సాక్షి, హైదరాబాద్: ఇంటికి తలుపులు ఎంత అవసరమో కిటికీలూ అంతే. అయితే ఈ మధ్యకాలంలో చెక్కతోనో, స్టీల్‌తోనో తయారైన కిటికీలు కాకుండా విండో బ్‌లైండ్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. కార్పొరేట్ ఆఫీసులకు మాత్రమే పరిమితమైన ఈ కల్చర్ ఇప్పుడు నివాసాలకూ పాకింది. ఎన్నో వెరైటీలు, డిజైన్లు అందుబాటు ధరల్లోనే దొరుకుతుండటంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు కూడా వీటి వైపే ఆసక్తి చూపిస్తున్నారు.
►విండో బ్‌లైండ్స్ ఏర్పాటుతో గదికి అందం రావటమే కాదు సూర్యకాంతి, అతినీలలోహిత కిరణాలూ ఇంట్లోకి రావు. వీటికి పరదా అవసరం ఉండదు. లివింగ్ రూమ్‌తో పాటు బెడ్ రూములో అందమైన ప్రకృతి చిత్రాలు ఉన్న బ్‌లైండ్స్‌ను ఏర్పాటు చేసుకుంటే ఉదయం లేచి వాటిని చూస్తే మనస్సు ప్రశాతంగా ఉంటుంది. అంతేకాదు బయటి వారికి లోపల ఏముందో కనిపించదు. మనం బయట ఏం జరుగుతుందో చూడాలనుకుంటే బ్‌లైండ్స్‌కు ఉన్న తాడు లాగితే సరిపోతుంది. ఇందులో వర్టికల్, రోలర్, చిక్, ఉడెన్, ఫొటో, జీబ్రా వంటి ఎన్నో రకాలుంటాయి. ఠి చీర్ బ్‌లైండ్స్ సహజసిద్దమైన బొంగు కర్రలతో చేస్తారు. ఇవి తలుపు మాదిరిగా కనిపిస్తుంటాయి. ధర చ.అ.కు రూ.200–350 వరకు ఉంటుంది. ఠి వర్టికల్ బ్‌లైండ్స్ అన్ని సైజుల కిటికీలకు అనువుగా ఉంటుంది. ఓ పక్క ఉండే తాడు లాగితే రెండు పక్కలా డబుల్ డోర్ మాదిరిగా తెరుచుకుంటుంది. ధర చ.అ.కు రూ.90–150 వరకు ఉంటుంది. ఠి గాలి, వెలుతురు ధారాలంగా రావాలనుకునేవారు జీబ్రా బ్‌లైండ్స్ కరెక్ట్. చూడ్డానికి చిప్స్ మాదిరిగా ఉండే ఈ బ్‌లైండ్స్ పైనుంచి కిందికి తెరుచుకుంటాయి. ధర చ.అ.కు రూ.180–280 ఉంటుంది. ఠి రోలర్ బ్‌లైండ్స్ అచ్చం పరదా మాదిరిగా ఉంటుంది. తాడు లాగుతుంటే ముడుచుకుంటూ పైకి లేస్తుంది. ధర చ.అ.కు రూ.130–300 వరకు ఉంటుంది.
తీగ లాగితే ‘కిటికీ’
Published Sat, Mar 9 2019 12:00 AM | Last Updated on Sat, Mar 9 2019 12:00 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment