Open defecation
-
స్వచ్ఛత ఎంతో మీరే చెప్పండి
సాక్షి, అమరావతి: స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా పట్టణాల్లో నిర్మించిన ప్రజా మరుగుదొడ్లు, కమ్యూనిటీ టాయిలెట్ల నాణ్యత, నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం ఈ నెల 18 వరకు ఆన్లైన్ సర్వే ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తోంది. ‘టాయిలెట్–2.0’ పేరుతో ఈ సర్వే చేస్తోంది. మరుగుదొడ్లను వినియోగించిన తర్వాత అక్కడే ఉన్న ‘క్యూఆర్ కోడ్’ను సెల్ఫోన్లో స్కాన్ చేసి ఆన్లైన్ సర్వేలో పాల్గొనాలని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ప్రకటించింది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకొని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బహిరంగ మల విసర్జన రహిత (ఓడీఎఫ్) నగరాలను ఎంపిక చేస్తుంది. స్వచ్ఛత పాటించే నగరాలు, పట్టణాలకు గుర్తింపునిచ్చి, ప్రోత్సాహకాలను అందిస్తుంది. స్వచ్ఛ పట్టణాలు, నగరాలుగా ప్రకటిస్తుంది. మరుగుదొడ్లను పరిశుభ్రంగా నిర్వహించే వారికి కెప్టెన్ అవార్డు కింద నగదు బహుమతులు సైతం ప్రకటించింది. అంతేకాకుండా సర్వే ముగిసిన మరుసటి రోజు నుంచే చెడిపోయిన మరుగుదొడ్లను బాగుచేసేందుకు చర్యలు తీసుకుంటారు. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాలు వాటర్+ అవార్డును, ఏడు పట్టణాలు ఓడీఎఫ్++ గుర్తింపు, 94 పట్టణాలు ఓడీఎఫ్+ గుర్తింపు పొందాయి. పరిశుభ్రమైన పట్టణాలే లక్ష్యంగా బహిరంగ మల విసర్జనను నూరు శాతం నిర్మూలించేందుకు కేంద్రం ప్రజలను భాగస్వాములను చేస్తోంది. అందుకోసం నవంబర్ 19 ప్రపంచ టాయిలెట్ డే సందర్భంగా స్వచ్ఛ సర్వే ప్రారంభించింది. ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా 25 శాతం నగరాలు ఓడీఎఫ్++ గుర్తింపు సాధించగా, ఈ సంఖ్యను నూరు శాతానికి పెంచాలన్నది కేంద్రం లక్ష్యం. అందుకనుగుణంగా రాష్ట్రంలో లక్ష కంటే తక్కువ జనాభా గల పట్టణాలను బహిరంగ మల విసర్జన రహితంగా మార్చాలని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిర్ణయించింది. అందులో భాగంగా పట్టణాల్లో ప్రజా మరుగుదొడ్ల నిర్వహణపై అవగాహన పెంచేందుకు, సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చేందుకు వాటివద్ద ‘క్యూఆర్’ కోడ్‌ను ఉంచింది. దీనిని స్కాన్ చేసి, ఆన్లైన్లో 24 ప్రశ్నలకు సమాధానాలను గుర్తించాలి. దీంతోపాటు ఇచ్చే ఓటింగ్ ఆధారంగా నిర్వాహకులను ఈ నెల 20వ తేదీన కెప్టెన్ అవార్డుతో సత్కరిస్తారు. మొదటి బహుమతిగా రూ.75 వేలు, రెండో బహుమతిగా రూ.50 వేలు, మూడో బహుమతిగా రూ.25 వేలు అందిస్తారు. ప్రజలు తమ అభిప్రాయాలను https://docs.google.com/forms/d/1AYucwLyLAJ037h1h_x2JpqoBoqLGDaGSU9FlYArRo8s/editలో చెప్పాలని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులు కోరారు. -
నాలుగేళ్లైనా వాళ్లకు టాయ్‌లెట్స్ గతిలేవు..!
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యాలకు దూరంగా సాగుతోంది. దేశాన్ని నిర్మలంగా మార్చడమే లక్ష్యంగా 2014 అక్టోబర్ 2న ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే, నాలుగేళ్లు గడుస్తున్నా.. చాలా ప్రభుత్వాస్పత్రుల్లో వాటి సిబ్బందికి కనీసం టాల్లెట్స్ కూడా గతిలేవు. గ్రామీణ భారతంలోని దాదాపు 38 శాతం ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేసే సిబ్బందికి మరుగుదొడ్లు అందుబాటులో లేవని ఓ జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది. ‘గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన’పై కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ లోక్‌సభలో ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఈ వివరాలు వెల్లడయ్యాయని తెలిపింది. ఇక ‘స్వచ్ఛ భారత్’ తమ ప్రభుత్వం విజయవంతమైన పథకాల్లో ఒకటని కేంద్రం చెప్తున్న సంగతి తెలిసిందే. ఈ మిషన్‌లో భాగంగా 2014 నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 9.5 మిలియన్ల మరుగుదొడ్లు నిర్మించామని కేంద్రం పేర్కొంది. ఇక 10 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో 50 శాతం సర్కారు దవాఖానాల్లో టాయ్లెట్స్లేని దారుణ పరిస్థితి నెలకొందని జాతీయ మీడియా పేర్కొంది. తెలంగాణ, రాజస్తాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఈ జాబితాలో మొదటి వరుసలో ఉన్నాయని తెలిపింది. తెలంగాణలో అత్యధికంగా 86 శాతం హెల్త్ సెంటర్లలో సిబ్బందికి మరుగుదొడ్లు లేవని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలో పరిస్థితి మెరుగ్గా ఉందని తెలిపింది. -
విద్యార్థినుల ఆత్మగౌరవ సమస్య
సాక్షి, కాటారం: ప్రభుత్వ విద్యారంగాన్ని మరింత పటిష్టం చేసే దిశగా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని చెప్పుకొస్తున్న ప్రభుత్వ పెద్దలు, అధికారుల మాటలు నీటిమూటలుగా మారిపోతున్నాయి. కేజీ టు పీజీ విద్య అమలులో భాగంగా ప్రభుత్వం నూతన భవన నిర్మాణాలకు కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తున్నప్పటికీ గత విద్యా సంస్థల భవనాల్లో నెలకొన్న సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలో లక్షల రూపాయలు వెచ్చించి భవనాలు నిర్మించినప్పటికీ కనీస సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)లో మరుగుదొడ్లు లేకపోవడంతో విద్యార్థులు, సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. ఆది నుంచి అంతే.. కాటారం మండలంలో 2009లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఐటీఐ కళాశాలను ఏర్పాటు చేసింది. సరైన భవన నిర్మాణం లేకపోవడంతో తాత్కాలికంగా ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన భవనంలో తరగతుల నిర్వహణ కొనసాగించారు. గత కొన్నాళ్ల పాటు కళాశాల అదే భవనంలో కొనసాగగా పాఠశాలకు తరగతుల కొరత ఏర్పడడంతో భవనం పాఠశాలకు అనివార్యమైంది. దీంతో అదే పాఠశాల భవన సముదాయం ఆవరణలో అప్పటి కాంగ్రెస్ హయాంలో రూ.40లక్షల నక్సల్స్ ప్రభావిత ప్రాంత అభివృద్ది నిధుల(ఐఏపీ) ద్వారా నిర్మించిన భవనంలోకి కళాశాలను మార్చి తరగతులు చేపడుతున్నారు. సివిల్, కోపా, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ లాంటి ట్రేడ్స్ అందుబాటులో ఉండటంతో కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగిపోయింది. మారుమూల గ్రామాలకు కళాశాల అందుబాటులో ఉండడంతో విద్యార్థినులు అధిక సంఖ్యలో ప్రవేశం పొందారు. కానీ కళాశాలలో మరుగుదొడ్లు లేకపోవడంతో విద్యార్థినులు, మహిళా అధ్యాపకుల ఆగచాట్లు వర్ణనాతీతంగా మారాయి. కళాశాలకు సరైన భవనం నిర్మాణం చేపట్టినప్పటికీ మరుగుదొడ్ల నిర్మాణం మాత్రం లేకపోవడంతో విద్యార్థినులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సమీపంలోని పాఠశాలకు సంబంధించిన మరుగుదొడ్లు వినియోగిస్తున్నా కొన్ని సార్లు పాఠశాల తరఫున అభ్యంతరాలు ఎదురవుతున్నట్లు విద్యార్థినులు తెలిపారు. అంతేకాకుండా సెలవు దినాల్లో ఈ పరిస్థితి మరింత అయోమయంగా ఉంటున్నట్లు వారు పేర్కొన్నారు. సెలవు రోజుల్లో పాఠశాల మరుగుదొడ్లకు తాళం వేసి ఉంటుండడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియని అయోమయమైన దుస్థితి ఉంటుందని వాపోయారు. లక్షలు వెచ్చించి భవనాలు నిర్మించినప్పటికీ మరుగుదొడ్లు మాత్రం నిర్మించకపోవడం దారుమని వాపోతున్నారు. ఇంత పెద్ద కళాశాలలో సౌకర్యాలు సరిగా లేకపోవడం శోచనీయం అని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరుగుదొడ్డి నిర్మాణం మహిళల ఆత్మగౌరవ సమస్యగా చెప్పుకొస్తూ గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అధికారులు ప్రభుత్వం సంస్థల్లోనే మరుగుదొడ్ల నిర్మాణాన్ని పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లివెత్తుతున్నాయి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఐటీఐలో మరుగుదొడ్లు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు, మహిళా సిబ్బంది కోరుతున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇదే దుస్థితి.. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సైతం సమస్యలకు నిలయంగా మారింది. పక్కా భవనం ఉన్నప్పటికి సరైన సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేసి నూతన భవనం నిర్మించారు. మరుగుదొడ్లు వినియోగంలో లేకపోవడంతో విద్యార్థుల సమస్య వర్ణానాతీతంగా మారిపోయింది. ఒంటికి రెంటికి కిలో మీటరు దూరం వెళ్లాల్సిన దుస్థితి నెలకొంటుందని విద్యార్థులు తెలుపుతున్నారు. భవనం నిర్మించి ఏళ్లు గడుస్తున్నప్పటికీ మరుగుదొడ్ల వాడకంలో రాకపోవడంతో తిప్పలు తప్పడం లేదు. పురాతన షెడ్డు ఆవరణలో మరుగుదొడ్లు ఉన్నప్పటికీ అవి శిథిలావస్థకు చేరడంతో వినియోగించలేని పరిస్థితి ఉంది. నూతనంగా నిర్మించిన మరుగుదొడ్లు నీటి సౌకర్యం లేక ఉపయోగంలోకి రావడం లేదు. ఇటీవల పలు విద్యార్థి సంఘాల నాయకులు ఐటీఐ, ప్రభుత్వ కళాశాలలోని అసౌకర్యాలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన స్థానిక ఎంపీపీ పంతకాని సమ్మయ్య, ప్రజాప్రతినిధులు విద్యార్థులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. పరిష్కారానికి ఉన్నతాధికారుల దృష్టికి తీసు కెళ్తామని హామీ ఇచ్చారు. ఏదేమైనా జిల్లా స్థాయి కళాశాలలు ఈ ప్రాంతంలో ఉన్నప్పటీకీ సౌకర్యాల లేమి వెంటాడుతుండటంతో విద్యా ర్థులు కళాశాలలకు రావడానికి ఆసక్తి చూపడం లేదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరుగుదొడ్లు లేక ఇబ్బందులు కళాశాలలో మరుగుదొడ్లు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కళాశాలలో ఉంటాం. అత్యవసర సమయాల్లో మరుగుదొడ్ల అవసరం ఎంతగానో ఉంటుంది. కళాశాలకు వచ్చిందంటే వెళ్లే వరకు మా పరిస్థితి అయోమయంగా నెలకొంటుంది. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. – రమ్య, ఐటీఐ, ప్రథమ సంవత్సరం విద్యార్థిని పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలి కళాశాలలో పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలి. ఇంత పెద్ద కళాశాల అయినప్పటికీ తగిన సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. మలమూత్ర విసర్జన కోసం మైలు దూరం వెళ్లాల్సి వస్తుంది. ఇప్పటి వరకు మా సమస్యను పట్టించుకునే వారే లేరు. – రాజేశ్, విద్యార్థి, ప్రభుత్వ జూనియర్ కళాశాల, కాటారం -
టాయిలెట్ ఉంటేనే జీతం ఇస్తాం
సీతాపూర్, యూపీ : మీరు యూపీకి చెందిన ప్రభుత్వ ఉద్యోగా...? అయితే మీ ఇంట్లో మరుగుదొడ్డి ఉందా...? మీ ఇంట్లో మరుగుదొడ్డి ఉంటేనే మీకు నెల జీతం అందుతుంది. మరుగు దొడ్డి ఉన్నట్లు చెప్తే సరిపోదు...దానికి సంబంధించిన ఫోటోతోపాటు ప్రమాణ పత్రాన్ని ఇస్తేనే మీకు మీ నెల జీతం అందుతుందనే నూతన నిబంధనను తీసుకు వచ్చింది యూపీ ప్రభుత్వం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతొంది. ఈ ఫోటో యూపీకి చెందిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భగవత్ ప్రసాద్‌ది. ఇది అతను తన ఇంటి టాయిలెట్లో ఒక స్టూలు మీద కూర్చుని దిగిన ఫోటో. ఫోటోతో పాటు ప్రమాణ పత్రంలో అతని ఆధార్ కార్టు నంబరు, కుటుంబ వివరాలు కూడా ఉన్నాయి. భగవత్ ప్రసాద్ ఇంట్లో మరుగుదొడ్డి ఉందనే దానికి నిదర్శనం ఈ ప్రమాణ పత్రం. ఈ ప్రమాణ పత్రాన్నిపంచాయితీ ఆఫీసులో ఇవ్వాలి. తర్వాతే అతనికి ఈ నెల జీతం అందుతుంది. ప్రధాని మోదీ 2014లో ప్రారంభించిన స్వచ్ఛ భారత్ పథకం అమలులో భాగంగా యూపీ ప్రభుత్వం ఈ వినూత్న నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజుల క్రితం సీతాపూర్ డిస్ట్రిక్ట్ మాజిస్ట్రీట్ శీతల్ వర్మ సీనియర్ అధికారులకు ఒక నోటీసు జారీ చేసారు. మీ సిబ్బంది ఇళ్లలో మరుగుదొడ్లు ఉన్నాయా, ఉంటే వాటి ఫోటోలను తీసి జిల్లా పంచాయితీ రాజ్ అధికారులకు పంపిచమని, అలా చేసిన వారికి మాత్రమే జీతం ఇస్తామని ఆదేశించారు. ఈ విషయం గురించి శీతల్ వర్మ ’ప్రధాని మోదీ 2018, అక్టోబరు 2 నాటికి మన దేశాన్ని బహిరంగ మలవిసర్జన రహిత దేశంగా మార్చాలనే ఉద్ధేశంతో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దానిలో భాగంగా ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి నిర్మాణం తపప్పనిసరిని తెలిపారు. ప్రజలకు ఈ విషయం గురించి అవగాహన కల్పించాలంటే ముందు ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లల్లో మరుగుదొడ్లు తప్పనిసరిగా ఉండాలనే ఉద్ధేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నాని తెలిపారు. ఈ నెల 27 నాటికి ఇంట్లో మరుగుదొడ్డి ఉన్నట్లు ఫోటో పంపించకపోతే వారికి ఈ నెల జీతం ఆపేస్తామన్నారు. అయితే చాలా మంది ఉద్యోగులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. -
దేవుళ్లు చూస్తుండటంతో...
లక్నో : యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ స్వస్థలం గోరఖ్‌పూర్. జిల్లా న్యాయస్థానం, ఐజీ కార్యాలయాలు ఉన్న రోడ్లు ఎప్పుడూ జనసందోహంతో బిజీగా ఉంటాయి. కాస్త దూరంలో టాయ్లెట్లు ఉన్నా.. దారినపోయే కొందరు మాత్రం అదే పనిగా ఆ గోడలకే మూత్ర విసర్జన చేస్తుండేవారు. ఎన్ని చర్యలు తీసుకున్నా, చివరకు పోలీస్ కాపలాను ఉంచిన నివారించలేకపోయారు. తరచూ ఈ గోడల వద్ద కొందరు చెత్త చెదారం వేయటం.. మూత్ర విసర్జన చేసేవారు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. చివరకు లేడీకానిస్టేబుళ్లను మోహరించినా ప్రయత్నం లేకపోయింది. ఈ నేపథ్యంలోనే ఓ ఆలోచన చేశారు. వెంటనే ముంబైకి చెందిన బత్వల్ అనే చిత్రకారుడికి కబురు పెట్టారు. మూత్ర విసర్జన నివారణకు కోసం ఆ గోడలపై దేవుడి బొమ్మలను చిత్రీకరించాలని అతన్ని కోరారు. దేవుళ్లు, ఇతర మతాలకు సంబంధించిన చిత్రాలు, రామాయంలోని ఘట్టాలు, ప్రముఖుల ఫోటోలతో బత్వల్ గోడలపై అందమైన పెయింటింగ్‌లు వేశాడు. ‘‘దేవుళ్లు చూస్తున్నారు.. మీ చెండాలం ఆపండి’’... అంటూ కొటేషన్లు రాసేశారు. ఈ ఆలోచన బాగా పని చేసింది. ప్రస్తుతం వాటి చుట్టు పక్కల ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండటంతోపాటు ఆయా గోడల వద్ద సెల్ఫీల కోసం జనాలు ఎగబడిపోతున్నారని గోరఖ్‌పూర్ ఐజీ మోహిత్ అగర్వాల్ చెబుతున్నారు. ఇలా బహిరంగ ప్రదేశాల్లో మల, మూత్ర విసర్జన నివారించటం కోసం చేసే యత్నం సాధారణమైన అంశమే. కానీ, యూపీ సీఎం స్వస్థలంలోనే స్వచ్ఛ భారత్ విఫలం అవుతుందన్న విమర్శలు వెల్లువెత్తగా.. స్వయంగా యోగి ఆదిత్యానాథ్ కలుగజేసుకోవాల్సి వచ్చింది. గత ఆరు నెలలుగా మున్సిపల్ అధికారులకు ఆయన అదే పనిగా ఆదేశాలు జారీ చేస్తుండటంతో.. ఏం చేయాలో తెలీక అధికారులు తలలు పట్టుకున్నారు. చివరకు ఓ సామాజిక వేత్త సాయంతో ఐజీ మోహిత్ ఈ సమస్యకు పుల్‌స్టాప్ పెట్టారు. -
ఇదేం టాస్క్.. మేము టీచర్లమేనా?
పట్నా: బహిరంగ మలవిసర్జనను నిర్మూలనకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ టీచర్లకు బీహార్ ప్రభుత్వం ఇచ్చిన టాస్క్‌పై ఆగ్రహజ్వాలలు నెలకొన్నాయి. బహిరంగ మలవిసర్జన నిర్మూలన ప్రచారంలో భాగంగా బహిరంగ మల విసర్జన చేసే ప్రజల ఫోటోలను తీయాలని ఉపాధ్యాయులకు బీహార్ ప్రభుత్వం ఓ టాస్క్ ఇచ్చింది. దీనికోసం ఉపాధ్యాయులు ఉదయం 5 గంటలకు, సాయంత్రం 4 గంటల సమయాల్లో రెండు షిఫ్ట్‌లుగా పనిచేయాలని ఆదేశించింది. ఫోటోలు తీయడం ఏమిటి? టీచర్లమై బహిరంగ విసర్జన ఫొటోలు తీయడం ఏమిటి?.. ఈ టాస్క్.. టీచర్లను అవమానించే విధంగా ఉందని నితీష్ ప్రభుత్వంపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించిన జనాభా లెక్కలు, ఓటరు లిస్టు వంటి బోధనేతర పనులతో ప్రభుత్వ టీచర్లకు పనిభారం ఎక్కువైందని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ ఆలోచనను విద్యావేత్తలు కూడా విమర్శిస్తున్నారు. ఉపాధ్యాయులు మేధావులని, ప్రజలకు అనుకూలంగా నడుచుకుంటూ బహిరంగ మల విసర్జనపై సరైన అవగాహాన కలిగిస్తారనే ఉద్దేశంతో ఈ టాస్క్ ఇచ్చినట్లు బీహార్ విద్యాశాఖ మంత్రి కృష్ణ నందన్ ప్రసాద్ తెలిపారు. టీచర్లు ట్యాబ్ పట్టుకొని రోజంతా తిరగాల్సిన పనిలేదని, ఉదయం, సాయంత్రం కొద్దిసేపు చేస్తే సరిపోతుందని ఇది విద్యాబోధనకు ఏలాంటి ఆటంకం కలగదన్నారు. -
బహిరంగ మలవిసర్జన రహితంగా 7 జిల్లాలు
సాక్షి, హైదరాబాద్: మార్చి చివరి నాటికి బహిరంగ మలవిసర్జన లేని 7 జిల్లాలు రూపుదిద్దుకోనున్నాయని రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ ఎస్పీ సింగ్ తెలిపారు. గురువారం ఎస్పీ సింగ్, కేంద్ర ప్రభుత్వ తాగునీరు, స్వచ్ఛ భారత్ మిషన్ కార్యదర్శి పరమేశ్వరన్ అయ్యర్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వ హించారు. ఈ సందర్భంగా.. వచ్చే ఏడాది అక్టోబర్ 2 నాటికి బహిరంగ మల విసర్జన లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని, ఇందుకు సరిపడా నిధులు ఇచ్చి సహకరించాలని కేంద్ర కార్యదర్శిని సీఎస్ కోరారు. ఇప్పటికే ఓడీఎఫ్ సాధించిన గ్రామాలు, పట్టణాలలోని ప్రజలు మరుగు దొడ్లను వినియోగించుకునే విధంగా పర్యవేక్షించాలని కలెక్టర్లను కోరారు. -
బహిరంగ మలవిసర్జన సాంఘిక దురాచారం
జేసీ–2 రాజ్‌కుమార్ నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) : బహిరంగ మలవిసర్జన సాంఘిక దురాచారమని జేసీ–2 ఆర్.సాల్మన్‌రాజ్‌కుమార్ పేర్కొన్నారు. బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కృష్ణ పుష్కరాలను పురస్కరించుకుని స్థానిక పాత జెడ్పీ సమావేశ మందిరంలో జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ ఆత్మగౌరవం అంశాలపై చర్చా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ–2 మాట్లాడుతూ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కార్యక్రమాలను చేపట్టారన్నారు. తాజా గణాంకాల ప్రకారం దేశంలో 68 శాతం బహిరంగ మలవిసర్జనకు అలవాటు పడ్డారన్నారు. దీన్ని నిర్మూలించేందుకు కృషి చేయాలన్నారు. ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు మరుగుదొడ్లపై అవగాహన కల్పించాలన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కృష్ణారెడ్డి మాట్లాడుతూ పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. తొలుత ఆత్మగౌరవం కళాజాత బృందం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వివిధశాఖల అధికారులు, స్వచ్ఛందసేవాసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
‘ఐదింటికి లేచి ఆ అవగాహన పెంచండి’
కోట(రాజస్థాన్): బహిరంగ మలవిసర్జన నిర్మూలన, విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అవగాహన కోసం ఉదయం ఐదింటికే పాఠశాల ప్రాంతాల్లో మలవిసర్జనకు పాల్పడే వారిని ఫొటో తీయాలని ప్రభుత్వ ఉపాధ్యాయులను రాజస్తాన్‌లోని కోట జిల్లా విద్యాశాఖ ఆదేశించింది. టీచర్లు వారి పరిధిలో రోజూ ఇలాంటి ఫొటోలు తీసి నివేదికను జతచేసి వాట్సప్‌లో అధికారులకు పంపాలని పేర్కొంది. దీనిపై దీనిపై ఉపాధ్యాయినిలు మండిపడుతున్నారు. సీఎం వసుంధర రాజే ప్రాతినిథ్యం వహిస్తున్న ఝలావాడ్‌లో ఈ ఘటన జరిగింది.