లోకులు పలు కాకులు అనే సామెత మనకు తెలిసిందే. ఆ సామెత ఎలా ఉన్నా.. కాకుల్లో పలు రకాలు ఉన్నాయి. మనం సాధారణంగా కావ్ కావ్ మంటూ చెవులు చిల్లులు పడేలా అరిచే నల్ల కాకులనే చూస్తాం. కానీ కాకుల్లో కూడా అందమైనవి. ఆకట్టుకునే రంగుల్లో ఉన్నవి కూడా లోకంలో ఉన్నాయి. కార్విడె కుటుంబానికి చెందిన కాకుల్లో హౌస్ క్రోలని, రావెన్స్ అని, జాక్‌డా అని, మాగ్ పీ అని రకరకాలుగా ఉన్నాయి. వాటి వివరాలు ఓ సారి చూద్దాం.
రుఫోస్ ట్రీపీ..
కాకి జాతిదే అయినా ఇది గోధుమ రంగులో ఉంటుంది. భారత ఉపఖండం దీని ఆవాసం. సాధారణ వర్షపాతం ఉండే ప్రాంతాలు, అడవులు, పట్టణాల్లోని ఉద్యానవనాల్లో ఇది కనిపిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సర్దుకుపోతుంది. పళ్లు, గింజలు, కీటకాలు, చిన్న చిన్న జీవులు దీని ప్రధాన ఆహారం.
వైట్ బెల్లీడ్ ట్రీ పీ..
తోక పొడుగ్గా, అందంగా ఉండే ఈ కాకి, ఎక్కువగా పశ్చిమ కనుమల్లో నివసిస్తుంది. రూఫోస్ ట్రీపీతో స్నేహం చేస్తుంది. జనావాసాలు అంటే దీనికి పడదు. గింజలు, కీటకాలు, సరీసృపాలు, ఎలుకలు దీని ఆహారం.
కామన్ గ్రీన్ మాగ్‌పీ..
దేశంలోని పక్షి జాతుల్లో అందమైనది. పచ్చని రంగుతో చూడముచ్చటగా ఉంటుంది. పరిమాణంలో చిన్నగా ఉండే ఈ కాకి హిమాలయాల్లో, ఈశాన్య భారతంలో కనిపిస్తుంది.
ఇండియన్ జంగిల్ క్రో..
రతదేశం మొత్తం ఈ కాకి కనిపిస్తుంది. హౌస్ క్రోకి దీనికి తేడా స్పష్టంగా కనిపిస్తుంది. పూర్తి నల్లగా, కొంచెం పెద్దగా ఉంటుంది. జంగిల్ క్రో అయినా జనావాసాలకు దగ్గరలోనే నివసిస్తుంది.
లార్జ్ బిల్లెడ్ క్రో..
ది కూడా అడవి కాకిలాగే పెద్దగా ఉంటుంది. కానీ సైజులో తేడా కనిపిస్తుంది. భారత్, ఆగ్నేయ ఆసియా దేశాల్లోని కాకుల్లో ఇది స్పష్టంగా తెలుస్తుంది. ఇది కూడా ప్రతిభ గలది. పరిస్థితులకు అనుకూలంగా మారుతుంది.
యెల్లో బిల్లెడ్ బ్లూ మాగ్‌పీ..
వైట్ బెల్లీడ్ ట్రీ పీలాగే దీనికి కూడా పొడవైన తోక ఉంటుంది. కామన్ గ్రీన్ మాగ్‌పీలా అందంగా ఉంటుంది. భారత ఉపఖండంలోని ఉత్తర ప్రాంతాల్లో ఇది నివసిస్తుంది. నేలపై ఉండే ఆహారాన్ని సేకరించి కడుపునింపుకుంటుంది.
బ్లాక్ హెడెడ్ జే..
హిమాలయాల్లో ఈ కాకి జాతి జీవిస్తుంది. నేపాల్, భూటాన్ వ్యవసాయ భూముల్లో కూడా అప్పుడప్పుడూ కనిపిస్తుంది. దీని తలపైన నల్లగా ఉంటుంది. యూరేసియన్ జేకి ఇది దగ్గరి చుట్టం. అదే పరిమాణంలో కూడా ఉంటుంది.
హౌస్ క్రో..
పంచంలో అన్ని ప్రాంతాల్లో సాధారణంగా కనిపించే కాకి ఇది. దీని ఆవాసాలు మనుషులకు చేరువలో ఉంటాయి. కాకి జాతుల్లో కర్ణకఠోరంగా కావ్ కావ్ మంటూ కూసే కాకి ఇదే. నల్లగా ఉన్నా.. కొంత భాగం బూడిద రంగులో మెరుస్తూ ఉంటుంది.
కామన్ రావెన్..
కాకి జాతుల్లో పెద్ద వాటిల్లో ఇది ఒకటి. ఇది అత్యంత ప్రతిభ కలిగినది. తెలివైనది. అంతేగాక అవకాశవాది అనే పేరున్నది. వాయవ్య భారతంలో మాత్రమే కనిపిస్తుంది. రాజస్థాన్, పంజాబ్‌తో పాటు సమీపంలోని ఎడారుల్లో జీవిస్తుంది.
వెస్ట్రన్ జాక్‌డా..
కాకి జాతిలో చిన్న రకం ఇది. ఉత్తర భారత దేశంలోని కశ్మీర్‌లో కనిపిస్తుంది. తిండి విషయంలో ఇది కూడా అవకాశవాదే. ఇది పలు రకాలైన ఆహారం భుజిస్తుంది. మొక్కలు, క్రిములు చివరకు వాన పాములు లాంటి వాటికి కూడా గుటుక్కుమనిపిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment