'మా ఆయన చాలా రోమాంటిక్' | David is very romantic: Victoria Beckham | Sakshi
Sakshi News home page

'మా ఆయన చాలా రోమాంటిక్'

Published Mon, Nov 23 2015 8:11 AM | Last Updated on Sun, Sep 3 2017 12:54 PM

'మా ఆయన చాలా రోమాంటిక్'

'మా ఆయన చాలా రోమాంటిక్'

లండన్: తన భర్త డేవిడ్ బెక్కామ్ చాలా రోమాంటిక్ ఫెలో అని ప్రముఖ గాయని, ఫ్యాషన్ డిజైనర్ విక్టోరియా చెప్పింది. ఒకప్పటి ఫుట్ బాల్ ప్లేయర్ అయిన ఆయన చెప్పలేనంత రోమాంటికల్ పర్సన్ అయినా కుటుంబ విషయంలో అతడికి ఉన్న కమిట్ మెంట్కే ఎక్కువ మార్కులు వేస్తానని చెప్పుకొచ్చింది. 'డేవిడ్ చాలా రోమాంటిక్. మేము ప్రతి రోజు ఒకరినొకరం ఆశ్యర్యపరుచుకునేందుకు ఏదో ఒకటి చేస్తుంటాం. తొలిసారి నేను డేవిడ్ను 20 ఏళ్ల కిందట కలిశాను.

ఆ సమయంలో ఫుట్ బాల్ మ్యాచ్ లో ఉన్నాము. మ్యాచ్ ముగిశాక అందరూ తమ స్నేహితులతో కలిసి కూల్ డ్రింక్స్ తాగుతూ కబుర్లు చెప్తుంటే ఒక్క డేవిడ్ మాత్రం తన కుటుంబ సభ్యులతో ఉన్నాడు. అతడి అమ్మ నాన్న, సోదరితో మాట్లాడుతున్నాడు. నాకు అప్పుడే అర్థమైంది.. అతడు తన కుటుంబానికి ఎంత విలువ ఇస్తాడో అని. నన్ను పెళ్లి చేసుకునేందుకు నా తండ్రి అనుమతి కోరిన తీరు ఇప్పటికీ మర్చిపోలేను. ఓ మోకాలిపై కూర్చుని మరీ మీ కూతురుని నాకు ఇవ్వరా అంకుల్ అంటూ అడిగి ఆశ్చర్యపోయేలా చేశాడు. అతడి గౌరవం చూసి అబ్బుర పోయాం' అంటూ విక్టోరియా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం విక్టోరియా, డేవిడ్ దంపతులకు నలుగురు పిల్లలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement