కుక్కలు చింపిన విస్తరిలా రాష్ట్రం: డీఎల్ | Political crisis arise in Andhra Pradesh, says DL Ravindra Reddy | Sakshi
Sakshi News home page

కుక్కలు చింపిన విస్తరిలా రాష్ట్రం: డీఎల్

Published Tue, Feb 18 2014 1:37 PM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

కుక్కలు చింపిన విస్తరిలా రాష్ట్రం: డీఎల్ - Sakshi

కుక్కలు చింపిన విస్తరిలా రాష్ట్రం: డీఎల్

మైదుకూరు: అనేక సంఘటనలతో రాష్ట్రం కుక్కలు చించిన విస్తరిలా తయారయిందని మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరులో రూ. 31 లక్షల ఉపాధి హామీ నిధులతో నిర్మించిన స్త్రీశక్తి భవనాన్ని సోమవారం డీఎల్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ మరణంతో రాజకీయాలలో అనిశ్చితి ఏర్పడిందన్నారు.

బలహీన సీఎం రావటం, రాష్ట్రంలోని ఇరు ప్రాంతాలలో ఉద్యమాలు చెలరేగడం ఇందుకు కారణాలన్నారు. గాంధీ పుట్టిన దేశంలో ఏమైపోతున్నామో అర్థం కావడం లేదన్నారు. తెలంగాణ బిల్లు విషయమై పార్లమెంట్‌లో జరిగిన గొడవలో ఇద్దరు ఎంపీలు సస్పెండ్‌కు గురి కాగా వారిని భగత్‌సింగ్, అల్లూరి సీతారామారాజులతో పోల్చడం సిగ్గుచేటన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement