సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని ఇంటర్నెట్ వినియోగదారులు యూట్యూబ్, ఫేస్‌బుక్‌లను ఎక్కువగా ఏఏ అంశాల కోసం వాడుతున్నారో వెల్లడయింది. మ్యూజిక్ కోసం యూట్యూబ్‌ను, వార్తల కోసమైతే ఫేస్‌బుక్‌పైన ఆధారపడుతున్నారట. విడూలీ మీడియా టెక్ అనే వీడియో ఇంటలిజెన్స్ సంస్థ దీనిపై సర్వే జరిపింది. ఆ వివరాలను సంస్థ సీఈవో సుబ్రత్ కర్ మంగళవారం వెల్లడించారు. దాదాపు 3 బిలియన్ల మంది నెట్ వీక్షకులు సంగీతం కోసం యూట్యూబ్‌ను వాడుతుండగా తర్వాతి స్థానంలో దాదాపు 2.4బిలియన్ల మంది వినోద కార్యక్రమాల కోసం ఆశ్రయిస్తున్నారు.
మూడో స్థానంలో చిన్నారుల కార్యక్రమాలకు దాదాపు 1.3 బిలియన్ వ్యూస్ ఉన్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా వార్తాంశాల కోసం 1.58 బిలియన్లు, వినోదం కోసం 1.06బిలియన్ వ్యూస్ ఉన్నాయని ఆయన తెలిపారు. ఫేస్‌బుక్‌లో వార్తాంశాల వీడియోల తర్వాత వినోదాంశాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. సంగీతం, వినోదం, వార్తల వీడియోలను చూసే వారి సంఖ్య ఒక్కసారిగా దాదాపు 40శాతం పెరిగిపోయిందని, టయర్-2, 3 స్థాయి పట్టణాల్లో ఈ ధోరణి ఎక్కువగా ఉందని చెప్పారు.
దేశంలో ఇంటర్నెట్ వినియోగదారులు 400 మిలియన్ల మంది ఉండగా అందులో యూట్యూబ్ చూసేవారి సంఖ్య అందులో ప్రధానంగా ఉంటోంది. సుమారు 241 బిలియన్ల వినియోగదారులతో ఫేస్‌బుక్ దేశంలోనే అతిపెద్ద సామాజిక మాధ్యమంగా మారిందని వెల్లడయింది. దేశంలోని 18-65 ఏళ్ల వారి 641 మిలియన్ల మంది నెట్ వినియోగదారుల అభిరుచులను విడూలీ సంస్థ విశ్లేషించి ఈ వివరాలను నమోదు చేసింది.
దీని ప్రకారం యూట్యూబ్ ఛానెళ్లలో టాప్-10లో ఉన్నవి... టీ సిరీస్, సెట్ ఇండియా, జీటీవీ, చుచుటీవీ, వేవ్ మ్యూజిక్, సబ్ టీవీ, జీ మ్యూజిక్, సీవీస్ రైమ్స్, స్పీడ్ రికార్డ్స్, ఈరోస్ నౌ ఉన్నాయి. అలాగే టాప్-10లో ఉన్న ఫేస్‌బుక్ వార్త ఛానెళ్లలో ఏబీపీ న్యూస్, దైనిక్ భాస్కర్, ఆజ్‌తక్, విజయ్ టెలివిజన్, ఏబీపీ మఝా, ఏబీపీ లైవ్, హెబ్బార్స్ కిచెన్, ది అమిత్ భదానా, ది టైమ్స్ ఆఫ్ ఇండియా, ఆష్కీన్-1 ఉన్నాయి.
yout
Indian internet users
Comments
Please login to add a commentAdd a comment