టీడీపీని భూస్థాపితం చేయడమే నా టార్గెట్‌.. | DL Ravindra Reddy targets Telugu Desam Party | Sakshi
Sakshi News home page

టీడీపీని భూస్థాపితం చేయడమే నా లక్ష్యం: డీఎల్‌

Published Mon, Mar 4 2019 7:41 PM | Last Updated on Mon, Mar 4 2019 7:46 PM

DL Ravindra Reddy targets Telugu Desam Party - Sakshi

సాక్షి, కడప : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయడమే తన ధ్యేయమని మాజీమంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి అన్నారు. ఆయన సోమవారం వైఎస్సార్ జిల్లా ఖాజీపేటలో కార్యకర్తలతో సమావేశం అయ్యారు. రానున్న ఎన్నికల్లో భవిష్యత్‌ కార్యచరణపై డీఎల్‌ ఈ సందర్భంగా కార్యకర్తలతో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..టీడీపీ సర్కార్‌ రాష్ట్రంలో పూర్తిగా అవినీతిమయ పాలన కొనసాగిస్తోందని మండిపడ్డారు. మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆరు సార్లు గెలుపొందిన డీఎల్‌ గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో ఆయన టీడీపీలో చేరతారనే ప్రచారం జోరుగా జరిగింది కూడా.  2014 ఎన్నికల్లో డీఎల్‌...టీడీపీకి మద్దతు ఇచ్చినా ఆ తర్వాత ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. కొద్దిరోజుల క్రితం డీఎల్‌ రవీంద్రారెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. మైదుకూరు టికెట్‌ కేటాయించాలని ఈ సందర్భంగా డీఎల్‌ కోరినట్లు సమాచారం. అయితే చంద్రబాబు నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఆయన వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డీఎల్‌...టీడీపీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడంతో, ఆయన మరో పార్టీలో చేరతారా, లేక ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement