Windows 11
-
విండోస్ యూజర్లకు అలెర్ట్..! అవి కచ్చితంగా కావాల్సిందే..
మనలో చాలా మంది ఎక్కువగా మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టంను వాడుతుంటాం. గత ఏడాది విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంను మైక్రోసాఫ్ట్ విడుదల చేసింది. విండోస్ 10ను వాడే యూజర్లు ఉచితంగా విండోస్ 11కు ఆప్ గ్రేడ్ కావచ్చునని మైక్రోసాఫ్ట్ తెలిపింది. కాగా విండోస్ 11 ప్రో ఆపరేటింగ్ సిస్టం కోసం మైక్రోసాఫ్ట్ చిన్న మెలిక పెట్టింది. కచ్చితంగా కావాల్సిందే..! మైక్రోసాఫ్ట్ విండోస్ 11 ప్రోకి ప్రారంభ సెటప్ సమయంలో ఇంటర్నెట్ కనెక్షన్, మైక్రోసాఫ్ట్ అకౌంట్ అవసరం అని కంపెనీ ప్రకటించింది. విండోస్ 11 హోమ్ ఎడిషన్ మాదిరిగానే, విండోస్ 11 ప్రొ ఎడిషన్‌ను మొదటి సారి వినియోగించే సమయంలో మాత్రమే ఇంటర్నెట్ కనెక్టివిటీ అవసరం. ప్రస్తుతం, విండోస్ 11 ప్రొ వినియోగదారులు సెటప్ సమయంలో ఇంటర్నెట్ నుంచి కంప్యూటర్ ని డిస్కనెక్ట్ చేయడంతో తాత్కాలికంగా లోకల్ అకౌంట్ క్రియేట్ చేసి మైక్రోసాఫ్ట్ అకౌంట్ క్రియేట్ చేయకుండానే ప్రారంభించవచ్చును. మీ వ్యక్తిగత సమాచారంతో పాటు, పూర్తిగా లెవల్లో విండోస్ 11 ప్రొను వినియోగించాలంటే మాత్రం మైక్రోసాఫ్ట్ అకౌంట్ తప్పనిసరి. అయితే ఇప్పటికే విండోస్ 10లో మైక్రోసాఫ్ట్ అకౌంట్ వాడుతున్నవారు నేరుగా మైక్రోస్టాఫ్ 11 ప్రొ ఎడిషన్‌లోకి లాగిన్ అవవచ్చు. అంతేకాకుండా వారు ఇప్పటికే ఆ అకౌంట్లో నిలువు చేసుకున్న డాటాను ఈ వెర్షన్లో వినియోగించుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే మైక్రోసాఫ్ట్ రాబోయే కొన్ని నెలల్లో విండోస్ 11 ప్రోని విడుదల చేయనుంది. -
ప్రపంచ వ్యాప్తంగా విండోస్ 11 యూజర్లు ఎంతో తెలుసా ?
స్మార్ట్ఫోన్లు జన జీవితంలోకి ఎంతగా చొచ్చుకువచ్చినా.. ఆకాశమే హద్దుగా గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ దూసుకుపోతున్నా.. చాపకింద నీరులా మాక్‌పాడ్ ప్రపంచాన్ని చుట్టేస్తున్నా... ఇప్పటికీ కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లకు విండోస్ సాఫ్ట్వేర్లే ప్రధాన అండ. విండోస్ 8 ఓస్ నుంచి మైక్రోసాఫ్ట్ ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది,. ఐప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా అందరి నమ్మకం ఇంకా మైక్రోసాఫ్ట్ - విండోస్ మీదనే ఉంది. తాజాగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల చెప్పిన వివరాలే అందుకు తార్కాణం. విండోస్ యూజర్లు ప్రపంచ వ్యాప్తంగా 140 కోట్ల మంది విండోస్ 10, విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉపయోగిస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యానాదెళ్ల వెల్లడించారు. ఇందులో ఫస్ట్, థర్డ్ పార్టీవి కూడా ఉన్నాయని వెల్లడించారు. విండోస్ 10తో పోల్చితే విండోస్ 11 వేగం మూడింతలు ఎక్కువ అని తెలిపారు. వీటిని మినహాయిస్తే విండోస్ 7, విండోస్ 8లపై కూడా ఇదే సంఖ్యలో యూజర్ల ఉంటారని అంచనా. దీంతో ఇప్పటికీ ప్రపంచంలో అత్యంత ఎక్కువగా ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌గా విండోస్ నిలిచింది. టీమ్‌దే ఆధిపత్యం ఇక కోవిడ్ సంక్షోభం తర్వాత వర్చువల్ మీటింగ్స్ సర్వసాధారణం అయ్యాయి. అనేక రకాల యాప్‌లు జనం నోళ్లలో నానుతున్నాయి. అయితే బిజినెస్ వరల్డ్ మాత్రం వర్చువల్ మీటింగ్స్‌కి ఎక్కువగా మైక్రోసాఫ్ట్‌కి చెందని టీమ్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారు. సత్య నాదెళ్ల తెలిపిన వివరాల ప్రకారం ఫార్చున్ 500 కంపెనీల్లో 90 శాతం టీమ్‌పైనే ఆధారపడుతున్నాయి. చదవండి:భవిష్యత్తులో ఇవే కీలకమన్న సత్య నాదెళ్ల -
Windows 11: వచ్చిందోచ్.. మీ కంప్యూటర్ సపోర్ట్ చేస్తుందా?
మైక్రోసాఫ్ట్ వినియోగదారులకు శుభవార్త ! మైక్రోసాఫ్ట్ సంస్థ సరికొత్త అప్డేట్ విండోస్ 11ని విడుదల చేసింది. ఉచితంగానే ఈ సరికొత్త వెర్షన్‌ని మైక్రోసాఫ్ట్ సంస్థ ఇండియాలోని వినియోగదారులకు మైక్రోసాప్ట్ అందుబాటులోకి తెచ్చింది. అనువుగా ఉందా ? ప్రస్తుతం విండోస్ 10 వెర్షన్‌పై పని చేస్తున్న ల్యాప్‌టాప్, కంప్యూటర్లే విండోస్ 11 వెర్షన్‌పై పని చేయడానికి అనువుగా ఉన్నాయి. అయితే ఇందులో కూడా అన్ని విండోస్ 11కి కాంపాటిబుల్ కావు. పీసీ హెల్త్ చెకప్ వంటి యాప్‌ల ద్వారా మన దగ్గరున్న ల్యాపీ లేదా పీసీ విండోస్ 11 వెర్షన్‌కి అనువుగా ఉందా లేదా అనే విషయం తెలుసుకోవచ్చు. ఇలా పొందండి కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. సెక్యూరిటీ అండ్ అప్డేట్ ఆప్షన్ని ఎంచుకోవాలి. అక్కడున్న విండోస్ అప్డేట్లో అప్డేట్పై క్లిక్ చేయాలి. సిస్టమ్ అప్డేట్కి అనువుగా ఉంటే అక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేస్తే.. సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి ముఖ్యమైన ఫీచర్లు మైక్రోసాఫ్ట్ చెబుతున్నదాని ప్రకారం యూజర్ ఇంటర్ఫేస్లో చాలా మార్పులు జరిగాయి. అదే విధంగా పెర్ఫామెన్స్ కూడా మెరుగ్గా ఉంటుంది. టాస్క్‌బార్, స్టార్ట్ బటన్లలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి.విండోస్ 8 నుంచి వస్తోన్న లైవ్ టైటిల్స్ ఆప్షన్ని తొలగించారు. యూఐలో క్విక్ యాక్షన్స్కి చోటు కల్పించారు. మైక్రోసాఫ్ట్ స్టోర్ యాప్, డైరెక్ట్ స్టోరేజీ, ఆటో హెచ్డీఆర్ తదితర ఫీచర్లు కూడా ఉన్నాయి. కొత్తవన్నీ 11 పైనే ఇప్పటికే ఆసూస్, హెచ్‌పీ, లెనోవాల నుంచి త్వరలో మార్కెట్లోకి రాబోతున్న ల్యాప్‌టాప్, పర్సనల్ కంప్యూటర్లకు ఇప్పటికే విండోస్ 11ని అందించినట్టు మైక్రోసాఫ్ట్ తెలిపింది. అతి త్వరలోనే ఏసర్, డెల్‌లు కూడా ఈ జాబితాలో చేరుతాయని ఆ సంస్థ ప్రకటించింది. చదవండి: కోట్లమంది చిరాకు.. డిలీట్ ఫేస్బుక్ ట్రెండ్! గ్యాప్‌లో కుమ్మేసిన ట్విటర్, టెలిగ్రామ్ -
విండోస్ 11.. సరికొత్త స్టార్ మెనూలపై ఓ లుక్కేయండి
StartIsBack Start Menu: విండోస్ వెర్షన్ కొత్త అప్డేట్ కోసం యూజర్లు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అక్టోబరు 5 నుంచి విండోస్-11ను యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకురానున్నట్లు మైక్రోసాఫ్ట్ కంపెనీ ఇదివరకే ప్రకటించింది కూడా. ఆండ్రాయిడ్ యాప్స్ సపోర్ట్ అందించడంతో పాటు విండోస్ 11లో స్టార్ట్ మెనూను ఎడమవైపు నుంచి మధ్యలోకి తీసుకొస్తున్నట్లు అనౌన్స్ చేసింది. దీంతో మరికొన్ని కంపెనీలు కూడా ఈ కొత్తతరహాలోనే స్టార్ మెనూలను రిలీజ్ చేస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం స్టార్డాక్ కంపెనీ ‘స్టార్ట్11’ అనే కొత్త స్టార్ట్ మెనూని రూపొందించినట్లు వెల్లడించింది. తాజాగా ‘స్టార్ట్ ఈజ్ బ్యాక్’ కూడా అల్టర్నేట్ స్టార్ట్ మెనూని రూపొందించినట్లు వెల్లడించింది. దీంతో వీటిల్లోని ఫీచర్స్ గురించి నెటిజన్లలో చర్చ మొదలైంది. స్టార్ట్ ఈజ్ బ్యాక్ స్టార్ట్ మెనూని విండోస్ 11 యూజర్స్ ఎవరైనా ప్రయత్నించొచ్చు. ఇందులో కూడా విండోస్ స్టార్ట్ మెనూలో మాదిరే అన్ని రకాలా ఫీచర్స్ ఉంటాయి. అచ్చం విండోస్ 7లోని స్టార్ట్ మెనూలానే పనిచేస్తుంది. అలానే యూజర్స్ తమకి నచ్చినట్లుగా ఈ మెనూలో మార్పులు చేసుకోవచ్చు. స్టార్డాక్ స్టార్ట్ మెనూ కండిషన్ అప్లై విండోస్ 11లో మాదిరిగా స్టార్ట్ ఈజ్ బ్యాక్ మెనూ బార్‌ను స్క్రీన్ మధ్యలో పెట్టుకోవచ్చు. ఇది కస్టమ్ టెక్చర్స్, ట్రాన్స్పరెన్సీ సెట్టింగ్స్, బ్లర్ ఎఫెక్ట్స్‌ను సపోర్ట్ చేస్తుంది. విండోస్ 11లోని స్టార్ట్ మెనూ, టాస్క్బార్లతో పోలిస్తే స్టార్ట్ ఈజ్ బ్యాక్ స్టార్ట్ మెనూ సిస్టం తక్కువ రీసోర్సులను ఉపయోగించుకుంటుంది. ప్రస్తుతం ఈ స్టార్ట్ మెనూ బీటా వెర్షన్లో అందుబాటులో ఉంది. నవంబరు వరకు దీన్ని యూజర్స్ ఎవరైనా ఉచితంగా ప్రయత్నించొచ్చు. తర్వాత ఈ మెనూను ఉపయోగించుకోవాలంటే మాత్రం లైసెన్స్ కొనుగోలు చేయాల్సిందే. స్టార్ట్ ఈజ్ బ్యాక్ స్టార్ట్ మెనూ స్టార్ట్ ఈజ్ బ్యాక్ స్టార్ట్ మెనూ అక్టోబరు 5 తర్వాత విండోస్ 11 ఉపయోగించబోయే యూజర్స్‌కి మాత్రమే!. కొసమెరుపు ఏంటంటే.. విండోస్ 11, ఆ తర్వాత వస్తున్న మెనూ మార్పుపై చాలామంది పెదవి విరుస్తున్నారు. చాలా ఎబ్బెట్టుగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. నెగెటివ్ ఫీడ్‌బ్యాక్‌లతో రివ్యూలను(గెస్ట్ ఫీచర్) నింపేస్తున్నారు. చదవండి: ఇంటర్నెట్ లేకున్నా.. ఏటీఎం కార్డు వాడండిలా -
విండోస్ 11పై మరో అప్ డేట్, క్రాక్ వెర్షన్లో ట్రై చేస్తున్నారా?
విండోస్ 11పై మరో అప్ డేట్‌తో మైక్రోస్టాఫ్ట్ ముందుకు వచ్చింది. థర్డ్ పార్టీ టూల్స్ ద్వారా ఇన్ స్టాల్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న యూజర్లను హెచ్చరించింది. ఎవరైతే చీట్ చేసి విండోస్‌ను అప్ డేట్ చేస్తారో వారి సిస్టమ్ లలో విండోస్ పనిచేయదని, బ్లాక్ చేస్తామని తెలిపింది. మైక్రోసాఫ్ట్ జులై 25, 2015లో విండోస్ 10ను అప్డేట్ చేసింది. దాదాపూ 6ఏళ్ల తరువాత విండోస్11 ను అందుబాటులోకి తెస్తున్నట్లు ఈ ఏడాది జూన్ నెలలో అధికారికంగా ప్రకటించింది. విండోస్ 11ను ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో డేట్ చెప్పకపోయినప్పటికి టెక్ నిపుణులు మాత్రం ఈ ఏడాది చివరిలో వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ విండోస్ -11 ఇన్స్టాల్ చేసుకోవాలంటే కావాల్సిన రిక్వైర్ మెంట్‌ను అనౌన్స్ చేసింది.1జీహెచ్‌జెడ్ ప్రాసెసర్ ,64బిట్ ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్, ట్రస్టెడ్ ఫ్లాట్‌ఫామ్ మోడల్ వెర్షన్ (టీపీఎం) 2.0, పనితీరు బాగుండేందుకు డైరెక్ట్ ఎక్స్12, డబ్ల్యూడీడీఎం 2.0 డ్రవైర్ కావాలని చెప్పింది. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ సీనియర్ ప్రోగ్రాం మేనేజర్ అరియా కార్లే మాట్లాడుతూ.. విండోస్ 11 ఇన్స్టాల్ అవ్వాలంటే ఈ ఫీచర్స్ ఉండాలని, లేదంటే విండోస్ 11ఇన్స్టాల్ అవ్వదని చెప్పారు. థర్ట్ పార్టీ ద్వారా ఇన్ స్టాల్ పనితీరు ఆగిపోతుందని స్పష్టం చేశారు. -
Windows 11: ప్రత్యేకతలు, ఆకర్షించే అంశాలు ఏమిటి?
మైక్రోసాఫ్ట్ సంస్థ కొద్ది రోజుల క్రితం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న విండోస్ 11 ఓఎస్ ను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. గత విండోస్ వెర్షన్లతో పోలిస్తే ఇందులో అనేక కీలక మార్పులు చేసినట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ‘ఇలా ఉంటుందట’ ‘అలా ఉంటుందట’ అనే ఊహాగానాలను షట్‌డౌన్ చేస్తూ మైక్రోసాఫ్ట్ వారి విండోస్ 11 హాయ్ చెప్పి పరిచయం చేసుకుంది. ఇది నెక్స్ట్ జెనరేషన్ ఆపరేషన్ సిస్టం(ఓయస్)గా వారు చెబుతున్నారు. ఇందులో ఉన్న ప్రత్యేకతలు, ఆకర్షించే అంశాలు ఏమిటి అనే దాని గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం. ఆండ్రాయిడ్ యాప్స్‌ను విండోస్‌కు తీసుకువస్తుంది మైక్రోసాఫ్ట్. అమెజాన్ యాప్ స్టోర్ నుంచి ఆండ్రాయిడ్ యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎడోబ్ క్రియేటివ్ క్లౌడ్, డిస్నీ ప్లస్, జూమ్, విజువల్ స్టూడియో.. మొదలైనవి యాడ్ అయ్యాయి. ఆటో హెచ్డీఆర్ (హై డైనమిక్ రేంజ్), డైరెక్ట్ స్టోరేజీ, డీఎక్స్12 అల్టిమెట్ ప్యాకేజీతో మోర్ బ్రైటర్, మోర్ కలర్ఫుల్గా గేమర్స్‌ను అలరించే మార్పులు చేశారు. విండోస్ 11 గేమింగ్‌లో డైరెక్ట్ ఎక్స్12 అల్టిమెట్(డీఎక్స్12) కీలక పాత్ర పోషించబోతుంది. రే ట్రేసింగ్ 1.1, వేరియబుల్ రేట్ షేడింగ్, శాంప్లర్ ఫీడ్‌బ్యాక్...మొదలైన ఫీచర్లు స్టన్నింగ్ లుకింగ్ దృశ్యాలను క్రియేట్ చేయడానికి డెవలపర్స్‌కు ఉపయోగపడతాయి. మల్టీటాస్కింగ్ కోసం స్నాప్ లేఅవుట్స్, స్నాప్ గ్రూప్స్, డెస్క్‌టాప్‌లు ఉంటాయి. ప్రత్యేక డెస్క్టాప్ను క్రియేట్ చేసుకోవచ్చు. ఉదా: డెస్క్‌టాప్ ఫర్ వర్క్, గేమింగ్, స్కూల్...మొదలైనవి. ఫోల్డర్, యాప్స్‌ను నచ్చిన విధంగా అమర్చుకోవచ్చు. న్యూస్, వెదర్, క్యాలెండర్, టు-డూ-లీస్ట్, తాజా ఫోటోలు.. మొదలైన వాటితో విడ్జెట్స్ కొత్త సొబగుతో అలరించనున్నాయి. అన్నిటినీ ఒకే సమయంలో ఫుల్‌స్క్రీన్‌లో చూసుకోవచ్చు. విడ్జెట్స్‌ను రీఅరెంజ్,రీసైజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. స్టార్ట్బటన్ను రీవాంప్ చేశారు. ఫ్రెష్‌లుక్‌తో వస్తున్న విండోస్ 11లో మాస్టర్ కంట్రోల్ ప్యానల్‌గా చెప్పే స్టార్ట్మెనునూ ఎడమ నుంచి సెంటర్‌కు మార్చారు. ‘నాకు నచ్చలేదు. లెఫ్ట్ ఒరియెంటెడ్ లేఔటే బాగుంది’ అని మీరనుకుంటే మార్చుకోవచ్చు. ఇక ‘యాప్ ఐకాన్స్’ రౌండెడ్ కార్నర్లో కనిపిస్తాయి. కొత్త ఫీచర్ స్నాప్ గ్రూప్స్ (కలెక్షన్ ఆఫ్ యాప్స్)తో యూజర్లు సులభంగా యాక్సెస్ కావచ్చు. ‘టీమ్స్’ అనేది మరో అప్డెట్. దీంతో టీమ్ మీటింగ్స్‌లో సులభంగా పాల్గొనవచ్చు. టాస్క్బార్తోనే మ్యూట్, అన్‌మ్యూట్ చేయవచ్చు. సదుపాయాల సంగతి సరే, విండోస్-11కు సంబంధించి కంప్యూటర్ అనుకూలత గురించి రకరకాల సందేహాలు ఉన్నాయి. మన కంప్యూటర్ ఎంత అనుకూలంగా ఉంది? అనేది సులభంగా తెలుసుకోవడానికి మైక్రోసాఫ్ట్ ‘పీసి హెల్త్ చెక్ అప్' అనే యాప్ ఉపకరిస్తుంది.