'కాంగ్రెస్ను కుక్కలు చింపిన విస్తరి చేశారు' | kiran kumar reddy and botsa ruined congress party says dl ravindra reddy | Sakshi
Sakshi News home page

Published Wed, Mar 5 2014 2:43 PM | Last Updated on Wed, Mar 20 2024 5:20 PM

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ కలిసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కుక్కలు చింపిన విస్తరి చేశారని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి మండిపడ్డారు. ఉరుములు, మెరుపులు వచ్చినంత వేగంగా రాష్ట్ర విభజన చేపట్టారని, దీంతో అందరి మనసులు కలత చెందాయని డీఎల్ అన్నారు. కడపలో నాయకులు, కార్యకర్తలతో కలిసి సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీడబ్ల్యుసీ నిర్ణయం వచ్చిన రోజే కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ తమ పదవులకు రాజీనామా చేసి ఉంటే విభజన జరిగి ఉండేది కాదని ఆయన అన్నారు. ఇంతకుముందు తెలుగు మాట్లాడే వాళ్లకు రెండు రాష్ట్రాలుంటే తప్పేంటి అన్న బొత్స, ఇప్పుడు మాత్రం సమైక్యాంద్ర అంటూ కబుర్లు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement