nuclear reactors
-
ప్రపంచంలోనే గూగుల్ మొదటి ఒప్పందం
ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్ తన కృత్రిమ మేధ (ఏఐ) వ్యవస్థలకు అవసరమయ్యే ఎనర్జీ కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. భవిష్యత్తులో సంస్థ అవసరాలు తీర్చడానికి వీలుగా స్మాల్ మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్ల (ఎస్ఎంఆర్-తక్కువ పరిమాణం, అధిక భద్రత కలిగే రియాక్టర్లు) నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. ప్రపంచంలోనే ఒక కార్పొరేట్ సంస్థ ఈమేరకు వివిధ ఎస్ఎంఆర్ల నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవడం ఇది మొదటిసారి కావడం గమనార్హం.గూగుల్ సంస్థ కైరోస్ పవర్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నట్లు తెలిపింది. 2030 నాటికి కైరోస్ పవర్‌కు చెందిన ఎస్ఎంఆర్ ద్వారా విద్యుత్ అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పింది. 2035 నాటికి మరిన్ని రియాక్టర్లను అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా పనిచేయాలని నిర్ణయించింది. ఈ ఒప్పందంలోని అంశాల అమలు తుదిదశ చేరేనాటికి ఆరు నుంచి ఏడు రియాక్టర్ల ద్వారా మొత్తం 500 మెగావాట్ల విద్యుత్‌ను గూగుల్ కొనుగోలు చేయనుంది. అందుకు సంబంధించిన ఆర్థిక వివరాలు, ఏ ప్రాంతంలోని రియాక్టర్ల నుంచి కొనుగోలు చేయబోతున్నారో మాత్రం తెలియజేయలేదు.ఏఐ టెక్నాలజీలో నిత్యం విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. అందుకు అనువుగా కంపెనీలు తమ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నాయి. ఏఐ టెక్నాలజీ అభివృద్ధికి వాడుతున్న పరికరాలు, డేటా సెంటర్ల నిర్వహణకు పెద్ద మొత్తంలో విద్యుత్ అవసరమవుతుంది. సంప్రదాయ విద్యుత్ తయారీకి బదులుగా గ్లోబల్ కంపెనీలు పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ల నుంచి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. అందులో భాగంగానే గూగుల్ కంపెనీ అణు రియాక్టర్ల ద్వారా వచ్చే విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపినట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.ఇదీ చదవండి: మార్జిన్లు పెరగకపోవచ్చు.. కారణాలు..ఈ ఏడాది ప్రారంభంలో అమెజాన్ టాలెన్ ఎనర్జీ నుంచి న్యూక్లియర్ పవర్డ్ డేటా సెంటర్‌ను కొనుగోలు చేసింది. మైక్రోసాఫ్ట్ పెన్సిల్వేనియాలోని త్రీ మైల్ ఐలాండ్‌లో రియాక్టర్‌ను పునరుద్ధరించడంలో కాన్స్టెలేషన్ ఎనర్జీకి సాయం చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, 2023-2030 మధ్య యూఎస్ డేటా సెంటర్ల విద్యుత్ వినియోగం మూడు రెట్లు పెరుగుతుందని గోల్డ్‌మన్ సాక్స్ అంచనా వేసింది. దీనికి దాదాపు 47 గిగావాట్ల విద్యుత్ అవసరం అవుతుంది. -
పాక్ కు ఆ శక్తి ఇచ్చింది చైనానే..
న్యూఢిల్లీ: అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్ పీటీ) నిబంధనలను చైనా ఉల్లఘించింది. ఎన్ పీటీలో సభ్యత్వం లేని దేశాలకు న్యూక్లియర్ ఆయుధాలు సరఫరా చేయకూడదని 2010లో ఎన్ పీటీ నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా పాకిస్తాన్ కు చైనా న్యూక్లియర్ రియాక్టర్లను సరఫరా చేసింది. అణ్వస్త్ర వ్యాప్తి గ్రూప్ ను పర్యవేక్షించే ఆర్మ్స్ కంట్రోట్ అసోసియేషన్(ఏసీఏ) తన తాజా రిపోర్టుల్లో ఈ విషయాన్ని గుర్తించింది. న్యూక్లియర్ సప్లైయర్స్ గ్రూప్(ఎన్ఎస్జీ)లో భారత్ సభ్యత్వానికి చైనా ఎన్ పీటీలోని ఈ నిబంధనను పావుగా వాడుకుని అడ్డుగా నిలిచింది. చైనా-పాకిస్తాన్ ల మధ్య 2013లో జరిగిన ఒప్పందం ప్రకారం చస్మా-3 న్యూక్లియర్ రియాక్టర్లను పాకిస్తాన్ కు ఇచ్చింది. దాంతో 2010 అంతర్జాతీయ స్థాయిలో ఎన్ పీటీ చేసిన నిబంధనలను తుంగలో తొక్కింది. చస్మా-3 రియాక్టర్లను అందుకోవడానికి తమకు అర్హత లేదని తెలిసినా పాకిస్తాన్ వెనకడుగు వేయలేదు. 2004 లో చైనా ఎన్ఎస్ జీలో సభ్యత్వాన్ని నమోదు చేసుకుంది. అయితే, ఎన్ఎస్ జీలో సభ్యత్వానికి ముందే పాకిస్తాన్ కు రియాక్టర్లను ఇచ్చినట్లు చైనా వాదిస్తోంది. అధికారిక రిపోర్టులలో చైనా నిబంధనలను ఉల్లఘించిందని తేలినా.. తానే తప్పు చేయలేదని బుకాయిస్తోంది. పాకిస్తాన్ లోని చస్మా న్యూక్లియర్ పవర్ కాంప్లక్స్ కు మొత్తం 6 రియాక్టర్లను చైనా అందించింది. వీటిలో రెండు రియాక్లర్లు మాత్రమే 2003లో పాకిస్తాన్ కు అందించింది. ఎన్ఎస్ జీలో సభ్యత్వం కలిగిన దానిగా 4 రియాక్టర్లను అందించింది. ఎగుమతులను క్రమంగా పర్యవేక్షిస్తూ వస్తున్న చైనా.. ఎన్ఎస్ జీకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే పాకిస్తాన్ కు రియాక్టర్లను సరఫరా చేస్తూ వస్తోంది. న్యూక్లియర్ ఆయుధాలకు సంబంధించి ఎటువంటి సాయాన్ని వేరే దేశాలకు అందించకుండా ఉంటేనే ఎమ్ టీసీఆర్ లో సభ్యత్వం తీసుకునే అవకాశం ఉంటుంది.2000లో మిస్సైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజైమ్(ఎమ్ టీసీఆర్) నిబంధనలకు ఒప్పుకున్న చైనా అందులో సభ్యత్వం తీసుకుంది. చైనాపై నాలుగేళ్ల నిరంతర పర్యవేక్షణ అనంతరం 2004లో చైనా ఎన్ఎస్ జీ సభ్యత్వానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ప్రస్తుతం ఎమ్ టీసీఆర్ లో సభ్యత్వం కలిగిన భారత్ ఎన్ఎస్ జీ ఆప్లికేషన్ ను చైనా ఆమోదించకుండా, తిరస్కరించకుండా నిలిపివేసింది. నిబంధనల ఉల్లంఘనను ఎమ్ టీసీఆర్ తీవ్రంగా పరిగణించే అవకాశం ఉంది. అయితే, ఎమ్ టీసీఆర్ నిబంధనలను చైనా స్వచ్ఛందంగా పాటిస్తోంది. 2016లో చైనాలో ఓ ప్రభుత్వ సంస్థ చేసిన సర్వేలో చైనా తనకు కావలసిన దేశాలకు న్యూక్లియర్ టెక్నాలజీని అందిస్తున్నట్లు తేలింది. -
అణు రియాక్టర్లతో ఏపీని ప్రమాదంలో పడేస్తారా?
ఢిల్లీ: గుజరాత్‌ను సేఫ్‌గా ఉంచి అణు రియాక్టర్లతో ఆంధ్రప్రదేశ్‌ని ప్రమాదం పడేస్తారా? అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మండిపడ్డారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. గుజరాత్‌లోని అణురియాక్టర్లను కొవ్వాడకు మార్చడంలో కుట్ర దాగి ఉందంటూ ఆరోపించారు. గుజరాత్లో ఉన్న అణురియాక్టర్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మార్చడంలో ఆంతర్యమేమిటి అని సూటిగా ప్రశ్నించారు. అన్ని న్యూక్లియర్ రియాక్టర్లను ఒకే చోట పెట్టడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. అమెరికా ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ భారత్‌ను పావుగా మారుస్తున్నారని విమర్శించారు. ఏకపక్షంగా కేంద్రం నిర్ణయం తీసుకోవడం సరికాదని సీతారాం ఏచూరి తెలిపారు. -
రియాక్టర్లకు రూ.1,500 కోట్ల రిస్క్ కవర్!
బీమా సంస్థల విజ్ఞప్తికి ఐఆర్డీఏ సానుకూల స్పందన న్యూఢిల్లీ: అణు రియాక్టర్లకు రిస్క్ కవరేజ్ కల్పించడానికి సంబంధించి రూ.1,500 కోట్ల మూలనిధి (లైబిలిటీ పూల్) ఏర్పాటుకు బీమా రంగ రెగ్యులేటర్- ఐఆర్డీఏ సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. చైర్మన్ టీఎస్ విజయన్ ఇక్కడ సోమవారం ఈ విషయాన్ని తెలిపారు. ‘రియాక్టర్ల కవరింగ్‌కు డిమాండ్ ఉంది. భారత్ పరిధిలో ఇందుకు సంబంధించి రూ.1,500 కోట్ల ప్రత్యేక మూల నిధిని ఏర్పాటు చేయాలన్నది ప్రతిపాదన. బీమా కంపెనీలు ఈ మూలనిధి ఏర్పాటుకు మా ఆమోదం కోరాయి. అయితే ఈ నిధులు ఎలా సమీకరిస్తారన్న విషయాన్ని మాత్రం అవి ఇంకా వెల్లడించలేదు.ఆయా అంశాలను మా ముందు ఉంచితే- సానుకూల రీతిలో ఈ ప్రతిపాదనను పరిశీలిస్తాం’ అని విజయన్ అన్నారు. భారత్ బీమా బ్రోకర్ల సంఘం సమావేశంలో పాల్గొన్న ఆయన, ఈ సందర్భంగా ఈ వివరాలను తెలియజేశారు. రూ.1,500 కోట్ల నిధి ఏర్పాటుకు రీ-ఇన్సూరర్ కంపెనీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకు సంబంధించి విధివిధానాల రూపకల్పన జరుగుతున్నట్లు కూడా ఆయా వర్గాలు తెలిపాయి. కస్టమర్లలో చైతన్యం పెంచాలి... కాగా కస్టమర్లలో చైతన్యాన్ని పెంపొందించడంలో బీమా బ్రోకర్లు సంబంధిత వర్గాలదే కీలకపాత్ర అని విజయన్ పేర్కొన్నారు. బహిరంగ నోటీసులు, వెబ్సైట్లు, వార్తా పత్రికల్లో ప్రకటనల ద్వారా పాలసీ హోల్డర్లు ఎటువంటి మోసాలకూ గురికాకుండా ఐఆర్డీఏ కూడా తగిన చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా విజయన్ వివరించారు. బీమా బిల్లుపై ఆర్డినెన్స్‌ను ఆపేయాలి హైదరాబాద్ , బిజినెస్ బ్యూరో: ఎన్డీఏ ప్రభుత్వం బీమా బిల్లుపై ఆర్డినెన్స్‌ను తీసుకురావడాన్ని నేషనల్, న్యూ ఇండియా, ఓరియంటల్, యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలు దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేశాయి. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ)లను 26 శాతం నుంచి 49 శాతానికి పెంచడాన్ని, ఈ నాలుగు సాధారణ బీమా కంపెనీల వాటాలను అమ్మడాన్ని వెంటనే విరమించుకోవాలని ఈ సందర్భంగా యూనియన్లు డిమాండ్ చేశాయి. -
పిసరంత పొలోనియం.. ప్రాణాలు తీస్తుంది
సాక్షి, హైదరాబాద్: అత్యంత అరుదైన రేడియోధార్మిక మూలకమిది. భూమి లోపలి పొరల్లో అతికొద్ది మోతాదుల్లో సహజసిద్ధంగా ఏర్పడే ఈ పదార్థాన్ని 1898లో మేరీ, పియరీ క్యూరీ దంపతులు కనుగొన్నారు. అణు రియాక్టర్లలోనూ దీన్ని కృత్రిమంగా తయారు చేయవచ్చు. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ(ప్లాస్టిక్ కాగితాన్ని నలిపినప్పుడు దాని ఉపరితలంపై ఏర్పడే విద్యుత్తు లాంటిది)ని తొలగించే పరికరాల్లో దీన్ని ఎక్కువగా వాడుతుంటారు. దుష్ర్పభావం ఇలా... పొలోనియం-210 అతిచిన్న మోతా దుల్లో కూడా అత్యంత ప్రమాదకరం. గ్రాము కంటే తక్కువ మోతాదుతోనూ మనిషి ప్రాణాలు తీయవచ్చు. ఇది ఒకసారి రక్తంలోకి చేరితే దాని ప్రభావాన్ని ఆపడం ఎవరి వల్లా కాదు. అందులోని ఆల్ఫా కణాలు కాలేయంతోపాటు కిడ్నీ, ఎముక మజ్జలపై దాడి చేసి పనిచేయకుండా చేస్తాయి. ఫలితంగా కొద్ది రోజుల్లో లేదంటే వారాల్లోపు మరణం సంభవిస్తుంది. రేడియోధార్మిక కణాలు శరీరంలోకి చేరినప్పుడు అవి చర్మం ద్వారా బయటకొచ్చే అవకాశముంది. కానీ పొలోనియం-210లోని ఆల్ఫా కణాలు పెద్దవిగా ఉండటం వల్ల లోపలే ఉండిపోతాయి. గాజు పరికరాల్లో ఉంచితే రేడియోధార్మిక డిటెక్టర్లు కూడా గుర్తుపట్టలేవు. శరీరంలోకి చేరిన విషంలో 50 నుంచి 90 శాతం మలమూత్రాల ద్వారా బయటకు వెళ్లిపోతుంది. మిగిలిన కొద్ది మోతాదులో సగం ముందుగా రక్తంలోకి ఆ తర్వాత ప్లీహం, మూత్రపిండాలు, కాలేయాల్లోకి చేరుతుంది. పది శాతం పొలోనియం ఎముక మజ్జలో పేరుకుపోతుంది. రక్తంలోకి చేరిన పొలోనియం శరీరం మొత్తం ప్రయాణిస్తూ ఎర్రరక్త కణాలను చంపేయడం మొదలుపెడుతుంది. రక్తంలోని మలినాలను, వ్యర్థ పదార్థాలను శుద్ధి చేసే అవయవాలను పనిచేయకుండా చేస్తుంది. ఆయా అవయవాలు విఫలం కావడంతోపాటు వికారం, తలనొప్పి, విరేచనాల లక్షణాలు కనిపిస్తాయి. ఈ ప్రభావం కేన్సర్ చివరి దశను పోలి ఉంటుంది. దీనితో ఎవరైనా మరణించారా? 2006లో రష్యా గూఢచారి అలెగ్జాండర్ లెథ్వింకో మరణంతో పొలోనియం విష ప్రయోగంపై విసృ్తత చర్చ మొదలైంది. అంతకుముందు 1956లో ఇరేన్ జోలియట్ క్యూరీ అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త (1935 నోబెల్ అవార్డు గ్రహీత) కూడా ఈ విష ప్రభావంతో మరణించినట్లు ఆధారాలున్నాయి. నాలుగేళ్ల క్రితం పాలస్తీనా నాయకుడు యాసర్ అరాఫత్ మరణానికి కూడా ఇదే కారణమన్న ఆరోపణలు వచ్చాయి.