బాబు ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారం చేపట్టిన పద్దెనిమిది నెలల కాలంలో ప్రత్యేక విమానాల్లో పర్యటనలకు చేసిన ఖర్చుపై శ్వేత పత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాధనానికి ధర్మకర్తల వ్యవహరించాల్సిన ముఖ్యమంత్రి అడ్డగోలుగా దుర్వినియోగం చేస్తున్నారన్నారు.
ప్రభుత్వ హెలికాఫ్టర్‌లో పర్యటించాల్సిన సీఎం ప్రత్యేక విమానాల్లో ఎందుకు పర్యటిస్తున్నారో స్పష్టం చేయాలన్నారు. రాష్ర్టంలో ఏదో మూల రైతు ఆత్మహత్యలు జరగుతూనే ఉన్నాయన్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టు ఉండగా 5వేల ఎకరాల్లో మంగళగిరిలో ఎయిర్‌పోర్టు ఎందుకు నిర్మించాలనుకుంటున్నారో స్పష్టం చేయాలన్నారు. సింగపూర్ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలను బహిర్గతం చేయాలన్నారు. రహస్య ఎజెండాతో రాజధాని నిర్మాణం పేరిట వేల కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రజా రాజధాని నిర్మించాలని కోరారు.