ఇండియాలో కాంప్లెక్స్ డిఫెన్స్ ఏరో ఇంజిన్ల తయారీకి రోల్స్ రాయిస్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆజాద్ ఇంజినీరింగ్ ప్రతినిధులు తెలిపారు. ఈ దీర్ఘకాలిక ఒప్పందంలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన ఆజాద్ ఇంజినీరింగ్ డిఫెన్స్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్‌ల కోసం కాంప్లెక్స్ కాంపోనెంట్‌లను సరఫరా చేయనుంది. ఈ ఒప్పందం ఏడేళ్లు కొనసాగనుంది.
రోల్స్ రాయిస్ ఏరోస్పేస్ పరికరాలకు కీలకమైన సాంకేతిక, అధునాతన భాగాల ఉత్పత్తిలో ఆజాద్ ఇంజినీరింగ్ భాగమవ్వడం పట్ల కంపెనీ వర్గాలు హర్షంవ్యక్తం చేశాయి. తమకు కాంప్లెక్స్ కాంపోనెంట్‌లను సప్లయ్ చేస్తున్న గ్లోబల్ కంపెనీల జాబితాలో ఆజాద్ ఇంజినీరింగ్ చేరుతుందని రోల్స్‌రాయిస్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ బిజినెస్ డెవలప్‌మెంట్ అండ్ ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ గ్లోబల్ నెట్‌వర్క్స్ హెడ్ అలెక్స్ జినో అన్నారు.
బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి
ఆజాద్ ఇంజినీరింగ్ ఫౌండర్ రాకేశ్ చోప్దార్ మాట్లాడుతూ డిఫెన్స్ కాంపోనెంట్లను భారతదేశంలోనే తయారు చేయడం వల్ల దేశ ఏరోస్పేస్ రక్షణ పరిశ్రమకు మేలు కలుగుతుందని అన్నారు. ప్రతిష్టాత్మక కంపెనీ భాగస్వామ్యంతో పనిచేయనుండడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment