
ఆ తీరు అసహ్యంగా ఉంది: డీఎల్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం జరిగిన తీరు అసహ్యంగా ఉందని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఆరోపించారు. అందుకోసం రూ. వందలాది కోట్లు అనవసర ఆర్భాటానికి ఖర్చు చేశారని విమర్శించారు. రాయలసీమ అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.
ఆ అసంతృప్తి ప్రజల్లో ఉందని, అందుకే ప్రత్యేక రాయలసీమ సమావేశాన్ని తిరుపతిలో పెట్టారని డీఎల్ రవీంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. అమరావతిపై రాయలసీమలోనే కాదని ఉత్తరాంధ్రలో అసంతృప్తి ఉందని ఆయన అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని రవీంద్రారెడ్డి స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో పాలన సరిగ్గా లేదని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.