అలోవెరా అనేది దాదాపు ప్రతి భారతీయ ఇంటిలో కనిపించే మొక్క.. ఇది అందం నుండి ఆరోగ్యం వరకు అన్ని విధాలుగా ఉపయోగపడే అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. ఈ మొక్కను నరదిష్టి కోసం కూడా వాడతారు. చాలా సులభంగా పెంచుకునే మొక్కిది. మనకు తెలిసినంతవరకు కలబంద పెద్ద కాడలుగా ఉంటుంది. అయితే ఈ కలబందలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 200 రకాలు వరకు ఉన్నాయట. కానీ వాటిలో నాలుగు మాత్రమే ఆరోగ్యానికి, అందానికి ఉపయోగపడతాయట. మిగతా కలబంద మొక్కలను అలంకరణగా ఉపయోగిస్తారట.
అయితే వాటిలో మనకు ఉపయోగపడే కలబంద రకాల మొక్కలు ఏంటీ? వాటిలో ఏవి మన చర్మ సంరక్షణలో ఉపయోగపడతాయో సవివరంగా తెలుసుకుందాం.
ఎరుపు కలబంద
ఇది చూడటానికి చాలా అందంగా ఉంటుంది. సూర్యకాంతిలో ఉంచినప్పుడు, దాని ఎరుపు రంగు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. దీని ఆకులకు చాలా ముళ్ళు ఉంటాయి. కానీ దాని అందం కారణంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో రెడ్ కలబందను నాటాలని కోరుకుంటారు. ఇది ప్రధానంగా దక్షిణాఫ్రికా మొక్క. దీనిని పెంచేందుకు ఎక్కువ నీరు అవసరం లేదు.
చిన్న ఆకుల కలబంద
లేతరంగు ఆకుల కారణంగా, అవి చాలా అందంగా కనిపిస్తాయి. ముళ్లతో నిండినప్పటికీ, చర్మ సంరక్షణలో దీనిని ఉపయోగిస్తారు. చిన్న లేతరంగు ఆకులతో పాటు, ఇది అందమైన ఎరుపు, పసుపు పువ్వులను కూడా ఉత్పత్తి చేస్తుంది.
స్పైరల్ అలోవెరా
ఇలాంటి కలబంద మొక్కలు మార్కెట్లో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఇది చాలా అందమైన రకాల్లో ఒకటి. ఇది గుండ్రని ఆకారంలో మరియు ఎరుపు నారింజ రంగు పుష్పాలను కలిగి ఉంటుంది. ఈ మొక్క ఇంటి అలంకరణకు ఉత్తమంగా పరిగణించబడుతుంది.
కార్మైన్ అలోవెరా..
ఈ కలబంద కూడా గృహ అలంకరణను మరింత ఇనుమడింప చేస్తుంది. ఇంటి అంకరణలో ఈ కార్మైన్ కలబంద ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది ఒకరకమైన హైబ్రిడ్ మొక్క. అయితే ఇది నీరు లేకుండా కూడా జీవించగలదు.
ఈ నాలుగు కలబంద రకాలు ఆరోగ్యానికి, అందానికి బాగా ఉపయోగడతాయి. ఇక మన ఇళ్లలో పెరిగే కలబంద కూడా చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది.
(చదవండి: వేసవిలో ఈ ఫుడ్స్‌కి దూరంగా ఉంటే మేలు!)
Comments
Please login to add a commentAdd a comment