సరికొత్త వంటకాలను కోరుకుంటున్నారా? వీటిని ట్రై చేయండి! | Preparation Of Mushroom Lollipops Mealmaker Tomato Garlic Cherry Halwa Variety Recipes | Sakshi
Sakshi News home page

సరికొత్త వంటకాలను కోరుకుంటున్నారా? వీటిని ట్రై చేయండి!

Published Tue, Apr 23 2024 1:13 PM | Last Updated on Tue, Apr 23 2024 1:17 PM

Preparation Of Mushroom Lollipops Mealmaker Tomato Garlic Cherry Halwa Variety Recipes - Sakshi

పుట్టగొడుగు లాలీపాప్స్‌

ప్రతీరోజూ తిన్న వంటకాలని మళ్లీ మళ్లీ తినాలంటే.. చాలా మంది ముఖం తిప్పేసుకుంటారు. కొంచెం కారంగానో, తీయగానో కావాలని కోరుకుంటారు. విశ్రాంతి సమయంలో ఏదో ఒకటి నమిలేవరకూ వారికి పొద్దేపోదు. మరి అలాంటి వారి కోసం ఈ వెరైటీ వంటలు సిద్ధంగా ఉన్నాయి. అవేంటో చూద్దాం. 

పుట్టగొడుగు లాలీపాప్స్‌..
కావలసినవి: పుట్టగొడుగులు – 15 లేదా 20 (వేడి నీళ్లతో శుభ్రం చేసుకుని పక్కనపెట్టుకోవాలి), మైదాపిండి – 1 కప్పు, ధనియాల పొడి, పసుపు – పావు టేబుల్‌ స్పూన్, కారం, చాట్‌ మసాలా, మిరియాల పొడి – అర టేబుల్‌ స్పూన్‌ చొప్పున, కార్న్‌ఫ్లేక్‌  మిక్సర్‌ – 1 కప్పు (కవర్‌లో వేసి.. చపాతీ కర్రతో అటు ఇటు నొక్కి పొడిపొడిగా చేసుకోవాలి), బ్రెడ్‌ పౌడర్, ఓట్స్‌ పౌడర్‌ – అర కప్పు చొప్పున, అల్లం పేస్ట్‌ – 1 టేబుల్‌ స్పూన్, ఉప్పు –  తగినంత, నీళ్లు – సరిపడా, నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా

తయారీ..

  • ముందుగా పెద్ద బౌల్‌ తీసుకుని అందులో మైదాపిండి, ధనియాల పొడి, పసుపు, కారం, చాట్‌ మసాలా, మిరియాల పొడి, అల్లం పేస్ట్, తగినంత ఉప్పు వేసుకుని.. కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పేస్ట్‌లా చేసుకోవాలి.
  • అనంతరం మరో బౌల్‌ తీసుకుని కార్న్‌ఫ్లేక్‌  మిక్సర్, బ్రెడ్‌ పౌడర్, ఓట్స్‌ పౌడర్‌ ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి.
  • అనంతరం ప్రతి పుట్టగొడుగుకు పుల్ల గుచ్చి.. ఒక్కోదాన్ని మొదట మైదా మిశ్రమంలో తర్వాత బ్రెడ్‌ పౌడర్‌ మిశ్రమంలో ముంచి.. మిశ్రమాన్ని బాగా పట్టించి.. నూనెలో డీప్‌ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది.

మీల్‌మేకర్‌ – టొమాటో గారెలు..
కావలసినవి: మీల్‌మేకర్‌ – 1 కప్పు (పదిహేను నిమిషాల పాటు వేడి నీళ్లలో నానబెట్టి, తురుముకోవాలి), టొమాటో – 3 (మెత్తగా మిక్సీ పట్టుకుని.. జ్యూస్‌లా చేసుకోవాలి), ఉల్లిపాయ తరుగు – పావు కప్పు పచ్చిమిర్చి ముక్కలు – 2 టీ స్పూన్లు, బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, ఓట్స్‌ పౌడర్‌ – 1 కప్పు చొప్పున, మినుముల పిండి – 2 కప్పులు (మినుములు నానబెట్టి గ్రైండ్‌ చేసుకోవాలి), జీలకర్ర – 1 టీ స్పూన్, నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా, ఉప్పు – తగినంత, నీళ్లు – సరిపడా
తయారీ..

  • ముందుగా ఒక బౌల్‌ తీసుకుని.. అందులో మినుముల పిండి, మీల్‌ మేకర్‌ తురుము, మొక్కజొన్న పిండి, బియ్యప్పిండి, జీలకర్ర, ఉప్పు, ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి ముక్కలు అన్ని వేసుకుని టొమాటో జ్యూస్‌ కొద్దికొద్దిగా వేసుకుంటూ గారెల పిండిలా చేసుకోవాలి.
  • అనంతరం కొద్దికొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసుకుని.. గారెల్లా ఒత్తుకుని, కాగుతున్న నూనెలో దోరగా వేయించుకోవాలి.
  • వాటిపై మజ్జిగ ఆవడ వేసుకుని, నానబెట్టి తింటే భలే బాగుంటాయి.

    మీల్‌మేకర్‌ – టొమాటో, గారెలు చెర్రీ హల్వా..

చెర్రీ హల్వా..
కావలసినవి: చెర్రీస్‌ – రెండున్నర కప్పులు (గింజలు తీసి శుభ్రం చేసుకోవాలి) యాలకుల పొడి – పావు టీ స్పూన్‌ మొక్కజొన్న పిండి – రెండుంపావు కప్పులు పంచదార – 1 కప్పు, నట్స్‌ – కావాల్సినన్ని నెయ్యి – అర కప్పు, నీళ్లు – 3 టేబుల్‌ స్పూన్లు డ్రైఫ్రూట్స్‌ – అభిరుచిని బట్టి

తయారీ..

  • ముందుగా స్టవ్‌ ఆన్‌ చేసుకుని, కళాయిలో కొద్దిగా నెయ్యి వేడి చేసి.. అందులో జీడిపప్పు దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి.
  • అనంతరం చెర్రీస్‌ వేసుకుని గరిటెతో తిప్పుతూ మగ్గేవరకు చిన్న మంట మీద ఉడికించాలి.
  • అనంతరం 2 టేబుల్‌ స్పూన్ల నెయ్యి, పంచదార వేసుకుని తిప్పుతూ ఉండాలి.
  • పంచదార కరిగిన తర్వాత.. మొక్కజొన్న పిండిలో నీళ్లు పోసుకుని బాగా కలిపి.. ఆ మిశ్రమాన్ని చెర్రీస్‌ మిశ్రమంలో వేసుకోవాలి.
  • కాసేపటికి మరోసారి కొద్దిగా నెయ్యి వేసుకుని తిప్పాలి.
  • దగ్గరపడుతున్న సమయంలో జీడిపప్పు, మిగిలిన నెయ్యి వేసుకుని బాగా కలిపి చల్లారాక.. మరిన్ని  డ్రైఫ్రూట్స్‌ తురుముతో సర్వ్‌ చేసుకోవాలి.

ఇవి చదవండి: సమ్మర్‌లో పిల్లలకు ఇలా చేసి పెడితే, ఇష్టంగా తింటారు, బలం కూడా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement