ఒకే క్లిక్‌తో వీడియోల వర్షం... | Youtube Videos to dump with single click | Sakshi
Sakshi News home page

ఒకే క్లిక్‌తో వీడియోల వర్షం...

Published Sat, Sep 28 2013 12:00 AM | Last Updated on Fri, Sep 1 2017 11:06 PM

ఒకే క్లిక్‌తో వీడియోల వర్షం...

ఒకే క్లిక్‌తో వీడియోల వర్షం...

యూట్యూబ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరంలేదు. అలాగే యూట్యూబ్ డౌన్‌లోడర్స్ గురించి కూడా. రియల్‌ప్లేయర్ డౌన్‌లోడర్, యూట్యూబ్ డౌన్‌లోడర్, ఇంటర్నెట్ డౌన్‌లోడ్ మేనేజర్ వంటి సాఫ్ట్‌వేర్లతో నెటిజన్లు యూట్యూబ్ నుంచి వీడియోలు డౌన్‌లోడ్ చేసుకుంటుంటారు. ఈ విషయంలో బాగా ఆరితేరిన నెటిజన్లు.. ఏ డౌన్‌లోడర్ అయితే బెటర్ అనే విషయం గురించి రివ్యూలు కూడా రాసేస్తుంటారు.

యూట్యూబ్ డౌన్‌లోడర్ అయితే లింక్ కాపీ పేస్ట్ చేయాల్సి ఉంటుందని, రియల్ ప్లేయర్ డౌన్‌లోడర్ వాడుతున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయని, అదే ఇంటర్నెట్ డౌన్‌లోడర్ మేనేజర్ అయితే తిరుగేలేదని చెబుతుంటారు. అయితే.. ఇవన్నీ యూట్యూబ్ నుంచి ఒక్కో వీడియోను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఉపయోగపడేందుకు ఉద్దేశించినవి మాత్రమే. వీటి ద్వారా మనకు అవసరమైన వీడియో మీద క్లిక్ చే సి.. లేదా దాని లింక్‌ను పేస్టు చేసుకుని డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

వీటినుపయోగించి ఒకసారి ఒక్క వీడియో మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే... ఒకేసారి ఎక్కువ వీడియోలు డౌన్‌లోడ్ చేసుకోవాలంటే? యూట్యూబ్ కు సంబంధించి ఒక ఛానల్‌లో ఉండే వీడియోలన్నీ ఒకేసారి డౌన్‌లోడ్ చేయాలంటే? ఒక్కో వీడియోను క్లిక్ చేసి ఒక్కొక్కటిగా డౌన్‌లోడ్ చేసుకునే శ్రమను తప్పించి.. అన్నీ ఒకే క్లిక్‌తో వీడియోలను సిస్టమ్‌లోకి డంప్ చేసుకోవాలంటే... దీనికి డౌన్‌లోడర్ సాఫ్ట్‌వేర్‌ల రూపంలో కొన్ని ఆప్షన్లున్నాయి. అవేవంటే...

 
 4కే వీడియో డౌన్‌లోడర్...


 ఒక ఛానల్‌లో ఆటోమేటిక్ ప్లే లిస్ట్‌గా జోడించిన వీడియోలన్నింటినీ ఒకేసారి డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ డౌన్‌లోడ్ మేనేజర్ చాలా ఉత్తమమైనది. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా వీడియో డౌన్‌లోడింగ్ చాలా సులభతరం అవుతుంది. ఈ సాఫ్ట్‌వేర్ విండోస్, మ్యాక్, లైనక్స్.. అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ మీదా పనిచేస్తుంది. ఇందులో రెండు వెర్షన్‌లున్నాయి. ఫ్రీవెర్షన్, పెయిడ్ వెర్షన్. ఫ్రీవెర్షన్ విషయంలో ఒకేసారి 25 వీడియోల వరకే పరిమితి ఉంటుంది. అదే పెయిడ్ వెర్షన్ విషయంలో ఎటువంటి పరిమితులుండవు. పెయిడ్ వెర్షన్ లెసైన్స్ కీ ధర దాదాపు పది డాలర్లు. వ్యక్తిగత అవసరాల కోసం అయితే.. ఉచిత వెర్షన్ చాలు. ఈ డౌన్‌లోడ్ మేనేజర్‌ను ఉపయోగించడం కూడా చాలా సులువే. డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్న ఛానల్ యూఆర్‌ఎల్‌ను తెచ్చి4కే మేనేజర్‌లో పేస్ట్ చేస్తే చాలు మొత్తం వీడియోలు పీసీ డౌన్‌లోడ్ ఫోల్డర్‌లోకి వస్తాయి.
 
 ఫ్రీ యూట్యూబ్ డౌన్‌లోడ్..


 ఇది విండోస్ ఓఎస్ కోసం ప్రత్యేకంగా రూపొందినది. ఇది కూడా 4 కే డౌన్‌లోడ్ మేనేజర్‌లాంటిదే. యూఆర్‌ఎల్‌ను కాపీ పేస్ట్ చేయడం.. మంచి క్వాలిటీతో ఉన్న వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవడం. ఛానల్‌లోని అన్ని వీడియోలూ కాకుండా.. అవసరమైన వీడియోలను మాత్రమే క్లిక్ చేసుకుని కూడా డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్లేలిస్ట్ కౌంట్ ద్వారా కొన్ని వీడియోలను స్కిప్‌చేసి.. అనవసరమనుకున్న వాటిని తొలగించుకోవడం ఈ డౌన్‌లోడ్ మేనేజర్‌లోని ప్రత్యేక సదుపాయం.
 
 బీవై ట్యూబ్‌డీ, ఫ్లాష్‌గాట్..


 ఈరెండు డౌన్‌లోడ్ మేనేజర్‌లూ మొజిల్లా ఫైర్‌ఫాక్స్ యాడ్ ఆన్ సర్వీస్‌లు. వీటిని ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌కు యాడ్ చేయడం ద్వారా యూట్యూబ్ ఛానల్స్ నుంచి ఒకేసారి ఎక్కువ వీడియోలు డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
 
 బీవై ట్యూబ్ డీ..


 దీని పూర్తిపేరు బల్క్ యూట్యూబ్ డౌన్‌లోడర్. పేరుకు తగ్గట్టే దీనిద్వారా ఒకేసారి ఎక్కువ సంఖ్యలో వీడియోలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీన్ని పోలినదే ఫ్లాష్‌గాట్.. మొజిల్లా ద్వారా యూట్యూబ్ చానల్‌ను ఓపెన్ చేసుకుని.. ఈ ఎక్స్‌టెన్షన్ మీద క్లిక్ చేసి.. వీడియో డౌన్‌లోడింగ్ మొదలుపెట్టవచ్చు.
 
 - జీవన్‌రెడ్డి.బి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement