'30 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణం అసాధ్యం'
విజయవాడ: రాజధానికి రైతుల అంగీకారంతోనే భూములు సేకరణ జరగాలని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. 30 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణం అసాధ్యం, అర్థరహితమని వ్యాఖ్యానించారు. దేశంలో ఏర్పడిన ఏ రాజధానికి అన్ని వేల ఎకరాలు సేకరణ జరిపిన చరిత్ర లేదని గుర్తు చేశారు.
రైతుల భూములతో వ్యాపారం చేయాలనుకోవడం తగదన్నారు. అసలే అంతంతమాత్రంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భూసేకరణతో మరింత దిగజారే ప్రమాదముందని ఆయన హెచ్చరించారు. రుణమాఫీ చేయలేని ప్రభుత్వం కొత్త రాజధానికి నిధులు ఎక్కడినుంచి తెస్తుందని ఆయన ప్రశ్నించారు.