varieties
-
నఖ శిఖం : క్యాన్సర్ మహమ్మారి
ఓ పరిమితి లేకుండా అనారోగ్యకరంగా, అసాధారణంగా పెరుగుతూ, తొలుత ఒక కణంతోనే క్యాన్సర్ తన ప్రస్థానాన్ని ప్రారంభిస్తుంది. ఎప్పటికప్పుడు రెట్టింపు అయ్యే ఈ ప్రక్రియలో 20వ సారి అది ఒక మిలియన్ కణాలుగా వృద్ధి చెందుతుంది. మిలియన్ కణాల సముదాయంగా పెరిగినప్పటికీ ఆ టైమ్‌లోనూ దాన్ని కనుక్కోవడం కష్టసాధ్యం. అదే 30వసారి రెట్టింపు అయ్యే సమయంలో అందులో బిలియన్ కణాలకు పైగా ఉంటాయి. అప్పుడు మాత్రమే అది ఓ గడ్డ (లంప్)లా రూపొంది గుర్తించడానికి వీలయ్యేలా ఉంటుంది. అంటే... చేత్తో గడ్డను తడిమి గుర్తించడానికి వీలయ్యే సమయానికి ఆ క్యాన్సర్ గడ్డలో బిలియన్ కణాలు... వందకోట్ల కణాలకు పైనే ఉంటాయి. ఇక 40వ సారి రెట్టింపయ్యాక అందులో ఒక ట్రిలియన్ కణాలుంటాయి. అప్పటికీ చికిత్స లభించక 42–43వ సారి రెట్టింపయినప్పుడు రోగి ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్తాడు. అన్ని రెట్టింపులు కాకముందే... అంటే కేవలం 20వ సారి రెట్టింపయ్యే లోపు కనుక్కోగలిగితే...? క్యాన్సర్‌ను నయం చేసే అవకాశాలు చాలా ఎక్కువే. మరి ఆ దశలోనే క్యాన్సర్‌ను కనుక్కోవడం ఎలాగో తెలిపేదే ఈ కథనం. క్యాన్సర్ లక్షణాలు అవయవానికీ అవయవానికీ మారి΄ోతున్నప్పటికీ క్యాన్సర్ బాధితులందరికీలోనూ కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. ఆరోగ్యవంతుల్లోనూ అప్పుడప్పుడూ ఆ లక్షణాలు కనిపించేవే కావడంతో వాటిని గుర్తించడం కష్టం.క్యాన్సర్‌ను గుర్తించేందుకు తోడ్పడే కొన్ని సాధారణ అంశాలు... ఆకలి తగ్గడం కారణం తెలియకుండా / ఏ కారణమూ లేకుండానే బరువు తగ్గడం ఎడతెరిపి లేకుండా దగ్గు లింఫ్ గ్లాండ్స్ (చంకల్లో, గజ్జల్లో, గొంతుదగ్గర) వాపు అవయవాలనుంచి రక్తస్రావం... (ఈ లక్షణం కొన్నిసార్లు కొన్ని అవయవాలలో మాత్రమే) ఒక్క చివరిది మినహా ఇక్కడ పేర్కొన్నవన్నీ చాలామందిలో ఏదో ఓ దశలో క్యాన్సర్ లేకపోయినప్పటికీ కనిపించే మామూలు లక్షణాలు. అందుకే ఈ లక్షణాలన్నీ తప్పనిసరిగా క్యాన్సర్‌వే కానక్కర్లేదు. కాబట్టి వీటిలో ఏదో ఒకటి కనిపించిన మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ లక్షణాలకు అవవసరమైన తొలి చికిత్సలు తీసుకున్న తర్వాత కూడా, అవే పునరావృతమవుతుంటే ఒకసారి డాక్టర్ చేత పరీక్ష చేయించుకుని అది క్యాన్సర్ కాదని నిర్ధారణ చేసుకొన్న తర్వాతే నిశ్చింతగా ఉండాలి. తల నుంచి కాలి వేలి వరకు ఆయా అవయవాల్లో క్యాన్సర్ ఉంటే కనిపించేందుకు / తొలి దశలోనే గుర్తించేందుకు ఉపయోగపడే ప్రాథమిక లక్షణాలివి... బ్రెయిన్ క్యాన్సర్ : తలనొప్పి వస్తుంటుంది. అకస్మాత్తుగా మతిమరపు రావడం, కొన్ని సార్లు సామాజిక సభ్యత మరచి ప్రవర్తించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మనిషి మెదడులో మాట్లాడటానికీ, దృష్టికీ, వినికిడికీ, కాళ్లూ, చేతుల కదలికల నియంత్రణకు... ఇలా వేర్వేరు ప్రతిచర్యలకు వేర్వేరు కేంద్రాలు (సెంటర్స్) ఉంటాయి. క్యాన్సర్ అభివృద్ధి చెందిన సెంటర్ దేనికి సంబంధించినదైతే ఆ అవయవం చచ్చుబడటం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. ఇవీ ఆయా అవయవాలకు సంబంధించి తొలిదశలో క్యాన్సర్‌కు లక్షణాలు. తల భాగంలో: ఈ క్యాన్సర్స్ నోటిలో, దడవ మీద, నాలుక మీద లేదా చిగుర్లు (జింజివా) మీదా ఇలా తలభాగంలో ఎక్కడైనా రావచ్చు. ఆయా భాగాల్లో ఎరుపు, తెలుపు రంగుల ΄్యాచెస్ ఉన్నా, దీర్ఘకాలంగా మానని పుండు (సాధారణంగా నొప్పి లేని పుండు, కొన్ని సందర్భాల్లో నొప్పి ఉండవచ్చు కూడా) ఉంటే క్యాన్సర్ అయ్యేందుకు అవకాశం ఎక్కువ. అదే నాలుక మీద అయితే నాలుక కదలికలు తగ్గవచ్చు. నాలుక వెనక భాగంలో అయితే స్వరంలో మార్పు వస్తుంది. మరింత వెనకనయితే మింగడంలో ఇబ్బంది కలుగుతుంది. ఇక స్వరపేటిక ్ర΄ాంతంలో అయితే స్వరంలో మార్పు వస్తుంది. మెడ దగ్గర లింఫ్ గ్రంధుల వాపు కనిపిస్తుంది. గొంతు భాగంలో : దీన్ని ఓరో ఫ్యారింజియల్ భాగంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ గొంతులో ఏదో ఇరుక్కుని ఉన్న ఫీలింగ్ ఉంటుంది. అన్నవాహిక మొదటి భాగంలో అయితే మింగడం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఊపిరితిత్తులు : పొగతాగేవాళ్లలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. ఇది ఉన్నవాళ్లలో దగ్గు, కళ్లె (స్ఫుటమ్)లో రక్తం పడటం వంటì లక్షణాలు కనిపిస్తాయి. ఎక్స్–రే, సీటీ స్కాన్ పరీక్ష ద్వారా దీన్ని తెలుసుకోవచ్చు.రొమ్ము క్యాన్సర్ : మహిళల్లో ఎక్కువగా కనిపించే ఈ రకం క్యాన్సర్‌లో... రొమ్ములో ఓ గడ్డ చేతికి తగలడం, రొమ్ము పరిమాణంలో మార్పు, రొమ్ము మీది చర్మం ముడతలు పడటం, రొమ్ము చివర (నిపుల్) నుంచి రక్తంతో కలిసిన స్రావం లాంటివి రొమ్ము క్యాన్సర్ లక్షణాలు.కడుపు (స్టమక్)లో: కడుపు (స్టమక్)లో మంట పుడుతున్నట్లుగా నొప్పి. పొట్టలో మంట. కొన్నిసార్లు పొట్టలో రక్తస్రావం అయినప్పుడు ఆ రక్తం వల్ల విసర్జన సమయంలో మలం నల్లగా కనిపిస్తుంది. రక్తస్రావం వల్ల రక్తహీనత (ఎనీమియా) కూడా కనిపించవచ్చు. దాంతో పాటు కొన్ని సార్లు కొద్దిగా తినగానే కడుపునిండిపోయిన ఫీలింగ్ ఉంటుంది.పేగుల్లో... మలమూత్ర విసర్జన అలవాట్లలో మార్పులు కనిపిస్తాయి.రెక్టమ్ క్యాన్సర్‌లో: మలద్వారం (రెక్టమ్) క్యాన్సర్ విషయంలోనూ మల విసర్జన తర్వాత కూడా ఇంకా లోపల మలం మిగిలే ఉందన్న ఫీలింగ్. దీనికో కారణం ఉంది. విసర్జించాల్సిన పదార్థం మామూలుగా మలద్వారం వద్దకు చేరగానే అక్కడి నాడులు స్పందించి అక్కడ మలం పేరుకుని ఉన్నట్లుగా మెదడుకు సమాచారమిస్తాయి. అప్పుడా పదార్థాల్ని విసర్జించాల్సిందిగా మెదడు ఆదేశాలిస్తుంది. కానీ విసర్జన తర్వాత కూడా అక్కడ క్యాన్సర్ ఓ గడ్డలా ఉండటంతో ఏదో మిగిలే ఉందన్న సమాచారాన్ని నాడులు మెదడుకు మళ్లీ మళ్లీ చేరవేస్తుంటాయి. దాంతో ఇంకా అక్కడేదో ఉందన్న ఫీలింగ్ కలుగుతుంటుంది. ఈ లక్షణంతో పాటు కొందరిలో బంక విరేచనాలు, రక్తంతో పాటు బంక పడటం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.సర్విక్స్ క్యాన్సర్: దక్షిణ భారతదేశంలోని తీర్ర ప్రాంతాల్లోని మహిళల్లో అత్యధికంగా కనిపించే క్యాన్సర్ ఇది. రుతుస్రావం సమయంలో గాక మధ్యలోనూ రక్తం రావడం, రుతుస్రావం ఆగిపోయిన (మెనోపాజ్) మహిళల్లో అసాధారణంగా రక్తస్రావం కావడం, మహిళల్లో సెక్స్ తర్వాత రక్తస్రావం ( పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్), ఎరుపు, తెలుపు డిశ్చార్జ్ వంటివి దీని లక్షణాలు.ఒవేరియన్ క్యాన్సర్ : దాదాపు 50, 60 ఏళ్ల మహిళల్లో పొట్ట కింది భాగంలో నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. సాధారణంగా ఈ భాగానికి క్యాన్సర్ వస్తే ఒక్కోసారి ఏ లక్షణాలూ కనిపించకుండానే ప్రమాదకరంగా పరిణమించవచ్చు.టెస్టిస్ క్యాన్సర్ : పురుషుల్లో వచ్చే ఈ క్యాన్సర్‌లో వృషణాల సైజ్ పెరగడం, దాన్ని హైడ్రోసిల్‌గా పొరబాటు పడటం వల్ల పెద్దగా సీరియస్‌గా తీసుకోకపోవడంతో అది సైజ్‌లో పెరిగి ప్రమాదకరంగా పరిణమించే అవకాశాలెక్కువ.ప్రొస్టేట్ క్యాన్సర్ : సాధారణంగా 50, 60 ఏళ్లు దాటిన పురుషుల్లో తరచూ కనిపించే క్యాన్సర్ ఇది. దాదాపు లక్షణాలేవీ పెద్దగా కనిపించకుండా వచ్చే ఈ క్యాన్సర్‌లో రాత్రివేళల్లో మూత్రవిసర్జనకు వెళ్లాల్సిన అవసరం ఎక్కువగా ఉండవచ్చు. పీఎస్ఏ అనే పరీక్ష ద్వారా దీన్ని తేలిగ్గా గుర్తించవచ్చు.కిడ్నీ అండ్ బ్లాడర్ క్యాన్సర్ : మూత్ర విసర్జన సమయంలో రక్తం కనిపించడం, మాటిమాటికీ మూత్రం రావడం మూత్రపిండాలు, మూత్రాశయ క్యాన్సర్లలో కనిపించే సాధారణ లక్షణం.బ్లడ్ క్యాన్సర్స్ : రక్తం కూడా ద్రవరూపంలో ఉండే కణజాలమే కాబట్టి... బ్లడ్ క్యాన్సర్ కూడా రావచ్చు. రక్తహీనత, చర్మం మీద పొడలా (పర్ప్యూరిక్ పాచెస్) రావడం, చిగుళ్లలోంచి రక్తం రావడం, బరువు తగ్గడం, జ్వరం రావడం వంటివి బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు. లింఫ్ గ్లాండ్స్ అన్నవి బాహుమూలాల్లో, దవడల కింది భాగంలో మెడకు ఇరువైపులా, గజ్జల్లో ఉండే ఈ గ్రంథులకూ క్యాన్సర్ రావచ్చు. దాన్ని లింఫోమా అంటారు.స్కిన్ క్యాన్సర్: చర్మం క్యాన్సర్‌ను ఏ, బీ, సీ, డీ అనే నాలుగు లక్షణాలతో తేలిగ్గా గుర్తించవచ్చు. శరీరంపై ఏదైనా మచ్చ తాలూకు ఏ– అంటే... ఎసిమెట్రీ (అంటే మచ్చ సౌష్టవం మొదటికంటే మార్పు వచ్చినా, బీ– అంటే... బార్డర్ అంటే అంచులు మారడం, మందంగా మారడం జరిగినా, సీ– అంటే కలర్ రంగు మారినా, డీ అంటే డయామీటర్... అంటే వ్యాసం (సైజు) పెరిగినా దాన్ని చర్మం క్యాన్సర్ లక్షణాలుగా భావించవచ్చు.కొంతమందిలో తమ తాత తండ్రుల్లో, పిన్ని వంటి దగ్గరి సంబంధీకుల్లో క్యాన్సర్ ఉన్నప్పుడూ, అలాగే స్మోకింగ్, ఆల్కహాల్ వంటి అనారోగ్యకరమైన జీవనశైలి ఉన్నవారూ...ఇక జన్యుపరంగా అంటే... జీరోడెర్మా, న్యూరోఫైబ్రమాటోసిస్ వంటి వ్యాధులున్నవారిలో క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి హైరిస్క్ వ్యక్తులంతా మిగతావారికంటే మరింత అప్రమత్తంగా ఉంటూ, మరింత ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి. గమనించాల్సిన అంశం ఏమిటంటే... ఇక్కడ ప్రస్తావించిన లక్షణాలన్నీ తప్పనిసరిగా క్యాన్సర్‌కు సంబంధించినవే కావచ్చేమోనని ఆందోళన వద్దు. తొలిదశలో తేలిగ్గా గుర్తిస్తే క్యాన్సర్ తగ్గుతుందన్న విషయం గుర్తుంచుకుని, ఏవైనా లక్షణాలు కనిపిస్తే ఆందోళన చెందకుండా ఒకసారి డాక్టర్ల సూచన మేరకు పరీక్షలు చేయించుకోవాలి. అది క్యాన్సర్ కాదని నిర్ధారణ చేసుకున్న తర్వాత నిశ్చింతగా ఉండాలి. -
'మనం' చాక్లెట్ తిన్నామంటే.. మైమరిచిపోవాలంతే!
సాక్షి, సిటీబ్యూరో: మీకు చాక్లెట్లంటే ఇష్టమా..? అసలు చాక్లెట్లు చూస్తేనే నోరూరుతుందా..? డిఫరెంట్ చాక్లెట్లను టేస్ట్ చేయడం మీకు అలవాటా? అయితే మీరు తప్పకుండా నగరంలోని ‘మనం’ చాక్లెట్ కార్ఖానాను ఒక్కసారైనా సందర్శించాల్సిందే. ఎందుకంటే ఇక్కడ దాదాపు 60కి పైగా వెరైటీ చాక్లెట్లు నోరూరిస్తుంటాయి. ఒకే దగ్గర పెరిగిన కోకో చెట్ల నుంచి తయారైన చాక్లెట్లను వీరు విక్రయిస్తున్నారు.టైమ్ మ్యాగజైన్ జాబితాలో చోటు..ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్ ‘ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల’ జాబితాను ప్రచురించింది. ఆయా రంగాలతో పాటు ప్రపంచంలో ప్రత్యేకంగా నిలిచే 100 అద్భుతమైన ప్రదేశాలు, కంపెనీలను ఇందులో చేర్చింది. హోటళ్లు, క్రూజ్‌లు, రెస్టారెంట్స్, పర్యాటక స్థలాలు, మ్యూజియాలు, పార్క్‌లను గుర్తించింది. పలు మార్గాల్లో స్వదేశీ పదార్థాలకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు మనం చాక్లెట్ కార్ఖానా పనిచేస్తోందని కొనియాడింది.అంతర్జాతీయ గుర్తింపు..భారత్‌లో పండించిన కోకోతో చాక్లెట్ల తయారీకి ‘మనం చాక్లెట్’ ప్రసిద్ధి పొందింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న ఈ సంస్థ ఉత్పత్తులకు ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. ఇక్కడ తయారైన చాక్లెట్లకు అంతర్జాతీయంగా చాలా డిమాండ్ ఉంది. 2023 ఆగస్టులో మనం చాక్లెట్ కార్ఖానాను ముప్పల చైతన్య స్థాపించారు. ఆల్మండ్ హౌజ్ మిఠాయి దుకాణం వీరి కుటుంబానికి చెందినది కావడం విశేషం.ఎన్నో రకాల వెరైటీలు.. డార్క్ చాక్లెట్లు, చాక్లెట్ ట్యాబ్లెట్స్, స్నాక్స్, ఒకే ప్రదేశంలో పండించినవి, అంతర్జాతీయంగా పండించిన కోకో నుంచి తయారైనవి, పాల మిశ్రమంతో చేసినవి ఇలా ఎన్నో రకాల వెరైటీ చాక్లెట్లు ఈ కార్ఖానాలో లభిస్తుంటాయి. పండ్లు, ప్లేన్, వీగన్ వంటి చాక్లెట్ల రకాలు కూడా తయారు చేస్తారు. ఇక్కడ తయారైన పది రకాల చాక్లెట్లను అవార్డులు కూడా వరించాయి.వర్క్‌షాప్స్‌తో పిల్లలకు నేరి్పస్తూ..చాక్లెట్ల తయారీలో మనం చాక్లెట్ కార్ఖానా అప్పుడప్పుడూ వర్క్‌షాప్స్ కూడా నిర్వహిస్తుంటుంది. సొంతంగా క్లస్టర్లు, కేక్ పాప్స్ తయారు చేసే విషయంలో పిల్లలకు శిక్షణ కూడా ఇస్తుంటుంది. కొన్నిసార్లు అసలు చాక్లెట్లు ఎలా తయారు చేస్తారో తెలుసుకునేలా టూర్ కూడా ఏర్పాటు చేస్తుంటారు. చాక్లెట్ కుకీస్, చాక్లెట్ ఇంక్లూజన్ స్లాబ్స్ తయారీలో 5–10 ఏళ్ల పిల్లలకు మెళకువలు నేర్పిస్తుంటారు.ఇవి చదవండి: అంతా స్మార్ట్.. ఆరోగ్యంపై ముందస్తు సమాచారం! -
కమ్మగా నోరూరించే.. వెజ్ నాన్‌వెజ్ వంటకాల తయారీ ఎలాగో తెలుసా!
వెరైటీ వంటకాలు.. కొంచెం కారంగా, కొంచె తీయగా.. అటు వెజిటేరియన్, ఇటు నాన్ వెజిటేరియన్లను మిక్స్ చేస్తూ సరికొత్తగా వంటకాలను తయారుచేయండిలా...యాపిల్ ప్రాన్స్..కావలసినవి..పెద్ద రొయ్యలు – అర కిలో (శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి)మిరియాల పొడి – పావు టీ స్పూన్,కార్న్‌పౌడర్ – అరకప్పుమైదా పిండి – ఒకటిన్నర కప్పులు,గుడ్డు – 1,కొత్తిమీర తురుము – కొద్దిగానీళ్లు – కావాల్సినన్ని,నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా,కెచప్ – పావు కప్పు, ఉప్పు – తగినంత,యాపిల్స్ – 3 (గింజలు తొలగించి.. సగం పేస్ట్‌లా చేసుకుని.. మిగిలిన సగం నచ్చిన షేప్‌లో ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, గ్రీన్ ఆపిల్ లేదా అవకాడో లేదా మామిడికాయనూ తీసుకోవచ్చు గార్నిష్ కోసం!)కారం, మిరియాల పొడి, ధనియాల పొడి – కొద్దికొద్దిగా (అన్నీ బాగా కలుపుకోవాలి)తయారీ..ముందుగా ఒక బౌల్లో కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, కార్న్ పౌడర్, మైదా పిండి, గుడ్డు వేసుకుని హ్యాండ్ బ్లెండర్తో బాగా కలపాలి.కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ.. బ్లెండర్ సాయంతో కాస్త జారుగా కలుపుకుని.. అందులో రొయ్యలువేసి, కలుపుకొని ఆ బౌల్‌కి పైన ఓ కవర్ చుట్టబెట్టి, 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.అనంతరం నూనెలో వాటిని డీప్‌ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో యాపిల్ గుజ్జు, కెచప్ బాగా కలుపుకుని పెట్టుకోవాలి.సర్వ్ చేసుకునే సమయంలో కొన్ని రొయ్యలను ఒక బౌల్లోకి తీసుకుని.. దానిపైన కొద్దిగా యాపిల్–కెచప్‌ల మిశ్రమాన్ని వేసుకుని.. దానిపైన కారం మిశ్రమాన్ని జల్లుకుని.. అవకాడో లేదా మామిడి కాయ ముక్కలతో గార్నిష్ చేసుకుని తింటే భలే రుచిగా ఉంటాయి ఈ రొయ్యలు.అవకాడో–పొటాటో కట్లెట్..కావలసినవి..బంగాళాదుంపలు – 2 మీడియం (మెత్తగా ఉడికించుకోవాలి),అవకాడో – 1 పెద్దది (పండినది)ఓట్స్ – అరకప్పు (పౌడర్లా చేసుకోవాలి)మెంతికూర – అర కప్పు (తురుముకుని పేస్ట్‌లా చేసుకోవాలి),పచ్చిమిర్చి ముక్కలు – 2 లేదా 3 (చిన్నగా తరగాలి),వెల్లుల్లి తురుము – కొద్దిగాలవంగాల పొడి – కొద్దిగానిమ్మరసం – 1–2 టేబుల్ స్పూన్లుఉప్పు – రుచికి, నూనె – సరిపడాతయారీ..ముందుగా ఒక బౌల్ తీసుకుని.. బంగాళదుంప ముక్కలు, అవకాడో ముక్కలు వేసుకుని పప్పుగుత్తితో మెత్తగా చేసుకోవాలి.ఓట్స్ పౌడర్, మెంతికూర పేస్ట్, వెల్లుల్లి తురుము, పచ్చిమిర్చి ముక్కలు, లవంగాల పొడి, ఉప్పు, నిమ్మరసం ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని.. బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని 20 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.అనంతరం పాన్ లేదా కళాయిలో నూనె వేడి చేసుకుని.. ఫ్రిజ్‌లోని మిశ్రమాన్ని తీసుకుని.. చిన్న చిన్న ఉండలుగా తీసుకుంటూ.. కట్లెట్స్లా చేసుకుని దోరగా వేయించుకోవాలి.పచ్చి ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.అవకాడో–పొటాటో కట్లెట్, బీట్రూట్ స్వీట్ పొంగనాలుబీట్రూట్ స్వీట్ పొంగనాలు..కావలసినవి..బీట్రూట్ – 2 కప్పులు,బెల్లం పాకం – ముప్పావు కప్పు (వడకట్టినది),కొబ్బరి కోరు,గోధుమ పిండి,బియ్యప్పిండి – 2 టేబుల్ స్పూన్ల చొప్పున,ఏలకుల పొడి – పావు టీ స్పూన్ బేకింగ్ సోడా – చిటికెడు,నూనె,ఉప్పు – సరిపడాతయారీ..ముందుగా ఒక బౌల్లో బీట్రూట్ గుజ్జు, బియ్యప్పిండి, కొబ్బరి కోరు, గోధుమ పిండి వేసుకుని.. గరిటెతో తిప్పుతూ ఉండాలి. అనంతరం అందులో ఏలకుల పొడి, బేకింగ్ సోడా, ఉప్పు, బెల్లం పాకం వేసుకుని మరోసారి బాగా కలుపుకోవాలి.తర్వాత పొంగనాల పాన్ కు బ్రష్‌తో నూనె రాసి.. అందులో ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేసుకుని.. ఉడికించుకోవాలి.వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి. -
జాతీయ స్థాయి మార్కెట్లోకి మన వంగడాలు
రాష్ట్రంలోని వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన 18 రకాల వంగడాలు దేశవ్యాప్తంగా వినియోగంలోకి రానున్నాయి. ఈ యూనివర్సిటీ ఇప్పటికే రాష్ట్ర మార్కెట్లో విడుదల చేసిన 15 వంగడాలతో పాటు కొత్తగా అభివృద్ధి చేసిన వాము (వర్ష), వస (స్వర్ణస్వర), పసుపు (లామ్ స్వర్ణ) వంగడాలను జాతీయ స్థాయి మార్కెట్లోకి విడుదల చేస్తూ కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ గెజిట్‌లో ప్రచురించింది.దేశవ్యాప్తంగా వినియోగించేందుకు వీలుగా వెంకట్రామన్నగూడెం, గుంటూరు లాం, బాపట్ల, తిరుపతి, కొవ్వూరు, పెద్దాపురం ఉద్యాన పరిశోధన స్థానాల శాస్త్రవేత్తలు ఈ వంగడాలను అభివృద్ధి చేశారు. రెండు రంగు (ద్వివర్ణ)లలో తోటకూర, వంగపండు రంగు చిక్కుడు, ఎర్రటి చింత వంటి వెరైటీలతో పాటు జెమినీ వైరస్‌ను తట్టుకునే క్రాంతి, చైత్ర, తనీ్వ, సిరి వంటి మిరప రకాలు కూడా వీటిలో ఉన్నాయి. కొత్తగా జాతీయ మార్కెట్లోకి వస్తున్న వంగడాలు, వాటి ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి. – సాక్షి, అమరావతిపసుపు (లామ్ స్వర్ణ) : అధిక దిగుబడినిచ్చే దీర్ఘకాలిక రకం (260–270 రోజులు). పసుపు పొడి ముదురు నిమ్మ పసుపు రంగులో ఉంటుంది. అధిక ఎండు కొమ్ముల రికవరి (24%) లో 3–4% కుర్కుమిన్ వద్ద పదార్ధం కల్గి ఉంటుంది. హెక్టారుకు 40–42 టన్నుల పచ్చి పసుపు, 9.8 నుంచి 11.3 టన్నుల ఎండు కొమ్ముల దిగుబడినిస్తుంది. వస (స్వర్ణస్వర) : 8–9 నెలల పంట కాల పరిమితితో అధిక దిగుబడినిచ్చే రకం. దీనిలో బిటా ఆసరోన్– (15.90 మి. గ్రా/ గ్రాము) అధికంగా వుంటుంది. మొక్క మధ్యస్థ పెరుగుదలతో (56.40 సెం.మీ), ఆకులు అధికంగా కలిగి ఉంటుంది. దగ్గర దగ్గరగా నాటుకోవడానికి అనువైన రకం. వస కొమ్ములు మంచి పొడవు (44.88 సెం.మీ), వెడల్పు (6.53 సెం.మీ) సరాసరి బరువు (112.30 గ్రా.) ఉంటాయి. చిత్తడి నేలల్లో సాగుకు అనుకూలం, హెక్టారుకి 28 క్వింటాళ్ళ దిగుబడినిస్తుంది. వాము (వర్ష) : అధిక దిగుబడినిచ్చే, దీర్ఘకాలిక రకం (140–145 రోజులు). నీటి పారుదల, వర్షాధార ప్రాంతాల్లో సాగుకి అనుకూలం, అధిక నూనె శాతం (7–8%)తో పాటు సువాసన కలిగిన ఈ రకం సువాసన పరిశ్రమలకి అనుకూలం. గింజ ఆకర్షణీయమైన గోధుమ రంగుతోమధ్యస్థ పరిమాణంలో ఉండటం వలన మార్కెట్లో గిరాకీ అధికంగా ఉంటుంది. హెక్టారుకి 10–12 క్వింటాళ్ళు దిగుబడినిస్తుంది. మిరప (క్రాంతి) : అధిక దిగుబడినిచ్చే దీర్ఘకాలిక (210–230 రోజులు) రకం. మొక్కలు నిటారుగా పొడవుగా పెరుగుతాయి. కాయలు మధ్యస్థ పొడవుతో పచి్చగా ఉన్నప్పుడు ముదురు ఆకుపచ్చ రంగులో, పండినప్పుడు ఆకర్షణీయమైన ముదురు ఎరుపు రంగులో ఉండి అధిక ఘాటును కలిగి ఉంటాయి. నేరుగా విత్తడానికి (సాలు తోటలు) అనుకూలమైన రకం. ఆకు ముడత (జెమిని వైరస్) తెగులు, బెట్టను సమర్ధంగా తట్టుకోగలదు. వర్షాధార పంటగా హెక్టార్‌కు 48 క్వింటాళ్లు, నీటి పారుదల కింద 65 క్వింటాళ్లు చొప్పున అధిక ఎండు మిరప దిగుబడినిస్తుంది. మిరప (చైత్ర): అధిక దిగుబడినిచ్చే మధ్యకాలిక (180–190 రోజులు) రకం. మొక్కలు గుబురుగా పెరిగి, ఆకులు దట్టంగా ఉండడం వల్ల కాయలు ఎండ వేడిమిని తట్టుకోగలుగుతాయి. కాయలు పచ్చిగా ఉన్నప్పుడు లేత ఆకుపచ్చ రంగులో, పక్వానికి వచి్చనప్పుడు మెరుపుతో కూడిన ఎరుపు రంగులో ఉంటాయి. పచ్చి మిర్చి, ఎండు మిరపగా కూడా ఉపయోగపడుతుంది. నేరుగా విత్తడానికి అనుకూలమైన రకం. ఆకుముడతను పూర్తిగా, బెట్టను కొంతవరకు తట్టుకోగలదు. వర్షాధార పంటగా హెక్టారుకి 46 క్వింటాళ్లు, నీటి పారుదల కింద 65 క్వింటాళ్ళ దిగుబడినిస్తుంది. మిరప (తన్వీ) : అధిక దిగుబడినిచ్చే దీర్ఘకాలిక (210–230 రోజులు) రకం. మొక్కలు మధ్యస్థంగా పెరుగుతాయి. ఆకుపచ్చ రంగులోనున్న కాయలు రంగు తిరిగే దశలో తొలుత కుంకుమ వర్ణంలోకి, ఆ తర్వాత ముదురు ఎరుపు రంగులోకి మారతాయి. కాయలు సన్నగా అధిక ఘాటును కలిగి ఉంటాయి. నిల్వ సమయంలో రంగును త్వరగా కోల్పోవు. ఆకు ముడత, పండు కుళ్ళు తెగుళ్ళను తట్టుకుంటుంది. ఎగుమతికి అనువైన రకం. వర్షాధార పంటగా హెక్టారుకి 48 క్వింటాళ్లు, నీటి పారుదల కింద 65 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. పచ్చి మిరప (సిరి): మొక్కలు నిటారుగా, పొడవుగా పెరుగుతాయి. అధిక పచ్చి మిరప దిగుబడినిచ్చే మధ్యకాలిక (180–200 రోజులు) రకం. కాయలు పసుపుతో కూడిన లేత ఆకు పచ్చ రంగు నిగారింపుతో మధ్యస్థ పొడవు, మధ్యస్థ ఘాటును కలిగివుంటాయి. నాటిన రెండున్నర నెలల నుండి పచ్చి మిర్చి కోతకు సిద్ధమవుతుంది. హెక్టారుకి 310 నుంచి 320 క్వింటాళ్ల పచ్చి మిరప దిగుబడినిస్తుంది. చిక్కుడు (శ్రేష్ఠ) : మొక్కలు మధ్యస్థంగా పెరిగి, సంవత్సరం పొడవునా సాగుకు అనువైన రకం. నిర్దిష్టమైన కాంతి/చీకటి అవసరం లేకుండా పూతనిచ్చే రకం. కాయలు ఉదా రంగును కలిగి నాటిన 80 – 85 రోజుల్లో కోతకొస్తాయి. హెక్టారుకి 19 టన్నుల దిగుబడి వస్తుంది. కర్ర పెండలం (ఆదిత్య): వరి కోత తరువాత లోతట్టు, మాగాణి భూముల్లో సాగుకు అనువైన స్వల్పకాలిక రకం (7 నెలలు). మొక్కలు నిటారుగా పెరిగి కోత సులభంగా ఉంటుంది. ఖరీఫ్‌లో వర్షాధారంతోపాటు నీటి పారుదల కింద కూడా సాగు చేయొచ్చు. కసావా మెజాయిక్ వైరస్‌ను తట్టుకుంటుంది. హెక్టారుకి 40 టన్నులు దిగుబడినిస్తుంది.పెండలం (శబరి): దుంపలు పొడవుగా పెరిగి పై తోలు ముదురు గోధుమ వర్ణంలో, కండ మీగడ వర్ణంలో ఉంటుంది. దుంపలు మంచి నాణ్యత కలిగి, చిప్స్ తయారీకి పనికొస్తాయి. 25 – 30 శాతం పిండి పదార్ధం ఉంటుంది. ఆకుమచ్చ తెగులును కొంత వరకు తట్టుకుంటుంది. హెక్టారుకి 45 – 50 టన్నుల దిగుబడినిస్తుంది. తోట కూర (వర్ణ) : ఆకులు మధ్య భాగాన ఊదా రంగు కలిగి ద్వివర్ణంలో చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఆంధోసైనిన్ వర్ణ పదార్ధాన్ని (61.55 మి.గ్రా/ 100గ్రా) కలిగి ఉంటాయి. మొక్కలు ఆలస్యంగా పూతకు రావడం వల్ల నాటిన 60 రోజులలో 3 సార్లు కోతకు వస్తుంది. మొక్కలు త్వరగా పెరుగుతాయి. ఏడాది పొడవునా పండించేందుకు వీలైన రకం. హెక్టారుకి 25 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. నిమ్మ (వకుళ): చెట్టు మధ్యస్థంగా ఎదిగి, అధిక సాంద్రత పద్ధతిలో సాగుకు అనువైన రకం. త్వరగా కాపుకు వచి్చ, కాయలు గుత్తులుగా కాస్తుంది. కాయలు సగటున 45 గ్రాముల బరువుతో, 45 శాతం రసం కలిగి తోలు మందంగా మెరుపును కల్గి ఉంటుంది. పచ్చళ్ళకు అనువైన రకం. బాక్టీరియా గజ్జి తెగులును తట్టుకుంటుంది. హెక్టారుకి 39 టన్నుల దిగుబడినిస్తుంది. జీడిమామిడి (బీపీపీ–10): గుత్తి కాపుతో అధిక దిగుబడినిచ్చే రకం. గింజ పెద్దదిగా (8.1 గ్రా) ఉండి, అధిక పప్పు (29.3%), ఎక్స్పోర్ట్ గ్రేడు (డబ్ల్యూ 210) రకం. అధికంగా ద్విలింగ పుష్పాలను (55.21 %) ఇవ్వడమే కాకుండా ద్విలింగ పుష్పదశ ముందుగా ఉంటుంది. సగటున చెట్టుకి 21 కిలోల దిగుబడి వస్తుంది. ఆకు, పూత, గింజలనాశించే పురుగులను తట్టుకుంటుంది.జీడిమామిడి (బీపీపీ–11): త్వరగా కాపునిచ్చే గుత్తికాపు రకం. పూత, కాయ దశలో నీటి ఎద్దడిని తట్టుకొనే రకం. అధిక సాంద్రతలో నాటడానికి అనువైనది. మధ్యస్థ గింజ పరిమాణం (6.8 గ్రా.), ఒత్తైన పుష్ప గుచ్ఛాలతో, అధిక పప్పు దిగుబడి (28.5%)ని ఇవ్వగల ఎక్స్పోరŠట్ట్ గ్రేడ్ (డబ్ల్యూ 240) రకం. చెట్టు సగటు దిగుబడి 17 కిలోలు. ఆకు, పూత, గింజలనాశించే చీడపీడలను తట్టుకుంటుంది. తమలపాకు (స్వర్ణకపూరి): కొమ్మలు, తీగలు ఎక్కువగా ఉండి, అత్యధిక పెరుగుదల సామర్థ్యాన్ని కలిగిన రకం. పెద్దగా, మృదువైన, లేత ఆకుపచ్చ రంగు ఆకులతో, పొడవైన కాడలు కలిగి ఎగుమతికి అనువైన రకం. స్థానిక రకాలకంటే 20 నుంచి 25 శాతం అధిక దిగుబడి ఇస్తుంది. హెక్టారుకు 53,820 పంతాల దిగుబడి సామర్థ్యం కలిగి ఉంటుంది. ఫైటోప్తెరా మొదలు కుళ్ళు తెగులును మధ్యస్తంగా తట్టుకోగలదు. సంకరీకరణలో, సంవత్సరం పొడవునా పుషి్పంచే వంగడం. వాము (లామ్ ఆజవాన్–2): మొక్కలు ఒక మీటరు పొడవుతో అధిక కొమ్మలు, పువ్వులను కలిగి ఉంటాయి. 145 – 175 రోజుల పంటకాలంతో అధిక దిగుబడినిచ్చే దీర్ఘకాలిక రకం. ఖరీఫ్‌కు అనుకూలం. అధిక నూనె శాతం (3–4%), సువాసన ఉంటాయి. వర్షాధార పంటగా హెక్టారుకి 6 నుంచి 13 క్వింటాళ్లు, నీటి పారుదల పంటగా 12 నుంచి 15 క్వింటాళ్లు దిగుబడినిస్తుంది. ఖరీఫ్ సీజన్లో వాతావరణ పరిస్థితులను బట్టి స్థానిక రకాలపై 30 నుంచి 60 శాతం ఎక్కువ దిగుబడులు ఇస్తుంది.చింత (తెట్టు అమలిక) : నాటిన తర్వాత 70–80 ఏళ్ల వరకు కాపునిస్తుంది. 20 ఏళ్ల వయసున్న చెట్టు ఏడాదికి సరాసరి 150 – 220 కిలోల దిగుబడినిస్తుంది. కాయలు 50–56 శాతం గుజ్జుతో పెద్దగా, వెడల్పుగా కొద్దిగా వంకర తిరిగి చివర్లు గుండ్రంగా వుంటాయి. గుజ్జు మందంగా, మెత్తగా, ముదురు గోధుమ రంగులో ఉంటుంది. చింత (అనంత రుధిర): అన్ని ప్రాంతాలకు అనువైన, క్రమం తప్పక అధిక దిగుబడినిచ్చే రకం. గుజ్జు (43.3%) ఆకర్షణీయమైన ఎరుపు రంగులో, ఆంథోసైనిన్ వర్ణ పదార్థం అధికంగా కల్గి ఉంటుంది. ఎరుపు రంగు గుజ్జు కలిగి ఉండటం వలన ఊరగాయలు, క్యాండీ, జామ్, సిరప్ వంటి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి అనువైన రకం. పచ్చి కాయల్లో బీటాకెరోటిన్ (188.23 మైక్రో గ్రాము/100గ్రా) అధికంగా ఉంటుంది. 10 ఏళ్ల వయస్సులో చెట్టుకి 50–60 కిలోలు, 20 ఏళ్ల వయసున్న చెట్లు 150 నుంచి 220 కిలోల దిగుబడినిస్తాయి. రైతుల ఆదాయం పెంచే రకాలు వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన 18 వంగడాలను జాతీయ స్థాయిలో విడుదల చేయడం గర్వంగా ఉంది. జాతీయ స్థాయిలో మన మిరపకున్న ప్రాముఖ్యత దృష్ట్యా మిరపలో జెమిని వైరస్‌ను తట్టుకునే క్రాంతి, చైత్ర, తన్వి రకాలు దేశీయ మార్కెట్లో రైతులకు అందుబాటులోకి రాబోతున్నాయి. చింత, నిమ్మ రకాలు విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ఎంతగానో ఉపయోగకరం. విశిష్ట లక్షణాలు కలిగిన ఈ నూతన వంగడాలు రైతుల ఆదాయం పెంచడంలో కీలకంగా మారనున్నాయి. అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు. – డాక్టర్ తోలేటి జానకీరామ్, వీసీ, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం -
సరికొత్త వంటకాలను కోరుకుంటున్నారా? వీటిని ట్రై చేయండి!
ప్రతీరోజూ తిన్న వంటకాలని మళ్లీ మళ్లీ తినాలంటే.. చాలా మంది ముఖం తిప్పేసుకుంటారు. కొంచెం కారంగానో, తీయగానో కావాలని కోరుకుంటారు. విశ్రాంతి సమయంలో ఏదో ఒకటి నమిలేవరకూ వారికి పొద్దేపోదు. మరి అలాంటి వారి కోసం ఈ వెరైటీ వంటలు సిద్ధంగా ఉన్నాయి. అవేంటో చూద్దాం. పుట్టగొడుగు లాలీపాప్స్.. కావలసినవి: పుట్టగొడుగులు – 15 లేదా 20 (వేడి నీళ్లతో శుభ్రం చేసుకుని పక్కనపెట్టుకోవాలి), మైదాపిండి – 1 కప్పు, ధనియాల పొడి, పసుపు – పావు టేబుల్ స్పూన్, కారం, చాట్ మసాలా, మిరియాల పొడి – అర టేబుల్ స్పూన్ చొప్పున, కార్న్‌ఫ్లేక్ మిక్సర్ – 1 కప్పు (కవర్లో వేసి.. చపాతీ కర్రతో అటు ఇటు నొక్కి పొడిపొడిగా చేసుకోవాలి), బ్రెడ్ పౌడర్, ఓట్స్ పౌడర్ – అర కప్పు చొప్పున, అల్లం పేస్ట్ – 1 టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, నీళ్లు – సరిపడా, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ.. ముందుగా పెద్ద బౌల్ తీసుకుని అందులో మైదాపిండి, ధనియాల పొడి, పసుపు, కారం, చాట్ మసాలా, మిరియాల పొడి, అల్లం పేస్ట్, తగినంత ఉప్పు వేసుకుని.. కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పేస్ట్‌లా చేసుకోవాలి. అనంతరం మరో బౌల్ తీసుకుని కార్న్‌ఫ్లేక్ మిక్సర్, బ్రెడ్ పౌడర్, ఓట్స్ పౌడర్ ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. అనంతరం ప్రతి పుట్టగొడుగుకు పుల్ల గుచ్చి.. ఒక్కోదాన్ని మొదట మైదా మిశ్రమంలో తర్వాత బ్రెడ్ పౌడర్ మిశ్రమంలో ముంచి.. మిశ్రమాన్ని బాగా పట్టించి.. నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీల్మేకర్ – టొమాటో గారెలు.. కావలసినవి: మీల్మేకర్ – 1 కప్పు (పదిహేను నిమిషాల పాటు వేడి నీళ్లలో నానబెట్టి, తురుముకోవాలి), టొమాటో – 3 (మెత్తగా మిక్సీ పట్టుకుని.. జ్యూస్‌లా చేసుకోవాలి), ఉల్లిపాయ తరుగు – పావు కప్పు పచ్చిమిర్చి ముక్కలు – 2 టీ స్పూన్లు, బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, ఓట్స్ పౌడర్ – 1 కప్పు చొప్పున, మినుముల పిండి – 2 కప్పులు (మినుములు నానబెట్టి గ్రైండ్ చేసుకోవాలి), జీలకర్ర – 1 టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా, ఉప్పు – తగినంత, నీళ్లు – సరిపడా తయారీ.. ముందుగా ఒక బౌల్ తీసుకుని.. అందులో మినుముల పిండి, మీల్ మేకర్ తురుము, మొక్కజొన్న పిండి, బియ్యప్పిండి, జీలకర్ర, ఉప్పు, ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి ముక్కలు అన్ని వేసుకుని టొమాటో జ్యూస్ కొద్దికొద్దిగా వేసుకుంటూ గారెల పిండిలా చేసుకోవాలి. అనంతరం కొద్దికొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసుకుని.. గారెల్లా ఒత్తుకుని, కాగుతున్న నూనెలో దోరగా వేయించుకోవాలి. వాటిపై మజ్జిగ ఆవడ వేసుకుని, నానబెట్టి తింటే భలే బాగుంటాయి. మీల్మేకర్ – టొమాటో, గారెలు చెర్రీ హల్వా.. చెర్రీ హల్వా.. కావలసినవి: చెర్రీస్ – రెండున్నర కప్పులు (గింజలు తీసి శుభ్రం చేసుకోవాలి) యాలకుల పొడి – పావు టీ స్పూన్ మొక్కజొన్న పిండి – రెండుంపావు కప్పులు పంచదార – 1 కప్పు, నట్స్ – కావాల్సినన్ని నెయ్యి – అర కప్పు, నీళ్లు – 3 టేబుల్ స్పూన్లు డ్రైఫ్రూట్స్ – అభిరుచిని బట్టి తయారీ.. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని, కళాయిలో కొద్దిగా నెయ్యి వేడి చేసి.. అందులో జీడిపప్పు దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అనంతరం చెర్రీస్ వేసుకుని గరిటెతో తిప్పుతూ మగ్గేవరకు చిన్న మంట మీద ఉడికించాలి. అనంతరం 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, పంచదార వేసుకుని తిప్పుతూ ఉండాలి. పంచదార కరిగిన తర్వాత.. మొక్కజొన్న పిండిలో నీళ్లు పోసుకుని బాగా కలిపి.. ఆ మిశ్రమాన్ని చెర్రీస్ మిశ్రమంలో వేసుకోవాలి. కాసేపటికి మరోసారి కొద్దిగా నెయ్యి వేసుకుని తిప్పాలి. దగ్గరపడుతున్న సమయంలో జీడిపప్పు, మిగిలిన నెయ్యి వేసుకుని బాగా కలిపి చల్లారాక.. మరిన్ని డ్రైఫ్రూట్స్ తురుముతో సర్వ్ చేసుకోవాలి. ఇవి చదవండి: సమ్మర్లో పిల్లలకు ఇలా చేసి పెడితే, ఇష్టంగా తింటారు, బలం కూడా! -
కలబంద మొక్కలు ఇన్ని రకాలు ఉన్నాయా!
అలోవెరా అనేది దాదాపు ప్రతి భారతీయ ఇంటిలో కనిపించే మొక్క.. ఇది అందం నుండి ఆరోగ్యం వరకు అన్ని విధాలుగా ఉపయోగపడే అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. ఈ మొక్కను నరదిష్టి కోసం కూడా వాడతారు. చాలా సులభంగా పెంచుకునే మొక్కిది. మనకు తెలిసినంతవరకు కలబంద పెద్ద కాడలుగా ఉంటుంది. అయితే ఈ కలబందలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 200 రకాలు వరకు ఉన్నాయట. కానీ వాటిలో నాలుగు మాత్రమే ఆరోగ్యానికి, అందానికి ఉపయోగపడతాయట. మిగతా కలబంద మొక్కలను అలంకరణగా ఉపయోగిస్తారట. అయితే వాటిలో మనకు ఉపయోగపడే కలబంద రకాల మొక్కలు ఏంటీ? వాటిలో ఏవి మన చర్మ సంరక్షణలో ఉపయోగపడతాయో సవివరంగా తెలుసుకుందాం. ఎరుపు కలబంద ఇది చూడటానికి చాలా అందంగా ఉంటుంది. సూర్యకాంతిలో ఉంచినప్పుడు, దాని ఎరుపు రంగు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. దీని ఆకులకు చాలా ముళ్ళు ఉంటాయి. కానీ దాని అందం కారణంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో రెడ్ కలబందను నాటాలని కోరుకుంటారు. ఇది ప్రధానంగా దక్షిణాఫ్రికా మొక్క. దీనిని పెంచేందుకు ఎక్కువ నీరు అవసరం లేదు. చిన్న ఆకుల కలబంద లేతరంగు ఆకుల కారణంగా, అవి చాలా అందంగా కనిపిస్తాయి. ముళ్లతో నిండినప్పటికీ, చర్మ సంరక్షణలో దీనిని ఉపయోగిస్తారు. చిన్న లేతరంగు ఆకులతో పాటు, ఇది అందమైన ఎరుపు, పసుపు పువ్వులను కూడా ఉత్పత్తి చేస్తుంది. స్పైరల్ అలోవెరా ఇలాంటి కలబంద మొక్కలు మార్కెట్లో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఇది చాలా అందమైన రకాల్లో ఒకటి. ఇది గుండ్రని ఆకారంలో మరియు ఎరుపు నారింజ రంగు పుష్పాలను కలిగి ఉంటుంది. ఈ మొక్క ఇంటి అలంకరణకు ఉత్తమంగా పరిగణించబడుతుంది. కార్మైన్ అలోవెరా.. ఈ కలబంద కూడా గృహ అలంకరణను మరింత ఇనుమడింప చేస్తుంది. ఇంటి అంకరణలో ఈ కార్మైన్ కలబంద ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది ఒకరకమైన హైబ్రిడ్ మొక్క. అయితే ఇది నీరు లేకుండా కూడా జీవించగలదు. ఈ నాలుగు కలబంద రకాలు ఆరోగ్యానికి, అందానికి బాగా ఉపయోగడతాయి. ఇక మన ఇళ్లలో పెరిగే కలబంద కూడా చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. (చదవండి: వేసవిలో ఈ ఫుడ్స్‌కి దూరంగా ఉంటే మేలు!) -
మ్యాంగో మ్యాన్
ఒకే మామిడి చెట్టుకు 300 కాయలు కాస్తాయి. అయితే ఆ కాయలు ఒక్కోటి ఒక్కో రకం. ఒక కొమ్మకు రసాలైతే ఒక కొమ్మకు తోతాపురి.. ఇలా ప్రపంచంలో ఏ చెట్టూ కాయదు. దీనిని సాధ్యం చేసి ‘మ్యాంగో మేన్ ఆఫ్ ఇండియా’గా పేరు పొందాడు లక్నోకు చెందిన కలీముల్లా ఖాన్. జీవితం మొత్తాన్ని మామిడి సాగుకు అంకితం చేసిన కలీముల్లా మామిడి తోట ఒక దర్శనీయ స్థలం. ‘ప్రపంచంలో మామిడి పండు అంత అందమైన పండు మరొకటి లేదు’ అంటారు కలీముల్లా ఖాన్. ఆయనికిప్పుడు 80 దాటాయి. లక్నో నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండే మలిహామాద్లో ఆయన మామిడి ఉద్యానవనం ఉంది. ‘ఇది ప్రపంచ మామిడి చెట్లకు కాలేజీ లాంటిది. ఎవరైనా మామిడి పండ్ల గురించి ఇక్కడ చదవాల్సిందే’ అంటాడాయన. మలిహాబాద్ ఉత్తరప్రదేశ్‌లో మామిడితోటలకు ప్రసిద్ధి. కలీముల్లా కుటుంబం కూడా మామిడి తోటల పెంపకంలో తాత తండ్రుల కాలం నుంచి ఉంది. ‘నేను సెవెన్త్ ఫెయిల్ అయ్యాను. మా ఊళ్లో పిల్లల్ని ఇళ్ల నుంచి కూడా బయటకు రానీయరు తల్లిదండ్రులు. అలా పెరిగాను. కొన్నాళ్లు ఆ పనీ ఈ పనీ చేసి మామిడి నర్సరీలో పని చేయడం మొదలుపెట్టాను. నాకు 18 ఏళ్ల వయసులో అంటు కట్టి మొదటి మామిడి మొక్కను నాటాను. కాని ఆ రోజు నుంచి భారీ వర్షం. దేవునికి ఇష్టం లేదనుకున్నాను. ఆ మొక్క బతకలేదు. కాని అంటు కట్టే విధానంతో కొత్త కొత్త మామిడి రకాలు సృష్టించాలన్న నా పిచ్చి పోలేదు. 1970లో నా పెళ్లయ్యింది. అప్పుడే ఈ మామిడి తోటలో ప్రయోగాలు మొదలెట్టాను’ అంటాడాయన. ఒకేచెట్టుకు 315 రకాలు ఒకేచెట్టు కొమ్మలకు రకరకాల పండ్ల అంటు కడుతూ చెట్టును విస్తరించడమే కాదు, దాని ప్రతికొమ్మకూ కొత్తరకం కాయలను సృష్టించాడు కలీముల్లా. ‘ఇన్ని రకాల కాయలు ఒకే చెట్టుకు కాసినప్పుడు మనుషులందరూ ఒకేరీతిన ఎందుకు కలిసి ఉండకూడదు’ అని ప్రశ్నిస్తాడాయన. ‘నేను సృష్టించిన ఒకరకం కాలాపహాడ్ పండును జుర్రుకుంటే మూడు రకాల రుచులు వస్తుంది’ అంటాడాయన. కొన్ని రకాల అంటు మామిళ్లకు కలీముల్లా ‘అమితాబ్, ‘సచిన్’, ‘నమో’ అనే పేర్లు పెట్టాడు. కరోనాలో సేవచేసి మరణించిన డాక్టర్లకు నివాళిగా ఒక మామిడిరకాన్ని సృష్టించి ‘డాక్టర్’వెరైటీ అని నామకరణం చేశాడు. కలీముల్లాకు 2008లో పద్మశ్రీ వచ్చింది. ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా నాకు 400 అవార్డులు ఉద్యానవన విభాగంలో వచ్చాయి. చాలా వాటిని మా పిల్లలు వెళ్లి తీసుకొస్తుంటారు అంటాడాయన. ‘నాకు మన దేశం అంటే ప్రేమ. అమెరికా నుంచి చాలామంది వచ్చి నా విధానాలు తెలుసుకుని వెళ్లారు. మన దేశం వాళ్లే నా వల్ల ఎక్కువ ప్రయోజనం పొందడం లేదని అనిపిస్తోంది. నా జ్ఞానాన్ని నా వాళ్లకు పంచాలనే నా తపన అని భావోద్వేగంతో అంటాడు కలీముల్లా. ‘మా తోటకు రండి. మామిడి తినిపోండి’ అని సదా ఆహ్వానిస్తుంటాడాయన. -
కెఫిన్ లేని కాఫీ గింజలు..హాయిగా సిప్ చేయొచ్చు
కాఫీ అంటే ఇష్టపడనివారు ఉండరు. ఐతే ఈ కాఫీలో ఉండే కెఫిన్ మన శరీరంలో అత్యంత దుష్పరిణామాలకు దారితీస్తోంది. అందుకనే రోజుకు రెండు నుంచి మూడు కప్పులకు మించి కాఫీ తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. దీంతో పలు కంపెనీలు కెఫిన్ లేని కాఫీ పొడిని తయారు చేస్తున్నాయి. కానీ వాటి ఖరీదు ఎక్కువ. అందరూ కొనుగోలు చేయలేరు. ఆ సమస్యకు చెక్‌పెట్టి ఆరోగ్యకరమైన కాఫీని ఆస్వాదించేలా కెఫిన్ లేని కాఫీ గింజలను ఉత్పత్తి చేసేందుకు నాంది పలికారు బ్రెజిల్ శాస్త్రవేత్తలు. ఈ మేరకు బ్రెజిలియన్ కాఫీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చెందిన శాస్త్రవేత్తలు చేపట్టిన రెండు దశాబ్దాల ప్రాజెక్టులో చాలా వరకు పురోగతి సాధించారు. ఈ పరిశోధనలు ప్రముఖ కాఫీ పరిశోధనా కేంద్రం ఇన్స్టిట్యూటో అగ్రోనోమికో డీ కాంపినాస(ఐఏఎస్) ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ పరిశోధన ఫలితంగా అధిక దిగుబడినిచ్చే కాఫీ మొక్కలను అభివృద్ధి చేశారు శాస్త్రవేత్తలు. దీంతో బ్రెజిల్ వాణిజ్య పరంగా కాఫీ ప్రపంచ మార్కెట్లో పవర్‌హౌస్‌గా మారుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అనేక ఏళ్లుగా కెఫిన్ కంటెంట్ తక్కువుగా ఉన్న వివిధ కాఫీ మొక్కలను అభివృద్ధి చేయడమే గాక క్షేత్ర స్థాయిలో ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇది గనుక విజయవంతమైతే అతి పెద్ద వినియోగదారులైన యూరప్, యునైటెడ్ స్టేట్స్ వంటి వాటితో బ్రెజిల్‌కి సముచిత వాణజ్య మార్కెట్ ఏర్పడే అవకాశం ఉంటుందని చెప్పారు. అంతేగాక డీకాఫీన్(కెఫిన్ శాతం తగ్గించడం) తయారు చేస్తున్న కంపెనీలు తమ ఖర్చులను తగ్గించేందుకు మొగ్గు చూపతాయని అంటున్నారు. ప్రస్తుతం తాము బ్రెజిల్లో వివిధ ప్రాంతాల్లో ఈ డీకాఫిన్ మొక్కలను పెంచుతున్నామని, అవి గింజలను ఉత్పత్తి చేయడానికి సాధారణంగా రెండు నుంచి మూడేళ్ల పడుతుందని చెబుతున్నారు. అందువల్ల తమ పరిశోధన మరింత విజయవంతం కావడానికి తాము ఇంకాస్త సమయం నిరీక్షించాల్సి ఉందని చెబుతున్నారు. వాస్తవానికి సాధారణ కాఫీలో ఉండే కాఫీ మనల్ని ఉత్సాహంగా ఉంచేలా చేయడమే గాక రోజంతా మేల్కోని ఉండేలా శక్తినిస్తుంది. కానీ ఈ కెఫిన్ కడుపులో యాసిడ్లను పెంచి మంట లేదా గుండెల్లో నొప్పికి దారితీసే ప్రమాదం పొంచి ఉంది. దాన్ని నివారించేందుకే కెఫిన్ తక్కువగా ఉండే కాఫీ మొక్కలను అభివృద్ధి చేసే ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. ఇప్పటికే యూఎస్ వంటి దేశాల్లో 10 శాతం కెఫిన్ ఉన్న కాఫీని తయారు చేస్తున్నాయి కొన్ని కార్పొరేట్ సంస్థలు. ఇది కాస్త ఖర్చుతో కూడుకున్నది. దీన్ని అధిగమించేందుకే శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలు చేస్తున్నారు. కాగా, శాస్త్రవేత్తల బృందం మాత్రం తమ పరిశోధనలు విజయవంతమవుతాయని ధీమగా చెబుతున్నారు. (చదవండి: 127 గంటలు.. డ్యాన్స్!) -
GM Mustard: జనం మేలుకోకపోతే జీఎం పంటల వెల్లువే!
మన దేశంలో ఇప్పటి వరకు ప్రభుత్వ అనుమతి ఉన్న ఏకైక పంట బీటీ పత్తి. ఇప్పుడు ఆహార పంటల్లోకి కూడా జన్యుమార్పిడి సాంకేతికత వచ్చేస్తోంది. జన్యుమార్పిడి ఆవాల సాగుకు కేంద్ర పర్యావరణ శాఖకు చెందిన జెనిటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ (జెఈఏసీ) ఇటీవల అనుమతులు ఇవ్వటంతో చాలా ఏళ్ల తర్వాత జీఎం టెక్నాలజీ మళ్లీ చర్చనీయాంశమైంది. చీడపీడలను తట్టుకునే బీటీ జన్యువుతో పాటు కలుపుమందును తట్టుకునే విధంగా కూడా జన్యుమార్పిడి చేసిన (హెచ్‌టిబిటి) హైబ్రిడ్ ఆవాల రకం డిఎంహెచ్ 11కు జెఈఏసీ పచ్చజెండా ఊపటం, కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లోని ప్రభుత్వ పరిశోధనా సంస్థల ఆవరణల్లో ప్రయోగాత్మకంగా సాగు ప్రారంభం కావటం జరిగిపోయింది. వంట నూనెల ఉత్పత్తిని దేశీయంగా పెంపొందించటం ద్వారా దిగుమతులను తగ్గించటం కోసమే బీటీ ఆవాలకు అనుమతి ఇచ్చినట్లు కేంద్రం చెబుతోంది. జీఎం పంటలకు వ్యతిరేకంగా చాలా ఏళ్ల నుంచి సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులో విచారణ కూడా ప్రారంభమైంది. ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ వ్యాప్తిని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వమే.. రసాయనిక కలుపుమందులను తట్టుకునే జన్యుమార్పిడి ఆహార పంటలకు గేట్లు తెరవటం విమర్శలకు తావిస్తోంది. సేంద్రియ వ్యవసాయంలో రసాయనాలతో పాటు జన్యుమార్పిడి పంటలూ నిషిద్ధమే. దేశవాళీ విత్తన పరిరక్షణ కృషిలో నిమగ్నమైన వందలాది సీడ్ సేవర్స్, సేంద్రియ రైతులతో కూడిన స్వచ్ఛంద సంస్థ ‘భారత్ బీజ్ స్వరాజ్ మంచ్’ హెచ్‌టిబిటి ఆవ పంటపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ పూర్వరంగంలో ‘మంచ్’ కన్వీనర్ జాకబ్ నెల్లితానంతో ‘సాక్షి సాగుబడి’ ప్రతినిధి పంతంగి రాంబాబు ఇటీవల ముచ్చటించారు. ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు.. పురుగును తట్టుకునే జన్యువులతోపాటు, కలుపు మందును తట్టుకునే ఆవాల పంటకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆవాల ఉత్పత్తి పెంచటం కోసమేనని ప్రభుత్వం చెబుతోంది. మీరేమనుకుంటున్నారు? జన్యుమార్పిడి సాంకేతికతను ఆహార పంటల్లో ప్రవేశపెట్టాలన్న పట్టుదలతోనే కేంద్ర ప్రభుత్వం ఇటీవల జన్యుమార్పిడి ఆవ హైబ్రిడ్ పంట డిఎంహెచ్11 సాగుకు పర్యావరణ అనుమతి మంజూరు చేసింది. కేంద్రం చెబుతున్నట్లు దేశంలో ఆవాల దిగుబడి పెంచటం కోసమే అయితే కలుపుమందును తట్టుకునే హైబ్రిడ్ బీటీ ఆవ వంగడానికి అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదు. అధిక దిగుబడినిచ్చే వంగడాలు మన దగ్గర ఇప్పటికే ఉన్నాయి. అధిక దిగుబడినిచ్చే ఆవ రకాలేవి? జన్యుమార్పిడి ఆవ డిఎంహెచ్11 రకం హెక్టారుకు 30–32 క్వింటాళ్ల ఆవాల దిగుబడి ఇస్తుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే, అంతకన్నా ఎక్కువ దిగుబడినిచ్చే వంగడాలు మన రైతుల దగ్గర ఉన్నాయి. ఉదాహరణకు.. ‘గోబి సార్సమ్ మస్టర్డ్’ రకం. ఇది సేంద్రియ సేద్యంలో హెక్టారుకు 40 క్వింటాళ్ల ఆవాల దిగుబడిని ఇస్తుంది. 5 నెలల పంట. నారు పోసి, నాట్లు (3“2.5 అడుగుల దూరం) వేసుకోవడానికి అనువైన రకం ఇది. ప్రభుత్వం దిగుబడులు పెంచాలనుకుంటే ఇటువంటి వంగడాలను పోత్సహించుకోవచ్చు కదా? ప్రభుత్వం ఉద్దేశం ఒక్కటే.. ఆహార పంటల్లో కూడా జన్యుమార్పిడి సాంకేతికతను ప్రవేశపెట్టడం మాత్రమే. జన్యుమార్పిడి ఆవ పంట కావాలని రైతులు అడగలేదు. ఆవాల జీవవైవిధ్యానికి మన దేశం పుట్టిల్లు. జీవవైవిధ్య కేంద్రాలైన దేశాల్లో ఆయా పంటల్లో జన్యుమార్పిడి ప్రవేశపెట్టవద్దని అంతర్జాతీయ జీవవైవిధ్య ఒడంబడిక నిర్దేశిస్తోంది. అయినా జీఎం ఆవాలను ప్రభుత్వం ముందుకు తెస్తోంది. జన్యుకాలుష్యం ముప్పు, తేనెటీగల పెంపకం, సేంద్రియ తేనె ఎగుమతి రంగానికి కలిగే తీరని/ వెనక్కి తీసుకోలేని నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని పౌరసమాజం, రైతు సంఘాలు, సంస్థలు వద్దంటున్నా మొండిగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ప్రజలు స్పందించి ఉద్యమించి అడ్డుకోకపోతే మరిన్ని ఆహార పంటలకు సంబంధించి జన్యుమార్పిడి విత్తనాలకు అనుమతులు మంజూరు చేసే ముప్పు పొంచి ఉంది. ఏయే ఆహార పంటల్లో జన్యుమార్పిడి విత్తనాలు రాబోతున్నారంటారు..? కలుపుమందులను తట్టుకునే (హెచ్‌టీ) బీటీ పత్తి, బీటీ వంగ, బీటీ మొక్కజొన్న, బీటీ వరి తదితర జన్యుమార్పిడి పంటల విడుదలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. జన్యుమార్పిడి వల్ల ముప్పు ఏమిటి? తరతరాలుగా మెరుగైన విత్తనాలను ఎంపిక చేసుకొని విత్తుకొని పంటలు పండిస్తూ, పండించిన పంట నుంచి విత్తనాలు దాచుకోవడానికి, ఇతరులతో పంచుకోవడానికి వ్యవసాయ సమాజాలకు, రైతులకు ఆయా సంప్రదాయ విత్తనాలపై సర్వహక్కులు ఉన్నాయి. ఈ హక్కుల్ని జన్యుమార్పిడి విత్తనాలు ధ్వంసం చేస్తాయి. వంగడాలు జీవ–సాంస్కృతిక వారసత్వంగా సంక్రమించినవి. వీటిని ప్రైవేటు/కార్పొరేట్ కంపెనీల లాభాపేక్ష కొద్దీ జన్యుమార్పిడి చేసి, కంపెనీల సొంత ఆస్థిగా విత్తనాలను మార్చే ప్రక్రియ ప్రజా వ్యతిరేకమైనది. జన్యుమార్పిడి విత్తనాల వల్ల సంప్రదాయ పంటల స్వచ్ఛత దెబ్బతింటుంది. జన్యుకాలుష్యం జరగకుండానే చూడాలి. జరిగిన తర్వాత మళ్లీ పాత స్థితికి తేవటం సాధ్యం కాదు. భూమి, నీరు, జీవవైవిధ్యం, ప్రజారోగ్యం, పశుపక్ష్యాదుల ఆరోగ్యం కూడా జన్యుమార్పిడి పంటల దుష్పలితాలకు గురవుతాయి. అందుకే జన్యుమార్పిడి పంటలను మేం వ్యతిరేకిస్తున్నాం. మైసూరులో ఇటీవల జరిగిన కిసాన్ స్వరాజ్య సమ్మేళనం వెలువరించిన ‘విత్తన స్వరాజ్య ప్రకటన –2022’ రైతుల సంప్రదాయ విత్తన హక్కుల్ని కాపాడటంలో రాజీలేని ధోరణి చూపమని పాలకులకు విజ్ఞప్తి చేసింది. (క్లిక్ చేయండి: అల్సర్‌ని తగ్గించిన అరటి.. 10 పిలకల ధర 4,200) -
చాయ్ లవర్స్ కోసం: కూల్‌గా ఉంటే హాట్‌గా, హాట్‌గా ఉంటే కూల్‌గా!
మీరు కూల్‌గా ఉంటే.. హాట్‌గా హాట్‌గా ఉంటే కూల్‌గా క్షణాల్లో మార్చేస్తుంది. అంతేనా వాన కురిసినా.. ఫ్రెండ్స్‌తో గాసిప్ టైం అయినా..తలనొప్పి వచ్చినా... పరీక్షలకు ప్రిపేర్ కావాలన్నా.. అంతెందుకు పొద్దున లేవగానే మన బుర్రలో వచ్చే ఏకైక థాట్ టీ. ఫ్రెష్‌గా వేడి వేడి టీ పడందే రోజు మొదలుకాదు చాలా మందికి. టీ అంటే కేవలం ఒక రిఫ్రెష్ డ్రింకే మాత్రమేనా. కానే కాదు..అదొక సెంటిమెంట్..ఎమోషన్. ప్రతి సంవత్సరం మే 21న అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అసలు మే నెలలోనే ఈ డేను ఎందుకు జరుపుకుంటారు? దీని వెనకాల హిస్టరీ ఏంటి? మే 21న అంతర్జాతీయ టీ దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలని టీ బోర్డ్ ఆఫ్ ఇండియా సూచన మేరకు భారత ప్రభుత్వం యూఎన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్‌కి ప్రతిపాదించింది.అలా తొలి ఇంటర్నేషనల్ టీ దినోత్సవాన్ని 2005లో ఢిల్లీలో నిర్వహించారు.ఎందుకంటే చాలా దేశాలలో ఈ నెలలోనే టీ ఉత్పత్తి సీజన్ ప్రారంభమవుతుంది. తేయాకు కార్మికుల సురక్షిత పని పరిస్థితులు, సరైన వ్యాపార నిర్వహణతోపాటు తేయాకు ఉత్పత్తిని మెరుగుపరిచే పరిస్థితులపై అవగాహన కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశం. ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రతి ఏడాది మే 21న అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని పాటించడం ఆనవాయితీగా వస్తోంది. అంతర్జాతీయ టీ దినోత్సవం అనేది సాంస్కృతిక వారసత్వం, ఆరోగ్య ప్రయోజనాలు, టీ ఆర్థిక ప్రాధాన్యతను సెలబ్రేట్ చేసుకోవడం, తేయాకుఉత్పత్తిని రక్షించి, దాని ప్రయోజనాలను ముందు తరాలకు అందించేలా 'ఫీల్డ్ నుండి కప్పు వరకు' అనే నినాదంతో ఈ డేను నిర్వహిస్తారు. ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే వాటిల్లో టీ కూడా ఒకటి. 2007లో టీ బోర్డ్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, భారత దేశంలో ఉత్పత్తి చేయబడిన మొత్తం టీలో 80 శాతం ఇండయన్సే వినియోగిస్తున్నారు. ఇక్కడ 5వేల సంవత్సరాలకు పైగా టీ మూలాలు విస్తరించి ఉన్నాయట. టీ అంటే ఒక భావోద్వేగం. సంతోషమైనా, ఉత్సాహమైనా, అలసిపోయినా సందర్భం ఏదైనా బెస్ట్ ఫ్రెండ్ టీ. దానికి చిట పట చినుకుల్లో పకోడీ తోడైతే ఆహా ఆ రంగు రుచి వాసనలతో మరో ప్రపంచంలో విహరిస్తాం. లక్షల మందికి ఉపాధినందిస్తున్న ఈ తేనీటిని సందర్భాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి దీనిని అనేక విధాలుగా తయారు చేయవచ్చు. వీటిలో కొన్ని కాశ్మీరీ కహ్వా, అల్లం టీ, తులసి టీ, సులైమాని టీ, రోంగా టీ, మసాలా టీ, లెమన్‌గ్రాస్ టీ, గ్రీన్ టీ. బెల్లం, మిరియాల టీ, అబ్బో.. ఈ లిస్ట్ చాలా పెద్దది. మన బాడీ డిటాక్స్ చేసుకోవడానికి కూడా రకరకాల టీలు ఉపయోగపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు , యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాల సంపూర్ణ మిశ్రం టీ. హల్దీ టీ రోగనిరోధక శక్తిని పెంచి, కాలేయాన్ని శుభ్రపరిస్తే.. తేనె నిమ్మకాయ అల్లం దట్టించిన టీ గొంతు నొప్పి , జలుబుకు చక్కటి చిట్కా. అలాగే హనీ లెమన్ జింజర్ టీ, ఆమ్లా అల్లం టీ ద్వారా విటమిన్ సీ దొరుకుతుంది. దీంతో బరువు తగ్గించుకోవచ్చు. డిటాక్స్ డైట్లో అల్లం అజ్వైన్ లెమన్ టీ, జింజర్ అజ్వైన్ లెమన్ టీ చేర్చుకుంటే బరువు తగ్గే ప్రక్రియ వేగవంత మవుతుందని నిపుణులు కూడా నమ్ముతున్నారు. మరోవైపు సాహసికుడు,టీ ప్రేమికుడు, ఆండ్రూ హ్యూస్ చరిత్రలో అత్యధిక టీ పార్టీని నిర్వహించిన ఘనత సాధించారు. బ్లాక్ , గ్రీన్ టీ, పిప్పరమెంటు, చమోమిలే వంటి టీలను ఆయన అందించారట. నేపాల్‌లోని మౌంట్ ఎవరెస్ట్ క్యాంప్ 2, మే 5, 2021న 6,496 మీటర్ల ఎత్తులో, ఆండ్రూ 15 మంది అధిరోహకుల బృందంతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. మరి మీరు కూడా మంచి టీ పార్టీతో మీ స్నేహితులతో ఇంటర్నేషనల్ టీ డేని ఎంజాయ్ చేయండి. -
మంచిర్యాలకు.. ధమ్ కి బిర్యానీ.. ‘మండి.. పదండి..’
ఆదివారమో, పండుగనో, ప్రత్యేక సందర్భం వచ్చిందంటే మాంసాహారం సాధారణంగా ఇళ్లలో ఉండే మెనూ ఇదే. కానీ రానురాను అభిరుచులు మారిపోతున్నాయి. ఓ రోజు అలా రెస్టారెంట్‌కు వెళ్లి, కొత్త రుచులను చూసేద్దాం అంటున్నారు పట్టణ ప్రజలు. సెలవు రోజుల్లో, పిల్లలు, పెద్దల పుట్టిన రోజులు, ఇతర వేడుకలు వచ్చాయంటే అంతా కలిసి సరదాగా రెస్టారెంట్‌కు వెళ్తున్నారు. అక్కడా కూడా ఎప్పటి మాదిరి చికెన్ బిర్యాని, మటన్ బిర్యానీలే కాకుండా వెరైటీ రుచులపై దృష్టిసారిస్తున్నారు. ఇలా మారుతున్న ప్రజల ఆహార అలవాట్లకు అనుగుణంగా రెస్టారెంట్లు ఏర్పాడుతున్నాయి. హైదరాబాద్ ధమ్కీ బిర్యాని అంటే ఎంత ఫేమసో... ఇప్పుడు మండి బిర్యాణి అంతే ఫేమస్‌గా మారుతోంది. ఈ బిర్యానిపై సండే స్పెషల్ కథనం మీకోసం. సాక్షి, మంచిర్యాల(ఆదిలాబాద్): హైదరాబాద్ దమ్కీ బిర్యానీలో మసాలా ఎక్కువగా ఉంటుంది. బిర్యానీలో వచ్చే చికెన్, మటన్ ముక్కలు ఉడికించి ఉంటాయి. కానీ మండి బిర్యానీలో మాత్రం మసాల చాలా తక్కువగా ఉంటుంది. కాజు, కిస్మిస్, డ్రైఫ్రూట్స్లతో పాటు, క్యారెట్, కొతిమీర తదితర వాటిని వేసి మండి బిర్యానినీ తయారు చేస్తారు. బిర్యానిని వేరుగా, చికెన్, మటన్ ముక్కలను వేరుగా చేసి, వాటిని ఒక్కచోట చేర్చి చికెన్, మటన్ మండి బిర్యానీలుగా చేస్తారు. ఈ మండి బిర్యాని ఎక్కువగా పాశ్చత్య దేశాలైన అరబ్, సౌదీ దేశాల్లో బాగా ఫేమస్, అయితే గత ఐదేళ్లుగా మంచిర్యాలలో అరేబియన్ నైట్స్, నవాబ్ వంటి పలు రకాల పేర్లతో మండి బిర్యాని కేంద్రాలు మంచిర్యాలలో ఐదు వరకు ఏర్పాటయ్యాయి. హైదరాబాద్ బిర్యానికి ఉన్న క్రేజ్ మండి బిర్యానికి ఉండడంతో, మాంసాహారులు దీనిపై ఆసక్తి చూపిస్తున్నారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరు ఇంట్లో మాదిరిగా తినేలా టేబుళ్లను వేయకుండా, కిందనే పరుపులు వేసి మధ్యలో చిన్న టేబుల్‌ను ఏర్పాటు చేశారు. ఒకే ప్లేటులో తీసుకువచ్చే బిర్యానిని కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి తినేవిధంగా ఏర్పాటు చేశారు. హాయిగా కింద కూర్చోని ప్రశాంతంగా మండి బిర్యాని తింటుంటే ఆ మజానే వేరు. ఫ్యామిలీతో వచ్చే వారికి, స్నేహితులతో వచ్చే వారికి వేర్వేరుగా మండి బిర్యాని తినేలా ఏర్పాట్లు చేయడంతో ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. చదవండి: ఆ ధైర్యంతోనే.. దొంగ ప్యాంట్, నడుము పట్టుకుని గట్టిగా లాగినా -
సాగు సమస్యలకు సాంకేతిక పరిష్కారం
న్యూఢిల్లీ: సాగు రంగంలో సమస్యలను సాంకేతికతతో అధిగమించేందుకు తమ ప్రభుత్వం యత్నిస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. భారత వ్యవసాయ పరిశోధనా సమాఖ్య(ఐసీఏఆర్) అభివృద్ధి చేసిన వంగడాలు ప్రధాని మంగళవారం ఆవిష్కరించారు. రాయ్‌పూర్‌లో నిర్మించిన జాతీయ బయోటిక్ స్ట్రెస్ టాలరెన్స్ సంస్థ నూతన భవనాన్ని ప్రారంభించారు. నాలుగు యూనివర్సిటీలకు గ్రీన్ క్యాంపస్ అవార్డులిచ్చారు. ‘సైంటిస్టులు 1300 రకాలకు పైగా విత్తన వెరైటీలను అభివృద్ధి చేశారు. ఈ రోజు మరో 35 వెరైటీలు రైతులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ వంగడాలు వాతావరణ మార్పులు, పోషకాహార లోపాల సవాళ్లను పరిష్కారిస్తాయి’ అని మోదీ అన్నారు. రైతులు ఎదుర్కొనే భిన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త రకాలను సైంటిస్టులు రూపొందించారు. కరవు తదితర కఠిన వాతావరణ పరిస్థితులను, వివిధ రకాల వ్యాధులను తట్టుకునే విధంగా వీటిని అభివృద్ధి చేశారని ప్రధాని చెప్పారు. అధిక పోషక విలువలున్న వరి, గోదుమ, మొక్కజొన్న, సోయాబీన్ తదితర పంట రకాలు కొత్తగా రూపొందించినవాటిలో ఉన్నాయి. దేశ రైతాంగంలో 86 శాతం మంది సన్నకారు రైతులేనని, వారి ఆదాయాన్ని పెంచడంపై ప్రధాని ఎల్లప్పుడూ శ్రద్ధ పెడుతుంటారని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్ చెప్పారు. సాగు రంగానికే కాకుండా మొత్తం పర్యావరణానికి వాతావరణ మార్పు(శీతోష్ణస్థితి మార్పు) అతిపెద్ద సవాలుగా మారిందని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు తక్షణ పరిష్కారం కనుగొనాలన్నారు. దీనివల్ల సాగు, అనుబంధరంగాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయన్నారు. హైదరాబాద్ నుంచి 5 మోదీ ఆవిష్కరించిన కొత్త వంగడాల్లో ఐదు హైదరాబాద్‌లోని భారత వ్యవసాయ పరిశోధన సమాఖ్య, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్‌లో అభివృద్ధి చేశారు. హైదరాబాద్‌కే చెందిన సీసీఎంబీ, పీజేటీఎస్ఏయూ ఈ వంగడాల అభివృద్ధిలో పాలుపంచుకున్నాయి. పంటకాలంతో పాటు నీటి అవసరం తక్కువగా ఉండే ‘డీఆర్ఆర్ ధన్ 57’, మధ్యమస్థాయి పలుచటి గింజ కలిగి, అగ్గితెగులును, ఉప్పునీటిని తట్టుకోగల ‘డీఆర్ఆర్ ధన్ 58’, పొడవుతోపాటు పలుచటి గింజలు కలిగి అగ్గితెగులును తట్టుకోగల ‘డీఆర్ఆర్ ధన్ 59’, ఫాస్పరస్ తక్కువగా ఉన్న నేలల్లోనూ పండగల, అగ్గితెగులును తట్టుకోగల ‘డీఆర్ఆర్ ధన్ 60’... అగ్గితెగులు, బ్లాస్ట్ రోగాన్ని తట్టుకోగల ‘డీఆర్ఆర్ ధన్ 62’ వంగడాలను ప్రధాని మంగళవారం కొన్ని ఇతర వంగడాలతో కలిపి విడుదల చేశారు. -
అత్యంత భారీ డైనోసార్లు ఏవి?
కోట్ల సంవత్సరాల క్రితం భూమండలంపై తిరగాడిన భారీ జీవజాతి ఏదైనా ఉందంటే అది రాకాసిబల్లులదే. పరిశోధకుల అన్వేషణలో ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు దేశాల్లో వేర్వేరు ప్రాంతాల్లో కొన్ని డైనోసార్ జాతుల అవశేషాలు బయల్పడ్డాయి. వాటిని విశ్లేషించి ఆ జాతుల్లో అత్యంత భారీ డైనోసార్లు రకాలు కొన్నింటిని శాస్త్రవేత్తలు వర్గీకరించారు. ► బ్రాకియోసారస్ పొడవు: 25 మీటర్లు బరువు: 80 టన్నులు జీవించిన కాలం: దాదాపు 15 కోట్ల ఏళ్ల క్రితం ►అర్జెంటీనోసారస్ పొడవు: 37–40 మీటర్లు బరువు: 100–110 టన్నులు జీవించిన కాలం: దాదాపు 9.8 కోట్ల ఏళ్ల క్రితం ► సూపర్సారస్ పొడవు: 33–35 మీటర్లు బరువు: 45 టన్నులు జీవించిన కాలం: 14.2 నుంచి 15.4 కోట్ల ఏళ్ల క్రితం ► పటగోటైటాన్ మయోరం పొడవు: 37–40 మీటర్లు బరువు: 77 టన్నులు జీవించిన కాలం: దాదాపు 9.5 నుంచి 10 కోట్ల ఏళ్ల క్రితం ► డిప్లోడోకస్ పొడవు: 27 మీటర్లు బరువు: 30–80 టన్నులు జీవించిన కాలం: దాదాపు 15 కోట్ల ఏళ్ల క్రితం పటగోటైటాన్ మయోరం రకం డైనోసార్ పరిమాణంలో మానవుడు, ఏనుగు, జిరాఫీల కంటే ఎంత పెద్దదంటే..? -
లోకంలో.. పలు కాకులు; ఆసక్తికర సంగతులు
లోకులు పలు కాకులు అనే సామెత మనకు తెలిసిందే. ఆ సామెత ఎలా ఉన్నా.. కాకుల్లో పలు రకాలు ఉన్నాయి. మనం సాధారణంగా కావ్ కావ్ మంటూ చెవులు చిల్లులు పడేలా అరిచే నల్ల కాకులనే చూస్తాం. కానీ కాకుల్లో కూడా అందమైనవి. ఆకట్టుకునే రంగుల్లో ఉన్నవి కూడా లోకంలో ఉన్నాయి. కార్విడె కుటుంబానికి చెందిన కాకుల్లో హౌస్ క్రోలని, రావెన్స్ అని, జాక్‌డా అని, మాగ్ పీ అని రకరకాలుగా ఉన్నాయి. వాటి వివరాలు ఓ సారి చూద్దాం. రుఫోస్ ట్రీపీ.. కాకి జాతిదే అయినా ఇది గోధుమ రంగులో ఉంటుంది. భారత ఉపఖండం దీని ఆవాసం. సాధారణ వర్షపాతం ఉండే ప్రాంతాలు, అడవులు, పట్టణాల్లోని ఉద్యానవనాల్లో ఇది కనిపిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సర్దుకుపోతుంది. పళ్లు, గింజలు, కీటకాలు, చిన్న చిన్న జీవులు దీని ప్రధాన ఆహారం. వైట్ బెల్లీడ్ ట్రీ పీ.. తోక పొడుగ్గా, అందంగా ఉండే ఈ కాకి, ఎక్కువగా పశ్చిమ కనుమల్లో నివసిస్తుంది. రూఫోస్ ట్రీపీతో స్నేహం చేస్తుంది. జనావాసాలు అంటే దీనికి పడదు. గింజలు, కీటకాలు, సరీసృపాలు, ఎలుకలు దీని ఆహారం. కామన్ గ్రీన్ మాగ్పీ.. దేశంలోని పక్షి జాతుల్లో అందమైనది. పచ్చని రంగుతో చూడముచ్చటగా ఉంటుంది. పరిమాణంలో చిన్నగా ఉండే ఈ కాకి హిమాలయాల్లో, ఈశాన్య భారతంలో కనిపిస్తుంది. ఇండియన్ జంగిల్ క్రో.. రతదేశం మొత్తం ఈ కాకి కనిపిస్తుంది. హౌస్ క్రోకి దీనికి తేడా స్పష్టంగా కనిపిస్తుంది. పూర్తి నల్లగా, కొంచెం పెద్దగా ఉంటుంది. జంగిల్ క్రో అయినా జనావాసాలకు దగ్గరలోనే నివసిస్తుంది. లార్జ్ బిల్లెడ్ క్రో.. ది కూడా అడవి కాకిలాగే పెద్దగా ఉంటుంది. కానీ సైజులో తేడా కనిపిస్తుంది. భారత్, ఆగ్నేయ ఆసియా దేశాల్లోని కాకుల్లో ఇది స్పష్టంగా తెలుస్తుంది. ఇది కూడా ప్రతిభ గలది. పరిస్థితులకు అనుకూలంగా మారుతుంది. యెల్లో బిల్లెడ్ బ్లూ మాగ్పీ.. వైట్ బెల్లీడ్ ట్రీ పీలాగే దీనికి కూడా పొడవైన తోక ఉంటుంది. కామన్ గ్రీన్ మాగ్పీలా అందంగా ఉంటుంది. భారత ఉపఖండంలోని ఉత్తర ప్రాంతాల్లో ఇది నివసిస్తుంది. నేలపై ఉండే ఆహారాన్ని సేకరించి కడుపునింపుకుంటుంది. బ్లాక్ హెడెడ్ జే.. హిమాలయాల్లో ఈ కాకి జాతి జీవిస్తుంది. నేపాల్, భూటాన్ వ్యవసాయ భూముల్లో కూడా అప్పుడప్పుడూ కనిపిస్తుంది. దీని తలపైన నల్లగా ఉంటుంది. యూరేసియన్ జేకి ఇది దగ్గరి చుట్టం. అదే పరిమాణంలో కూడా ఉంటుంది. హౌస్ క్రో.. పంచంలో అన్ని ప్రాంతాల్లో సాధారణంగా కనిపించే కాకి ఇది. దీని ఆవాసాలు మనుషులకు చేరువలో ఉంటాయి. కాకి జాతుల్లో కర్ణకఠోరంగా కావ్ కావ్ మంటూ కూసే కాకి ఇదే. నల్లగా ఉన్నా.. కొంత భాగం బూడిద రంగులో మెరుస్తూ ఉంటుంది. కామన్ రావెన్.. కాకి జాతుల్లో పెద్ద వాటిల్లో ఇది ఒకటి. ఇది అత్యంత ప్రతిభ కలిగినది. తెలివైనది. అంతేగాక అవకాశవాది అనే పేరున్నది. వాయవ్య భారతంలో మాత్రమే కనిపిస్తుంది. రాజస్థాన్, పంజాబ్‌తో పాటు సమీపంలోని ఎడారుల్లో జీవిస్తుంది. వెస్ట్రన్ జాక్‌డా.. కాకి జాతిలో చిన్న రకం ఇది. ఉత్తర భారత దేశంలోని కశ్మీర్లో కనిపిస్తుంది. తిండి విషయంలో ఇది కూడా అవకాశవాదే. ఇది పలు రకాలైన ఆహారం భుజిస్తుంది. మొక్కలు, క్రిములు చివరకు వాన పాములు లాంటి వాటికి కూడా గుటుక్కుమనిపిస్తుంది. -
షాకింగ్: కరోనాలో 4 వేల రకాలు
లండన్: కరోనా వైరస్‌లో 4వేల రకాలు ఉన్నాయని, ఇవన్నీ కోవిడ్ కేసుల్ని పెంచేస్తున్నాయని బ్రిటన్ మంత్రి ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. ఫైజర్, ఆస్ట్రాజెనెకా తమ వ్యాక్సిన్ల సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని బ్రిటన్‌లో కరోనా వ్యాక్సిన్ కార్యక్రమ పర్యవేక్షణ చేస్తున్న మంత్రి నదీమ్ జహావీ అన్నారు. జన్యుక్రమ నమోదు పరిశ్రమల్లో 50శాతం పైగా బ్రిటన్‌లో ఉన్నాయని, ఈ వైరస్‌లో రకాలన్నీ లైబ్రరీల్లో భద్రపరిస్తే అవసరమైనప్పుడు అది విసిరే సవాళ్లను ఎదుర్కొనేలా వ్యాక్సిన్‌ను తయారు చేయవచ్చునని మంత్రి నదీమ్ జహావీ సూచించారు. ప్రయోగాత్మకంగా మిక్స్ అండ్ మ్యాచ్ వ్యాక్సిన్ ఒక వ్యక్తికి కరోనా 2 డోసుల్ని రెండు వేర్వేరు కంపెనీలవి ఇచ్చి ఎలా పని చేస్తున్నాయో బ్రిటన్ ప్రభుత్వం తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. దీనికి సంబంధించి మానవ ప్రయోగాలు ప్రారంభించినట్టుగా నదీమ్ చెప్పారు. ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ తరహాలో వ్యాక్సిన్లు ఇవ్వడం ప్రపంచంలో ఇదేతొలిసారి. ఇలా రెండు వేర్వేరు రకాల కోవిడ్-19 వ్యాక్సిన్లు ఇవ్వడం వల్ల మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చునని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. 13 నుంచి రెండో డోస్ దేశవ్యాప్తంగా ఈ నెల 13వ తేదీ నుంచి కోవిడ్-19 రెండో డోస్ వ్యాక్సినేషన్ మొదలవుతుందని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. ఇప్పటికే మొదటి డోస్ అందుకున్న ఆరోగ్య కార్యకర్తలు 49,93,427 మందికి ఈ డోస్ అందుతుందన్నారు. ఈ డోస్ అందుకున్న కేవలం 0.18శాతం మందిలో దు్రష్పభావాలు కనిపించాయని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం దేశంలో జనవరి 16వ తేదీన ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం, సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేస్తున్న ఆక్స్ఫర్డ్ టీకా కోవిషీల్డ్, భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కోవాగ్జిన్ ఆరోగ్య కార్యకర్తలకు వేస్తున్నారు. కాగా, దేశంలో కరోనా కేసులు 12,899 కొత్తగా నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,07,90183కు చేరుకుంది. 24 గంటల్లో 107 మంది కరోనా బారినపడి మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 1,54,703కు చేరుకుందని కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం తెలిపింది. -
పిండివంటలు చేసి నోటిని కరకరలాడిస్తూ..
కొత్త సంవత్సరం.. కొత్త బియ్యం.. కొత్త పిండి.. కొత్త వంటలు.. కొత్త రుచులు.. బియ్యం పిండివంటలు చేసి నోటిని కరకరలాడిస్తూ.. రుచుల శబ్దాలతో దుప్పటి కప్పుకున్న సూర్యుడిని నిద్ర లేపుదాం.. బియ్యప్పిండి వంటకాలను ఆయనకు చూపిస్తూ ఆస్వాదిద్దాం.. పొంగనాలు కావలసినవి బియ్యప్పిండి – ఒక కప్పు; బొంబాయి రవ్వ – పావు కప్పు; పెరుగు – ముప్పావు కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చిమిర్చి తరుగు – అర టీ స్పూను; కొత్తిమీర తరుగు – 1 టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత; వంట సోడా – చిటికెడు తయారీ ఒక పాత్రలో బియ్యప్పిండి, బొంబాయి రవ్వ, పెరుగు వేసి బాగా కలపాలి ∙కొద్దిగా నీళ్ళు జతచేసి, మరోమారు బాగా కలపాలి (దోసె పిండి కంటే గట్టిగా ఉండాలి) మూతపెట్టి ఐదు నిముషాలు వదిలేయాలి ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, ఉప్పు, వంట సోడా దీనికి జత చేసి, మరోసారి బాగా కలపాలి స్టౌమీద పొంగణాల స్టాండ్ పెట్టి, అన్ని గుంటల్లోనూ సమానంగా నూనె వేయాలి తయారు చేసుకున్న పిండిని, గుంటల నిండుగా వేయాలి మూతపెట్టి, మీడియం మంట మీద మూడు నిముషాలు ఉంచాక, తిరగేసి కొద్దిగా నూనె వేసి మళ్ళీ మూత పెట్టాలి మరో రెండు నిముషాల తరవాత పొంగనాలను ప్లేటులోకి తీసుకోవాలి కొబ్బరి, అల్లం చట్నీలతో వేడిగా అందించాలి. వడ కావలసినవి బియ్యప్పిండి – అర కప్పు; ఉల్లి తరుగు – అర కప్పు; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్ స్పూను; పచ్చిమిర్చి తరుగు – ఒక టీ స్పూను; అల్లం తురుము – అర టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; కారం – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – తగినంత తయారీ ఒక పాత్రలో ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, అల్లం తురుము, జీలకర్ర, కారం, ఉప్పు, కొత్తిమీర తరుగు, రెండు టీ స్పూన్ల నూనె వేసి, చేతితో బాగా కలపాలి బియ్యం పిండి జత చేస్తూ కలపాలి ∙కొద్దికొద్దిగా నీరు జత చేస్తూ వడ పిండి మాదిరిగా గట్టిగా కలుపుకోవాలి అర చేతికి కొద్దిగా నూనె పూసుకుని, కొద్దికొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుంటూ వడ మాదిరిగా వత్తి పక్కన ఉంచుకోవాలి స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, మంటను మీడియంలోకి తగ్గించి ఒత్తి ఉంచుకున్న వడలను నూనెలో వేసి, బంగారు రంగులోకి వచ్చే వరకూ రెండువైపులా వేయించి పేపర్ నేప్కిన్ పైకి తీసుకోవాలి ∙సాస్‌తో అందించాలి. చిప్స్ కావలసినవి బియ్యప్పిండి – ఒక కప్పు; నీళ్ళు – ఒక కప్పు; ఉప్పు – తగినంత; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – అర టేబుల్ స్పూను; జీలకర్ర – అర టేబుల్ స్పూను; నూనె – 2 టేబుల్ స్పూన్లు + డీప్ ఫ్రైకి సరిపడా; నువ్వులు – ఒక టేబుల్ స్పూను; కొత్తి మీర తరుగు – ఒక టేబుల్ స్పూను తయారీ స్టౌ మీద ఒక వెడల్పాటి పాత్రలో నీళ్ళు మరిగించాలి ఉప్పు, పసుపు, మిరప కారం, జీలకర్ర, నూనె, నువ్వులు, కొత్తిమీర తరుగు ఒకదాని తరువాత ఒకటి వేసి బాగా కలపాలి స్టౌ ఆపేసి, మరుగుతున్న నీటిలో బియ్యప్పిండి కొద్దికొద్దిగా వేసి, కలుపుతుండాలి కొద్దిగా చల్లారిన తరవాత పిండిని, ఐదు నిముషాల పాటు చపాతి పిండి మాదిరిగా కలపాలి పిండిని పెద్ద పెద్ద ఉండలు చేసుకోవాలి ∙అప్పడాల పీటపై కొద్దిగా బియ్యం పిండి చల్లుతూ పెద్ద చపాతీగా ఒత్తు కోవాలి చాకుతో కావలసిన ఆకారంలో కట్ చేసుకోవాలి స్టౌ మీద బాణలిలో నూనె వేడయ్యాక, తయారుచేసి ఉంచుకున్న కాజాలను వేసి, దోరగా వేయించి, ప్లేటులోకి తీసుకోవాలి బాగా చల్లారాక గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. హల్వా కావలసినవి బెల్లం – అర కప్పు; బియ్యప్పిండి – కప్పు; నీళ్ళు – కప్పు; ఏలకుల పొడి – అర టీ స్పూను; మిఠాయి రంగు – చిటికెడు; నూనె/నెయ్యి – కొద్దిగా తయారీ స్టౌ మీద ఒక గిన్నెలో బెల్లం, నీళ్ళు వేసి బెల్లం కరిగే వరకూ కలపాలి ఏలకుల పొడి జత చేసి, స్టౌ కట్టేయాలి ∙కిందకు దింపేసి, చల్లారనివ్వాలి ’ బెల్లం నీళ్లు చల్లారాక బియ్యప్పిండి జత చేసి ఉండలు లేకుండా కలపాలి కొద్దికొద్దిగా నీళ్ళు జతచేస్తూ, దోసె పిండి కంటే కొద్దిగా పలచగా ఉండేలా చేసుకోవాలి ∙చిటికెడు ఉప్పు జత చేయాలి ఈ మిశ్రమాన్ని రెండు పాత్రల్లోకి సమానంగా తీసుకోవాలి ∙చిన్న గిన్నెలో టీ స్పూను నీటికి చిటికెడు మిఠాయి రంగు జత చేసి, కరిగించి ఒక పాత్రలో ఉన్న పిండికి జత చేయాలి ఒక ప్లేటుకు నూనె కానీ, నేయి కానీ పూయాలి స్టౌ మీద వెడల్పాటి పాత్రలో గ్లాసుడు నీళ్ళు పోసి, మరిగించాలి (పైన ఉంచే మూతను వస్త్రంతో గట్టిగా కట్టాలి) నీళ్ళపై ఒక స్టాండ్ ఉంచి దాని మీద నెయ్యి లేదా నూనె రాసిన ప్లేటును ఉంచాలి ముందుగా సిద్ధం చేసుకుని ఉంచుకున్న బియ్యప్పిండి మిశ్రమాన్ని ఒక లేయర్‌గా సమానంగా పరవాలి వస్త్రం కట్టిన మూతను ఉంచి ఐదు నిముషాలు ఉడికించాలి మూత తీసి రంగు కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని సమానంగా పరవాలి మూత పెట్టేసి, పది నిముషాల పాటు ఉడికించాలి మంట ఆర్పేయాలి పది నిముషాల పాటు చల్లారిన తరవాత చాకుతో అంచులను జాగ్రత్తగా కట్ చేస్తూ, ప్లేటు నుంచి విడదీయాలి కావలసిన ఆకారంలో ముక్కలను కట్ చేసుకోవాలి. దోసె కావలసినవి బియ్యప్పిండి – కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చి మిర్చి తరుగు – ఒక టీ స్పూను; అల్లం తురుము – ఒక టీ స్పూను; కొత్తిమీర తరుగు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – అర టీ స్పూను తయారీ ఒక పాత్రలో బియ్యప్పిండి, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, అల్లం తురుము, కొత్తి మీర తరుగు, జీలకర్ర, ఉప్పు, పసుపు, మిరప కారం ఒక దాని తరువాత ఒకటి వేస్తూ బాగా కలుపుకోవాలి కొద్దికొద్దిగా నీరు జత చేస్తూ దోసె పిండి మాదిరిగా కలుపుకోవాలి చివరిగా రెండు గ్లాసుల నీళ్ళు జత చేసి, బాగా పలచగా చేసుకోవాలి స్టౌ మీద పెనం వేడయ్యాక, గరిటెడు పిండి తీసుకుని, పలచగా దోసె వేసి, ఎర్రగా కాలాక నూనె వేసి, రెండో వైపు కూడా కాల్చి ప్లేటులోకి తీసుకోవాలి కొబ్బరి చట్నీతో అందించాలి. చపాతీ కావలసినవి బియ్యప్పిండి – అర కప్పు; గోధుమ పిండి – అర కప్పు; ఉప్పు – తగినంత; నూనె – తగినంత తయారీ ఒక పాత్రలో బియ్యప్పిండి, గోధుమ పిండి, ఉప్పు వేసి కలపాలి నీరు జత చేస్తూ చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి చివరగా కొద్దిగా నీరు జత చేసి, బాగా కలిపి మూత పెట్టి అరగంట సేపు పక్కన ఉంచాలి పిండిని ఉండలు చేసుకోవాలి అప్పడాల పీటమీద పొడి పిండి జల్లుకుంటూ ఒక్కో చపాతీని ఒత్తుకోవాలి స్టౌ మీద పెనం వేడయ్యాక ఒక్కో చపాతీని, నూనె జత చేస్తూ కాల్చాలి రెండువైపులా బంగారు రంగులోకి వచ్చే వరకూ కాల్చాలి వేడి వేడి కుర్మాతో తింటే రుచిగా ఉంటాయి. -
చికెన్ వెరైటీల్లోనూ హైదరాబాద్ టాప్
సాక్షి, హైదరాబాద్: చికెన్ లవర్స్‌కు హైదరాబాద్ అడ్డాగా మారుతోంది. టిఫిన్.. లంచ్.. స్నాక్స్.. డిన్నర్ సమయం ఏదైనా.. చికెన్ వంటకాలను కుమ్మేస్తున్నారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత నవంబర్, డిసెంబర్ నెలలో చికెన్ వాడకంలో దేశంలోనే హైదరాబాద్ నగరం మొదటి స్థానంలో ఉంది.గ్రేటర్ జనానికి సందర్భం ఎదైనా ముక్క లేనిదే ముద్ద దిగడంలేదు. దేశరాజధాని ఢిల్లీ రెండో స్థానంలో.. ఎలక్ట్రానిక్ సిటీ బెంగళూరు మూడోస్థానంలో నిలవడం విశేషం. కాగా పోషక విలువలు, ప్రొటీన్స్ అధికంగా ఉండటం.. అన్ని ఆదాయ వర్గాల వారికీ అందుబాటులో ఉండటంతో చికెన్‌కు రోజురోజుకూ గిరాకీ పెరుగుతోందని పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. కరోనా తర్వారా చికెన్ విక్రయాలు భారీగా పెరిగినా.. మటన్ వినియోగం మాత్రం అంతగా పెరగలేదని నాన్‌వెజ్ మార్కెట్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి. చికెన్ వెరైటీల్లోనూ హైదరా‘బాద్షా’.. ఉద్యోగం, వ్యాపారం, ఇతర వ్యాపకాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతోన్న సిటీజన్లు ఆన్‌లైన్‌లోనూ తమకు నచ్చిన చికెన్ వెరైటీలను ఆర్డర్లు చేస్తున్నట్లు పలు ఫుడ్ డెలివరీ సంస్థల సర్వే ద్వారా తెలిసింది. దేశంలోని ఇతర నగరాలతో పోలీస్తే ప్రపంచ వ్యాప్తంగా లభించే వివిధ రకాల చికెన్ డిష్‌లు దాదాపు నగరంలోని అన్ని హోటల్స్‌లో లభిస్తున్నాయి. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలీస్తే హైదరాబాద్ హోటల్స్‌లో చికెన్‌తో చేసిన దాదాపు ఇరవైకి పైగా వెరైటీలు లభిస్తున్నాయి. దీంతో కూడా నగర జనం వివిధ రకాల చికెన్ వెరైటీల రుచులు ఆస్వాదిస్తున్నారు. వెరైటీ చికెన్ ఆడర్స్లోనూ దేశంలోనే హైదరాబాద్ నంబర్ వన్‌గా ఉందని ఫుడ్ డెలివరీ సంస్థలు తెలిపాయి. హైదరాబాద్‌లో ఆది నుంచే భోజన ప్రియులు ఉండటంతో ఇక్కడ అందుబాటులో ఉన్న ఫుడ్ వెరైటీలు దేశంలో ఎక్కడా లేవని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు. గ్రేటర్లో నిత్యం 6 లక్షల కిలోలు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజువారి చికెన్ వినియోగం 6 లక్షల కిలోలు ఉంది. ఇది దేశంలోనే అత్యధికం. ఢిల్లీ, బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్‌లో వినియోగం ఎక్కువగా ఉందని పౌల్ట్రీ వ్యాపారులు అంటున్నారు. కోవిడ్ అనంతరం గ్రేటర్లో రోజూ 6 లక్షల కిలోల వినియోగం ఉండగా ఢిల్లీలో 5.5 లక్షలు, బెంగళూరులో 5 లక్షల వరకు చికెన్ విక్రయాలు జరుతున్నాయని పౌల్ట్రీ రంగం అంచనా. ఇతర ప్రాంతాలతో పోలిస్తే గ్రేటర్ శివారు ప్రాంతాలతో పాటు రాష్ట్రంలో ఎక్కువగా పౌల్ట్రీ ఫామ్‌లు ఉన్నాయి. ఇతర నగరాలతో గ్రేటర్లో చికెన్ ధరలు కూడా తక్కువే. తెలంగాణ నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు కోళ్ల ఎగుమతులు కూడా జరుగుతున్నాయి. మటన్ లక్ష కేజీలు మాత్రమే.. గ్రేటర్లో చికెన్ విక్రయాలు రికార్డు స్థాయిలో జరుగుతున్నా మటన్ విక్రయాలు మాత్రం అంతగా లేవు. నిత్యం మటన్ విక్రయాలు లక్ష కేజీల దాటడం లేదు. చికెన్‌తో పోలీస్తే మటన్ ధర ఎక్కువగా ఉంది. కేజీ మటన్ ధరలో మూడు కేజీల చికెన్ లభిస్తోంది. ఇతర నాన్‌వెజ్ విషయానికి వస్తే చేపలు, రొయ్యల వినియోగం పెరిగింది. -
రుచుల పొట్లం
పొట్లకాయ తీరే వేరు. పొడుగ్గా పెరగడానికి రాయి కడతారు. తిన్నగా సాగాక తనంత పొడవుగా మరొకరు లేరంటూ విర్రవీగుతుంది. జ్వరమొస్తే పథ్యమవుతుంది. పొట్లకాయ అంటే ముఖం చిట్లించక్కర్లేదు. కాస్త చాకచక్యంగా వండాలేగానీ... చవులూరించేలా... తన రుచులు సైతం తనంత పొడవంటూ నిరూపించే పొగరుకాయ పొట్లకాయ. ఆ రుచులెలా తేవాలో తెలిపే ‘పొట్ల’మ్ ఇది. విప్పండి... చవులతో నాలుక చప్పరించండి. పొట్లకాయ రింగ్స్ కావలసినవి: బియ్యప్పిండి – పావు కప్పు; సెనగ పిండి – పావు కప్పు; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – అర టీ స్పూను, కోడి గుడ్డు – 1 (పెద్దది); ఉప్పు – తగినంత; అల్లం వెల్లుల్లి ముద్ద – అర టీ స్పూను; పొట్ల కాయ తరుగు – 2 కప్పులు (చక్రాల్లా తరగాలి); నూనె – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ►ఒక పాత్రలో అన్ని పదార్థాలు (నూనె, పొట్లకాయ చక్రాలు మినహా) వేసి బాగా కలపాలి ►కొద్దిగా నీళ్లు జత చేసి బజ్జీ పిండిలా చేసుకోవాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాచాలి ►పొట్ల కాయ చక్రాలను పిండిలో ముంచి, కాగిన నూనెలో వేసి, బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ∙వేడి వేడి పొట్ల కాయ రింగ్స్‌ను, టొమాటో సాస్‌తో అందించాలి. పొట్లకాయ కట్లెట్ కావలసినవి: లేత పొట్ల కాయ – 1; బంగాళదుంపలు – 3 (మీడియం సైజువి); తరిగిన పచ్చి మిర్చి – 2; వెల్లుల్లి రెబ్బలు – 3 (మెత్తగా చేయాలి); ఉల్లి తరుగు – పావు కప్పు; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా; బియ్యప్పిండి – కొద్దిగా. తయారీ: ►పొట్లకాయను శుభ్రంగా కడిగి, పెద్ద సైజు చక్రాలుగా తరగాలి (గింజలు తీసేయాలి) ►ఉడికించి, తొక్క తీసేసిన బంగాళ దుంపలు ముద్దలా అయ్యేలా చేతితో మెదపాలి ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, ఉల్లి తరుగు, మెత్తగా చేసిన వెల్లుల్లి రేకలు వేసి ఉల్లి తరుగు మెత్తపడే వరకు వేయించాలి ►బంగాళ దుంప ముద్ద, తరిగిన పచ్చి మిర్చి, పసుపు, ఉప్పు జత చేసి బాగా వేయించి, దింపేయాలి ►ఈ మిశ్రమాన్ని పొట్లకాయ చక్రాలలో స్టఫ్ చేయాలి ►స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి కాచాలి ►స్టఫ్ చేసిన చక్రాలను పొడి బియ్యప్పిండిలో పొర్లించి, కాగిన నూనెలో వేసి (డీప్ ఫ్రై కాదు) రెండు వైపులా దోరగా కాల్చి ప్లేట్లోకి తీసుకోవాలి ►టొమాటో సాస్ లేదా చిల్లీ సాస్‌తో అందించాలి. పొట్లకాయ మసాలా కర్రీ కావలసినవి: పెసర పప్పు – అర కప్పు; జీలకర్ర – ఒక టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; తరిగిన పచ్చి మిర్చి – 5; పల్లీ పొడి – ఒక టేబుల్ స్పూను; ఇంగువ – చిటికెడు; ఆవాలు – ఒక టీ స్పూను; ఉల్లి తరుగు – అర కప్పు; ఎండు మిర్చి – 4; ఉప్పు – తగినంత; పొట్ల కాయ – 1 (లేతది); పసుపు – అర టీ స్పూను. తయారీ: ►పొట్లకాయలను శుభ్రంగా కడిగి మధ్యలోకి నిలువుగా చీల్చి, గింజలు తీసేయాలి ►చిన్న చిన్న ముక్కలుగా తరగాలి ∙ఒక గిన్నెలో పెసర పప్పు, తగినన్ని నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి ఉడికించాలి ►కొద్దిగా ఉడుకుతుండగానే, పొట్ల కాయ ముక్కలు, ఉప్పు జత చేసి బాగా కలిపి మూత ఉంచి, ఉడికించి, దింపేయాలి ►స్టౌ మీద పాన్ ఉంచి వేడయ్యాక నూనె వేసి కాగాక, ఎండు మిర్చి, ఆవాలు, జీలకర్ర, ఉల్లి తరుగు, పసుపు, ఇంగువ, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు వేసి బాగా వేయించాలి ►ఉడికించిన పొట్లకాయ + పెసర పప్పు మిశ్రమం జత చేసి బాగా కలిపి, నీరు పోయేవరకు మగ్గబెట్టాలి ►పల్లీ పొడి, తగినంత ఉప్పు వేసి కలిపి, దింపేయాలి ►అన్నంలోకి, రోటీలలోకి రుచిగా ఉంటుంది. పొట్లకాయ చట్నీ కావలసినవి: పొట్ల కాయ – 1; నూనె – 2 టీ స్పూన్లు; మినప్పప్పు – ఒక టీ స్పూను; కాశ్మీరీ మిర్చి – 3; తాజా కొబ్బరి తురుము – ముప్పావు కప్పు; పసుపు – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; చింతపండు – కొద్దిగా. పోపు కోసం: నూనె – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – అర టీ స్పూను, కరివేపాకు – రెండు రెమ్మలు; ఎండు మిర్చి – 1; ఇంగువ – కొద్దిగా. తయారీ: ►పొట్లకాయను శుభ్రంగా కడిగి, ముక్కలు చేసి, గింజలు వేరు చేయాలి ►స్టౌ మీద పెద్ద బాణలిలో నూనె వేసి కాగాక, మినప్పప్పు, ఎండు మిర్చి వేసి దోరగా వేయించాలి ►పొట్ల కాయ తరుగు వేసి సన్నని మంట మీద ముక్కలు మెత్తబడేవరకు వేయించి, దింపి, చల్లార్చాలి ►పచ్చి కొబ్బరి తురుము, పసుపు, ఉప్పు, చింత పండు జత చేసి, మిక్సీలో వేసి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టి, చిన్న గిన్నెలోకి తీసుకోవాలి ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఆవాలు, ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేయించి, పచ్చడికి జత చేయాలి ►అన్నం, దోసె, ఇడ్లీలలోకి రుచిగా ఉంటుంది. స్టఫ్డ్ పొట్లకాయ కూర కావలసినవి: పొట్లకాయ – 1; ఉల్లి తరుగు – పావు కప్పు + పావు కప్పు; అల్లం + వెల్లుల్లి ముద్ద – ఒక టే బుల్ స్పూను; ధనియాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను + అర టీ స్పూను; మిరియాలు –అర టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; గరం మసాలా – పావు టీ స్పూను; నూనె – తగినంత. తయారీ: ►పొట్లకాయను పెద్ద పెద్ద ముక్కలుగా గుండ్రంగా తరిగి, అందులోని గింజలను చాకుతో జాగ్రత్తగా తీసేయాలి ► జీలకర్ర, మిరియాలు, ధనియాలు, వెల్లుల్లి +అల్లం ముద్ద, ఉల్లి తరుగు మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక జీలకర్ర, ఉల్లి తరుగు వేసి వేయించాలి ►పసుపు, మిరప కారం వేసి బాగా కలియబెట్టాలి మసాలా ముద్ద జత మరో రెండు నిమిషాలు వేయించాలి ►పొట్ల కాయలో నుంచి వేరుచేసిన గింజలను ఈ మిశ్రమానికి జత చేసి మరోమారు వేయించాలి ►బాగా ఉడికిన తరవాత తగినంత ఉప్పు, మిరప కారం, గరం మసాలా జత చేసి బాగా కలియబెట్టి, మూత ఉంచి సన్నటి మంట మీద రెండు నిమిషాల పాటు ఉడికించాలి ►మూత తీసి, మరోమారు బాగా కలిపి దింపేయాలి ►తరిగి ఉంచుకున్న పొట్ల కాయ ముక్కలలోకి ఈ మిశ్రమాన్ని స్పూన్ సహాయంతో కొద్దికొద్దిగా స్టఫ్ చేయాలి ►స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి (డీప్ ఫ్రై కాదు) కాగాక, స్టఫ్ చేసి ఉంచుకున్న పొట్ల కాయ ముక్కలను వేసి, మూత ఉంచి, మంట తగ్గించి రెండు నిమిషాల తరవాత, ముక్కలను రెండో వైపుకి తిప్పి, మళ్లీ మూత ఉంచాలి ►ఈ విధంగా రెండు నిమిషాలకోసారి ముక్కలు మెత్తబడేవరకు తిప్పుతుండాలి ►బాగా వేగిన తరవాత దింపేయాలి ►అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. పొట్లకాయ పాలు కూర కావలసినవి: పొట్ల కాయ – 1; కొబ్బరి నూనె – ఒక టీ స్పూను; ఉల్లి తరుగు – పావు కప్పు; కారం – ఒక టీ స్పూను; కొత్తిమీర – చిన్న కట్ట; కరివేపాకు – రెండు రెమ్మలు; పాలు – అర కప్పు (మరిగించాలి); ఉప్పు – తగినంత; తాజా కొబ్బరి తురుము – పావు కప్పు; జీలకర్ర – అర టీ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 2; ఆవాలు – పావు టీ స్పూను; ఎండు మిర్చి – 4; పసుపు – పావు టీ స్పూను. తయారీ: ►స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక కొబ్బరి నూనె వేసి కాగాక ఎండు మిర్చి, ఆవాలు, జీలకర్ర, పసుపు వేసి వేయించాలి ►ఉల్లితరుగు, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు జత చేసి, ఉల్లి తరుగు బంగారు రంగులోకి మారేవరకు వేయించాలి ►పొట్లకాయ ముక్కలు జత చేసి, మూత ఉంచాలి ►ముక్కలు బాగా మగ్గాక, ఉప్పు, మిరప కారం వేసి కలపాలి ►కొబ్బరి తురుము, పాలు జత చేసి మరోమారు కలిపి, మూత పెట్టి, రెండు నిమిషాలు ఉడికించాలి ►కూర బాగా దగ్గర పడిన తరవాత, కొత్తిమీర వేసి కలిపి దింపేయాలి ►అన్నం, రోటీలలోకి రుచిగా ఉంటుంది. -
తీగ లాగితే ‘కిటికీ’
సాక్షి, హైదరాబాద్: ఇంటికి తలుపులు ఎంత అవసరమో కిటికీలూ అంతే. అయితే ఈ మధ్యకాలంలో చెక్కతోనో, స్టీల్‌తోనో తయారైన కిటికీలు కాకుండా విండో బ్లైండ్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. కార్పొరేట్ ఆఫీసులకు మాత్రమే పరిమితమైన ఈ కల్చర్ ఇప్పుడు నివాసాలకూ పాకింది. ఎన్నో వెరైటీలు, డిజైన్లు అందుబాటు ధరల్లోనే దొరుకుతుండటంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు కూడా వీటి వైపే ఆసక్తి చూపిస్తున్నారు. ►విండో బ్లైండ్స్ ఏర్పాటుతో గదికి అందం రావటమే కాదు సూర్యకాంతి, అతినీలలోహిత కిరణాలూ ఇంట్లోకి రావు. వీటికి పరదా అవసరం ఉండదు. లివింగ్ రూమ్‌తో పాటు బెడ్ రూములో అందమైన ప్రకృతి చిత్రాలు ఉన్న బ్లైండ్స్ను ఏర్పాటు చేసుకుంటే ఉదయం లేచి వాటిని చూస్తే మనస్సు ప్రశాతంగా ఉంటుంది. అంతేకాదు బయటి వారికి లోపల ఏముందో కనిపించదు. మనం బయట ఏం జరుగుతుందో చూడాలనుకుంటే బ్లైండ్స్కు ఉన్న తాడు లాగితే సరిపోతుంది. ఇందులో వర్టికల్, రోలర్, చిక్, ఉడెన్, ఫొటో, జీబ్రా వంటి ఎన్నో రకాలుంటాయి. ఠి చీర్ బ్లైండ్స్ సహజసిద్దమైన బొంగు కర్రలతో చేస్తారు. ఇవి తలుపు మాదిరిగా కనిపిస్తుంటాయి. ధర చ.అ.కు రూ.200–350 వరకు ఉంటుంది. ఠి వర్టికల్ బ్లైండ్స్ అన్ని సైజుల కిటికీలకు అనువుగా ఉంటుంది. ఓ పక్క ఉండే తాడు లాగితే రెండు పక్కలా డబుల్ డోర్ మాదిరిగా తెరుచుకుంటుంది. ధర చ.అ.కు రూ.90–150 వరకు ఉంటుంది. ఠి గాలి, వెలుతురు ధారాలంగా రావాలనుకునేవారు జీబ్రా బ్లైండ్స్ కరెక్ట్. చూడ్డానికి చిప్స్ మాదిరిగా ఉండే ఈ బ్లైండ్స్ పైనుంచి కిందికి తెరుచుకుంటాయి. ధర చ.అ.కు రూ.180–280 ఉంటుంది. ఠి రోలర్ బ్లైండ్స్ అచ్చం పరదా మాదిరిగా ఉంటుంది. తాడు లాగుతుంటే ముడుచుకుంటూ పైకి లేస్తుంది. ధర చ.అ.కు రూ.130–300 వరకు ఉంటుంది. -
ఆహా ఏమి‘టీ’
సాక్షి, ఆలేరు : ఆంగ్లేయుల నుంచి వలస వచ్చిన టీ అలవాటు మనకు జీవితంలో ఒక భాగమైంది. టీ తాగనిదే పొద్దు గడవదు. చాయ్.. చటుక్కున్న తాగరా బాయ్.. అంటూ ఓ చిత్రంలో కథనాయకుడు టీ పుట్టుపుర్వోత్తారాలను అసక్తిగా చెబుతాడు. అలనాడు టీ తాగిన బ్రహ్మ అనాటి నుంచి ఈనాటి వరకు విశ్రాంతి లేకుండా సృష్టిని కొనసాగిస్తునే ఉన్నాడంటూ టీ మహత్తును గమ్మత్తుగా వర్ణించాడు. నిజ జీవితంలో తేనెటి ఘుమఘుమలతోనే దీనచర్య ప్రారంభమయ్యే వారు ఎందరో. నేడు అన్ని వేళల్లో టీ తాగడం సర్వసాధారణమైంది. ధనిక, పేద అనే తేడా లేకుండా అందరు టీని సేవిస్తారు. ఇంటికి వచ్చిన అతిథులుగా మొదటగా మర్యాదాగా అందించేది టీ తోనే. ఈ రోజే ఎదుకంటే ? ప్రపంచ వ్యాప్తంగా తేయాకు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న దేశాలు టీ ప్రాధాన్యాన్ని ప్రచారం చేసేందుకు పలుమార్లు అంతర్జాతీయ సదస్సులను నిర్వహించాయి. ఇందులో భారత్ సహా పలు దేశాలు పాల్గొని ఈ దినోత్సవ ఏర్పాటుకు చొరవ చూపాయి. 2005 డిసెంబర్ 15న టీ వినియోగం గుర్తించి మనదేశంలో టీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఇలా క్రమేనా అన్ని దేశాల్లో నిర్వహిస్తున్నారు. ఆరోగ్య ప్రదాయిని.. టీ తాగడం కూడా ఆరోగ్యమే. మానసిక ఉత్తేజం కల్గుతుంది. గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ కల్గిస్తుంది. రక్తంలోని కొవ్వు పదార్థాలను కరిగిస్తుంది. శరీరంలో చెడు ప్రభావాలను తగ్గించడంలో కొన్ని రకాల టీలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. వీటిని నానాటికి ఆదరణ పెరుగుతోంది. గ్రీన్, లెమన్, హనీ, బ్లాక్, అల్లం, మసాలా, బాదం టీలు ఈ జాబితాలో ఉన్నాయి. మధుమేహ బాధితులకు గ్రీన్, బ్లాక్ టీలు ఆరోగ్యమని పలు పరిశోధనల ద్వారా తెలిసింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రకాల టీలు అందుబాటులో ఉన్నాయి. భారత్‌తో పాటు తెలంగాణలో కూడా వివి«ధ రకాల టీలను సేవిస్తున్నారు. ఇరానీ, అస్సాం, ఫ్లెవర్, చాక్లెట్, మసాలా, హెర్బల్, ఇలాచీ, బిస్కెట్ అందుబాటులో ఉన్నాయి. ఒక్కో రకం టీకి ఒక్కో రకం ప్రత్యేకత ఉంటుంది. పెరిగిన టీ ధర టీ ధర పేద ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. తేయాకు, పాలు, చక్కెర, గ్యాస్ ధరలు పెరగడంతో టీ ధరను కూడా పెంచేశారు. రూ. 6 నుంచి 10 వరకు అమ్ముతున్నారు. కూలీ నాలీ చేసే సామాన్యులు సైతం దీనచర్యను చాయ్‌తోనే మొదలుపెడుతారు. చాయ్ తయారుచేయడానికి అవసరమయ్యే అన్నిరకాల వస్తువుల ధరలు పెరగడం వల్ల చాయ్ ధరలను పెంచాల్సి వస్తుందని టీకొట్టుల నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఎందరికో ఉపాధి ఛాయే కదా అని అనుకుంటాం.. కానీ ఎంతో మందికి టీ అమ్మకాలు ఉపాధిని కల్పిస్తుంది. డబ్బా కొట్టు నుండి 5 నక్షత్రాల హోటళ్ల వరకు వివిధ స్థాయిలో టీ లభ్యమౌతుంది. టీ దొరకని ప్రాంతాలుండవు. కొన్ని వందల మైళ్ల దూరంలోని రాజస్థాన్ వంటి రాష్ట్రాల నుంచి వలసవచ్చి మరి టీ కొట్టులు పెట్టుకుని బతుకుతున్న వారు ఎందరో. సినిమా థియేటర్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, దుకాణ సముదాయాల్లో, ఫ్యాక్టరీలలో, కళాశాలలు, పార్కులు, జన సంచారం ఉన్న ప్రదేశాల్లో టీని విక్రయిస్తుంటారు. చిన్న కప్పుల్లో సాగే టీ వ్యాపారం రూపాయలు కోట్లలోనే సాగుతుందంటే ఆశ్చర్యమనిపించక మానదు. -
ఉలవచారు ఇడ్లీ...
తెలుగువారి సంప్రదాయ రుచులు దోశ, ఇడ్లీ. వీటికి రకరకాల చట్నీలు, ఫ్లేవర్లు యాడ్ చేసి విభిన్నంగా అందించే ప్రయత్నం చేస్తున్నాయి నగరంలోని రెస్టారెంట్లు. దోశలో అయితే ఓకే... ఎన్నో వెరైటీలు పరిచయం. కానీ ఇడ్లీ..! దానికీ మాంచి రుచి యాడ్ చేశారు ఫిలింనగర్ మయూర హౌస్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ శివరాజ్. దీంతోపాటు స్పెషల్ దోశలనూ ఈయన తయారు చేస్తున్నారు. రండి... ఆ రుచులు మనమూ ‘టేస్ట్’ చేద్దాం... కార్న్ చీజ్ దోశ దోశల్లోనే ఇదో సరికొత్త వెరైటీ. మినప దోశపై నెయ్యిలో వేయించిన స్వీట్‌కార్న్, చీజ్‌ను వేసి, నాలుగు రకాల చట్నీలతో వడ్డిస్తే ఎరికైనా నోరూరాల్సిందే. తినేదాకా ఎందుకు... అసలు చూస్తుంటేనే కడుపు నిండినంత ఫీలింగ్ వస్తుంది. రుచే కాదు... ఆరోగ్యానికి కూడా ఈ దోశ ఎంతో మేలు చేస్తుంది. ఫుడ్ లవర్స్ దీన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వెరైటీ టేస్ట్... ఇడ్లీలకు కాంబినేషన్‌గా ఎన్నో చట్నీలు, సాంబార్లూ ఉన్నాయి. అవన్నీ పాత రుచులే. తొలిసారిగా ఆంధ్రా ఉలవచారుతో ఇడ్లీలు అందిస్తున్నాం. నగరవాసులకు ఇది ఓ సరికొత్త టేస్ట్‌ను ఇవ్వడమే కాదు... ఎంతో ఆరోగ్యాన్ని కూడా సమకూర్చుతుంది. పల్లీ, అల్లం చట్నీలు, సాంబారుతో ఎంత ఇష్టంగా లాగిస్తారో ఉలవచారు ఇడ్లీలు కూడా అంతే ఇష్టంగా తింటున్నారు నగరవాసులు. కాకినాడ పెసరట్టు అట్టులందు పెసరట్టు వేరయా అనేవారు ఎందరో! మినప దోశలు ఎన్ని రకాలుగా ఊరిస్తున్నా... పెసరట్టు ఎప్పుడూ ప్రత్యేకమే. ఇంత ప్రత్యేకమైన పెసరట్టుకు మరిన్ని ఫ్లేవర్లు యాడ్ చేశాం. మేలు రకం పెసల పిండి... పైన నేతిలో వేయించిన జీడిపప్పు, కలర్ఫుల్గా కనిపించే క్యారెట్, కొత్తిమేర దట్టించి, దోరగా కాల్చి, దానికి కాస్త వెన్న జోడించి వడ్డిస్తే... వాహ్ అనాల్సిందే. సామాన్యులే కాదు సూపర్‌స్టార్ కృష్ణ, విక్టరీ వెంకటేష్ వంటి స్టార్లు కూడా అడిగి మరీ రెగ్యులర్‌గా పార్శిల్ తెప్పించుకుంటారు. అంత రుచిగా ఉంటుందీ పెసర దోశ. చెఫ్ శివరాజ్