vulnerability
-
'యాపిల్ వినియోగదారులకు కేంద్రం హెచ్చరిక'
కేంద్ర భద్రతా సలహాదారు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ఐఫోన్లు, ఐప్యాడ్లు మొదలైన ఇతర యాపిల్ ఉత్పత్తులలో భద్రతా సమస్యలు ఉన్నట్లు వెల్లడించింది. వీటిని నేరగాళ్లు యాక్సెస్ చేసే అవకాశం ఉందని, ఇది స్పూఫింగ్‌కు దారితీయవచ్చు, సమాచారం లీక్ అయ్యే అవకాశం కూడా ఉందని కేంద్రం హెచ్చరించింది.17.6, 16.7.9కి ముందున్న ఐఓఎస్, ఐపాడ్ఓఎస్ వెర్షన్లు.. 14.6కి ముందు ఉన్న మ్యాక్ఓఎస్ సోనోమా వెర్షన్లు, 13.6.8కి ముందు మ్యాక్ఓఎస్ వెంచురా వెర్షన్లు, 13.6.8కి ముందు మ్యాక్ఓఎస్ మోంటెరేరీ వెర్షన్లు, 12.7కి ముందు వెర్షన్లు, 12.7కి ముందు వెర్షన్ వంటి యాపిల్ ఉత్పత్తులు ఈ ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వెల్లడించింది.విచారణ జరిపే వరకు తమ ఉత్పత్తులలోని భద్రతా సమస్యలను నిర్ధారించని యాపిల్ సంస్థ.. గత వారం లేటెస్ట్ సెక్యూరిటీ అప్డేట్స్ విడుదల చేసింది. ఈ సాఫ్ట్వేర్ లేటెస్ట్ వెర్షన్లు కూడా వారి పోర్టల్‌లో జాబితా చేశారు. వీటిని యాపిల్ ఉత్పత్తులలో కూడా అప్డేట్ చేసుకోవాలి CERT-In వినియోగదారులను కోరింది.ఐఫోన్లు, ఐప్యాడ్లు, మ్యాక్‌బుక్స్, విజన్ప్రో హెడ్సెట్లకు ప్రభుత్వం ఇదే విధమైన హై రిస్క్ వార్ణింగ్ జారీ చేసింది. వివిధ యాపిల్ ఉత్పత్తులలో "రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్"కు సంబంధించి సమస్యను ఇందులో హైలెట్ చేశారు. -
గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక..!
గూగుల్ క్రోమ్ వాడే యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద పనిచేసే ప్రభుత్వ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) గూగుల్ క్రోమ్‌లో అధిక తీవ్రతతో కూడిన సమస్య ఉన్నట్లు గుర్తించింది. CERT-In ప్రకారం గూగుల్ క్రోమ్ వెబ్ బ్రౌజర్లో అనేక దుర్బలత్వాలు ఉన్నాయని పేర్కొంది. వీటితో యూజర్లపై సైబర్ దాడులు సులువుగా జరిగే అవకాశం ఉందని సెర్ట్-ఇన్ వెల్లడించింది.గూగుల్ క్రోమ్ V8 టైప్ కన్ఫ్యూజన్ కారణంగా అనేక సమస్యలను ఉన్నట్లు తేలింది. దీంతో హ్యాకర్లు యూజర్ల వ్యక్తిగత డేటాకు యాక్సెస్ పొందవచ్చని, వారిని లక్ష్యంగా చేసుకొని కంప్యూటర్లో మాల్వేర్ను ఇంజెక్ట్ చేసేందుకు సులువుగా ఉంటుందని సెర్ట్-ఇన్ తెలిపింది. గూగుల్..నివారణ చర్యలు..! గూగుల్ క్రోమ్ వెబ్‌బ్రౌజర్‌లో సమస్యలు ఉన్నట్లు గూగుల్ కూడా గుర్తించింది. అందుకోసం నివారణ చర్యలను కూడా చేపట్టింది. గూగుల్ క్రోమ్ అప్డేట్డ్ వెర్షన్‌ను విడుదల చేసింది. యూజర్లు వీలైనంత త్వరగా క్రోమ్ బ్రౌజర్‌ను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. సుమారు 22 రకాల భద్రతా పరిష్కారాలను అందించినట్లు సాఫ్ట్వేర్ దిగ్గజం గూగుల్ తెలిపింది.గూగుల్ ఇటీవల ప్రకటించినట్లుగా విండోస్, మ్యాక్, లైనెక్స్ కోసం విస్తృతంగా ఉపయోగించే క్రోమ్ బ్రౌజర్ వెర్షన్‌ను 96.0.4664.93 రిలీజ్ చేసింది. మీ క్రోమ్ బ్రౌజర్‌ని ఇలా అప్డేట్ చేయండి • Google Chrome బ్రౌజర్‌ని ఒపెన్ చేయండి. • కుడి ఎగువ మూలలో, మూడు చిన్న చుక్కలపై క్లిక్ చేయండి •హెల్ఫ్‌పై క్లిక్ చేయండి. మీకు బ్రౌజర్ వెర్షన్‌ను చూపుతుంది. అప్డేట్ అప్షన్‌పై క్లిక్ చేయండి. ఇలా కాకుండా మీరు నేరుగా గూగుల్ ప్లే స్టోర్‌కి వెళ్లి..మై యాప్స్‌లో గూగుల్ క్రోమ్‌పై క్లిక్ చేసి అప్డేట్ అప్షన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. చదవండి: జియో కమాల్: ప్రపంచంలోనే చీపెస్ట్ ఇంటర్నెట్ ప్యాక్.. కస్టమర్లకు పండగే! -
పీఎన్బీ ఖాతాదారులకు షాక్... 18 కోట్ల మంది డేటా లీక్ ?
Punjab National Bank server exposed customer data : ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సర్వర్‌లోని (పీఎన్బీ) ఒక లోపం కారణంగా సుమారు 18 కోట్ల మంది కస్టమర్ల వ్యక్తిగత, ఆర్థిక వివరాలు బహిర్గతమయ్యే పరిస్థితి ఏర్పడిందని సైబర్ సెక్యూరిటీ సంస్థ సైబర్ఎక్స్9 వెల్లడించింది. సుమారు ఏడు నెలల పాటు ఇలాంటి పరిస్థితి కొనసాగిందని వివరించింది. అడ్మినిస్ట్రేషన్ అధికారాలతో పీఎన్బీకి చెందిన మొత్తం డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థను బైటి వ్యక్తులు అందుబాటులోకి తెచ్చుకునేందుకు దోహదపడేలా ఈ లోపం ఉందని పేర్కొంది. దీన్ని తాము గుర్తించి సైబర్ సెక్యూరిటీ ప్రాధికార సంస్థలు సీఈఆర్టీ–ఇన్, ఎన్సీఐఐపీసీ ద్వారా హెచ్చరించిన తర్వాత, పీఎన్బీ లోపాన్ని సరిదిద్దిందని సైబర్ఎక్స్9 వ్యవస్థాపకుడు హిమాంశు పాఠక్ తెలిపారు. మరోవైపు, లోపం ఉన్న మాట వాస్తవమేనని నిర్ధారించినప్పటికీ దీని వల్ల కీలకమైన డేటా ఏదీ బైటికి పోలేదని బ్యాంక్ తెలిపింది. - న్యూఢిల్లీ -
విండోస్ యూజర్లకు షాక్ ! మైక్రోసాఫ్ట్ కీలక సూచన
విండోస్ ప్రింట్ స్పూలర్ యూజర్లు జాగ్రత్తగా ఉండాలంటూ మైక్రోసాఫ్ట్ హెచ్చిరించింది. ప్రింట్ స్పూలర్ సర్వీస్‌లో ఉన్న లోపాలను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మీ డేటాను దొంగలించే అవకాశం ఉందని హెచ్చరించింది. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే 2021 జూన్ 8న విడుదల చేసిన సెక్యూరిటీ ప్యాచ్‌ని అప్డేట్ చేసుకోవాలని సూచించింది. సెక్యూరిటీ ప్యాచ్ ‘ప్రింట్ స్పూలర్ కోడ్‌కి సంబంధించిన లోపాల కారణంగా విండోస్‌కి సంబంధించిన అన్ని వెర్షన్లకు ముప్పు పొంచి ఉంది. దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అలాగే ఈ అంశంపై విచారణ కొనసాగిస్తున్నాం’ అంటూ మైక్రోసాఫ్ట్ పేర్కొంది. లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్‌ని అప్డేట్ చేసుకోకి వాళ్లు ప్రింట్ స్పూలర్‌ని డిసేబుల్ చేయడం మంచిదని సూచించింది. -
పేదోడి కడుపు కొడుతోన్న కరోనా, వివరాలివే...
సాక్షి, న్యూఢిల్లీ: లాక్డౌన్ కారణంగా దారిద్ర్యరేఖకు దిగువన ఉంటున్న ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడానికి ది అజీమ్ ప్రేమ్‌జీ సెంటర్ ఫర్ సస్టయినబుల్ ఎంప్లామెంట్ చేపట్టిన సర్వేలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 12 రాష్ట్రాల్లోని గ్రామాలు, పట్టణాల్లో ఏప్రిల్ 13 నుంచి మే 9 వరకు సర్వే చేపట్టారు. ఈ సర్వేలో కేవలం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారినే తీసుకున్నారు. కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ వలన ఇండియాలో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారిలో 67 శాతం మంది ఉపాధిని కోల్పోయారు. 63 శాతం మంది ఆదాయాలు తగ్గిపోయాయి. (ఆర్థిక ప్యాకేజీ.. సాయంత్రం 4గంటలకు వివరాలు) వీటిలో ఆశ్చర్యానికి గురిచేసే మరో విషయం ఏంటంటే 74 శాతం మంది కరోనా కాలంలో తమ ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి ఎప్పటి కంటే తక్కువ ఆహారం తీసుకుంటున్నట్లు తెలిపారు. తరువాతి వారం రేషన్ సామాన్లు కొనడానికి 74 శాతం మంది దగ్గర డబ్బులు లేనట్టు తెలిపారు. ఇక వీరిలో చాలా మంది రోజు కూలీ చేసుకున్నే వారు, నెలకు 10,000 కంటే తక్కువ సంపాదించే వారే ఉన్నారు. అయితే ఇలా ఆహారం తక్కువగా తీసుకువడం వలన తరువాత చాలా మందిలో పోషకాహార లోపం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆడపిల్లల్లో ఈ సమస్య అధికంకావొచ్చు అని నిపుణులు అంచనా వేస్తోన్నారు. అయితే దీనిలో ఆనందించదగ్గ విషయం ఏంటంటే వీరిలో 86 శాతం మందికి ప్రభుత్వం అందించే నిత్యవసర సరుకులు, డబ్బులు అందుతున్నాయి. కరోనా కారణంగా కేవలం తిండి దొరకకపోవడమే కాకుండా చాలా మంది ఇంటి అద్దెలు చెల్లించలేని స్థితిలో ఉన్నారు. చాలా మంది పక్కవారి నుంచి అప్పులు తీసుకుంటున్నారు. పల్లెలతో పోలీస్తే ఈ సమస్య పట్టణాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. అయితే దేశ ఆర్ధిక పరిస్థితిని గాడిలో పెట్టడానికి కేంద్రప్రభుత్వం 20 లక్షల కోట్ల ప్యాకేజీని మంగళవారం ప్రకటించింది. అందులో వలస కూలీలకు, దిగువ తరగతి వారికి ఏం కేటాయించారో బుధవారం సాయంత్రం తెలియనుంది. (కోయంబేడు కొంపముంచిందా?) -
యువతులు చెప్పుకోలేరని తెగబడుతున్నారు
తనపై అత్యాచారం జరిగితే ఏ ఆడపిల్ల బయటకు చెప్పుకోలేదనే ధైర్యంతో కామాంధులు తెగబడుతున్నారు. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సాప్ట్వేర్ యువతి కిడ్నాప్, అత్యాచారం కేసులో ఈ విషయం స్పష్టమైంది. యువతుల బలహీనతను ఆసరాగా చేసుకొని కామాంధులైన యువకులు రెచ్చిపోతున్నారు. ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుడు చెప్పిన విషయాల ద్వారా ఈ విషయం స్పష్టమవుతోంది. బెంగళూరుకు చెందిన ఓ యువతి(22) మాదాపూర్‌లోని ఓ సాప్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తోంది. హైదరాబాద్ గౌలిదొడ్డిలోని ఓ ప్రైవేటు మహిళా హాస్టల్లో ఉంటోంది. ఈ నెల 18 తేది శుక్రవారం సాయంత్రం విధులు ముగించుకున్న ఆమె ఇనార్బిట్ షాపింగ్‌మాల్‌లో షాపింగ్ పూర్తి చేసుకుంది. రాత్రి ఎనిమిదిన్నర గంటలకు గౌలిదొడ్డి వెళ్లేందుకు బస్టాప్‌లో నిల్చుంది. అరగంట గడిచినా బస్సు రాకపోవడంతో అటుగా వచ్చిన క్యాబ్ ఎక్కింది. అయితే క్యాబ్ దారిమళ్లిందని గమనించిన ఆమె వెంటనే సెల్‌ఫోన్ ద్వారా తన స్వస్థలంలో ఉంటున్న స్నేహితునికి సమాచారమిచ్చింది. అతను ఆ విషయాన్ని నగరంలో ఉంటున్న తన మిత్రునికి తెలియజేశాడు. అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈలోగా జరగవలసినదంతా జరిగిపోయింది. ఆ ఇద్దరు అతి కిరాతకంగా ఆ యువతిపై అత్యాచారం చేశారు. పోలీసులు రంగంలోకి దిగేసరికే ఇద్దరు కామాంధులు ఆమెను హాస్టల్ వద్ద వదిలి వెళ్లిపోయారు సీసీ కెమెరాలలోని దృశ్యాల ఆధారంగా నిందితులను సతీష్, వెంకటేశ్వర్లుగా సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈరోజు వారిని మీడియా ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా నిందితుడు వెంకటేశ్వర్లు జరిగిన విషయాన్ని పూర్తిగా వివరించాడు. సంఘటన వివరాలు అతని మాట్లల్లోనే.... నాకు అత్యాచారం చేయాలన్న ఉద్దేశం లేదు. నా స్నేహితుడు సతీష్ బలవంతపెట్టడం వల్లే సాప్ట్వేర్ యువతిపై అత్యాచారం చేశాను. సతీష్ ఆ యువతిని వోల్వా కారులో ఎక్కించుకున్నాడు. నేను కూడా ఆ కారులోనే ఉన్నాను. ఆమె చెప్పినవైపు కారు పోనివ్వలేదు. అవుటర్ రింగ్ రోడ్డు, నాచారం, కోకాపేట వైపు తీసుకువెళ్లాడు. అవుటర్ రింగ్ రోడ్డు ఎక్కడు, దిగాడు. చాలా సమయం అలాగే తిప్పాడు. చివరకు మెదక్ జిల్లా తెల్లాపూర్ సమీపంలో అడవి లాంటి ప్రదేశంలోకి తీసుకువెళ్లాడు. మనుషులు ఎవరూ కనిపించడంలేదు. కారును అక్కడ ఆపాడు. ఆ అమ్మాయిని పాడుచెయ్యమని అడిగాడు. నాకు భయం వేసింది. అందుకు నేను అంగీకరించలేదు. ఆ అమ్మాయి పోలీసులకు చెబితే వారు కొడతారని చెప్పాను. అతను వినలేదు. ఆడపిల్లలు పరువు పోతుందని, ఇటువంటి విషయాలను బయటకు చెప్పరు, నీకు ఏం భయంలేదు అని నన్ను ప్రోత్సహించాడు. అయినా నేను వినలేదు. దాంతో అతను కారు లోపలకు వెళ్లి తాళం వేసుకున్నాడు. ఆ అమ్మాయి అరుపులు పెడుతున్నా వినకుండా అత్యాచారం చేశాడు. ఆ తరువాత అతను బయటకు వచ్చి నన్ను కూడా ఆ అమ్మాయిని పాడుచెయ్యమని కోరాడు. నేను చేయనని చెప్పాను. నాకు భయం అన్నాను. అయినా అతను వినలేదు. భయపెట్టాడు. బెదిరించాడు. ''ఇప్పుడు నేను ఒక్కడినే తప్పు చేసినవాడిని అవుతాను. నువ్వు కూడా చేయాలి. లేకపోతే నిన్ను చంపుతాను.'' అని బెదించాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు బాధితురాలికి 'అభయ' అని పేరు పెట్టి నిర్భయ చట్టం కింద అత్యాచారం కేసు నమోదు చేశారు. ఢిల్లీలో సంఘటన తరువాత అత్యంత సంచలనం సృష్టిచిన ఈ కేసు ఛేదించడం కోసం పోలీసులు పది బృందాలుగా ఏర్పడి నాలుగు రోజులపాటు దర్యాప్తు చేశారు. నగరంలోని వోల్వా కారుల సమాచారం మొత్తం సేకరించారు. అత్యంత వేగంగా పరిశోధన పూర్తి చేసి నిందితులను పట్టుకోగలిగారు. ఒంటరి ఆడపిల్లలు - వారు పరువు గురించి ఆలోచించడం వల్ల కామాంధులు ధైర్యంగా ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్లు అర్ధమవుతోంది. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు యువతులు ముందుకు వచ్చి జరిగిన విషయాన్ని చెప్పవలసిన అవసరాన్ని ఈ సంఘటన గుర్తుచేస్తోంది. ఆడవారు పరువుకోసం ప్రాకులాడకుండా బయటకు చెబితే ఇటువంటివారు కొంతవరకు భయపడే అవకాశం ఉంటుంది. ఒంటిరిగా ఉద్యోగాలకు వెళ్లే యువతులు, మహిళలు జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంది. ఉద్యోగులు తమ కంపెనీకి చెందిన క్యాబ్‌లలోనే ఎక్కాలని, షేరింగ్ క్యాబ్‌లలో ఎక్కడం అంత మంచిది కాదని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సూచించారు. ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలో క్యాబ్ డ్రైవర్లు ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ముంబై, బెంగళూరు, పూనే... లలో ఇటువంటి సంఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా యువతులు జాగ్రత్తగా ఉండటంతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.