అణు రియాక్టర్లతో ఏపీని ప్రమాదంలో పడేస్తారా?
ఢిల్లీ: గుజరాత్‌ను సేఫ్‌గా ఉంచి అణు రియాక్టర్లతో ఆంధ్రప్రదేశ్‌ని ప్రమాదం పడేస్తారా? అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మండిపడ్డారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. గుజరాత్‌లోని అణురియాక్టర్‌లను కొవ్వాడకు మార్చడంలో కుట్ర దాగి ఉందంటూ ఆరోపించారు. గుజరాత్‌లో ఉన్న అణురియాక్టర్‌లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మార్చడంలో ఆంతర్యమేమిటి అని సూటిగా ప్రశ్నించారు.
అన్ని న్యూక్లియర్ రియాక్టర్‌లను ఒకే చోట పెట్టడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. అమెరికా ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ భారత్‌ను పావుగా మారుస్తున్నారని విమర్శించారు. ఏకపక్షంగా కేంద్రం నిర్ణయం తీసుకోవడం సరికాదని సీతారాం ఏచూరి తెలిపారు.