the implementation of the election code
-
మోగిన ఎమ్మెల్సీ ఎన్నికల నగారా
నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల కమిషన్ ఈ నెల 13 నుంచి 20 వరకు నామినేషన్ల స్వీకరణ 21న పరిశీలన ఉపసంహరణకు 23 వరకు గడువు మార్చి 13న పోలింగ్, 15న కౌంటింగ్ ఎన్నికల కోడ్ అమల్లోకి.. అనంతపురం అర్బన్: పశ్చిమ రాయలసీమ (అనంతపురం, వైఎస్సార్, కర్నూలు జిల్లాలు) పట్టభద్ర, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎన్నికల కమిషన్ సోమవారం విడుదల చేసింది. నోటిఫికేషన్ వెలువడిన మరుక్షణమే మూడు జిల్లాల పరిధిలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఈ నెల 13 నుంచి 20 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 21వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు 23వ తేదీ ఆఖరి గడువు. మార్చి 13న పోలింగ్ జరుగుతుంది. 15వ తేదీన కౌంటింగ్ నిర్వహిస్తారు. పట్టభద్ర, ఉపాధ్యాయ ఓటర్లు 2,74,159 పశ్చిమ రాయలసీమ పట్టభద్ర, ఉపాధ్యాయ నియోజకవర్గాల పరి«ధిలో మొత్తం 2,74,159 మంది ఓటర్లు ఉన్నారు. పట్టభద్ర నియోజకవర్గ పరిధిలో 2,53,515 మంది ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 1,75,134 మంది, మహిళలు 76,666 మంది, ఇతరులు 1,715 మంది ఉన్నారు. ఉపాధ్యాయ నియోజకవర్గ పరిధిలో 20,644 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 13,597 మంది, మహిళలు 6,959, ఇతరులు 88 మంది ఉన్నారు. 508 పోలింగ్ కేంద్రాలు ఎమ్మెల్సీ ఎన్నికలకు 508 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలను 336 పోలింగ్ కేంద్రాల్లో నిర్వహిస్తారు. అనంతపురం జిల్లాలో 119, వైఎస్ఆర్ జిల్లాలో 105, కర్నూలు జిల్లాలో 112 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను 171 పోలింగ్ కేంద్రాల్లో నిర్వహిస్తారు. అనంతపురం జిల్లాలో 65 కేంద్రాలు, వైఎస్ఆర్ జిల్లాలో 52, కర్నూలులో 54 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది : బి.లక్ష్మీకాంతం, జాయింట్ కలెక్టర్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన కారణంగా జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కోడ్ అమల్లో ఉంటుంది. కోడ్ ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలుంటాయి. -
నూజివీడులో ముద్దరబోయిన ర్యాలీ
నూజివీడు, న్యూస్‌లైన్ : టీడీపీ నూజివీడు టికెట్ ఖాయమైందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు సోమవారం ఆగిరిపల్లి మండలం అడవినెక్కలం నుంచి నూజివీడు వరకు ద్విచక్రవాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ఆగిరిపల్లి, నూజివీడు మండలాలకు చెందిన టీడీపీ ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్న ఈ ర్యాలీ ఆగిరిపల్లి, ఈదులగూడెం, వట్టిగుడిపాడు, రామన్నగూడెం మీదుగా నూజివీడుకు చేరుకుంది. అనంతరం జంక్షన్‌రోడ్డులో పెట్రోలు బంకు పక్కసందులో ఏర్పాటుచేసిన ఆయన కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ముద్దరబోయిన మాట్లాడుతూ మొదటిసారిగా నియోజకవర్గంలో నిర్వహించిన ర్యాలీకి మంచి స్పందన లభించిందన్నారు. పట్టణంలోకి వచ్చిన తరువాత టీడీపీ మండలాధ్యక్షుడు కాపా శ్రీనివాసరావు, పోతురెడ్డిపల్లి సర్పంచి అక్కినేని చందు ముద్దరబోయినతో పాటు ర్యాలీలో పాల్గొన్నారు. దూరంగా ఉన్న టీడీపీ పట్టణ నాయకులు... ఆ పార్టీకి చెందిన పట్టణ నాయకులు మాత్రం ఈ ర్యాలీకి దూరంగా ఉన్నారు. పట్టణంలోని నాయకులు ఏ ఒక్కరూ పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది. పట్టణ అధ్యక్షుడు నూతక్కి వేణు, నాయకులు పసుపులేటి జగన్, మోచర్లకృష్ణంరాజు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ బొబ్బిలి ఝాన్సీ, కందుల సత్యన్నారాయణ తదితరులెవరూ ఈ ర్యాలీ దరిదాపుల్లోకి కూడా రాలేదు. ర్యాలీపై కేసు నమోదు చేసిన పోలీసులు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అనుమతి లేకుండా పార్టీ జెండాలతో భారీ సంఖ్యలో ద్విచక్రవాహనాలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించినందున పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బోనం ఆదిప్రసాద్ తెలిపారు. ర్యాలీ నిర్వహించినంత సేపు పోలీసులు వీడియోచిత్రీకరణ చేశారు. -
బహుపరాక్
అమలులోకి ఎన్నికల కోడ్ ఏలూరు, న్యూస్‌లైన్ : నగర పాలక సంస్థలు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయటంతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. రాజకీయ నాయకులకు, ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల ప్రచారానికి సంబంధించి పలు నిబంధనలు వర్తించనున్నాయి. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే ఎన్నికల నియమావళిని అనుసరించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. దీంతో అధికారులు పట్టణాల్లోని రాజకీయ పార్టీలకు చెందిన బ్యానర్లు, కటౌట్లను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. నియమావళి ఇది.. కులం, మతం, భాష ప్రాతిపదికన ఓట్లు అభ్యర్థించకూడదు {పభుత్వ సంస్థల భవనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల ప్రచారం కోసం ఉపయోగించరాదు {పైవేట్ స్థలాలు, భవనాలు వినియోగించాలంటే తప్పనిసరిగా సంబంధిత యజమాని రాతపూర్వక అనుమతి పొందాలి. అనుమతి పత్రాన్ని జిల్లా ఎన్నికల అధికారికి పంపాలి. {పచారానికి వినియోగించే కరపత్రాలు, వాల్‌పోస్టర్లు, ఫ్లెక్సీల వంటి వాటిపై ముద్రణ సంస్థల పేరుతో పాటు వాటి మొత్తం సంఖ్య, ఎవరు ముద్రింపజేశారు అనే వివరాలను విధిగా ప్రచురించాలి. ఇతర పార్టీల కరపత్రాలు, వాల్‌పోస్టర్లు, ఫ్లెక్సీల వంటి వాటిని చించటం, తొలగించటం ఎన్నికల నియమావళిని ఉల్లఘించటమే మంత్రులు, ఎంపీలు, శాసనసభ్యులు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. అధికారులు సైతం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టరాదు అభ్యర్థుల బహిరంగ సభల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకూడదు ముందస్తు అనుమతి లేకుండా ఊరేగింపులు, బహిరంగ సభలు నిషిద్ధం. లౌడ్ స్పీకర్ల వినియోగానికి పోలీస్ శాఖ అనుమతి తప్పనిసరి ఓటర్లను మభ్య పెట్టేలా హామీలు ఇవ్వకూడదు. కోడ్ సమయంలో ప్రభుత్వ అతిథి గృహాలను ప్రజాప్రతినిధులకు కేటాయించకూడదు ఎన్నికల కోడ్ ఉన్న ప్రాంతాల్లోకి వచ్చే ప్రజా ప్రతినిధుల వెంట వారి సెక్యూరిటీ సిబ్బంది తప్ప ఇతర ప్రభుత్వ అధికారుల ఎవరూ ఉండకూడదు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఆరాధన ప్రాంతాలు(ఆలయాలు, చర్చి లు, మసీదులు వంటివి) వినియోగించటం నిషేధం పంపిణీ చేసే ఓటర్ స్లిప్‌లు తెల్లకాగితంపై మాత్రమే ముద్రించినవై ఉండాలి. వాటిమీద పార్టీకి సంబంధించిన చిహ్నాలు, రంగులు ఉండకూడదు