రోల్స్‌రాయిస్‌కు రూ.90,200 కోట్ల కాంట్రాక్ట్‌ | Britain awarded Rolls Royce a 11 billion USD contract to design manufacture and support services for nuclear reactors | Sakshi
Sakshi News home page

రోల్స్‌రాయిస్‌కు రూ.90,200 కోట్ల కాంట్రాక్ట్‌

Published Fri, Jan 24 2025 9:23 AM | Last Updated on Fri, Jan 24 2025 10:34 AM

Britain awarded Rolls Royce a 11 billion USD contract to design manufacture and support services for nuclear reactors

బ్రిటన్ జలాంతర్గాములకు ఎనర్జీ అందించే అణు రియాక్టర్ల రూపకల్పన, వాటి నిర్వహణ కాంట్రాక్ట్‌ను రోల్స్ రాయిస్‌ దక్కించుకుంది. 11 బిలియన్ డాలర్ల(సుమారు రూ.90,200 కోట్లు) ఈ ‘యూనిటీ’ కాంట్రాక్టు ఎనిమిదేళ్లపాటు చెల్లుబాటు అవుతుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ ఒప్పందం బ్రిటన్‌ రాయల్ నేవీ సామర్థ్యాన్ని పెంచుతుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ యూనిటీ ఒప్పందం గతంలో చేసుకున్న ఒప్పందాలను క్రమబద్ధీకరిస్తుందని అధికారులు తెలిపారు. కంపెనీ అందుకున్న కాంట్రాక్టు వల్ల లండన్‌లో పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఈ నిధులు బ్రిటిష్ వ్యాపారం, ఉద్యోగాలు, జాతీయ భద్రతకు దీర్ఘకాలిక ప్రోత్సాహాన్ని అందిస్తాయని రక్షణ మంత్రి జాన్ హీలీ నొక్కి చెప్పారు. ఈ ఒప్పందం వల్ల కనీసం 1,000 నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు అవకాశాలు వస్తాయని, 4,000 మందికి పరోక్షంగా రక్షణ లభిస్తుందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా సెంట్రల్ ఇంగ్లాండ్‌లో డెర్బీలో రోల్స్ రాయిస్ న్యూక్లియర్ రియాక్టర్ ఉత్పత్తి కేంద్రాన్ని బ్రిటన్‌ రక్షణ మంత్రి హీలీ సందర్శించారు.

ఇదీ చదవండి: కాల్స్‌ కోసమే ప్రత్యేక ప్యాక్‌.. వాట్సప్‌కు ఊరట

యూకే, యూఎస్‌, ఆస్ట్రేలియా మధ్య సైనిక సహకారాన్ని బలోపేతం చేయడానికి ఈ ఒప్పందం సహకరిస్తుందని బ్రిటన్‌ ప్రభుత్వం తెలిపింది. ఈ ఒప్పందంతో రక్షణ రంగంలో నూతన ఆవిష్కరణలతో అత్యాధునిక టెక్నాలజీని వినియోగించబోతున్నట్లు రోల్స్ రాయిస్ పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement