
అమీర్‌పేట: ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో టీఆర్‌ఎస్ నాయకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బోరబండ రామారావు నగర్‌కు చెందిన డేవిడ్(40) టీఆర్‌ఎస్ నేతగా కొనసాగుతున్నాడు. ఓ ప్రైవేటు కంపనీలో పనిచేస్తున్న అతను తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆర్థిక సమస్యల కారణంగా ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండటంతో మనస్థాపానికి లోనైన డేవిడ్ సోమవారం రాత్రి తన గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరళించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.