సల్మాన్‌ ఖాన్‌ పరువునష్టం దావా కొట్టివేత | Salman Khan Defamation Petition Dismissed By Court Mumbai | Sakshi
Sakshi News home page

సల్మాన్‌ ఖాన్‌ పరువునష్టం దావా కొట్టివేత

Published Sat, Jan 15 2022 10:47 AM | Last Updated on Sat, Jan 15 2022 10:47 AM

Salman Khan Defamation Petition Dismissed By Court Mumbai - Sakshi

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ దాఖలు చేసిన పరువునష్టం దావా పిటిషన్‌ను ముంబై సిటీ సివిల్‌ కోర్టు శుక్రవారం కొట్టివేసింది. ముంబైలోని పన్వేల్‌ ప్రాంతంలో సల్మాన్‌ ఖాన్‌ ఫాంహౌజ్‌ పక్కనే ఉన్న ఓ స్థలాన్ని ఖేతన్‌ కక్కడ్‌ అనే వ్యక్తి కొనుగోలు చేశారు.

అయితే ఖేతన్‌ కక్కడ్‌ ఓ యూట్యూబ్‌ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ తనపైనా, తన ఫాంహౌస్‌పైనా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తన పరువుకు నష్టం చేకూర్చేవిధంగా ఉన్నాయని, భవిష్యత్తులో తనపై అటువంటి వ్యాఖ్యలు చేయకుండా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని, ఇంటర్వ్యూ భాగం నుంచి ఆ వ్యాఖ్యలు తొలగించాలని కోరుతూ ముంబై సిటీ సివిల్‌ కోర్టులో పరువునష్టం వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

అయితే ఈ పిటిషన్‌ను కోర్టు విచారణకు తిరస్కరించింది. ఖేతన్‌ కక్కడ్‌పై వస్తున్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని, దీనిపై తదుపరి విచారణను ఈనెల 21కి వాయిదా వేస్తూ జడ్జి అనిల్‌ హెచ్‌ లద్దాద్‌ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement