
విండోస్ స్మార్ట్‌వాచ్ ఇలా ఉంటుందా?!
‘విండోస్’ ను వేరబుల్ గాడ్జెట్స్‌కు కూడా అందుబాటులో ఉంచుతామని మైక్రోసాఫ్ట్ ప్రకటించిన నేపథ్యంలో ‘మైక్రోసాఫ్ట్ స్మార్ట్‌వాచ్’ కచ్చితంగా వస్తుందని టెక్ పండితులు అంచనా వేస్తున్నారు.
‘విండోస్’ ను వేరబుల్ గాడ్జెట్స్‌కు కూడా అందుబాటులో ఉంచుతామని మైక్రోసాఫ్ట్ ప్రకటించిన నేపథ్యంలో ‘మైక్రోసాఫ్ట్ స్మార్ట్‌వాచ్’ కచ్చితంగా వస్తుందని టెక్ పండితులు అంచనా వేస్తున్నారు. మైక్రోసాప్ట్ సొంతంగా స్మార్ట్‌వాచ్‌ను తయారు చేయకపోయినా... విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఆధారపడి పనిచేసే స్మార్ట్‌వాచ్ అందుబాటులోకి రావడం మాత్రం ఖాయమని అంచనా వేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఈ విండోస్ స్మార్ట్‌వాచ్ ఎలా ఉంటుంది? ఎలాంటి ఫీచర్లు ఉండబోతున్నాయి.. అనే విషయం గురించి ఆన్‌లైన్‌లో గాసిప్స్ మొదలయ్యాయి. ప్రస్తుతం ప్రపంచం స్మార్ట్‌వాచ్‌ల కోసం ఎదురుచూస్తున్న పరిణామాల మధ్య విండోస్ స్మార్ట్‌వాచ్ కాన్సెప్ట్ ఒకటి సచిత్రరూపంలో ఆసక్తికరంగా మారింది. నెటిజన్లను అమితంగా ఆకట్టుకొంటున్న విండోస్‌స్మార్ట్‌వాచ్ కాన్సెప్ట్ ఇదే...
వాచ్‌ఫేస్: అన్నివాచ్‌లలాగానే టైమ్, తేదీ చూసుకోవడానికి అనుగుణంగా ఉంటుంది.
బ్యాక్‌గ్రౌండ్: సెల్‌ఫోన్‌లో వాల్‌పేపర్ మార్చుకొన్నట్టుగానే ఈ స్మార్ట్‌వాచ్‌లో కూడా బ్యాక్‌గ్రౌండ్‌మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఆజ్ఞలు పాటిస్తుంది: ఈ స్మార్ట్‌వాచ్ పిలిస్తే పలుకుతుంది. ఒక ‘హాట్‌వర్డ్’ ను సెట్ చేసుకొంటే అది వినిపించినప్పుడల్లా స్పందిస్తుంది. మీ ఆజ్ఞలను పాటిస్తుంది.
స్పర్శతెర: స్పర్శకు కూడా స్పందిస్తుంది. స్వైపింగ్ ద్వారా తెరలను మార్చుకోవచ్చు.
నోటిఫికేషన్‌లు పంపిస్తుంది: కీలకమైన విషయం ఏమిటంటే.. ఇది స్మార్ట్‌ఫోన్‌కు రిమోట్‌లా ఉంటుంది. మొబైల్‌తో కనెక్ట్ అయ్యి ఉంటుంది. దానికి వచ్చే మెసేజ్‌ల గురించి అప్‌డేట్స్ ఇస్తుంది. జేబులోంచి ఫోన్ తీయకుండానే చేతికి కట్టిన ఈ స్మార్ట్‌వాచ్ ద్వారా ఫోన్‌ను ఆపరేట్ చేయవచ్చు.
మెసేజ్‌లు చదువుకోవచ్చు: ఈ స్మార్ట్‌ఫోన్ తెరపై ఫోన్‌కు వచ్చిన టెక్ట్స్ మెసేజ్‌లు డిస్‌ప్లే అవుతాయి.
టెక్ట్స్‌ను స్పీచ్‌గా మారుస్తుంది: మెసేజ్‌ను చదివి వినిపిస్తుంది.
వాతావరణ వివరాలు, న్యావిగేషన్, మ్యూజిక్ ప్లేయర్‌లా ఉపయోగపడుతుంది.