సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ప్రభుత్వ రంగబ్యాంకు, ముఖ్యమైన వాణిజ్య బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంకు మరోసారి వార‍్తల్లో నిలిచింది. బ్యాంకు మాజీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, ఇతర డైరెక్టర్లపై సీబీఐ కేసులు నమోదు చేసింది. మోసం, ఫోర్జరీ ఆరోపణలతో ఈ చర్యకు దిగింది. 2013లో రూ68కోట్ల రుణాలను అక్రమంగా మంజూరు చేసినట్టుగా టిఎస్ హజారీలో ప్రత్యేక సిబిఐ కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్లో పేర్కొంది. కెనరా బ్యాంకు సీఎండీ ఆర్.కె. దుబే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లపై అవినీతి నిరోధక చట్టంలోని నేర కుట్ర, మోసం, ఫోర్జరీ, నిబంధనల ఆరోపణలు నమోదు చేసింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అశోక్ కుమార్ గుప్తా వీఎస్ కృష్ణ కుమార్‌తోపాటు అకేషన్ సిల్వర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపైనా, కంపెనీ ఇద్దరు డైరెక్టర్లు కపిల్ గుప్తా, రాజ్ కుమార్ గుప్తా పేర్లను కూడా చార్జ్‌షీట్‌లో చేర్చింది.
కాగా ఈ స్కాంకు సంబంధించి 2016, జనవరిలో సీబీఐ కేసులు నమోదు చేసింది. వెండి ఆభరణాలు, ఆర్టికల్స్, డైమండ్, బంగారు ఆభరణాలు, ఇమిటేషన్ జ్యూయలరీ ఆభరణాలు, టపాకాయల వస్తువులు తదితర అంశాలపై రీటైల్ వ్యాపారం చేసే అకేషన్ సిల్వర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బ్యాంకును మోసం చేసిందన్న ఆరోపణలపై ఈ నమోదు చేసింది. న్యూఢిల్లీ శాఖలోని కమలా నగర్‌లో బ్రాంచ్ వ ఖాతాల ద్వారా సుమారు రూ.68.38 కోట్లు చెల్లించిందని సీబీఐ అధికార ప్రతినిధి అభిషేక్ దయాల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment