ప్రతీకాత్మకచిత్రం
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యాలకు దూరంగా సాగుతోంది. దేశాన్ని నిర్మలంగా మార్చడమే లక్ష్యంగా 2014 అక్టోబర్ 2న ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే, నాలుగేళ్లు గడుస్తున్నా.. చాలా ప్రభుత్వాస్పత్రుల్లో వాటి సిబ్బందికి కనీసం టాల్‌లెట్స్ కూడా గతిలేవు. గ్రామీణ భారతంలోని దాదాపు 38 శాతం ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేసే సిబ్బందికి మరుగుదొడ్లు అందుబాటులో లేవని ఓ జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది. ‘గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన’పై కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ లోక్‌సభలో ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఈ వివరాలు వెల్లడయ్యాయని తెలిపింది.
ఇక ‘స్వచ్ఛ భారత్’ తమ ప్రభుత్వం విజయవంతమైన పథకాల్లో ఒకటని కేంద్రం చెప్తున్న సంగతి తెలిసిందే. ఈ మిషన్‌లో భాగంగా 2014 నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 9.5 మిలియన్ల మరుగుదొడ్లు నిర్మించామని కేంద్రం పేర్కొంది. ఇక 10 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో 50 శాతం సర్కారు దవాఖానాల్లో టాయ్‌లెట్స్‌లేని దారుణ పరిస్థితి నెలకొందని జాతీయ మీడియా పేర్కొంది. తెలంగాణ, రాజస్తాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఈ జాబితాలో మొదటి వరుసలో ఉన్నాయని తెలిపింది. తెలంగాణలో అత్యధికంగా 86 శాతం హెల్త్ సెంటర్లలో సిబ్బందికి మరుగుదొడ్లు లేవని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలో పరిస్థితి మెరుగ్గా ఉందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment