'యాపిల్ వినియోగదారులకు కేంద్రం హెచ్చరిక' | Multiple Vulnerabilities in iPhones iPads Other Apple Products | Sakshi
Sakshi News home page

యాపిల్ ఉత్పత్తులలో భద్రతా సమస్యలు: కేంద్రం హెచ్చరిక

Published Sun, Aug 4 2024 11:03 AM | Last Updated on Sun, Aug 4 2024 11:03 AM

Multiple Vulnerabilities in iPhones iPads Other Apple Products

కేంద్ర భద్రతా సలహాదారు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ఐఫోన్‌లు, ఐప్యాడ్‌లు మొదలైన ఇతర యాపిల్ ఉత్పత్తులలో భద్రతా సమస్యలు ఉన్నట్లు వెల్లడించింది. వీటిని నేరగాళ్లు యాక్సెస్ చేసే అవకాశం ఉందని, ఇది స్పూఫింగ్‌కు దారితీయవచ్చు, సమాచారం లీక్ అయ్యే అవకాశం కూడా ఉందని కేంద్రం హెచ్చరించింది.

17.6, 16.7.9కి ముందున్న ఐఓఎస్, ఐపాడ్ఓఎస్ వెర్షన్‌లు.. 14.6కి ముందు ఉన్న మ్యాక్ఓఎస్ సోనోమా వెర్షన్‌లు, 13.6.8కి ముందు మ్యాక్ఓఎస్ వెంచురా వెర్షన్‌లు, 13.6.8కి ముందు మ్యాక్ఓఎస్ మోంటెరేరీ వెర్షన్‌లు, 12.7కి ముందు వెర్షన్‌లు, 12.7కి ముందు వెర్షన్‌ వంటి యాపిల్ ఉత్పత్తులు ఈ ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వెల్లడించింది.

విచారణ జరిపే వరకు తమ ఉత్పత్తులలోని భద్రతా సమస్యలను నిర్ధారించని యాపిల్ సంస్థ.. గత వారం లేటెస్ట్ సెక్యూరిటీ అప్డేట్స్ విడుదల చేసింది. ఈ సాఫ్ట్‌వేర్ లేటెస్ట్ వెర్షన్‌లు కూడా వారి పోర్టల్‌లో జాబితా చేశారు. వీటిని యాపిల్ ఉత్పత్తులలో కూడా అప్డేట్ చేసుకోవాలి CERT-In వినియోగదారులను కోరింది.

ఐఫోన్‌లు, ఐప్యాడ్‌లు, మ్యాక్‌బుక్స్, విజన్‌ప్రో హెడ్‌సెట్‌లకు ప్రభుత్వం ఇదే విధమైన హై రిస్క్ వార్ణింగ్ జారీ చేసింది. వివిధ యాపిల్ ఉత్పత్తులలో "రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్"కు సంబంధించి సమస్యను ఇందులో హైలెట్ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement