ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లో కీలక నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్ తన కొత్త విండోస్, సర్ఫేస్ చీఫ్‌గా భారత సంతతికి చెందిన పవన్ దావులూరిని నియమించింది.
ది వెర్జ్ నివేదిక ప్రకారం.. దావులూరి, ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి. మైక్రోసాఫ్ట్‌లో 23 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల మైక్రోసాఫ్ట్ డీప్‌మైండ్ డిపార్ట్‌మెంట్ మాజీ సహ వ్యవస్థాపకుడు ముస్తఫా సులేమాన్‌ను ఏఐ బ్రాంచ్ హెడ్‌గా నియమించగా.. తాజాగా పవన్‌కు కీలక బాధ్యతలను మైక్రోసాఫ్ట్ అప్పగించింది.
అయితే, విండోస్, సర్ఫేస్ విభాగాలకు వేర్వేరుగా అధిపతులు ఉండగా.. రెండింటి బాధ్యతలను పవన్‌కే కట్టబెట్టింది. ఇక పవన్ నియామకమంతో అమెరికా దిగ్గం టెక్ కంపెనీల్లో అత్యున్నత పదవులు చేపట్టిన భారతీయ వ్యక్తుల జాబితాలో పవన్‌కు సైతం చోటు దక్కింది.
ప్రస్తుతం, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ నాయకత్వం వహిస్తుండగా.. మైక్రోసాఫ్ట్ స్వయంగా సత్య నాదెళ్ల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్నారు. కాగ్నిజెంట్‌కి రవి కుమార్ , ఐబీఎంకు అరవింద్ కృష్ణ, పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌కు నికేశ్ అరోరా, యూట్యూబ్ నీల్ మోహన్ అడోబ్‌కి శాంతను నారాయణ్‌లు సీఈఓలుగా రాణిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment