
లగ్జరీ కార్ల బ్రాండ్ రోల్స్ రాయిస్ చరిత్ర తిరగరాసుకుంది. కరోనా కాలంలో 117 ఏళ్ల రికార్డును బద్ధలు కొట్టింది. 2021లో రికార్డు స్థాయి అమ్మకాలతో సంచలనం సృష్టించినట్లు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
బ్రిటన్‌కు చెందిన కాస్ట్‌లీ బ్రాండ్ ‘రోల్స్ రాయిస్ మోటార్ కార్స్’.. తన అమ్మకాల్ని గణనీయంగా పెంచుకుంది. అమెరికా ఖండాలు, ఆసియా-పసిఫిక్, గ్రేటర్ చైనా రీజియన్లలతో పాటు ఇతర దేశాల్లో కలిపి మొత్తం 5, 586 కార్లు అమ్ముడుపోయాయి. ఈ పెరుగుదల గతంతో పోలిస్తే 50 శాతం నమోదు అయ్యింది. 117 ఏళ్ల రోల్స్ రాయిస్ చరిత్రలో ఈ రేంజ్‌లో కార్లు అమ్ముడుపోవడం ఇదే మొదటిసారి.
ఆటోమేకర్స్ అంతా గత ఏడాది కాలంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అయితే కరోనా.. అందునా సెమీకండక్టర్ షార్టేజ్ కొనసాగుతున్న టైంలో రోల్స్ రాయిస్ రికార్డు అమ్మకాలు ఆశ్చర్యం కలిగించే అంశమే!. 2020తో పోలిస్తే.. 2021లో 48 శాతం అమ్మకాలు పెరగడం మరో రికార్డు. Rolls-Royce ‘ఘోస్ట్’, Cullinan ఎస్‌యూవీ అమ్మకాలకు డిమాండ్ పెరిగినందువల్లే ఈ ఫీట్ సాధ్యమైందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పన్నెండేళ్ల క్రితం రోల్స్ రాయిస్ కార్ల ఓనర్ సగటు వయసు 54 సంవత్సరాలుగా ఉండేది. ఇప్పుడు ఆ వయసు 43 ఏళ్లుగా ఉండడం విశేషం.
ఇదిలా ఉంటే రోల్స్ రాయిస్.. మొట్టమొదటి ఈవీ కారు ‘స్పెక్టర్’ను తయారు చేసే పనిలో బిజీగా ఉంది. రోల్స్ రాయిస్ మోటార్ కార్స్ అనేది BMW గ్రూప్(జర్మనీ ఆటో దిగ్గజం) అనుబంధ సంస్థగా 1998 నుంచి కొనసాగుతున్న విషయం తెలిసిందే.
చదవండి- భారత నేవీకి ఎలక్ట్రిక్ యుద్ధ నౌకలు అందిస్తాం:: రోల్స్‌రాయిస్
Comments
Please login to add a commentAdd a comment