Rolls Royce Company
-
రోల్స్‌రాయిస్‌కు రూ.90,200 కోట్ల కాంట్రాక్ట్
బ్రిటన్ జలాంతర్గాములకు ఎనర్జీ అందించే అణు రియాక్టర్ల రూపకల్పన, వాటి నిర్వహణ కాంట్రాక్ట్‌ను రోల్స్ రాయిస్ దక్కించుకుంది. 11 బిలియన్ డాలర్ల(సుమారు రూ.90,200 కోట్లు) ఈ ‘యూనిటీ’ కాంట్రాక్టు ఎనిమిదేళ్లపాటు చెల్లుబాటు అవుతుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ ఒప్పందం బ్రిటన్ రాయల్ నేవీ సామర్థ్యాన్ని పెంచుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.ఈ యూనిటీ ఒప్పందం గతంలో చేసుకున్న ఒప్పందాలను క్రమబద్ధీకరిస్తుందని అధికారులు తెలిపారు. కంపెనీ అందుకున్న కాంట్రాక్టు వల్ల లండన్‌లో పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఈ నిధులు బ్రిటిష్ వ్యాపారం, ఉద్యోగాలు, జాతీయ భద్రతకు దీర్ఘకాలిక ప్రోత్సాహాన్ని అందిస్తాయని రక్షణ మంత్రి జాన్ హీలీ నొక్కి చెప్పారు. ఈ ఒప్పందం వల్ల కనీసం 1,000 నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు అవకాశాలు వస్తాయని, 4,000 మందికి పరోక్షంగా రక్షణ లభిస్తుందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా సెంట్రల్ ఇంగ్లాండ్‌లో డెర్బీలో రోల్స్ రాయిస్ న్యూక్లియర్ రియాక్టర్ ఉత్పత్తి కేంద్రాన్ని బ్రిటన్ రక్షణ మంత్రి హీలీ సందర్శించారు.ఇదీ చదవండి: కాల్స్ కోసమే ప్రత్యేక ప్యాక్.. వాట్సప్‌కు ఊరటయూకే, యూఎస్, ఆస్ట్రేలియా మధ్య సైనిక సహకారాన్ని బలోపేతం చేయడానికి ఈ ఒప్పందం సహకరిస్తుందని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది. ఈ ఒప్పందంతో రక్షణ రంగంలో నూతన ఆవిష్కరణలతో అత్యాధునిక టెక్నాలజీని వినియోగించబోతున్నట్లు రోల్స్ రాయిస్ పేర్కొంది. -
ప్రపంచంలో అత్యంత ఖరీదైన కారు: ధర రూ.250 కోట్ల కంటే ఎక్కువే! (ఫోటోలు)
-
రోల్స్‌రాయిస్‌తో హైదరాబాద్ కంపెనీ ఒప్పందం
ఇండియాలో కాంప్లెక్స్ డిఫెన్స్ ఏరో ఇంజిన్ల తయారీకి రోల్స్ రాయిస్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆజాద్ ఇంజినీరింగ్ ప్రతినిధులు తెలిపారు. ఈ దీర్ఘకాలిక ఒప్పందంలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన ఆజాద్ ఇంజినీరింగ్ డిఫెన్స్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ల కోసం కాంప్లెక్స్ కాంపోనెంట్లను సరఫరా చేయనుంది. ఈ ఒప్పందం ఏడేళ్లు కొనసాగనుంది. రోల్స్ రాయిస్ ఏరోస్పేస్ పరికరాలకు కీలకమైన సాంకేతిక, అధునాతన భాగాల ఉత్పత్తిలో ఆజాద్ ఇంజినీరింగ్ భాగమవ్వడం పట్ల కంపెనీ వర్గాలు హర్షంవ్యక్తం చేశాయి. తమకు కాంప్లెక్స్ కాంపోనెంట్లను సప్లయ్ చేస్తున్న గ్లోబల్ కంపెనీల జాబితాలో ఆజాద్ ఇంజినీరింగ్ చేరుతుందని రోల్స్‌రాయిస్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ బిజినెస్ డెవలప్మెంట్ అండ్ ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ గ్లోబల్ నెట్వర్క్స్ హెడ్ అలెక్స్ జినో అన్నారు. బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి ఆజాద్ ఇంజినీరింగ్ ఫౌండర్ రాకేశ్ చోప్దార్ మాట్లాడుతూ డిఫెన్స్ కాంపోనెంట్లను భారతదేశంలోనే తయారు చేయడం వల్ల దేశ ఏరోస్పేస్ రక్షణ పరిశ్రమకు మేలు కలుగుతుందని అన్నారు. ప్రతిష్టాత్మక కంపెనీ భాగస్వామ్యంతో పనిచేయనుండడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. -
రోల్స్ రాయిస్ ఇండియాకు కేంద్రం షాక్: అవినీతి ఆరోపణలతో సీబీఐ కేసు
సాక్షి, ముంబై: బ్రిటిష్ ఏరోస్పేస్ కంపెనీ రోల్స్ రాయిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు భారీ షాక్ తగిలింది. 24 హాక్ జెట్ 115 అడ్వాన్స్ కొనుగోలులో భారత ప్రభుత్వాన్నిమోసంచేశా రని ఆరోపిస్తూ కంపెనీ డైరెక్టర్‌సహా, మరికొంతమందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. (3వేల ఉద్యోగాలు కట్: లగ్జరీ కార్‌మేకర్ స్పందన ఇది!) ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై రోల్స్ రాయిస్, దాని ఎగ్జిక్యూటివ్‌లపై కేసు నమోదు చేసింది. రోల్స్ రాయిస్ ఇండియా డైరెక్టర్ టిమ్ జోన్స్, ఆయుధాల డీలర్లు సుధీర్ చౌదరి , భాను చౌదరితోపాటు, ప్రభుత్వ ప్రైవేట్ వ్యక్తులపై సీబీఐ కేసు నమోదు చేసింది.రోల్స్ రాయిస్ పిఎల్సి, యుకె , ఎం/ఎస్ రోల్స్ రాయిస్ టర్బోమెకా లిమిటెడ్‌తో సహా దాని అసోసియేట్ గ్రూప్ కంపెనీల నుండి హాక్ ఎయిర్‌క్రాఫ్ట్ కొనుగోలు విషయంలో భారత ప్రభుత్వాన్ని మోసం చేసినందుకు ఈ కేసు సంబంధించినదని సీబీఐ ప్రకటించింది. (కేవీపీ పెట్టుబడి డబుల్ ధమాకా: పదేళ్లదాకా ఆగాల్సిన పనిలేదు!) CBI registers a case against British Aerospace company Rolls Royce India Pvt Ltd, Tim Jones, Director Rolls Royce India Pvt Ltd and private individuals Sudhir Chuadhrie and Bhanu Chaudharie and other unknown public servants and private persons with the objective to cheat the… pic.twitter.com/tREN8OUkyk — ANI (@ANI) May 29, 2023 -
117 ఏళ్ల చరిత్ర.. ఒక్క ఏడాదిలోనే తిరగరాసిన కార్ల కంపెనీ
లగ్జరీ కార్ల బ్రాండ్ రోల్స్ రాయిస్ చరిత్ర తిరగరాసుకుంది. కరోనా కాలంలో 117 ఏళ్ల రికార్డును బద్ధలు కొట్టింది. 2021లో రికార్డు స్థాయి అమ్మకాలతో సంచలనం సృష్టించినట్లు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. బ్రిటన్‌కు చెందిన కాస్ట్లీ బ్రాండ్ ‘రోల్స్ రాయిస్ మోటార్ కార్స్’.. తన అమ్మకాల్ని గణనీయంగా పెంచుకుంది. అమెరికా ఖండాలు, ఆసియా-పసిఫిక్, గ్రేటర్ చైనా రీజియన్లలతో పాటు ఇతర దేశాల్లో కలిపి మొత్తం 5, 586 కార్లు అమ్ముడుపోయాయి. ఈ పెరుగుదల గతంతో పోలిస్తే 50 శాతం నమోదు అయ్యింది. 117 ఏళ్ల రోల్స్ రాయిస్ చరిత్రలో ఈ రేంజ్లో కార్లు అమ్ముడుపోవడం ఇదే మొదటిసారి. ఆటోమేకర్స్ అంతా గత ఏడాది కాలంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అయితే కరోనా.. అందునా సెమీకండక్టర్ షార్టేజ్ కొనసాగుతున్న టైంలో రోల్స్ రాయిస్ రికార్డు అమ్మకాలు ఆశ్చర్యం కలిగించే అంశమే!. 2020తో పోలిస్తే.. 2021లో 48 శాతం అమ్మకాలు పెరగడం మరో రికార్డు. Rolls-Royce ‘ఘోస్ట్’, Cullinan ఎస్యూవీ అమ్మకాలకు డిమాండ్ పెరిగినందువల్లే ఈ ఫీట్ సాధ్యమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. పన్నెండేళ్ల క్రితం రోల్స్ రాయిస్ కార్ల ఓనర్ సగటు వయసు 54 సంవత్సరాలుగా ఉండేది. ఇప్పుడు ఆ వయసు 43 ఏళ్లుగా ఉండడం విశేషం. ఇదిలా ఉంటే రోల్స్ రాయిస్.. మొట్టమొదటి ఈవీ కారు ‘స్పెక్టర్’ను తయారు చేసే పనిలో బిజీగా ఉంది. రోల్స్ రాయిస్ మోటార్ కార్స్ అనేది BMW గ్రూప్(జర్మనీ ఆటో దిగ్గజం) అనుబంధ సంస్థగా 1998 నుంచి కొనసాగుతున్న విషయం తెలిసిందే. చదవండి- భారత నేవీకి ఎలక్ట్రిక్ యుద్ధ నౌకలు అందిస్తాం:: రోల్స్‌రాయిస్ -
రోల్స్‌రాయిస్ నుంచి తొలి ఎలక్ట్రిక్ కార్‌పై ఓ లుక్కేయండి..!
ప్రపంచవ్యాప్తంగా పలు దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టిసారించాయి. అంతేకాకుండా శిలాజ ఇంధనాలతో నడిచే వాహనాలను పూర్తిగా నిలిపివేయాలని ఆటోమొబైల్ కంపెనీలు భావిస్తున్నాయి. కాగా తాజాగా బీఎమ్‌డబ్య్లూకు చెందిన ప్రముఖ బ్రిటన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్‌రాయిస్ కూడా ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై దృష్టిపెట్టింది. రోల్స్‌రాయిస్ ఎలక్ట్రిక్ కార్ల శ్రేణిలో ‘స్పెక్టర్’ తొలి కారుగా నిలవనుంది. రోల్స్‌రాయిస్ తన తొలి ఎలక్ట్రిక్ కార్ స్పెక్టార్‌ను 2023 నాలుగో త్రైమాసికంలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. చదవండి: ఒక్కసారి ఛార్జ్‌తో 1100 కిలోమీటర్లు..వరల్డ్ రికార్డ్ పెట్రోల్, డీజిల్ వాహనాలు బంద్...! పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని రోల్స్‌రాయిస్ కీలక నిర్ణయాలను తీసుకుంది. 2030 నాటికి ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే ఉత్పత్తి చేస్తుందని..శిలాజ ఇంధనాల కార్ల ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేయనుందని రోల్స్ రాయిస్ సీఈవో బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. మరోవైపు రోల్స్‌రాయిస్ పేరెంట్ సంస్థ బీఎమ్‌డబ్ల్యూ ముడిచమురునుపయోగించి వాడే కార్లను ఎప్పుడూ నిలిపివేయనుందనే విషయం స్పష్టంగా లేదు. కానీ 2030 నాటికి 50 శాతం ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి చేస్తోందని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్‌రోవర్ కూడా 2025 నాటికి ఎలక్ట్రిక్‌వాహనాలను ఉత్పత్తి చేయనుంది. చదవండి: మహీంద్రా సంచలన నిర్ణయం.. త్వరలో హైపర్ కార్ -
రోల్స్ రాయిస్ ఒప్పందంపై సీబీఐ దర్యాప్తు
న్యూఢిల్లీ: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)తో విమాన ఇంజిన్ల సరఫరా ఒప్పందం కుదుర్చుకోవడం కోసం బ్రిటన్‌కు చెందిన రోల్స్ రాయిస్ కంపెనీ రూ.600 కోట్ల ముడుపులు చెల్లించిందన్న ఆరోపణలపై రక్షణ శాఖ సీబీఐ విచారణకు ఆదేశించింది. ఇందులో నగదు లావాదేవీలన్నీ తవ్వి తీయాలని సీబీఐను కోరినట్లు రక్షణ శాఖ అధికారులు మంగళవారమిక్కడ తెలిపారు. 2007-11 మధ్య హాక్ శిక్షణ విమానాలు (ఏజేటీ), జాగ్వార్ యుద్ధ విమానాలకు అవసరమైన ఇంజిన్ల సరఫరాకు ఉద్దేశించిన ఈ ఒప్పదంపై అంతర్గతంగా విచారించిన హాల్ నిఘా విభాగం... కొన్ని ఆరోపణలను ధ్రువీకరించింది. ఈ భారీ కాంట్రాక్టును దక్కించుకునేందుకు హాల్, ఇతర విభాగాల్లోని అధికారులకు ముడుపులు ముట్టాయని రూఢీ చేసింది. ఈ నేపథ్యంలో రోల్స్ రాయిస్‌తో కుదిరిన గత ఒప్పందాలు, భవిష్యత్తు ఒప్పందాలపై, దళారుల ప్రమేయంపై సీబీఐ దర్యాప్తునకు రక్షణ మంత్రి ఆంటోనీ ఆదేశించారు. సీబీఐ దర్యాప్తు పూర్తయ్యే వరకు రోల్స్ రాయిస్‌తో ప్రస్తుత, భవిష్యత్ ఒప్పందాలన్నీ నిలిపేస్తున్నట్లు ప్రకటించారు.