3,990 వార్డులకు 35,998 నామినేషన్లు
చివరిరోజునే 21 వేలకు పైగా నామినేషన్లు
నేడు నామినేషన్ల పరిశీలన.. ఉపసంహరణకు చివరి తేదీ ఈ నెల 18
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం శుక్రవారం ముగిసింది. 3,990 వార్డులకు గాను 35,998 నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 146 మున్సిపాలిటీలకు ఈనెల 10వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమయింది. చివరిరోజు శుక్రవారం 21 వేలకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. శనివారం నామినేషన్ల పరిశీలన ఉంటుంది. తిరస్కరణకు గురైన నామినేషన్లపై 16వ తేదీన అప్పీలు చేసుకోవచ్చు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 18 చివరి తేదీ. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత రాజకీయ పార్టీల ప్రచారం ఊపందుకోనుంది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఈ నెల 30న జరగనున్న సంగతి విదితమే. మున్సిపల్ కార్పొరేషన్లకు గురువారం గడువు ముగియగా.. 513 డివిజన్లకు 6,837 నామినేషన్లు దాఖలైన విషయం విదితమే.
సీమాంధ్రలో పలుచోట్ల కాంగ్రెస్ నామినేషన్లు నిల్
సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్లు దాఖలు చేసిన వారి సంఖ్య బహుస్వల్పంగా ఉండడం గమనార్హం. రాష్ట్ర విభజన తరువాత ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు ఇతర పార్టీల్లో చేరడం, వారితో పాటే అనుచరగణం కూడా వెళ్లిపోవడంతో కాంగ్రెస్ తరఫున నామినేషన్లు దాఖలు చేసేవారే కరువయ్యూరు. సీమాంధ్రలోని యలమంచలి, సామర్లకోట, తణుకు, మార్కాపురం, ఎర్రగుంట్ల, ఆళ్లగడ్డ, పామిడి (నగర పంచాయతీ)లలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోవడం గమనార్హం. ఇక రాయదుర్గం, గుత్తి మున్సిపాలిటీల్లో ఒక్కొక్కటి చొప్పున, తాడిపత్రిలో రెండు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యూరుు. పామిడి, రాయదుర్గం, గుత్తి, తాడిపత్రి మున్సిపాలిటీలు ఏపీసీసీ కొత్త అధ్యక్షుడు రఘువీరారెడ్డి సొంత జిల్లా అనంతపురంలోనివి కావడం గమనార్హం. కాగా ఇదే జిల్లాలోని ధర్మవరంలో నాలుగు, గుంతకల్లులో ఐదు నామినేషన్లు మాత్రమే కాంగ్రెస్ తరఫున దాఖలయ్యూరుు. అరుుతే తెలంగాణ ప్రాంతంలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కువగా నామినేషన్లు వే శారు.
ఆదిలాబాద్ మున్సిపాలిటీ మినహా మిగతా 145 మున్సిపాలిటీల్లో రాజకీయ పార్టీల వారీగా దాఖలైన నామినేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి.
కాంగ్రెస్: 6,062, వైఎస్సార్‌సీపీ: 6,442, టీడీపీ:8,213, టీఆర్‌ఎస్: 2,776, బీఎస్పీ:175, బీజేపీ: 1,906, సీపీఐ: 526, సీపీఎం: 639, లోక్‌సత్తా:161, స్వతంత్రులు: 7,940, రిజిస్టర్డ్ పార్టీలు: 660 (ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 498 నామినేషన్లు దాఖలయ్యాయి)
మున్సిపల్ ఎన్నికల్లో ముగిసిన నామినేషన్ల ఘట్టం
Published Sat, Mar 15 2014 2:44 AM | Last Updated on Wed, Aug 29 2018 6:13 PM
Advertisement
Advertisement