తెలుగువారి సంప్రదాయ రుచులు దోశ, ఇడ్లీ. వీటికి రకరకాల చట్నీలు, ఫ్లేవర్లు యాడ్ చేసి విభిన్నంగా అందించే ప్రయత్నం చేస్తున్నాయి నగరంలోని రెస్టారెంట్లు. దోశలో అయితే ఓకే... ఎన్నో వెరైటీలు పరిచయం. కానీ ఇడ్లీ..! దానికీ మాంచి రుచి యాడ్ చేశారు ఫిలింనగర్ మయూర హౌస్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ శివరాజ్. దీంతోపాటు స్పెషల్ దోశలనూ ఈయన తయారు చేస్తున్నారు. రండి... ఆ రుచులు మనమూ ‘టేస్ట్’ చేద్దాం...
కార్న్ చీజ్ దోశ
దోశల్లోనే ఇదో సరికొత్త వెరైటీ. మినప దోశపై నెయ్యిలో వేయించిన స్వీట్‌కార్న్, చీజ్‌ను వేసి, నాలుగు రకాల చట్నీలతో వడ్డిస్తే ఎరికైనా నోరూరాల్సిందే. తినేదాకా ఎందుకు... అసలు చూస్తుంటేనే కడుపు నిండినంత ఫీలింగ్ వస్తుంది. రుచే కాదు... ఆరోగ్యానికి కూడా ఈ దోశ ఎంతో మేలు చేస్తుంది. ఫుడ్ లవర్స్ దీన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
వెరైటీ టేస్ట్...
ఇడ్లీలకు కాంబినేషన్‌గా ఎన్నో చట్నీలు, సాంబార్లూ ఉన్నాయి. అవన్నీ పాత రుచులే. తొలిసారిగా ఆంధ్రా ఉలవచారుతో ఇడ్లీలు అందిస్తున్నాం. నగరవాసులకు ఇది ఓ సరికొత్త టేస్ట్‌ను ఇవ్వడమే కాదు... ఎంతో ఆరోగ్యాన్ని కూడా సమకూర్చుతుంది. పల్లీ, అల్లం చట్నీలు, సాంబారుతో ఎంత ఇష్టంగా లాగిస్తారో ఉలవచారు ఇడ్లీలు కూడా అంతే ఇష్టంగా తింటున్నారు నగరవాసులు.
కాకినాడ పెసరట్టు
అట్టులందు పెసరట్టు వేరయా అనేవారు ఎందరో! మినప దోశలు ఎన్ని రకాలుగా ఊరిస్తున్నా... పెసరట్టు ఎప్పుడూ ప్రత్యేకమే. ఇంత ప్రత్యేకమైన పెసరట్టుకు మరిన్ని ఫ్లేవర్లు యాడ్ చేశాం. మేలు రకం పెసల పిండి... పైన నేతిలో వేయించిన జీడిపప్పు, కలర్‌ఫుల్‌గా కనిపించే క్యారెట్, కొత్తిమేర దట్టించి, దోరగా కాల్చి, దానికి కాస్త వెన్న జోడించి వడ్డిస్తే... వాహ్ అనాల్సిందే. సామాన్యులే కాదు సూపర్‌స్టార్ కృష్ణ, విక్టరీ వెంకటేష్ వంటి స్టార్లు కూడా అడిగి మరీ రెగ్యులర్‌గా పార్శిల్ తెప్పించుకుంటారు. అంత రుచిగా ఉంటుందీ పెసర దోశ.
చెఫ్ శివరాజ్
ఉలవచారు ఇడ్లీ...
Published Thu, Feb 19 2015 4:31 AM | Last Updated on Sat, Sep 2 2017 9:32 PM
Advertisement