రింపజేశారు అనే వివరాలను విధిగా ప్రచురించాలి.
ఇతర పార్టీల కరపత్రాలు, వాల్‌పోస్టర్లు, ఫ్లెక్సీల వంటి వాటిని చించటం, తొలగించటం ఎన్నికల నియమావళిని ఉల్లఘించటమే
మంత్రులు, ఎంపీలు, శాసనసభ్యులు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. అధికారులు సైతం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టరాదు
అభ్యర్థుల బహిరంగ సభల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకూడదు
ముందస్తు అనుమతి లేకుండా ఊరేగింపులు, బహిరంగ సభలు నిషిద్ధం. లౌడ్ స్పీకర్ల వినియోగానికి పోలీస్ శాఖ అనుమతి తప్పనిసరి
ఓటర్లను మభ్య పెట్టేలా హామీలు ఇవ్వకూడదు. కోడ్ సమయంలో ప్రభుత్వ అతిథి గృహాలను ప్రజాప్రతినిధులకు కేటాయించకూడదు
ఎన్నికల కోడ్ ఉన్న ప్రాంతాల్లోకి వచ్చే ప్రజా ప్రతినిధుల వెంట వారి సెక్యూరిటీ సిబ్బంది తప్ప ఇతర ప్రభుత్వ అధికారుల ఎవరూ ఉండకూడదు.
ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఆరాధన ప్రాంతాలు(ఆలయాలు, చర్చి లు, మసీదులు వంటివి) వినియోగించటం నిషేధం
పంపిణీ చేసే ఓటర్ స్లిప్‌లు తెల్లకాగితంపై మాత్రమే ముద్రించినవై ఉండాలి. వాటిమీద పార్టీకి సంబంధించిన చిహ్నాలు, రంగులు ఉండకూడదు
బహుపరాక్
Published Wed, Mar 5 2014 2:56 AM | Last Updated on Sat, Sep 2 2017 4:21 AM
Advertisement
Advertisement