
'రాజధాని నిర్మాణానికి 800 ఎకరాలు చాలు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి 800 ఎకరాల భూమి చాలని మాజీ మంత్రి వడ్డే శోభనాదీశ్వర రావు అన్నారు. రాజధానికి లక్ష ఎకరాల భూమి అవసరం లేదని చెప్పారు.
ప్రభుత్వం రాజధాని నిర్మాణం పేరిట రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవడం సరికాదని వడ్డే శోభనాదీశ్వర రావు పేర్కొన్నారు. కాగా రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు గుంటూరు జిల్లాలో కొన్ని గ్రామాల రైతులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.