రాజధాని వ్యవహారంలో క్విడ్ ప్రోకో:వడ్డే
విజయవాడ : నవ్యాంధ్ర రాజధాని అమరావతి వ్యవహారంలో క్విడ్ ప్రోకో జరుగుతోందని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆరోపించారు. మంగళవారం విజయవాడలో వడ్డే శోభనాద్రీశ్వరరావు విలేకర్లలో మాట్లాడుతూ... విదేశీ కంపెనీలకు మేలు చేసేందుకే స్విస్ ఛాలెంజ్ పద్దతి అని ఆయన విమర్శించారు.
సింగపూర్ కంపెనీలకు 1600 ఎకరాలను అప్పనంగా కట్టబెడుతున్నారన్నారు. లాభాలు వస్తే తీసుకుపోతారు... నష్టాలు వస్తే చేతులు దులుపుకుని వెళ్లిపోతారని సింగపూర్ కంపెనీలపై మండిపడ్డారు. స్విస్ ఛాలెంజ్ పద్దతిలో రాష్ట్రానికి తీవ్రనష్టం వాటిల్లుతుందని మాజీ మంత్రి వడ్డె శోభనాద్రీశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు.