పట్నా: బహిరంగ మలవిసర్జనను నిర్మూలనకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ టీచర్లకు బీహార్ ప్రభుత్వం ఇచ్చిన టాస్క్‌పై ఆగ్రహజ్వాలలు నెలకొన్నాయి. బహిరంగ మలవిసర్జన నిర్మూలన ప్రచారంలో భాగంగా బహిరంగ మల విసర్జన చేసే ప్రజల ఫోటోలను తీయాలని ఉపాధ్యాయులకు బీహార్ ప్రభుత్వం ఓ టాస్క్ ఇచ్చింది. దీనికోసం ఉపాధ్యాయులు ఉదయం 5 గంటలకు, సాయంత్రం 4 గంటల సమయాల్లో రెండు షిఫ్ట్‌లుగా పనిచేయాలని ఆదేశించింది.
ఫోటోలు తీయడం ఏమిటి?
టీచర్లమై బహిరంగ విసర్జన ఫొటోలు తీయడం ఏమిటి?.. ఈ టాస్క్.. టీచర్లను అవమానించే విధంగా ఉందని నితీష్ ప్రభుత్వంపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించిన జనాభా లెక్కలు, ఓటరు లిస్టు వంటి బోధనేతర పనులతో ప్రభుత్వ టీచర్లకు పనిభారం ఎక్కువైందని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ ఆలోచనను విద్యావేత్తలు కూడా విమర్శిస్తున్నారు.
ఉపాధ్యాయులు మేధావులని, ప్రజలకు అనుకూలంగా నడుచుకుంటూ బహిరంగ మల విసర్జనపై సరైన అవగాహాన కలిగిస్తారనే ఉద్దేశంతో ఈ టాస్క్ ఇచ్చినట్లు బీహార్ విద్యాశాఖ మంత్రి కృష్ణ నందన్ ప్రసాద్ తెలిపారు. టీచర్లు ట్యాబ్ పట్టుకొని రోజంతా తిరగాల్సిన పనిలేదని, ఉదయం, సాయంత్రం కొద్దిసేపు చేస్తే సరిపోతుందని ఇది విద్యాబోధనకు ఏలాంటి ఆటంకం కలగదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment