Vadde Sobhanadreeswara Rao
-
బాబూ.. అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డు అవసరమా?: వడ్డే శోభనాద్రీశ్వరరావు
సాక్షి, విజయవాడ: ఏపీలో అసెంబ్లీకి ప్రస్తుతం ఉన్న బిల్డింగ్ సరిపోదా?.. మళ్లీ ఐకానిక్ అసెంబ్లీ అవసరమా చంద్రబాబు అని ప్రశ్నించారు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు. అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డు వేయాల్సిన అవసరం ఏముంది?. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు లేకపోవడం మనం సిగ్గుపడాల్సిన విషయం అని ఘాటు కామెంట్స్ చేశారు.మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. 2014-19లో చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయలేదు. చంద్రబాబు తన మనసులోని కొన్ని అంశాలకే ప్రాధాన్యత ఇచ్చారు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల ఆలోచనలకు అనుగుణంగా మార్పులేమీ రాలేదు. చంద్రబాబు చెప్పిన పారిశ్రామిక అభివృద్ధి జరగాలంటే ప్రత్యేక హోదా ఉండాల్సిందే. చంద్రబాబు, పవన్.. ప్రధాని మోదీపై ఒత్తిడి తెచ్చి ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావాలి.ఔటర్ రింగ్ రోడ్డు కారణంగా హైదరాబాద్ డెవలప్ కాలేదు.. ఐటీ వల్ల హైదరాబాద్ అభివృద్ధి చెందలేదు. అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డు వేయాల్సిన అవసరం ఏముంది?. మేం నెత్తీ నోరూ మొత్తుకున్నా వినకుండా 33 వేల ఎకరాలు రైతుల నుంచి తీసుకున్నారు. 33వేల ఎకరాలు తీసుకుని ఏం లాభం.. అక్కడ ముళ్ల చెట్లు పెరిగాయి. ఇప్పుడు లక్షలు ఖర్చు చేసి ఆ పొలాల్లోని చెట్లను తొలగిస్తున్నారు. అలాగే, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు లేకపోవడం మనం సిగ్గుపడాల్సిన విషయం. చంద్రబాబు తక్షణమే ప్రకాశం, అనంతపురం జిల్లాల్లోని ఐరన్ ఓర్ గనులను విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేటాయించాలి. ముందు రాష్ట్రం చేయాల్సిన పని చేస్తే.. అప్పుడు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావచ్చు.విజయవాడ-విశాఖ మధ్య మెట్రో రైల్ వేస్తానని హడావుడి చేశాడు.. కానీ జరిగిందేమీ లేదు. అమెరికాలో కూడా లేని హైపర్ లూప్ రైలును తెస్తానని ప్రకటించడం చూస్తే నవ్వొస్తోంది. చెన్నై-బెంగుళూరు-హైదరాబాద్-అమరావతిని కలిపి బుల్లెట్ రైలు వేయాలంటున్నాడు. నాది కాకపోతే ఢిల్లీ దాకా దొర్లాలనీ వెనకటికి ఎవడో చెప్పినట్లుంది చంద్రబాబు ఆలోచన. చంద్రబాబు ఇలాంటి అనవరమైన ఆలోచనలను మానుకోవాలని కోరుతున్నాను. ఐకానిక్ హైకోర్టు బిల్డింగ్ కట్టాలన్న ఆలోచన విరమించుకోండి. అలాగే, అసెంబ్లీకి ప్రస్తుతం ఉన్న బిల్డింగ్ సరిపోదా.. మళ్లీ ఐకానిక్ అసెంబ్లీ అవసరమా?. ఐకానిక్ భవనాలకు బదులు భూములిచ్చిన రైతులకు న్యాయం చేయండి. ఉచిత ఇసుక అన్నావ్.. ప్రయోజనం ఎవరికి చేకూరుతుందో మీకూ రిపోర్టులు వస్తున్నాయ్ ఒక్కసారి పరిశీలించండి. అవినీతి చేస్తే ఎన్టీఆర్ మంత్రులను కూడా సహించలేదు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటే రెండోసారి తప్పులు జరగవు’ అంటూ కామెంట్స్ చేశారు. -
విశాఖ స్టీల్ ప్లాంట్ పై మోడీ ని అడిగే దమ్ము లేదు ఈ కూటమి నాయకులకు
-
కూటమి నేతలు గాడిదలు కాస్తున్నారా?: వడ్డే శోభనాద్రీశ్వరరావు
సాక్షి, విజయవాడ: విశాఖలో 32 మంది బలిదానాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందన్నారు టీడీపీ మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు. ఏపీకి ఇంత అన్యాయం జరుగుతున్నా కూటమి ఎంపీలు, మంత్రులు గాడిదలు కాస్తున్నారా?.. అని ప్రజలు నిలదీసే రోజులు వస్తాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు.కాగా, మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు శనివారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ..‘విశాఖ స్టీల్ ప్లాంట్ 32 మంది బలి దానాలతో సాధించుకున్నాం. కానీ, ఇప్పుడు బ్లాస్ట్ ఫర్నేస్‌లలో ఉత్పత్తి నిలిపివేశారు. స్టీల్ మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రి శ్రీనివాస వర్మ మన తెలుగు వ్యక్తే. ఆయన కేంద్రమంత్రిగా ఉండి కూడా స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నేస్ మూతపడటం సిగ్గుచేటు. ఏపీకి ఇంత అన్యాయం జరుగుతున్నా కూటమి నేతలు ఏం చేస్తున్నారు. తెలుగు ప్రజలను ఆషామాషీగా, తేలిగ్గా తీసుకోవద్దు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం. టీడీపీ పార్టీ అధికారంలో ఉండి కూడా స్టీల్ ప్లాంట్‌ను అమ్మేస్తారా?. ప్రజలు దీన్ని సహించరు.స్టీల్ మినిస్టర్ కుమారస్వామి వైజాగ్ వచ్చి వెళ్లినా పరిస్థితిలో మార్పు రాలేదు. కర్నాటకలో మూతబడిన హెచ్ఎంటీ వాచ్ కంపెనీని కేంద్రమంత్రి తిరిగి తెరిపించుకున్నాడు. తెలుగు వాళ్లు చేసుకున్న పాపం ఏంటని మోదీని మన నేతలు నిలదీయాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. ఈనెల 16న గుజరాత్ వెళుతున్న చంద్రబాబు.. ప్రధాని మోదీతో మాట్లాడాలి. మోదీని నిర్మోహమాటంగా చంద్రబాబు నిలదీయాలి. ఇలాంటి సమయంలో చంద్రబాబు స్టీల్ ప్లాంట్‌ను సాధించుకోలేకపోతే ప్రజలు క్షమించరు. కేంద్రంలో మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడికి ఇదే నా సూచన. విమానాశ్రయాల గురించి కాదు.. పోరాడి వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను సాధించండి అంటూ కామెంట్స్ చేశారు.ఇది కూడా చదవండి: ఆధారాలతో సహా చర్చకు సిద్ధం.. స్పందించు పవన్: పోతిన మహేష్ -
ప్యాకేజీకి ఒప్పుకోవడం బాబు చేసిన పెద్ద తప్పు
-
బాబూ.. నోరు ఎందుకు మెదపలేదు
సాక్షి, అమరావతి : పద్నాలుగవ ఆర్థిక సంఘం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వొద్దని చెప్పలేదని.. ఈ విషయం తెలిసిన తరువాత కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్యాకేజీకి ఒప్పుకోవడం పెద్ద తప్పు అని మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు. ప్యాకేజీలో అమరావతి నిర్మాణానికి కేంద్రం రెండు వేల ఐదువందల కోట్లు ఇస్తామంటే చంద్రబాబు నోరు మూసుకు కూర్చున్నారని విమర్శించారు. రాజధాని కోసం ఎక్కువ నిధులు కావాలంటూ చంద్రబాబు ఎందుకు అడగలేదని ఆయన నిలదీశారు. ఏపీలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి బుందేల్‌ఖండ్, బొలంగీ తరహాలో నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టుపట్టలేదని ప్రశ్నించారు. దుగరాజపట్నం పోర్టు విషయంలోను చంద్రబాబు అలసత్వం వహించారని వడ్డే ధ్వజమెత్తారు. సాంకేతిక సమస్యల కారణంగా దుగరాజపట్నం పోర్టు ఏర్పాటు చేయలేమని కేంద్రం చెబితే రామాయపట్నంలో ఏర్పాటు చేయమని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అడగలేదని నిలదీశారు. రామాయపట్నం పోర్టు నిర్మించమని అడిగితే ఈ సమయానికి 24వేల కోట్లతో ఈపాటికే పోర్టు పనులు జరుగుతుండేవని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో చంద్రబాబు చేసిన తప్పునే మళ్లీ చేస్తున్నారని, అభివృద్ది వికేంద్రీకరణ చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం అమరావతి పైనే దృష్టి పెడుతోందని ద్వజమెత్తారు. గతంలో ప్రారంభమైన ప్రాజెక్టులను పూర్తి చేయటానికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వటం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులను బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టి భారీ స్థాయిలో అప్పలు తీసుకురావటం దారుణమైన విషయమని ధ్వజమెత్తారు. ఈ నెల 22న చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న లోపభూయిష్ట విధానాలపై తాను రాసిన 'నేలవిడిచి సాము చేయటం తుగునా..' అనే పుస్తకాన్ని ఆవిష్కరించనున్నట్లు వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలిపారు. -
అది రైతుల హక్కుగా చట్టం చేయాలి
సాక్షి, విజయవాడ : కేంద్ర ప్రభుత్వం 14 పంటలకు ప్రకటించిన మద్దతు ధరలపై మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతుల సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయానికి సిటుతో పాటు యాభై శాతం కలిపి ఇస్తామని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పంటల మద్దతు ధర రైతుల హక్కుగా పార్లమెంట్ లో చట్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం ప్రకటించిన ధరల్లో ఒక్క సజ్జకు మాత్రమే సిట్ ప్రకారం న్యాయం జరిగిందని అన్నారు. ధాన్యానికి ప్రకటించిన రెండు వందలు కూడా తక్కువే అని మండిపడ్డారు. శాస్త్రీయంగా పెరగాల్సిన వాటికి ఐదు వందల రూపాయలు తక్కువగా ప్రకటించారని ధ్వజమెత్తారు. పప్పుధాన్యాలలో పెసరకు మినహా ఇతర పంటలకు తక్కువ మద్దతు ధరనే ప్రకటించారని మండిపడ్డారు. కందులు, మినుములకు కేటాయించిన ధరలు చాలా తక్కువగా ఉన్నాయని అన్నారు. ఆయిల్ సీడ్ పంటలకు సరైన విధంగా ధర పెంచే విధంగా కేంద్రం ఇప్పటికైన సరైన ఆలోచన చేయకపోవడం దారుణమని అభిప్రాయపడ్డారు. జాతీయ శాంపిల్ సర్వే ప్రకారం సగటు కుటుంబ ఆదాయం రూ. 18 వేలు ఉండాలని, కానీ రైతు కుటుంబాల సగటు ఆదాయం రూ. 6630 మాత్రమేనని తెలిపారు. తక్షణమే స్వామినాథన్ కమీషన్ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధర కన్నా రైతులు తక్కువకు అమ్ముకుంటే... రెండిటి మధ్య తేడాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించాలని కోరారు. -
‘ప్రాజెక్టుల పేరుతో నిలువు దోపిడీ’
సాక్షి, విజయవాడ : ప్రాజెక్టుల పేరుతో, నీరు-చెట్టు పేరుతో రాష్ట్రంలో నిలువు దోపిడి జరుగుతోందని రైతు సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎర్నేని నాగేంద్రం రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన పోలవరం ప్రాజెక్టు విషయమై రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 2019 కల్లా పోలవరంలో గ్రావిటీతో నీళ్లు ఇస్తామని చెబుతున్న మాట అబద్ధమని అన్నారు. అది అసాధ్యం అని చాలెంజ్ చేస్తున్నానని అన్నారు. ఈ నాలుగేళ్లలో ప్రాజెక్టుల పేరుతో ఖర్చు పెట్టిన రూ.58,400 కోట్లపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకు సాగునీరు ఇచ్చారో చెప్పాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నానా హడావిడి చేసిన చంద్రబాబు ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు. చిన్న చిన్న ప్రాజెక్టులకు కూడా మోక్షం లేదు.. రాష్ట్రంలో చిన్న చిన్న ప్రాజెక్టులు కూడా పూర్తి కావడం లేదని మాజీ మంత్రి వడ్డే శోభానాద్రీశ్వరరావు ఆరోపించారు. ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని ఇష్టం వచ్చినట్లు పెంచేస్తున్నారని అన్నారు. కాలువల పరిస్థితి మరి అధ్వానంగా ఉందని, రియల్ టైం గవర్నెన్స్ అని చెప్పుకునే ముఖ్యమంత్రికి విజయవాడలో కాలువల పరిస్థితి కనిపించడం లేదా అన్ని ప్రశ్నించారు. -
‘తేడా వస్తే సింగపూర్ వెళ్లాల్సిందే’
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాల వివరాలను ముఖ్యమంత్రి వెల్లడించాలని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వేల కోట్ల విలువైన రాజధాని భూములను బలవంతంగా రైతుల నుంచి లాక్కొని అప్పనంగా సింగపూర్ కంపెనీలకు చంద్రబాబు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. అసలు వాటిపై ముఖ్యమంత్రికి అంత ప్రేమ ఎందుకని సందేహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి సింగపూర్ కంపెనీలకు జరిగిన చీకటి ఒప్పందం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రహస్యంగా ఉంచేందకు ఇది హెరిటేజ్ సంస్థ వ్యవహారం కాదని ప్రజల వ్యవహారమని కచ్చితంగా సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. ఏడాది క్రితం సింగపూర్ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలు ఇప్పటివరకూ అమలుకు నోచుకొలేదని, తాజాగా వేరే కంపెనీలతో ఒప్పందం చేసుకుంటున్నారని తెలుస్తోందని.. గతంలో చేసుకున్న ఒప్పందం సంగతేంటని ప్రశ్నించారు. ఒప్పందాల్లో తేడాలోస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారని అన్నారు. పైగా సింగపూర్ కంపెనీలకు భారత చట్టాలు వర్తించవని, ఏమైనా తేడాలు వస్తే సింగపూర్ వెళ్లాల్సిందేనని హెచ్చరించారు. ప్రజల సొమ్మును ఇష్టం వచ్చినట్లు, నచ్చిన వారికి దొచిపెడితే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. -
మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టొద్దు
ఉయ్యూరు: బందరు పోర్టు నిర్మాణంలో మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టడం సరికాదని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. ఉయ్యూరులోని ఆయన నివాసంలో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో పోర్టుకు శంకుస్థాపన చేశారన్నారు. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు నిర్మాణంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదన్నారు. ఎన్నికల్లో ఆరు నెలల్లో పనులు ప్రారంభిస్తామని వాగ్దానం చేసిన చంద్రబాబు నాలుగేళ్లలో చేసిందేమీ లేదన్నారు. మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్రలు సంక్రాంతి పండుగకు షిప్పును బందరు పోర్టుకు తీసుకొస్తామని ప్రకటించడం సిగ్గుచేటన్నారు. అసత్య, అసాధ్య ప్రకటనలు చేస్తూ ఎంత కాలం మోసం చేస్తారని ప్రశ్నించారు. పనులు ఇప్పటికిప్పుడు ప్రారంభించినా పూర్తయ్యే సరికి రెండేళ్లు పడుతుందన్నారు. పుష్కరాలకు విజయవాడ ఫ్లైఓవర్ ప్రారంభిస్తామన్నట్లే పోర్టు ప్రారంభం కూడా అని ఎద్దేవా చేశారు. దుగ్గరాజుపట్నంలో పోర్టు సాంకేతికంగా సాధ్యం కాదని, ఆర్థికంగా ఎలాంటి లాభం ఉండదని ఎక్స్‌ఫర్ట్ కమిటీలు రెండుసార్లు నివేదిక ఇచ్చినా సీఎం పదేపదే దుగ్గరాజుపట్నం ఎందుకు జప్పించాల్సి వస్తుందన్నారు. రామయ్యపట్నంలో పోర్టు కడితే రాయలసీమకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. కృష్ణా జిల్లాకు నందమూరి తారకరామారావు పేరును పెడతానని జగన్ ప్రకటించడం అభినందనీయమన్నారు. తెలుగు జాతి గర్వపడే మహనీయుడు ఎన్టీఆర్ పేరును జిల్లాకు పెడితే అందరూ హర్షిస్తారని చెప్పారు. -
‘తెలంగాణతో ఎందుకు లాలూచీ పడ్డారు’
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరువల్లే రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు. కేంద్ర నిధులపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వడ్డే శోభనాద్రీశ్వరరావు శుక్రవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ...‘ చంద్రబాబు అనుభవాన్ని చూసి ఆనాడు ప్రజలు ఓటు వేశారు. కానీ అందుకు భిన్నంగా ప్రతిచోటా అవినీతి పెరిగింది. రాష్ట్రంలో బాధ్యతారహితంగా పాలన సాగుతోంది. ప్రజాధనంను మంచినీళ్ల ప్రాయంగా దుబారా చేస్తున్నారు. ప్రపంచస్థాయి రాజధానిని నాలుగేళ్లలో ఎలా నిర్మిస్తారు. ఏడాదికి నలబై నుంచి యాబై రోజులు వాడుకునే అసెంబ్లీ సమావేశాలకు తాత్కాలిక అసెంబ్లీ భవనాలు ఎందుకు?. అసెంబ్లీ తాత్కాలిక భవనాల కోసం రూ.800 కోట్లు ఖర్చు అవసరమా?. భోగాపురంలో విమానాశ్రయం నిర్మాణానికి ఎయిర్‌పోర్టు అథార్టీ ముందుకొస్తే టెండర్లు ఎందుకు రద్దు చేశారు?. పోలవరం పనులను కేంద్రం నుంచి ఎందుకు లాక్కున్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబే తామే నిర్మిస్తామని బాధ్యత తీసుకున్నారు. ప్రాజెక్ట్ తొందరగా నిర్మాణం జరుగుతుందని అందరూ భావించారు. అరుణ్ జైట్లీ స్పెషల్ ప్యాకేజీ ప్రకటించే సమయంలోనూ... ఇరిగేషన్ కాంపోనెంట్ మాత్రమే ఇస్తామని అన్నారు. రీ సెటిల్ మెంట్, రిహాబిలిటేషన్ గురించి మాట్లాడలేదు. సుమారు 21 వేల కోట్లు ఖర్చు అయ్యే అంశంపై స్పందించలేదు.దీనిపై ఆనాడే చంద్రబాబు ఎందుకు నోరు మెదపలేదు. ఆర్ ఆర్ ప్యాకేజీలు ఇవ్వకుండానే ఎలా ప్రాజెక్ట్ పూర్తవుతుంది. 9,10 షెడ్యూల్లోని సంస్థల విభజనపై తెలంగాణతో ఎందుకు లాలూచీ పడ్డారు. రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరడం లేదని కేంద్రానికి ఎందుకు రిఫరెన్స్ పంపలేదు. మూడేళ్ల వరకు రాష్ట్రపతి జోక్యం చేసుకునే గడువును కూడా వృధా చేశారు. ఎన్నోచోట్ల తెలంగాణ ప్రభుత్వంతో మోహమాటానికి పోతున్నారు. దీని వెనుక వున్న అసలు కారణాలు ఏమిటీ..?’ అంటూ వడ్డే శోభనాద్రీశ్వరరావు సూటిగా ప్రశ్నలు సంధించారు. -
'ఎక్స్‌ప్రెస్ వే, రింగ్ రోడ్ల పేరుతో కాజేస్తున్నారు'
సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లాలో గురువారం రైతాంగ పరిరక్షణ అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 27న జొన్నలగడ్డలో రైతాంగ ప్రయోజనాల పరిరక్షణ సదస్సును నిర్వహించనున్నట్టు తెలిపారు. అవసరం లేకపోయినా ఎక్సప్రెస్ హైవే, రింగ్ రోడ్లు అంటూ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా భూసేకరణ చేస్తోందని విమర్శించారు. కడప-కర్నూలు నేషనల్ హైవే జరుగుతుంటే మళ్లీ అమరావతి - అనంతపురం హైవే అవసరం ఏంటని ప్రశ్నించారు. భూ సేకరణలు చేస్తూ ప్రభుత్వం తన స్వార్ధ ప్రయోజనాల కోసం రైతులను బలి చేస్తోందని మండి పడ్డారు. ప్రభుత్వ భూ సేకరణపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రైతులు పండించే అన్నీ పంటలకు కనీసమద్దతు ధర చట్టాన్ని తేవాలని డిమాండ్ చేశారు. రైతులకు రుణమాఫీ అవసరం లేకుండా రుణ ఉపశమన చట్టం తీసుకురావాలన్నారు. -
ప్రజలకు సీఎం వివరణ ఇవ్వాలి: వడ్డే
-
ప్రజలకు సీఎం వివరణ ఇవ్వాలి: వడ్డే
విజయవాడ: సింగపూర్ కంపెనీలతో కుదర్చుకున్న ఎంవోయూపై ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శించారు. కోర్ క్యాపిటల్ నిర్మాణం జరుగుతోందంటూ ప్రజలను పక్కదోవ పట్టించే యత్నం చేస్తోందని ఆరోపించారు. క్యాపిటల్ డిజైన్లు ఖరారు కాకుండా నిర్మాణ సంస్థలతో టెండర్లు నిర్వహించకుండా కోర్ క్యాపిటల్ ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. స్టార్ట్ అప్ ఏరియాగా 1,691 ఎకరాల్లో అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ (ఏడీపీ) అభివృద్ది పనులను మూడు దశల్లో చేపడతారని, అయితే దానిని మరుగుపరిచి ప్రభుత్వం కోర్ కార్యాలయాల నిర్మాణమని ప్రచారం చేయడమేంటని నిలదీశారు. స్వదేశీ కంపెనీలు రాజధాని నిర్మాణంలో పాల్గొనకుండా నిబంధనలను మార్చారని ఆరోపించారు. సింగపూర్ కంపెనీలకు మాత్రమే అర్హత వుండేలా చట్టాలను సవరించారని వివరించారు. రాజధాని నిర్మాణాలను స్విస్ చాలెంజ్ కింద చేపట్టే వీలు లేదని తెలిపారు. స్టార్ట్ అప్ ఏరియా అభివృద్దికి ప్రభుత్వం పెట్టే ఖర్చు ఎంత? ప్రభుత్వం తీసుకునే వాటా ఎంత? అతి తక్కువ ఖర్చు పెట్టే సింగపూర్ సంస్థలకు 58 శాతం వాటా ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు. దీనిలో భారీ అవినీతి జరిగే అవకాశం ఉందని, దీనిపై ముఖ్యమంత్రి ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
గ్రామీణ ప్రజాబంధు చరణ్ సింగ్
అభిప్రాయం జమిందారీ విధానం రద్దు అయిన తరువాత అప్పటికి వాస్తవంగా భూమిని సాగుచేస్తూ ఉన్న కోట్లాది మంది కౌలుదారులకు, గ్రామీణ పేదలకు భూమిపైన హక్కు కల్గించిన రైతు బాంధవుడు చరణ్‌సింగ్. భారతీయ రైతాంగ సమస్యల పరిష్కారంలో అద్వితీయ పాత్ర పోషించిన రైతుజన బాంధవుడు చౌదరి చరణ్‌సింగ్. జిల్లా స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థాయికి ఎది గిన క్రమంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి, రైతు సంక్షేమానికి తుదివరకు చిత్తశుద్ధితో ప్రయత్నించిన వారిలో అగ్రగణ్యులు చరణ్ సింగ్. సహకార వ్యవసాయం భారతీయ వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో పడవేస్తుందన్న అభిప్రాయంతో, జవహర్లాల్ నెహ్రూ విధానాలనే ధిక్కరిం చిన ధీరుడు చరణ్‌సింగ్. 1902 డిసెంబర్ 23న పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో భడోల్ అనే చిన్న గ్రామంలో మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించిన చౌదరి చరణ్ సింగ్ 1923లో సైన్స్‌లో డిగ్రీని పొంది 1925లో ఆగ్రా యూనివర్సిటీ నుండి ఎం.ఏ., ఎం.ఎల్. పట్టాలను పొందారు. వృత్తిపరంగానేకాక గ్రామీణ ప్రజల సమస్యలను ప్రత్యేకంగా వ్యవసాయదారుల కష్టసుఖాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకొని గ్రామీణ ప్రజానీకంతో మమేకం అయ్యేవారు. ఈ క్రమంలో 1931లోనే జిల్లా బోర్డు సభ్యునిగా ఎన్నికయ్యారు, ఛాప్రౌలీ శాసనసభా నియోజకవర్గం నుంచి 1937–1974 దాకా శాసన సభ్యుడిగా వరుసగా ఎన్నికవుతూ వచ్చారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా, కేంద్రంలో జనతా ప్రభుత్వంలో ఆర్థికమంత్రి, ఉప ప్రధాని పదవులను నిర్వహించారు. 6 నెల లకే ప్రధాని పదవి నుంచి వైదొలగవలసి వచ్చిన చరణ్‌సింగ్ 29 మే 1987న అసువులు బాశారు. స్వతహాగా రైతు కుటుంబంలో నుంచి వచ్చిన చరణ్‌సింగ్ వ్యవసాయ రంగంలో రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, చేనేత మున్నగు చేతివృత్తుల వారి మధ్య సంబంధాలను, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బాగా అవగాహన చేసుకొన్న వ్యక్తి. జవహర్లాల్ నెహ్రూ సహకార వ్యవసాయాన్ని చేపట్టాలని నాగపూర్ కాంగ్రెస్‌లో తీర్మానం చేయించిన సందర్భంలో ఆచార్య ఎన్జీరంగా వలనే చరణ్‌సింగ్ కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకిం చారు. సహకార వ్యవసాయంతో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడుతుందని, దీర్ఘకాలంలో వ్యవసాయ ఉత్పత్తికి దెబ్బ తగులుతుందని చెబుతూ వివరణాత్మక పుస్తకాలను రచించి, ప్రచారం కూడా చేశారు. జమిందారీ విధానం రద్దు అయిన తరువాత అప్పటికి వాస్తవంగా భూమిని సాగుచేస్తూ ఉన్న కోట్లాదిమందికి కౌలుదారులు, గ్రామీణ పేదలకు భూమిపైన హక్కు కల్గించిన గొప్ప వ్యక్తి చరణ్‌సింగ్. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే దళారుల దోపిడీ నుంచి సన్నకారు, చిన్న రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు వ్యవసాయ మార్కెటింగ్ బిల్లును విధాన సభలో ప్రవేశ పెట్టారు. పలు రాష్ట్రాలలో ఈ బిల్లును అనుసరించి చట్టాలు రూపొందాయి. కుటీర పరిశ్రమలకు ప్రాధాన్యాన్ని, మద్దతును ఇవ్వటం ద్వారా కోట్లాది మంది స్వయం వృత్తిదారులకు ఉపాధి అవకాశములను మెరుగుపరుస్తూ, దేశ ప్రజానీకానికి అవసరమైన వస్తువుల ఉత్పత్తిని భారీ ఎత్తున మూలధన పెట్టుబడుల అవసరము లేకుండానే సాధించవచ్చునని మహాత్మాగాంధీ ప్రబోధించిన సిద్ధాంతంపట్ల చరణ్ సింగ్‌కు పూర్తి విశ్వాసం ఉంది. భారత రాజకీయవేత్తలలో ఈ అంశాలపై అత్యంత లోతైన పరిశోధనలు జరిపి, గ్రంథ రచనలను చేసిన వ్యక్తి చరణ్‌సింగ్. మన దేశంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉద్యోగుల వలన పొగాకు పంటను పండించే లక్షలాది మంది రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, కష్టనష్టాలను వారి దృష్టికి తీసుకువెళ్లినప్పుడు ఒక్క కలం పోటుతో వారి ఇబ్బందులను తొలగించిన ఘనత చరణ్సింగ్దే. అప్పట్లో విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ మున్నగు నగరాలు, పట్టణాల పరిధిలో పశుపోషణ కొరకు పారాగ్రాసు, నేపియార్ గ్రాసు, పచ్చగడ్డి మున్నగు వాటిని పండిస్తూ ఉన్న భూముల్ని అర్బన్ లాడ్ సీలింగ్ చట్టం ప్రకారం ఖాళీ స్థలాలుగా ప్రక టించారు. నాటి ప్రధాని చరణ్ సింగ్ దృష్టికి దీన్ని తీసుకెళ్లగా సదరు భూములను వ్యవసాయ భూములుగానే పరిగణించాలని ఆదేశించారు. భారతదేశ రైతాంగానికి, వ్యవసాయ రంగానికి, గ్రామీణ ప్రజానీకానికి చరణ్‌సింగ్ చేసిన విశిష్ట సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం నవంబర్ 23వ తేదీని ‘కిసాన్ దివస్’గా నిర్వహించటం ముదావహం. మన భారతదేశంలో గత రెండు దశాబ్దాలలో దాదాపు 3 లక్షలమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడి, వ్యవసాయం తీవ్ర సంక్షోభంగా మారిన నేపథ్యంలో మహా త్మాగాంధీ, ఆచార్య రంగా, చౌదరీ చరణ్‌సింగ్‌లు కోరి నట్లు వ్యవసాయానికి ప్రప్రథమ ప్రాధాన్యతను కుటీర, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రెండవ ప్రాధాన్యతను ఇవ్వటమేగాక అందుకు తగిన విధంగా విధివిధానాలను రూపకల్పన చేయటం, నిధులను కేటాయించి భారతదేశ సత్వర అభివృద్ధికి, ఆ అభివృద్ధి ఫలాలు, విశాల జన బాహుళ్యానికి అందేటట్లు చేయడానికి ప్రయత్నించటం చరణ్ సింగ్‌నకు సరైన నివాళి అవుతుంది. (నేడు చౌదరి చరణ్ సింగ్ జయంతి సందర్భంగా) (వ్యాసకర్త : వడ్డే శోభనాద్రీశ్వరరావు మాజీ మంత్రి, మాజీ ఎంపీ ఈ–మెయిల్ : vaddesrao@yahoo.com ) -
పొంతనలేని ఆలోచన, ఆచరణ
అభిప్రాయం అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న ప్రస్తుత తరుణంలో పెళ్లికి కేవలం రూ. 2.5 లక్షలు తీసుకోవడానికి అవకాశం ఇవ్వడం, మళ్లీ ఇందుకు రిజర్వు బ్యాంకు అనేక నిబంధనలు పెట్టడం మరీ విడ్డూరం. నోట్లు మార్చుకోవడానికి వెళ్లినవారి వేళ్లకు గుర్తులు వేయడం కూడా అవమానకరమే. ఖరీఫ్ సీజన్ తుది దశకు చేరుకుని, పంటల నూర్పిళ్లు, కోతలు దగ్గర పడినాయి. వెంటనే రబీ సాగుకు సన్నద్ధం కావాలి. ఇలాంటి పరిస్థితిలో గ్రామ సహకార పరపతి సంఘానికి వారానికి రూ. 50 వేలు మాత్రం ఇవ్వడం ఏం సబబు? నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేసి ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తారు. నల్లధనానికీ, నకిలీ కరెన్సీకి అడ్డుకట్ట వేయడంతో పాటు, ఉగ్రవాదులకు నగదు సరఫరా కూడా ఈ చర్యతో ఆగుతుందని ప్రధాని ప్రకటించారు. దేశ పౌరులు గానీ, రాజకీయ పక్షాలు గానీ ఈ లక్ష్య సాధనను వ్యతిరేకిస్తున్నాయని అనుకోనక్కరలేదు. ఇప్పుడు వస్తున్న విమర్శలు, అభిప్రాయాలు అన్నీ డీమోనిటైజేషన్ (నోట్ల రద్దు)కు అనుసరించిన పద్ధతి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సక్రమంగా లేకపోవడం గురించే. 2013 నాటి భూసేకరణ చట్టంలో చేర్చిన ‘సామాజిక ప్రభావ అంచనా’ పద్ధతిని డీమోనిటైజేషన్ విషయంలో కూడా కేంద్రం అనుసరించి ఉంటే నేడు కోట్లాదిమందికి ఈ ఇబ్బందులు తప్పేవి. దేశంలో అప్రకటిత బినామి ఆస్తులు, పన్ను ఎగవేత, రాజకీయ నాయకులు, ఉద్యోగులు, వ్యాపారుల అవినీతి చర్యల ద్వారా మొత్తంగా పోగుపడిన సంపద దాదాపు రూ. 30 లక్షల కోట్లని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ఇందులో నగదు రూపంలోని నల్లధనం 3 నుంచి 4 లక్షల కోట్లు ఉండవచ్చునని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. కొన్ని నెలల క్రితం ప్రకటించిన స్వచ్ఛంద వెల్లడి పథకం ద్వారా దాదాపు రూ. 65 వేల కోట్ల అప్రకటిత ఆదాయానికి సంబంధించిన వివరాలు కేంద్రానికి అందాయి. నల్లధనాన్ని నిరోధించే క్రమంలో ఏ దశలలో, ఏఏ వర్గాలకు సంబంధించి ఏఏ చర్యలు తీసుకోవాలో సరైన ఆలోచన జరగలేదన్న విషయం వాస్తవం. ప్రస్తుతం కేంద్రం అనుసరిస్తున్న విధానం చూస్తే, తిమింగలాలను వదిలి, చిరు చేపలను పడుతున్నట్టే ఉంది. 1947 నుంచి చూస్తే విదేశాలలో భారతీయుల సంపద రూ. 45 లక్షల కోట్లు పైనేనని ఒక అంచనా. పలువురు రాజకీయ నాయకుల పేర్ల మీద, హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్ వంటి వ్యాపార వర్గాలకు చెందిన దాదాపు వేరుు మంది పేర్ల మీద స్విస్ బ్యాంకులలో, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స, మారిషస్, సింగపూర్లలోని బ్యాంకులలో లక్షల కోట్లు ఉన్నాయని పనామా పత్రాలు, వికీలీక్స్ బయటపెట్టినా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విదేశాలలోని భారతీయుల ఖాతాలలో 500 బిలియన్ డాలర్ల సంపద ఉందని ఫిబ్రవరి, 2012న సుప్రీంకోర్టుకు ఇచ్చిన పత్రంలో ప్రభుత్వం పేర్కొన్నది. మొన్నటి ఎన్నికలలో బీజేపీ విదేశీ బ్యాంకులలో మూలుగుతున్న మన నల్లడబ్బును స్వదేశానికి తీసుకువస్తామని హామీ ఇచ్చింది. ఇక్కడ ఒక ప్రశ్న. మోదీ ప్రధాని హోదాలో అనేక దేశాలలో పర్యటించారు. అప్పుడు విదేశాలలో మూలుగుతున్న భారతీయుల అక్రమ సంపదను రాబట్టేందుకు గట్టిగా కృషి చేసి ఉంటే అది స్వదేశానికి చేరడానికి వీలుం డేది కదా! కాబట్టి విదేశాలలోని నల్లడబ్బును తెచ్చేందుకు మోదీ చేసిన కృషి స్వల్పం. ఇంకా చిత్రం-విదేశాలలోని భారతీయుల నల్లధనం ఇప్పటికీ మారిషస్, సింగపూర్ వంటి దేశాల నుంచి మనీల్యాండరింగ్ పద్ధతిలో, ఇంకా రౌండ్ టిప్పింగ్, పార్టిసిపేటరీ నోట్స్ పేరిట దేశానికి తిరిగి వస్తున్నది. రైతుల దగ్గర అంత ఆదాయమా? మరికొందరు నల్లధనాన్ని సక్రమ ఆదాయంగా చూపడానికి సేద్యాన్ని వాడుకుంటున్నారు. అడ్డగోలుగా వారి వద్ద పోగుపడిన సంపద వ్యవసాయం నుంచి వచ్చిందంటూ ఆదాయ పన్ను శాఖకు చెబుతున్న లక్షలాది మంది ఖాతాదారులపైన చర్యలు తీసుకుని ఉంటే లక్షల కోట్ల అక్రమార్జనలు వెలుగులోకి వచ్చేవి. దేశంలో వ్యవసాయ ఆదాయం మీద పన్ను లేదు. పలువురు పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు దీనిని అవకాశంగా తీసుకుని తమకు కోట్లాది రూపాయలు వ్యవసాయం ద్వారా లభిస్తున్నాయని చూపించుకోవడానికి అవకాశం చిక్కింది. ఈ ధోరణి 2007 నుంచి కనిపిస్తున్నది. ఉదాహరణకు- 2007లోనే 78,794 మంది తమ సగటు వార్షిక వ్యవసాయ ఆదాయం రూ. 2.9 లక్షలుగా చూపించారు. 2010లో 4,25,085 మంది తమ వార్షిక వ్యవసాయ ఆదాయం 19.7 లక్షలుగా నమోదు చేయించారు. తరువాత ఈ ధోరణి విశ్వరూపం దాల్చింది. 2011లో అనూహ్యంగా 6,56,944 మంది సగటు వార్షిక వ్యవసాయ ఆదాయం రూ. 30.04 కోట్లుగా ప్రకటించారు. 2012లో 8,12,426 మంది సగటు వ్యవసాయ వార్షిక ఆదాయాన్ని రూ. 874 లక్షల కోట్లుగా చూపారు. ఇది దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) కంటే ఎన్నో రెట్లు అధికం. విజయ్‌శర్మ అనే సమాచార హక్కు చట్టం కార్యకర్త పట్నా హైకోర్టులో వేసిన పిటిషన్ మేరకు ఇన్‌కమ్‌ట్యాక్స్ డెరైక్టరేట్ ఈ వివరాలు వెల్లడించింది. కాబట్టి ఈ వ్యవహారం మీద ఆదాయ పన్ను శాఖ, కేంద్ర మంత్రిత్వ శాఖలు తీసుకున్న చర్యల గురించి దేశానికి తెలియచేయాలి. దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వ్యాపార సంస్థల నుంచి బ్యాంకులకు రావలసిన మొండి బకాయిలు లక్షల కోట్లలో ఉన్నాయి. వీటిని చెల్లించవలసిందంటూ మొన్నటిదాకా ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేసిన రఘురామ్ రాజన్ ఈ సంవత్సరమే నోటీసులు కూడా ఇచ్చారు. ఇలా బకాయిలు పడిన ఆ సంస్థల ఆస్తుల విలువ బ్యాంకులకు చెల్లించవలసిన అప్పులో 3వ వంతు కూడా లేవు. ఉదాహరణకు అనిల్ అంబానీ ఆస్తుల విలువ రూ. 60 వేల కోట్లు, అప్పు లక్షా 24 వేల కోట్లు గత 10 సంవత్సరాల నుండి కేంద్ర ప్రభుత్వం ప్రతి యేటా ఇన్‌కంట్యాక్స్, ఎక్సైజ్డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ, రాయితీలను ఈ బడా కంపెనీలకు అందజేస్తూ ఉన్నా పర్యవసానంగా దాదాపు రూ. 4 నుండి రూ. 5 లక్షల కోట్ల మేరకు కేంద్రం ఆదాయాన్ని కోల్పోతూ ఉంది. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బడా బాబులకు దాదాపు రూ. 1.12 లక్షల కోట్ల మేరకు రుణమాఫీ ఇచ్చింది. రైతులు, చిరు వ్యాపారులు, చిన్న మధ్యతరహా పరిశ్రమల యూనిట్ల నుండి రుణ వసూళ్ల విషయంలో అత్యంత కర్కశంగా ఆస్తులను కూడా వేలం వేసే జాతీయ బ్యాంకులు ఈ పెద్ద వ్యాపారస్తుల ఎడల మెతక వైఖరిని అవలంబిస్తూ ఉండటం గమనార్హం. గ్రామీణ ప్రజలకు ఒరిగేది ఏమిటి? పెద్ద నోట్ల రద్దుకు పూర్వం తమ ఖాతాలలో ప్రజలు దాచుకున్న ధనాన్ని వారి వారి అవసరాల కోసం తీసుకునే సౌకర్యం కూడా ప్రస్తుతం లేకపోవడం అన్యాయం. అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న ప్రస్తుత తరుణంలో పెళ్లికి కేవలం రూ. 2.5 లక్షలు తీసుకోవడానికి అవకాశం ఇవ్వడం, మళ్లీ ఇందుకు రిజర్వు బ్యాంకు అనేక నిబంధనలు పెట్టడం మరీ విడ్డూరం. నోట్లు మార్చుకోవడానికి వెళ్లినవారి వేళ్లకు గుర్తులు వేయడం కూడా అవమానకరమే. ఖరీఫ్ సీజన్ తుది దశకు చేరుకుని, పంటల నూర్పిళ్లు, కోతలు దగ్గర పడినాయి. వెంటనే రబీ సాగుకు సన్నద్ధం కావాలి. ఇలాంటి పరిస్థితిలో గ్రామ సహకార పరపతి సంఘానికి వారానికి రూ. 50 వేలు మాత్రం ఇవ్వడం ఏం సబబు? సభ్యులకు ఇది ఏ విధంగా ఉపకరిస్తుంది? దేశంలో అన్ని వర్గాల ప్రజలు నోట్లతో ఇబ్బంది పడుతున్నారు. క్యూలలో నిలబడిన వారిలో దాదాపు 70 మంది చనిపోవడం శోచనీయం. ఏ విధంగా చూసినా డీమోనిటైజేషన్ నిర్ణయం నల్లధనాన్ని అరికట్టాలన్న లక్ష్యంతో పాటు కొన్ని ఇతర రాజకీయ ప్రయోజనాలను కూడా ఆశించి తీసుకున్నట్టే ఉంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికలలో ఈ చర్య ద్వారా విపక్షాలను చిత్తు చేయాలన్న వ్యూహం అందులో ఒకటి. డీమోనిటైజేషన్ ద్వారా బ్యాంకులకు రూ. 3 నుంచి 4 లక్షల కోట్ల మేరకు (నల్లధనం మురిగిపోతుందని అంచనా వలన) లబ్ధి చేకూరుతుందని, ఆ మేరకు నూతనంగా కరెన్సీ ముద్రించుకుని బ్యాంకుల ఆర్థిక పరిస్థితి మెరుగు పరచుకోవచ్చునని కేంద్రం భావిస్తున్నది. అరుుతే ఈ ధనం తిరిగి పెద్ద పెద్ద పారిశ్రామిక, వ్యవసాయ వేత్తలకే వెళ్తుంది. అంతేతప్ప సామాన్యులకు ఏదో ఒరుగుతుందని ఆశిస్తే అవివేకమే. గ్రామీణ ప్రజలు, రైతుల అవసరాల ఎడల బ్యాంకులు చూపుతున్న పక్షపాత ధోరణి ఇందుకు నిదర్శనం. గ్రామాలలో రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోగా వచ్చిన ధనాన్ని దాచడానికి, అవసరానికి రుణం తీసుకొనడానికి కూడా సహకార బ్యాంకులపై ఆధారపడుతూ ఉంటారు. ఇప్పుడు వారందరికీ ఎనలేని కష్టాలు వచ్చి పడ్డాయి. తక్షణ-దీర్ఘకాలిక చర్యలు అవసరం దేశంలో స్టేట్ బ్యాంకుతో సహా ప్రభుత్వ రంగంలోని బ్యాంకుల శాఖలు 3,997. ప్రైవేటు రంగంలో 1,987 బ్యాంకు శాఖలు, సహకార రంగంలో 933 శాఖలు ఉన్నాయి. అయితే ఇటీవల రిజర్వు బ్యాంకు అందించిన కొత్తనోట్లు ప్రభుత్వ రంగ బ్యాంకు శాఖలకు అందజేసిన దానికన్నా, కొద్ది సంఖ్యలోనే ఉన్న ప్రైవేటు బ్యాంకులకు రెండు నుంచి మూడు రెట్లు అధికంగా అందచేయటం ఏమి సబబు? పర్సంటేజి కమీషన్లతో పాత పెద్దనోట్ల మార్పిడులు జరిగాయన్న సమాచారంలో ప్రైవేటు బ్యాంకులదే పెద్ద పాత్ర అని తెలుస్తూనే ఉంది. మోదీ ప్రభుత్వం ప్రధానంగా హెచ్చు స్థాయిలో నల్లధనం పోగుపడడానికి అవకాశం ఉన్న రియల్ ఎస్టేట్ రంగం, బినామీ ఆస్తులు, పన్ను ఎగవేత అంశం, విదేశాల నుండి నల్లధనం రాబట్టడం, రాజకీయ, ఉద్యోగ రంగాలలో అవినీతి వంటి అంశాలపై తక్షణం దృష్టి సారించి, అవసరమైన మేరకు చట్టాలను సవరించి, కఠినంగా వ్యవహరించి ప్రభుత్వ ఖజానాకు ఆదాయాన్ని రాబట్టి సామాన్య ప్రజల అవసరాలను తీర్చే విధంగా రుణ పరపతి సౌకర్యాన్ని విస్తరింపజేయటం అవసరం. ప్రస్తుతం నగదు లావాదేవీలలో అనుసరిస్తూ ఉన్న పరిమితులను సడలించి, సామాన్య ప్రజానీకం దైనందిక జీవితంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు వెనువెంటనే చర్యలను చేపట్టాలి. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ పరిధిలో ఉన్న సహకార సంఘాల పట్ల వివక్ష చూపకుండా జాతీయ బ్యాంకులకు ఏ విధమైన నియమ నిబంధనలను విధించారో అవే సూత్రాలను సహకార బ్యాంకులకు కూడా వర్తింపజేసి నగదు లావాదేవీలు నిర్వహించే అవకాశాలు కల్పించి సంక్షోభాన్ని వెంటనే నివారించవలసిన అవసరం ఉంది. గాంధీజీ చెప్పినట్టు లక్ష్యమే కాదు, మార్గం కూడా సజావుగా ఉండాలి. వడ్డే శోభనాద్రీశ్వరరావు వ్యాసకర్త మాజీ మంత్రి, మాజీ ఎంపీ ఈ-మెయిల్ : vaddesrao@yahoo.com -
అమరావతి అతిపెద్ద కుంభకోణం
మచిలీపట్నం : అమరావతి నిర్మాణం దేశంలోని అతి పెద్ద కుంభకోణానికి నాంది అని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. బందరు పోర్టు, పారిశ్రామిక కారిడార్ కోసం భూసమీకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వ భూ దోపిడీని నిరసిస్తూ భూపరిరక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలో మచిలీపట్నంలో శనివారం జరిగిన అవగాహన సదస్సులో వడ్డే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గతానికి భిన్నంగా పరిపాలన కొనసాగిస్తున్నారని, స్విస్ చాలెంజ్‌పై పరిశీలన జరిగితే సరైన విధానం కాదని కోర్టులో తీర్పు వస్తుందని వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులు ఇప్పుడు పొరపాటు చేశామని అనుకుంటున్నట్లు తెలిపారు. గతంలో పోర్టుల నిర్మాణానికి 1200 ఎకరాల భూమి చాలని ఆందోళన చేసిన టీడీపీ నాయకులు నేడు 4,800 ఎకరాలు పోర్టుకు, పారిశ్రామిక కారిడార్ కోసం 28,801 ఎకరాలను ఎలా సమీకరిస్తున్నారని వడ్డే దుయ్యబట్టారు.గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రిలయన్స్ సంస్థ రూ.1.80 లక్షల కోట్ల వ్యయంతో ఆయిల్ రిఫైనరీని 7,500 ఎకరాల్లో నిర్మించిందని చెప్పారు. మూడు బెర్త్‌లు నిర్మించే బందరు పోర్టుకు 4,800 ఎకరాలు, పారిశ్రామిక కారిడార్ కోసం 33,601 ఎకరాలను ఎలా సమీకరిస్తున్నారని ప్రశ్నించారు. రైతులు భూసమీకరణకు వ్యతిరేకంగా ఫారం-2 ఇచ్చి, అధికారుల నుంచి రశీదు పత్రం పొందాలని సూచించారు. 8వేల ఎకరాలను కాపాడుకున్నాం : ఎమ్మెల్యే ఆర్కే ఇదే సదస్సులో మాట్లాడిన మంగళిగిరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే).. రాజధాని అమరావతిలో భూసమీకరణకు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేసి 8వేల ఎకరాలను కాపాడుకున్నామని చెప్పారు. ప్రభుత్వం రాజధాని కోసం 33వేల ఎకరాలను సేకరించినట్లు చెబుతున్నా అందులో వాస్తవం లేదని, భూములు ఇచ్చిన రైతులకు వైద్యం, పిల్లలకు ఉచిత విద్య అనంతరం ఉద్యోగ అవకాశం కల్పిస్తామని చెప్పినా ఎక్కడా అవి అమలు జరగడం లేదని తెలిపారు. కౌలు రైతులు, వ్యవసాయ కూలీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న ఆయన.. ఈ నెల 4వ తేదీలోగా అభ్యంతర పత్రాలను ప్రతి ఒక్క రైతు అందజేయాలని సూచించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా లేనప్పుడు మచిలీపట్నంలో పరిశ్రమలు ఎలా స్థాపిస్తారని ప్రశ్నించారు. ఫారం-2 ఇవ్వండి :సుధాకరరెడ్డి హైకోర్టు న్యాయవాది సుధాకరరెడ్డి మాట్లాడుతూ రైతుల అంగీకారం తెలపకుండా ప్రభుత్వం సెంటుభూమిని కూడా భూసమీకరణ ద్వారా తీసుకోలేదని స్పష్టంచేశారు. ప్రభుత్వం రైతుల నుంచి భూములు తీసుకోవాలని చూస్తుంటే, హైకోర్టు రైతుల హక్కులను కాపాడేందుకు వెన్నుదన్నుగా ఉందన్నారు. రాజధాని భూసమీకరణలో ఈ అంశం రుజువైందన్నారు. భూసమీకరణను వ్యతిరేకిస్తూ రైతులంతా ఫారం-2ను ఎంఏడీఏ అధికారులకు అందజేస్తే 15 రోజుల తరువాత భూసమీకరణ నుంచి బయటపడొచ్చన్నారు. ప్రలోభాలకు లొంగొద్దు: పేర్నినాని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య (నాని) మాట్లాడుతూ భూసేకరణ నోటిఫికేషన్ అమలులో ఉండగానే మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (ఎంఏడీఏ) పేరుతో ప్రభుత్వం భూసమీకరణకు దిగిందన్నారు. భూసమీకరణకు అభ్యంతరాలు, అంగీకరపత్రాలు ఇచ్చేందుకు అక్టోబర్ 4ను ఆఖరు తేదీగా ప్రకటించి మళ్లీ ఈ గడువును నవంబరు 4వ తేదీకి అధికారులు పెంచారని తెలిపారు. అయినప్పటికీ అక్టోబర్4వ తేదీకే రైతులంతా అభ్యంతర పత్రాలు ఇవ్వాలన్నారు. భూపరిరక్షణ పోరాట సమితి కన్వీనరు కొడాలి శర్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు ధనేకుల మురళీమోహన్, సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్.రఘు, సీపీఐ కార్యదర్శి అక్కినేని వనజ, ప్రజాసంఘాలు, రైతు సంఘాల నాయకులు ప్రసంగిస్తూ రైతులతో కలిసి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని చెప్పారు. -
'భూములిచ్చిన రైతులు బాధపడుతున్నారు'
-
చంద్రబాబు ఘోరంగా విఫలం!
⇒ చంద్రబాబు తీరును ఎండగట్టిన రైతు సంఘాలు ⇒ దామాషా పద్ధతిలో నీటిపంపిణీకి అంగీకరించం : మాజీ మంత్రి వడ్డే విజయవాడ(గాంధీనగర్) : కృష్ణానదిపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయమై ఎపెక్స్ కౌన్సిల్ ఎదుట తమ వాదనలు వినిపించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఘోరంగా విఫలమయ్యారని పలువురు వక్తలు ఘాటుగా విమర్శించారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ‘ కృష్ణా, గోదావరి నదులపై ఎగువ రాష్ట్రాల్లో నిర్మిస్తున్న ప్రాజెక్టులు- రాష్ట్రానికి జరిగే అన్యాయం’ అనే అంశంపై బుధవారం రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. రైతు సంఘం ఉపాధ్యక్షుడు ఎన్. గురవయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ.. ఈ నెల 21న డిల్లీలో జరిగిన ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం రాష్ట్ర రైతాంగాన్ని నిరాశపరిచిందన్నారు. సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. దిగువనున్న నీటి పారుదల ప్రాజెక్టుల ప్రయోజనాలకు భంగం కలగకూడదని విభజన చట్టంలో స్పష్టం చేశారన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులు విభజన చట్టానికి విరుద్దమన్నారు. వీటికి ఏ ఒక్క అనుమతి లేదన్నారు. ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో దీన్ని సమర్థంగా, బలంగా తిప్పకొట్టడంలో చంద్రబాబు విఫలమయ్యారన్నారు. సీఎం చంద్రబాబు ఏ ఒక్క విషయంలోనూ రైతుసంఘాల ప్రతినిధులు, నీటిపారుదల రంగ నిపుణుల అభిప్రాయాలు, సలహాలు తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ఎఐకెఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు రావుల వెంకటయ్య మాట్లాడుతూ.. చంద్రబాబుకు ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారన్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు అల్మట్టి ఎత్తు పెంచుతుంటే గుడ్లప్పగించి చూశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు నిర్లక్ష్య వైఖరి కారణంగానే కృష్ణా డెల్టా సంక్షోభంలో చిక్కుకుందని, ఇకనైనా కళ్లు తెరిచి డెల్టా ప్రయోజనాలు కాపాడాలని వైఎస్సార్సీపీ అవనిగడ్డ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం (సీపీఎం) ప్రధాన కార్యదర్శి వంగల సుబ్బారావు, రైతుసంఘం (సీపీఐ) ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్ మాట్లాడుతూ.. మొట్టమొదటి సారిగా కృష్ణాడెల్టాకు కాలువల ద్వారా నీళ్లిచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. మిగులు జలాలపై చివరి రాష్ట్రమైన ఏపీ వాడుకునే అవకాశం కల్పించాలని తీర్మానం చేశారు. ఈ సమవేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, రైతాంగ సమాఖ్య అధ్యక్షుడు నాగేంద్రనాథ్, రిటైర్డ్ డెప్యూటీ సీఈ కోనేరు రాజేంద్రప్రసాద్, వివిధ సంఘాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
మెతక వైఖరి వెనుక మతలబు ఏంటి?
మాజీ మంత్రి వడ్డే ఉయ్యూరు : కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాల పట్ల సీఎం చంద్రబాబు ఎందుకు మెతక వైఖరి అవలంభిస్తున్నాడో ప్రజలకు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్ చేశారు. ఉయ్యూరులోని ఆయన నివాసంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ, ‘‘ఎఫెక్స్ కౌన్సిల్ ఎదుట పాలమూరు రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులపై అభ్యంతరం చెప్పడం బాగానే ఉంది. అదే వైఖరితో ఉండకుండా ఒక కమిటీ వేసి దామాషా ప్రకారం నీళ్ల పంపకానికి ఎందుకు అంగీకరించావు, కర్ణాటకలో కావేరీ జలాలపై హక్కు కోసం ఆ రాష్ట్రంలో పోరాటం చేస్తుంటే ఇక్కడ మాత్రం నీవెందుకు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెడుతున్నావు... మెతక వైఖరి వెనుక మతలబు ఏంటి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబును వడ్డే ప్రశ్నించారు. కృష్ణాజలాల విషయంలో బాబు వైఖరి వల్ల డెల్టా రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. మంగళగిరిలో ఎయిర్‌పోర్టు ఎందుకు.. గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దుతుంటే మరోపక్క మంగళగిరిలో ఐదు వేల ఎకరాలను కేటాయిస్తూ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం సరైందికాదని వడ్డే అన్నారు. విభజన చట్టంలో తిరుపతి, గన్నవరం, విశాఖపట్నం విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా మార్చే వీలున్నప్పుడు కొత్తగా ఎయిర్‌పోర్టులు ఎందుకని ప్రశ్నించారు. ఎయిర్‌పోర్టుల నిర్మాణం పేరుతో హడ్కో నుంచి అప్పులు తెచ్చుకోవడం తప్ప చేసేదేముందన్నారు. రెండున్నరేళ్లలో చంద్రబాబు సాధించిన ప్రగతి ఏంటో చెప్పాలని సవాల్ విసిరారు. వడ్డేను కలిసిన ధనేకుల ఉయ్యూరులో శుక్రవారం మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావును డీసీసీ అధ్యక్షుడు ధనేకుల మురళీమోహన్ కలిశారు. బందరు పోర్టు భూములపై రైతు పక్షాన పోరాటం, ప్రత్యేక హోదా, తదితర అంశాలపై చర్చించారు. అనంతరం ధనేకుల విలేకరులతో మాట్లాడుతూ, ప్రత్యేక ప్యాకేజీలో ఆంతర్యమేమిటో ప్రజలకు అర్థమైందన్నారు. చంద్రబాబు, వెంకయ్యనాయుడు, సుజనాచౌదరిలు ప్రజలను మభ్యపెడుతూ గందరగోళానికి గురిచేసి సమస్యను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. బీజపీ, టీడీపీ మోసపూరిత విధానాలపై పోరాడి ప్రజలను చైతన్యుల్ని చేస్తామన్నారు. దాసు నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
కేంద్ర సాయం ఏమాత్రం సరిపోదు: వడ్డే
విజయవాడ: కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రకటించిన ఆర్ధిక సాయం ఏమాత్రం సరిపోదని మాజీ మంత్రి వడ్డే శోభనాదీశ్వరరావు విమర్శించారు. విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.3500 కోట్లు ఇస్తే.. ఎలా పూర్తవుతుందని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై టీడీపీ ప్రభుత్వం అఖిలపక్షాన్ని కలుపుకుని కేంద్రంపై పోరాడాలన్నారు. రూ.32 వేల కోట్లు అవసరమయ్యే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం రూ.8 వేల కోట్లే ఇస్తామనడం సరికాదన్నారు. -
భూసమీకరణా.. భూదందానా..?
విశ్లేషణ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతున్నా ఇంతవరకూ దుగరాజపట్నం లేక రామాయ పట్నం మేజరు పోర్టు పనులే ప్రారంభానికి నోచుకోలేదు. పోర్టుల అభివృద్ధే నత్తనడకన సాగుతుండగా రైతులకు చెందిన వేలాది ఎకరాల పట్టాభూములపై ప్రభుత్వం ఎందుకు కన్నేస్తున్నట్లు? రాష్ట్ర ప్రభుత్వ భూసమీకరణ వ్యవహారం భూదం దాకు అచ్చమైన నిదర్శనంగా రూపొందుతోంది. రాజధాని కోసం ముక్కారు పంటలు పండే ప్రాంతంలో 30 వేలకుపైగా మాగాణి భూములను సమీకరించిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు పారిశ్రామిక రంగ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఒక్క మచిలీపట్నం ఓడరేవు, పారిశ్రామిక కారిడార్ సాకుతో వేలాది ఎకరాల భూమిని కైవసం చేసు కోవడానికి శరవే గంగా పావులు కదుపుతోంది. దీంట్లో రైతుల పట్టాభూములే 12 వేల ఎకరాలకు పైబడి ఉన్నాయంటే అభివృద్ధి పేరిట ప్రభుత్వం సాగించనున్న భూదందా వ్యవహారం ఎంత తీవ్రస్థాయిలో ఉంటోందో అర్థం చేసుకోవచ్చు. రైతుకు స్వాంతన కలిగిస్తున్న భూ సేకరణ చట్టం కింద కాకుండా ల్యాండ్ పూలింగ్ కింద భూములను లాక్కోవాలని ప్రభు త్వం చూస్తుండటం వేలాది రైతుల జీవితాలను అస్తవ్యస్థతకు గురిచేయనుంది. మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో 1.05 లక్షల ఎక రాలలోని 36,559 ఎకరాల భూమి మచిలీ పట్నం ఓడరేవు, పారిశ్రామిక కారిడార్ కోసం అవసరమని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఓడరేవు కోసం 2,282 ఎకరాలు, అనుబంధ పరిశ్రమల కోసం 12,144 ఎకరాల రైతువారి పట్టా భూములను ల్యాండ్ పూలింగ్ విధానంలో తీసుకోవాలని ప్రభుత్వం సంక ల్పించింది. అమరావతి తరహాలో ఎకరా ఇచ్చిన వారికి 1000 గజముల నివాస స్థలం, 250 గజాల వాణిజ్య స్థలం ఇవ్వాలని, ఏడాదికి లీజు క్రింద రైతుకు రూ. 30,000లు ఇచ్చేం దుకు వ్యవసాయ కూలీ కుటుంబానికి నెలకు రూ. 2,500లు పింఛను ఇచ్చేం దుకు అవకాశం ఉంటుంది. అనేక దశాబ్దాల తర్వాత రైతులు, భూములపై ఆధారపడ్డ ఇతర ప్రజల ప్రయోజనాలను పరిరక్షించడానికి కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్ ఆమోదం పొందిన 2013 భూసేకరణ చట్టం ఇప్పుడు అమలులో ఉంది. దీని ప్రకారం నిపుణుల బృందంతో సామాజిక ప్రభావం అంచనా, పర్యావరణ అంచనాలు వేసిన తదుపరి నూటికి 70 మంది రైతులు, ప్రజలు భూసేకరణకు ఆమోదించ వలసి ఉంటుంది. మార్కెట్ వాల్యూ (రిజిస్ట్రేషన్ విలువ)కు పట్టణ ప్రాంతంలో 2 రెట్లు, గ్రామీణ ప్రాంతంలో 4 రెట్లు చొప్పున రైతులకు నష్ట పరిహారం ఇవ్వవలసి ఉంటుంది. దీని ప్రకారమే ఇటీవల భోగాపురం ఎయిర్‌పోర్టు కొరకు తీసుకోనున్న భూములకు రూ. 25 నుండి 33 లక్షల రూపాయల నష్ట పరిహారం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు మచిలీపట్నం పోర్టు కొరకు 4,800 ఎకరాలు అవసరమని, ప్రభుత్వ భూమి సుమారు 2,300 ఎకరాలు కాక రైతుల నుంచి 2,282 ఎకరాలు భూసమీకరణలో తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించటం ఎంతమాత్రం సరి కాదు. మచిలీపట్నంలో సముద్రంలోతు (డ్రాఫ్ట్) 13 మీటర్లు, 3 బెర్తులు నిర్మిం చాలని పోర్టు డెవలపర్ ప్రతిపాదన, ఇందుకు ప్రభుత్వ భూమి 2,300 ఎకరాలు సరిపోతుంది. 21 మీటర్ల లోతుతో, 5 బెర్తులతో 14 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకును ఇప్పటికే హ్యాండిల్ చేస్తూ ఉన్న గంగవరం పోర్టునకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది 1800 ఎకరాలు మాత్రమే. అంతేకాక మన దేశంలో మేజరు పోర్టులు అయిన చెన్నై పోర్టు 500 ఎకరాలు, ఎన్నూరు పోర్టు 2,000 ఎకరాలు, ట్యుటుకో రిన్ పోర్టు 2,150 ఎకరాలు, కొచ్చిన్ పోర్టు 2,000 ఎకరాలు, న్యూమంగళూరు పోర్టు 1,908 ఎకరాలు, మార్మగోవా 530 ఎకరాల విస్తీర్ణంతోనే తమ కార్యకలా పాలు నిర్వహిస్తున్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ఆదర్శప్రాయమైన సింగపూర్‌లో పి.ఎస్.ఎ. సింగపూర్ రేవు 1,500 ఎకరాలలో 52 బెర్తులతో పనిచేస్తూ ఉంది. అలాగే జురాంగ్ పోర్టు 400 ఎకరాలలో 32 బెర్తులతో పనిచేస్తూ ఉంది. అనగా కేవలం 1,900 ఎకరాలలో 84 బెర్తులతో కోట్లాది టన్నుల సరుకులను హ్యాండిల్ చేస్తూ, ఈ రెండు పోర్టులు పని చేస్తున్నాయి. ఇక్కడ మచిలీపట్నం పోర్టునకు అవసరమని చెబుతూ ఉన్న 4,800 ఎకరాలలో ఒక మినీ స్టీల్ ప్లాంట్, ఒక థర్మల్ పవర్ ప్రాజెక్టు, ఒక సెజ్, డీశాలినేషన్ ప్లాంట్ మున్నగునవి ఉంటాయని పోర్టు డెవలపర్ సమర్పించిన డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టులో (డి.పి.ఆర్.) ఉంది కావున ఎట్టి పరిస్థితులలోను పోర్టు కోసం రైతుల భూమి ఒక ఎకరా కూడా తీసుకోవలసిన అవసరం లేదు. ఒకవేళ ఉంది అని భావించితే 2013 భూసేక రణ చట్టంను అనుసరించి న్యాయమైన నష్ట పరిహారమును చెల్లించి భూసేకరణ ద్వారా తీసుకొన వచ్చును. మన దేశంలో అనేక రాష్ట్రాలలో రహదారుల కొరకు, పరిశ్రమల కొరకు, ప్రాజెక్టుల కొరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు 2013 భూసేకరణ చట్టంను అను సరించి రైతులకు నష్టపరిహారం ఇచ్చి భూములను తీసుకొంటున్నాయి. ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని అమరావతి ప్రాంతంలో రైతులు భూసమీ కరణ క్రింద భూములు ఇచ్చివున్నారు, కాబట్టి మచిలీపట్నంలో కూడా అదే తరహాలో భూములు ఇస్తారని భావించటం ఎంతమాత్రమూ తగదు. అది రాజ ధాని ప్రాంతం కాబట్టి కొంతకాలం తర్వాతైనా తమ భూములకు మంచి ధరలు వస్తాయని మెట్ట గ్రామాలలోని రైతులు ఆశించారు. కొందరు మంత్రులు, పార్ల మెంట్ సభ్యులు రైతుల భూములకు భవిష్యత్తులో కోట్లకు కోట్ల రూపాయలు వస్తాయని భ్రమలు కల్పించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే కొన్ని ప్రైవేటు సంస్థలకు వందల ఎకరాల భూములను ఎకరాకు రూ. 50 లక్షల చొప్పున భూ సంతర్పణ చేస్తూ ఉంటే ఆ మెట్ట గ్రామాలలోని రైతుల ఆశలు రానున్న కాలంలో అడియాశలు అయ్యే పరిస్థితి ఉంది. మన బందరు పట్టణంలో ప్రధానమైన రహదారి, కలెక్టరేట్ వంటి కొద్ది రహదారులు మినహా ఏ మాత్రం అభివృద్ధి జరిగినదో ప్రజ లందరికీ ఎరుకే. ఇలాంటి పరిస్థితులలో ఎకరా భూమి (4,840 చదరపు గజాల)ని ఏమాత్రం నష్ట పరిహారం తీసుకోకుండా ప్రభుత్వానికి ఇచ్చి, దానికి బదులుగా ప్రభుత్వం ఇచ్చే 1,250 చదరపు గజాలను మాత్రమే తీసుకోవటానికి రైతులు ఏమన్నా బిచ్చగాళ్ళా! దాదాపు 18 నుండి 20 వేల ఎకరాల మేరకు ప్రభుత్వ భూమి పెట్రో కెమికల్ కాంప్లెక్స్, పారిశ్రామిక కారిడార్ కొరకు అందుబాటులో ఉందని మంత్రులే చెబుతున్నారు. కావున ఏ ఏ పరిశ్రమలు వస్తాయి? వాటికి వాస్త వంగా ఎంత భూమి అవసరం? అని అంచనాలు రూపొందించుకొని రైతుల నుంచి అవసరం అయ్యే భూములకు 2013 చట్టంను అనుసరించి నష్ట పరి హారం చెల్లించి తీసుకోవాలి. ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో 13 పోర్టులు ఉన్నాయని బ్రహ్మాండంగా అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉన్నదని పదే పదే మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ రెండు సంవత్సరాలలో ఒక్క పోర్టు పనిని కూడా ప్రారంభించలేదు. పొరుగున ఉన్న ఒరిస్సా రాష్ట్రములో పారాదీప్ మేజర్ పోర్టే కాక నవీన్ పట్నాయక్ ప్రభుత్వం దమ్రా, కిరిటానియా, గోపాల్పూర్ మున్నగు పలు పోర్టుల అభివృద్ధికి చక్కగా కృషి చేస్తూ గణనీయమైన ఆదాయాన్ని కూడా పొందుతూ ఉంది. తమిళనాడు రాష్ట్రంలో ఇప్పటికే 3 మేజర్ పోర్టులు ఉండగా ఇప్పుడు కొత్తగా 4వ మేజర్ పోర్టును కొలాచల్ సమీపంలో ఎనైమ్ వద్ద రూ. 21 వేల కోట్లు ఖర్చుతో కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసేందుకు కేంద్ర మంత్రి వర్గం ఇటీవల ఆమోదించింది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు దాటిపోతూ ఉన్నా ఇంత వరకూ దుగరాజపట్నం లేక రామాయపట్నం మేజరు పోర్టు పనులు ప్రారం భానికి నోచుకోలేదు. 2,300 ఎకరాలలో బందరు పోర్టు పనిని చేపట్టేందుకు నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ ముందుకు రాని పక్షంలో విశాఖపట్నం పోర్టు ట్రస్టువారు మన రాష్ట్రంలో ఒక పోర్టును చేపట్టి అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చిన నేపథ్యంలో.. మచిలీపట్నంలో 2,300 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఇచ్చి విశాఖపట్నం పోర్టు ట్రస్టు వారిచే మచిలీపట్నం పోర్టును అభివృద్ధి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలి. రాష్ట్ర ప్రభుత్వం ‘‘మడ’’ ఏరియాలో తలపెట్టిన భూసమీకరణ ప్రయత్నాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని రైతాంగం కోరుతూ ఉంది. - వడ్డే శోభనాద్రీశ్వరరావు వ్యాసకర్త మాజీ మంత్రి, వ్యవసాయ రంగ నిపుణులు మొబైల్ : 93929 59999 -
చంద్రబాబు సొంత పోర్టు 1900 ఎకరాలే
ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆదర్శమైన సింగపూర్‌లోనూ ఆయనకు 1,900 ఎకరాల్లోనే 84 బెర్తుల పోర్టు నడుస్తోందని వడ్డే శోభనాద్రీశ్వర రావు తెలిపారు. బందరు పోర్టుకు 4,800 ఎకరాల భూమి అక్కర్లేదని.. ప్రస్తుతం కేవలం 1,800 ఎకరాల్లో మాత్రమే గంగవరం పోర్టు నడుస్తోందని ఆయన అన్నారు. బందరుపోర్టు బాధితుల పక్షాన అఖిలపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. రైతుల భూములతో వ్యాపారం చేసి లబ్ధి పొందాలని చూస్తున్న చంద్రబాబూ... రైతుల ఉసురుపోసుకోవద్దని హితవు పలికారు. అభివృద్ధి పేరుతో అరాచకాలు తగవని చెప్పారు. బందర్‌పోర్టు బాధితుల పక్షాన అన్ని పార్టీలు కలసి ఉద్యమించాలని వైఎస్సార్ కాంగ్రెస్ నేత ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. అవసరానికి మించి ప్రభుత్వం తలపెట్టిన భూసేకరణను అడ్డుకోవాలని ఆయన కోరారు. రైతులపై పోలీసులను ఉసిగొల్పుతున్న దుర్మార్గ ప్రభుత్వమని ధర్మాన మండిపడ్డారు. చంద్రబాబుకు భూమి పిచ్చి పట్టిందని సీపీఐ రాష్ట్ర కార్యద ర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు. ప్రశ్నిస్తే రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ప్రతిపక్షాలపై దుష్ర్పచారం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుకు రైతులంటే పడదు..ఆయనది మాట నిలబెట్టుకునే నైజం కాదని కాంగ్రెస్ శాసనమండలి సభానేత సి.రామచంద్రయ్య ఆరోపించారు. రాష్ట్రంలో 4.5 లక్షల ఎకరాల భూమి ప్రభుత్వం చేతిలో ఉందంటూప్రపంచం అంతా తిరుగుతున్నారని సీఎంపై ధ్వజమెత్తారు. ఎవరి భూములను హరిస్తాడో తెలియకుండా ఉంది..ఆఖరికి శ్మశానలకుకూడా స్థలం లేకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. మోదీ కాళ్లు పట్టుకుని.. పవన్ కల్యాణ్ గడ్డం పట్టుకున్నా.. ఎన్నికల్లో బాబుకు ప్రతిపక్షం కన్నా కేవలం ఒక్కశాతం మాత్రమే ఎక్కువ ఓట్లు వచ్చాయని మరవొద్దని హెచ్చరించారు. -
రాజధాని వ్యవహారంలో క్విడ్ ప్రోకో:వడ్డే
విజయవాడ : నవ్యాంధ్ర రాజధాని అమరావతి వ్యవహారంలో క్విడ్ ప్రోకో జరుగుతోందని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆరోపించారు. మంగళవారం విజయవాడలో వడ్డే శోభనాద్రీశ్వరరావు విలేకర్లలో మాట్లాడుతూ... విదేశీ కంపెనీలకు మేలు చేసేందుకే స్విస్ ఛాలెంజ్ పద్దతి అని ఆయన విమర్శించారు. సింగపూర్ కంపెనీలకు 1600 ఎకరాలను అప్పనంగా కట్టబెడుతున్నారన్నారు. లాభాలు వస్తే తీసుకుపోతారు... నష్టాలు వస్తే చేతులు దులుపుకుని వెళ్లిపోతారని సింగపూర్ కంపెనీలపై మండిపడ్డారు. స్విస్ ఛాలెంజ్ పద్దతిలో రాష్ట్రానికి తీవ్రనష్టం వాటిల్లుతుందని మాజీ మంత్రి వడ్డె శోభనాద్రీశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. -
తాత్కాలిక సచివాలయానికి రూ.180 కోట్లా ?
విజయవాడ : రాష్ట్రం ఆర్థిక లోటులో ఉందంటూనే తాత్కాలిక సచివాలయానికి రూ.180 కోట్లు వెచ్చించడం అవసరమా? అని మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓ వైపు రాజధాని నిర్మాణానికి స్కూల్ పిల్లల నుంచి చందాలు వసూలు చేస్తున్న ప్రభుత్వం తాత్కాలిక నిర్మాణాలకు వేల కోట్లు ఖర్చు చేయడం సరికాదని పేర్కొన్నారు. ప్రజా రాజధాని నిర్మిస్తామంటే రైతులు 33 వేల ఎకరాల భూములు త్యాగం చేశారని గుర్తు చేశారు. తాత్కాలిక కార్యాలయాల కోసం మంత్రి నారాయణ భవనాలు త్యాగం చేయలేరా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం ఆకాశంలో విహరిస్తోందని, నేలమీదకు వచ్చి ప్రజలకు పాలన అందించాలని సూచించారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం సహాయం కోసం ఒత్తిడి చేయాలని కోరారు. మాస్టర్ ప్లాన్‌లో వ్యవసాయ పరిరక్షణ జోన్ నిబంధనలు తక్షణమే మార్పు చేయాలని కోరారు. వ్యవసాయం, పంటలపై ప్రేమతో అగ్రికల్చర్ జోన్లు ఏర్పాటు చేయలేదని, రాజధాని ప్రాంతంలో భూముల ధరలు పెంచుకునేందుకేనని విమర్శించారు. మాస్టర్‌ప్లాన్‌పై అభ్యంతరాలు కోరుతూ రైతులకు అర్థం కాకుండా నోటిఫికేషన్ ఇంగ్లిష్‌లో విడుదల చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. తెలుగులో తర్జుమా చేసి ఆ ప్రాంత రైతుల అభిప్రాయాలు, సూచనలు, అభ్యంతరాలు స్వీకరించాలని కోరారు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి వందల ఎకరాల భూమి, వేల కోట్లు నిధులు ఖర్చు చేయడం దండగన్నారు. ప్రస్తుత పరిస్థితులు, జనాభా దృష్ట్యా ఔటర్ రింగ్ రోడ్డు అవసరం లేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. పంట భూములను లాగేసుకుని కాంక్రీట్ జంగిల్‌గా మార్చవద్దన్నారు. ప్రభుత్వం పునరాలోచించి గ్రీన్‌బెల్ట్ నిబంధనలు మార్చాలని, ప్రజాధనాన్ని దుబారా చేయవద్దని కోరారు. -
బాబు ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారం చేపట్టిన పద్దెనిమిది నెలల కాలంలో ప్రత్యేక విమానాల్లో పర్యటనలకు చేసిన ఖర్చుపై శ్వేత పత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాధనానికి ధర్మకర్తల వ్యవహరించాల్సిన ముఖ్యమంత్రి అడ్డగోలుగా దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ హెలికాఫ్టర్‌లో పర్యటించాల్సిన సీఎం ప్రత్యేక విమానాల్లో ఎందుకు పర్యటిస్తున్నారో స్పష్టం చేయాలన్నారు. రాష్ర్టంలో ఏదో మూల రైతు ఆత్మహత్యలు జరగుతూనే ఉన్నాయన్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టు ఉండగా 5వేల ఎకరాల్లో మంగళగిరిలో ఎయిర్‌పోర్టు ఎందుకు నిర్మించాలనుకుంటున్నారో స్పష్టం చేయాలన్నారు. సింగపూర్ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలను బహిర్గతం చేయాలన్నారు. రహస్య ఎజెండాతో రాజధాని నిర్మాణం పేరిట వేల కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రజా రాజధాని నిర్మించాలని కోరారు.