శాన్ ఫ్రాన్సిస్కో : ఇంటర్నెట్ వినియోగదారులకు కేబుల్ టెలివిజన్ సర్వీసులు అందించేందుకు యూట్యూబ్ సన్సాహాలు చేస్తోంది. . సబ్ స్ర్కిప్షన్ మొత్తంతో ఈ సర్వీసులు అందించనున్నట్టు సమాచారం. ఈ సర్వీసులను అందించేందుకు యూట్యూబ్ అన్ని మార్గాలను అన్వేషిస్తుందని బ్లూమ్ బర్గ్ రిపోర్టు పేర్కొంది. వచ్చే ఏడాది లోపల ఈ సర్వీసులను ఇంటర్నెట్ వినియోగదారుల ముందుకు తీసుకొస్తుందని ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఒక అధికారి తెలిపారని రిపోర్టు నివేదించింది. ఇప్పటికే ఈ ప్రణాళిక గురించి టాప్ మీడియా కంపెనీలు వియోకామ్, ఎన్ బీసీ యూనివర్సల్, ట్వంటీ-ఫస్ట్ సెంచరీ ఫాక్స్ లతో యూట్యూబ్ ఎగ్జిక్యూటివ్ లు మంతనాలు జరిపారని తెలుస్తోంది. కానీ కంటెంట్ పై ఎలాంటి హక్కులు యూట్యూబ్ పొందలేదని బ్లూమ్ బర్గ్ చెప్పింది. అయితే బ్లూమ్ బర్గ్ నివేదించిన రిపోర్టుపై స్పందించడానికి యూట్యూబ్ తిరస్కరించింది.
అల్ఫాబెట్ కు చెందిన గూగుల్ లో యూట్యూబ్ ఒక విభాగం. ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటూ, ఆదాయాలను ఎక్కువగా ఆర్జించడంలో యూట్యూబ్ స్టార్ గా ఉంది. యూట్యూబ్ గతేడాది నుంచి రెడ్ సర్వీసులను ఇంటర్ నెట్ వినియోగదారులకు అందించడం ప్రారంభించింది. నెలకు 10 డాలర్ల సబ్ స్క్రిప్షన్ తో ఉచిత యాడ్ వీడియోలను యూఎస్ లో యూట్యూబ్ అందిస్తోంది.
కేబుల్ టీవీ సేవల్లోకి యూట్యూబ్
Published Thu, May 5 2016 11:26 AM | Last Updated on Sun, Sep 3 2017 11:28 PM
Advertisement
Advertisement