ఏ పార్టీకి ఏ మునిసిపాలిటీ?
హైదరాబాద్: రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికల ఫలితాలలో తెలంగాణలో కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్లో టిడిపి హవా కొనసాగుతోంది. 10 మునిసిపల్ కార్పోరేషన్లకు, 145 మునిసిపాలిటీలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. వీటిలో ఏపిలో 7 కార్పోరేషన్లు, 92 మునిసిపాలిటీలు, తెలంగాణలో మూడు కార్పోరేషన్లు, 53 మునిసిపాలిటీలు ఉన్నాయి. తొలిసారిగా మునిసిపల్ ఎన్నికల రంగంలో దిగిన వైఎస్ఆర్ సిపి ఇప్పటివరకు తెలిసిన ఫలితాలలో రెండు మునిసిపల్ కార్పోరేషన్లను, 25 మునిసిపాలిటీలు గెలుచుకుంది. ఏపిలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ఒక్క మునిసిపాలిటీని కూడా గెలుచుకోలేకపోయింది.
ఆయా పార్టీలు గెలుచుకున్న కార్పోరేషన్లు, మునిసిపాలిటీల వివరాలు ఈ దిగువన ఇస్తున్నాం.
కడప కార్పోరేషన్ : వైఎస్‌ఆర్సిపి
నెల్లూరు కార్పోరేషన్ : వైఎస్‌ఆర్సిపి
రాజమండ్రి కార్పోరేషన్ : టీడీపీ
చిత్తూరు కార్పోరేషన్ : టీడీపీ
అనంతపురం కార్పోరేషన్ : టీడీపీ
కరీంనగర్ కార్పోరేషన్ : కాంగ్రెస్
రామగుండం కార్పోరేషన్ : టిఆర్ఎస్
మునిసిపాలిటీలు:
వైఎస్ఆర్ సిపి : శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస, ఇచ్ఛాపురం.
విజయనగరం జిల్లా బొబ్బిలి.
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, నూజివీడు.
గుంటూరు జిల్లా తాడేపల్లి, సత్తెనపల్లి.
ప్రకాశం జిల్లా చీరాల, గిద్దలూరు.
నెల్లూరు జిల్లా కావలి, ఆత్మకూరు, సూళ్లూరుపేట, గూడూరు.
వైఎస్ఆర్ జిల్లా పులివెందుల, రాయచోటి, ఎర్రగుంట్ల.
చిత్తూరు జిల్లా మదనపల్లి, పుంగనూరు,పలమనేరు.
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ, గూడూరు, ఆత్మకూరు,ఆదోని, నందికొట్టూరు,
అనంతపురం జిల్లా గుత్తి.
టిడిపి : శ్రీకాకుళం జిల్లా పాలకొండ, పలాస.
విజయనగరం జిల్లా సాలూరు, విజయనగరం.
విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం, యలమంచిలి.
తూర్పుగోదావరి జిల్లా మండపేట, రామచంద్రాపురం, పెద్దాపురం, ఏళేశ్వరం,
సామర్లకోట, అమలాపురం, పిఠాపురం,తుని.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, పాలకొల్లు,తాడేపల్లిగూడెం, నిడదవోలు, తణుకు, జంగారెడ్డిగూడెం.
కృష్ణా జిల్లా నందిగామ, తిరువూరు, పెడన.
గుంటూరు జిల్లా నర్సరావుపేట, చిలకలూరిపేట, మంగళగిరి. మాచర్ల, పిడుగురాళ్ల, వినుకొండ, తెనాలి, బాపట్ల, రేపల్లె.
ప్రకాశం జిల్లా మార్కాపురం, అద్దంకి, చీమకుర్తి, కనిగిరి.
నెల్లూరు జిల్లా వెంకటగిరి.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, పెద్దఅంబర్‌పేట్.
నల్గొండ జిల్లా కోదాడ.
వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు, మైదుకూరు, ప్రొద్దుటూరు, బద్వేల్.
కర్నూలు జిల్లా నంద్యాల, ఎమ్మిగనూరు, డోన్.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, నగరి, పుత్తూరు.
అనంతపురం జిల్లా గుంతకల్లు, తాడిపత్రి, ధర్మవరం, కదిరి, రాయదుర్గం, మడకశిర, పుట్టపర్తి, పామిడి, కళ్యాణదుర్గం.
కాంగ్రెస్ : రంగారెడ్డి జిల్లా వికారాబాద్, బడంగ్‌పేట్.
మెదక్ జిల్లా జహీరాబాద్, సదాశివపేట, సంగారెడ్డి, ఆందోల్.
కరీంనగర్ జిల్లా జగిత్యాల, కోరుట్ల.
నల్గొండ జిల్లా నల్లగొండ, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, దేవరకొండ.
మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల్, షాద్‌నగర్.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్.
ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి, మంచిర్యాల.
టిఆర్ఎస్ : మెదక్ జిల్లాలో మెదక్.
కరీంనగర్ జిల్లా మెట్పల్లి, పెద్దపల్లి, హుస్నాబాద్, జమ్మికుంట, హుజూరాబాద్
మహబూబ్‌నగర్ జిల్లా అయిజ.
బిజెపి : మహబూబ్‌నగర్ జిల్లా నారాయణ్‌పేట.
కరీంనగర్ జిల్లా వేములవాడ నగర పంచాయతీ.
బిఎస్పి : ఆదిలాబాద్ జిల్లా నిర్మల్.
ఎంఐఎం : భైంసా
కొన్ని మునిసిపాలిటీలలో ఏ ఒక్క పార్టీ పూర్తి మెజారిటీ సాధించలేదు. 13 మునిసిపాలిటీలలో ఎవరికీ ఆధిక్యత లభించలేదు. కొన్ని మునిసిపాలిటీలలో వైఎస్ఆర్ సిపి, టిడిపి సమానంగా కౌన్సిల్ స్థానాలు గెలుచుకున్నాయి.