
టీడీపీకి హ్యాండిచ్చిన డీఎల్!
కడప: కాంగ్రెస్ సీనియర్ నేత, మైదుకూరు తాజా మాజీ ఎమ్మెల్యే డీఎల్ రవీంద్రా రెడ్డి తెలుగుదేశం పార్టీకి హ్యాండిచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. టీడీపీలోకి చేరేందుకు డీఎల్ ప్రయత్నిస్తున్నారంటూ ఇటీవల వార్తలు రాగా, తాజాగా ఆయన మనసు మార్చుకున్నట్టు సమాచారం.
కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని డీఎల్ నిర్ణయించుకున్నట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కాగా ఎన్నికల్లో ఆయన పోటీకి విముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్రలో కాంగ్రెస్కు ఎదురుగాలి వీస్తుండటమే దీనికి కారణం. మైదుకూరు శాసనసభ స్థానం నుంచి డీఎల్ తన బదులు భార్యను రంగంలోకి దించే యోచనలో ఉన్నారట. ఈ మేరకు కాంగ్రెస్ పెద్దలతో డీఎల్ సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది.