CBI Files Case Against Rolls Royce Top Executives In Corruption Case - Sakshi
Sakshi News home page

రోల్స్‌ రాయిస్‌ ఇండియాకు కేంద్రం షాక్‌: అవినీతి ఆరోపణలతో సీబీఐ కేసు

Published Mon, May 29 2023 2:09 PM | Last Updated on Mon, May 29 2023 2:44 PM

CBI Files Case Against Rolls Royce Top Executives In Corruption Case - Sakshi

సాక్షి, ముంబై:  బ్రిటిష్ ఏరోస్పేస్ కంపెనీ రోల్స్ రాయిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు భారీ షాక్‌ తగిలింది.  24 హాక్ జెట్ 115 అడ్వాన్స్ కొనుగోలులో భారత ప్రభుత్వాన్నిమోసంచేశా రని ఆరోపిస్తూ కంపెనీ డైరెక్టర్‌సహా,  మరికొంతమందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. (3వేల ఉద్యోగాలు కట్‌: లగ్జరీ కార్‌మేకర్‌ స్పందన ఇది!)

ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై  రోల్స్ రాయిస్, దాని ఎగ్జిక్యూటివ్‌లపై కేసు నమోదు చేసింది.  రోల్స్ రాయిస్ ఇండియా  డైరెక్టర్  టిమ్ జోన్స్,  ఆయుధాల డీలర్లు   సుధీర్ చౌదరి , భాను చౌదరితోపాటు, ప్రభుత్వ ప్రైవేట్ వ్యక్తులపై సీబీఐ కేసు నమోదు చేసింది.రోల్స్ రాయిస్ పిఎల్‌సి, యుకె , ఎం/ఎస్ రోల్స్ రాయిస్ టర్బోమెకా లిమిటెడ్‌తో సహా దాని అసోసియేట్ గ్రూప్ కంపెనీల నుండి హాక్ ఎయిర్‌క్రాఫ్ట్ కొనుగోలు విషయంలో భారత ప్రభుత్వాన్ని మోసం చేసినందుకు ఈ కేసు సంబంధించినదని  సీబీఐ ప్రకటించింది. (కేవీపీ పెట్టుబడి డబుల్‌ ధమాకా: పదేళ్లదాకా ఆగాల్సిన పనిలేదు!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement