మనలో చాలా మంది ఎక్కువగా మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టంను వాడుతుంటాం. గత ఏడాది విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంను మైక్రోసాఫ్ట్ విడుదల చేసింది. విండోస్ 10ను వాడే యూజర్లు ఉచితంగా విండోస్ 11కు ఆప్ గ్రేడ్ కావచ్చునని మైక్రోసాఫ్ట్ తెలిపింది. కాగా విండోస్ 11 ప్రో ఆపరేటింగ్ సిస్టం కోసం మైక్రోసాఫ్ట్ చిన్న మెలిక పెట్టింది.
కచ్చితంగా కావాల్సిందే..!
మైక్రోసాఫ్ట్ విండోస్ 11 ప్రోకి ప్రారంభ సెటప్ సమయంలో ఇంటర్నెట్ కనెక్షన్, మైక్రోసాఫ్ట్ అకౌంట్ అవసరం అని కంపెనీ ప్రకటించింది. విండోస్ 11 హోమ్ ఎడిషన్ మాదిరిగానే, విండోస్ 11 ప్రొ ఎడిషన్‌ను మొదటి సారి వినియోగించే సమయంలో మాత్రమే ఇంటర్నెట్ కనెక్టివిటీ అవసరం. ప్రస్తుతం, విండోస్ 11 ప్రొ వినియోగదారులు సెటప్ సమయంలో ఇంటర్నెట్ నుంచి కంప్యూటర్ ని డిస్‌కనెక్ట్ చేయడంతో తాత్కాలికంగా లోకల్ అకౌంట్ క్రియేట్ చేసి మైక్రోసాఫ్ట్ అకౌంట్ క్రియేట్ చేయకుండానే ప్రారంభించవచ్చును.
మీ వ్యక్తిగత సమాచారంతో పాటు, పూర్తిగా లెవల్‌లో విండోస్ 11 ప్రొను వినియోగించాలంటే మాత్రం మైక్రోసాఫ్ట్ అకౌంట్ తప్పనిసరి. అయితే ఇప్పటికే విండోస్ 10లో మైక్రోసాఫ్ట్ అకౌంట్ వాడుతున్నవారు నేరుగా మైక్రోస్టాఫ్ 11 ప్రొ ఎడిషన్‌లోకి లాగిన్ అవవచ్చు. అంతేకాకుండా వారు ఇప్పటికే ఆ అకౌంట్‌లో నిలువు చేసుకున్న డాటాను ఈ వెర్షన్‌లో వినియోగించుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే మైక్రోసాఫ్ట్ రాబోయే కొన్ని నెలల్లో విండోస్ 11 ప్రోని విడుదల చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment