ప్రాజెక్టు పనులు పరిశీలిస్తున్న చంద్రబాబు (ఫైల్)
సాక్షి, విజయవాడ : ప్రాజెక్టుల పేరుతో, నీరు-చెట్టు పేరుతో రాష్ట్రంలో నిలువు దోపిడి జరుగుతోందని రైతు సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎర్నేని నాగేంద్రం రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన పోలవరం ప్రాజెక్టు విషయమై రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 2019 కల్లా పోలవరంలో గ్రావిటీతో నీళ్లు ఇస్తామని చెబుతున్న మాట అబద్ధమని అన్నారు. అది అసాధ్యం అని చాలెంజ్ చేస్తున్నానని అన్నారు. ఈ నాలుగేళ్లలో ప్రాజెక్టుల పేరుతో ఖర్చు పెట్టిన రూ.58,400 కోట్లపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకు సాగునీరు ఇచ్చారో చెప్పాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నానా హడావిడి చేసిన చంద్రబాబు ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు.
చిన్న చిన్న ప్రాజెక్టులకు కూడా మోక్షం లేదు..
రాష్ట్రంలో చిన్న చిన్న ప్రాజెక్టులు కూడా పూర్తి కావడం లేదని మాజీ మంత్రి వడ్డే శోభానాద్రీశ్వరరావు ఆరోపించారు. ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని ఇష్టం వచ్చినట్లు పెంచేస్తున్నారని అన్నారు. కాలువల పరిస్థితి మరి అధ్వానంగా ఉందని, రియల్ టైం గవర్నెన్స్ అని చెప్పుకునే ముఖ్యమంత్రికి విజయవాడలో కాలువల పరిస్థితి కనిపించడం లేదా అన్ని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment