సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని 4,041 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, పట్టణాల్లో వార్డు స్థాయిలో జరిగే స్వచ్ఛభారత్ మిషన్ కార్యక్రమాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేరుగా పరిశీలించే విధంగా మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్(ఎంఐఎస్) అనే వ్యవస్థను రూపొందించనున్నట్టు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ వెల్లడించింది. దీని ద్వారా పట్టణ ప్రాంతాల్లో రూ. 67 వేల కోట్లు ఖర్చు చేయనున్నామని తెలిపింది.